Previous Page Next Page 
ఋషి పేజి 28


    ఆ లేవటంలో ఆమె జుట్టు అతని మొహాన్ని కప్పేసింది. తన చుట్టూ చీకటి అలుముకున్నట్టు ఫీలయ్యాడు. ఆ చీకటిలో ఒక కాంతిపుంజం దగ్గరగా__కళ్ళు మిరుమిట్లు గోలిపేటంతగా- ఏదో తెలీని అస్పష్టమ్తెన మేరుపు- హెల "సితా" అంటూ గోనిగేడు. వెనక్కి అడుగు వేయబోయింది. చటుక్కున  ఆమె నడుంచుట్టూ చేయివేసి దగ్గరకు  లాక్కుని ఏం జరుగుతుందో ఊహించే లోపునే ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దుపెట్టుకున్నాడు. ఒక క్షణం  ఆమె బిత్తరపోయింది. వెంటనే ఆమె సిగ్గు  ముంచుకొచ్చింది. అతన్ని వెనక్కి తోసేసి చేతుల్తో మొహం కప్పుకొని బయటకు పరుగెత్తింది.

    ఆ గదినిండా నిశ్శబ్దం పెరుకోంది. గడియారం టిక్ టిక్ మంటూ చేసే ధ్వనితప్పు యింకేమి వినిపించటం లేదు. ప్రకాశం  కళ్ళు గట్టిగా మూసుకొన్నాడు. ఏం చేశాడు తను? కళ్ళు విప్పాడు. ఆమె మొహం దగ్గరగా వుంది ఏదో తెలియని ఉద్వేగం తనని  ఆవరించింది. ఆమెని దగ్గిరగా లాక్కొని.....

    పక్కకి తిరిగి పడుకొన్నాడు.

    __ఏం చేశాడు తను?- ఆమె మొహం దగ్గరగా వుంది. ఏదో తెలియని ఉద్వేగం  అతన్ని ఆవరించింది. ఆమెని దగ్గరగా లాక్కొని-

    తలగడలో  మొహం దాచుకొన్నాడు.

    ఏంచేశాడు తను? ఏదో తెలియని ఉద్వేగం తనని ఆవరించింది-ఆమెని దగ్గరగా లాక్కొని.

    తల విదిలించాడు.

    ఎందులో ఎక్కువ ఆనందం వుంది? దోసిలిని హారతిగా పట్టి తనని ప్రేమించే  స్త్రినీ పవిత్రంగా హృదయం ఆర్పించటంలోనా? అర్దరాత్రి పెరటిగోడ దూకి పక్కింటి కొత్తకోడల్ని ముద్దు పెట్టుకోవడంలోనా? చెప్పు "హ్తేడ్" చెప్పు! ఈ అనంతమ్తెన విశ్వంలో ప్రచండమ్తెన వేగంతో పరిభ్రమించే కోటాను కోట్ల గోళాలమధ్య__పిపిలక ప్రమాణంలో తన వునికిని నిలుపుకొనే  ఈ   భూగోళం మీద_ఒక చిన్న జీవం -మనిషి -మనిషిలో సూక్ష్మమ్తెన ఆత్మ_ ఆ చిన్న పరిధిలో ఇన్ని కంట్రడిక్షన్ల ముళ్ళేందుకు?

    తప్పు చెయ్యటంలో వుండే ఆనందం ప్రకాశానికి  మొట్టమెదటిసారి తెలిసింది.

    అగ్నిపర్వతం బ్రద్దలవలేదు. కడలి  ఉప్పొంగలేదు. అంతా మామూలే. గుండెల్లో దాచుకొన్న రహస్యం . పెదవుల మీద చిరునవ్వు.

    బాల్యం ఆటపాటల్లోనూ యవ్వనం మత్తులోనూ గడిచిపోతే వార్ధక్యం చూసి  ఏడుపోస్తుంది. సంఘాన్ని మనిషి మార్చలేడు సాటి మనిషిని  న్తేతికంగా బాగుచెయ్యలేడు. మారాలి! అమ్మా కడుపులో వున్నప్పటికీ నిశ్చింతని, బయటికి రాగానే  మంత్రసాని-ఏడిపించి పోగొడుతుంది. ఎక్కడుంది ప్రశాంతత? కాలే నరాలూ, ఉప్పూ కారం  పట్టించిన శరీరం, రహస్యాన్ని శోదించటమే పనిగా పెట్టుకొన్న కళ్ళూ.... పవిత్రంగా ఊగే గడ్డిపోచని, మూగభక్తితో ప్రశాంతత పొందినప్రకృతినీ పరిశీలించి ద్తేవత్వాన్ని పొందటానికి మనిషికి తెరికేది?

                                                                15

    ఆఫీసుకు ఆలస్యం అవటంవల్ల గబగబ  తయారు అయ్యాడు. సిత దాదాపు అతన్ని తప్పుకునే  తిరిగింది. ప్రోద్దున్నుంచి అది అతను గమనించేడు అయినా దాని గురించి ఆలోచించలేదు. అతని మనసంతా క్రితంరోజు పోయిన నూట ఇరవ్తే రూపాయల గురించే ఆలోచిస్తూ వుంది.

    ఎలా తీరుస్తాడు ఆ అప్ప?

    ఎక్కడ సంపాదించగలడు?

    ఒకటి మాత్రం సంతోషించదగ్గ విషయం. మిగతా  అందర్లా "మళ్ళి ఈ రోజు వెళ్ళిపోయినదంతా గెల్చుకువస్తే సరి" అనుకోవటం లేదు అతను.

    ఇక ఎటువంటి పరిస్దితుల్లోను అటువ్తెపు వెళ్ళకూడదనే నిర్ణయం చాలా  గట్టిగా చేసుకున్నాడు. పోతే ఈ నిర్ణయం ఎంతకాలం  ఉంటుందనేది వేరే విషయం. బ్రోతల్ హౌస్ లోంచి, బార్లలోంచి , బ్తేటకోస్తూ ప్రతి వాడు ఈ నిర్ణయం  తీసుకుంటూనే వుంటాడు.

    ఆలోచనలతో స్నానం బాగా ఆలస్యం చేసేడు. ఆఫీసుకి వచ్చే  సరికి కొంచెం  ఆలస్యం  అయింది.

    అతనిలో ఒక మంచి గుణంవుంది. సీట్లో కూర్చొని  పనిచేయడము మొదలు పెట్టగానే  మిగతా విషయాలు మర్చిపోతాడు. ఆఫీసులో చేరిన కొత్తలో ప్రతివ్యక్తి ఇలానే సిన్సియర్  గా పని చేస్తాడు. తరువాతే  రెడ్  తెపిజయ్ అతనిలోనూ జీర్ణించుకుపోతుంది. దిన్ని మార్చాలంటే సంవత్సరానికో, రెండేళ్ళకో అతని పని మారుస్తూ వుండాలి. కాణి ప్రభుత్వానికి అంత  తిరికేది?

    పదకొండయింది. బయట బాగా ఎండగా వుంది. ప్రకాశం తన సీట్లోనే  కూర్చొని పని చేసుకొంటున్నాడు. ఆఫీసంతా హడావుడిగా  వుంది. వరండాలో నిల్చొని  మాట్లాడుకొంటున్న  ఆడిటర్ల నవ్వులు  అప్పడప్పడు బిగ్గరగా  వినిపిస్తున్నాయ్ వాళ్ళకి విడిగా గది లేకపోవటం వల్ల యెవరు ఆడిటరో, ఎవరు క్లయింటో తెలియటంలేదు-ప్రాక్టీసు పెట్టుకొన్న  చార్తెర్టు అకౌంటెంట్స్ మీద ఇన్ కంటాక్స్ వాళ్ళకున్న  తేలిక భావానికి నిదర్శనంగా ఆ వరండా ఒక సత్రంలా వుంది.

    ప్రకాశానికి ఈ గొడవేమి పట్టలేదు. అతనికిది అలవాటయి పోయింది. ఏకాగ్రతతో పనిచేసుకొంటున్నాడు ఫ్తేలుమీద నోటు వ్రాసి మూస్తూ ఎందుకో తలెత్తిచూస్తే  ఎదురుగా రాఘవరావు కనిపించేడు. అతను ఎదురింట్లో వుంటాడు. ప్రకాశానికి ముఖపరిచయం వుంది. కాణి యిలా  పనిగట్టుకొని తన ఆఫీసుకు  ఎందుకు వచ్చాడో అర్ధంకాలేదు ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకొంటూ "కూర్చోండి" అన్నాడు.

 Previous Page Next Page