"నేనన్న మాటలలో ఏమయినా తప్పుందా శాంతి గారూ ?"
"ఉహూ " మొహమాటంగా అంది శాంతి . నిజానికతని మాటలు తను చాలా వరకూ అంగీకరించటం లేదు. ఐనా గానీ వాదనేందుకని మాట్లాడకుండా వూరుకుంది.
మరికాసేపు అక్కడ కూర్చుని ఇంటికి తిరిగి వచ్చేసిందామే.
ఇవాళ భలే మనిషిని కలుసుకోన్నానన్నాయ్ " అంది సృజన్ బాబు తో తను సరస్వతి వాళ్ళింటి కెళ్ళిన సంగతి చెపుతూ.
"ఎవరది?" అడిగాడు సృజన్ బాబు.
"సరస్వతి వాళ్ళన్నయ్య. పేరు వినోద్ అట. బి.కామ్, పాసయ్ రెండేళ్ళ నుంచి ఉద్యోగం దొరక్క తిరుగుతున్నాడట" అతని కెంత కోపంగా ఉందొ తెలుసా ? ఉద్యోగం చేసే ఆడాళ్ళనందరినీ మర్డర్ చేసేట్లున్నాడు...."
సృజన్ బాబు నవ్వేశాడు.
"ఒకసారి మనింటికి తీసుకురా అతని "బ్రెయిన్" రిపేర్ చేద్దాం"
"నిజంగానే తీసుకొస్తాను చూస్తుండు" అందామె.
రెండు రోజుల తర్వాత కాలేజీ బయట శ్రీపతి కనిపించాడామేకి. అతన్ని చూసి చిన్నగా మందహాసం చేసిందామె.
"మీతో కొంచెం మాట్లాడాలిగా గంభీరంగా అన్నాడతను.
"ఏమిటది ?"
"ఇక్కడ రోడ్డు మీదే మాట్లాడమంటారా?"
శాంతి మాట్లాడలేదు.
"పదండి! అలా హోటల్లో కూర్చుని మాట్లాడుకొందాం."
అయిష్టంగానే అతని వెనుక నడిచిందామే.
హోటల్లో చాలాసేపు మౌనంగా కూర్చున్నారిద్దరూ.
"మీరు నన్ను చాలా బాధ పెడుతున్నారు ...." అన్నాడతను పెన్నుతో టేబుల్ మీద ఏదో బొమ్మ గీస్తూ.
"నేనా?" ఆశ్చర్యంగా అడిగింది శాంతి.
"అవును, ఆ రోజు నన్నలా వదిలేసి పారిపోయారు. కదా ----- పిలుస్తున్నా వినిపించుకోకుండా ...."
శాంతి సిగ్గు పడింది.
"నాకెందుకో వెళ్ళిపోవాలనిపించింది...."
"ఆరోజు నుంచీ నాకు పిచ్చెక్కిపోయినట్లుంది. మీ మీద ఎంతో కోపం వచ్చింది. కానీ ఎంత కోపమొచ్చినా చేసేదేముంది?...."
శాంతి అతనివంకే చూస్తుండిపోయింది.
"కావాలంటే ఇంత విషమిచ్చి నన్ను చంపేయండి. కాని ఇలా చిత్రహింస పెట్టొద్దు....." తిరిగి అన్నాడతను.
శాంతి అదిరిపడింది.
"ఆ రోజు నేను వెళ్ళిపోయినందుకే మీరింత బాధ పడుతోంటే - అయాం సారీ!" అంది నెమ్మదిగా.
"ఊహు , నాక్కావలసింది -- మీరూ విచారించటం కాదు. మీమీద ఎన్నో ఆశలు -- మీ గురించి కంటున్న ఎన్నో కలలు వీటినేం చేయడల్చుకొన్నారన్నది నాక్కావాలసిన సమాధానం."
"అంటే?" ఇబ్బందిగా అడిగింది శాంతి. నిజానికతని ఉద్దేశ్యం స్పష్టంగా అర్ధమయిందామెకి.
"నేను మిమ్మల్ని ప్రేమించాను. వివాహం చేసుకోవాలనుకొంటున్నాను......" త్వరత్వరగా అన్నాడతను.
శాంతి మనసు ఆనందంతో ఊగిసలాడింది. తనను పెళ్ళాడేవారు కూడా ఉన్నారన్నమాట . కానీ....... ఎలా ?..
"మీ చదువు గురించి మీరేమయినా బాధపడుతున్నారేమో ? ఈ కోర్స్ పూర్తయ్యాకే వివాహం చేసుకొందాం...."
శాంతి ఏమీ మాట్లాడలేదు. ఎంచేతో అతను తొందర పడుతున్నాడెమో అనిపించింది.
"త్వరలోనే సృజన్ బాబుతో నేనన్ని విషయాలూ మాట్లాడతాను లెండి మీరేమీ భయపడకండి. సృజన్ బాబు సంగతి నాకు తెలుసు! మన నిర్ణయాన్ని తప్పక హర్షిస్తాడు."
శాంతి మనసంతా ఆలోచనలతో నిండిపోయింది. ఇంతకి తనసలు శ్రీపతిని ప్రేమిస్తోందా? మనసారా కోరుకొంటుందా? లేక 'స్త్రీ' మీద అతనికి గల అభిప్రాయాన్ని గౌరవించి తద్వారా అతనిని అభిమానిస్తోందా?
సర్వర్ కాఫీలు తెచ్చి వారి ముందుంచాడు.
ఇద్దరూ కాఫీ తాగి, ;లేచి నిలబడ్డారు. చటుక్కున ఆమె చేయి అందుకొని చుంబించి వదిలేశాడతను.
శాంతి కంగారుపడి చుట్టూ చూసింది. ఫామిలీ రూమ్ లో ఇంకెవ్వరూ లేరు. "అమ్మయ్యా ' అనుకొంది ధైర్యం తెచ్చుకొని.
"ఇంకెప్పుడూ అలా చేయకండి. అలాంటి పనులు నా కిష్టం ఉండదు " అంది అసహనంగా.
"ఓ! మీరింత అప్ సెట్ అవుతారనుకోలేదు. మీరు నేనూ త్వరలో ఒకటవబోతున్నామన్న ఆనందంలో అలా చేశాను ......" అన్నాడతను నవ్వుతూ.
బస్ స్టాప్ దగ్గర ఆమెను వదిలి వెళ్ళిపోయాడతను.
ఆ రాత్రి సృజన్ బాబుతో శ్రీపతి గురించి మాట్లాడడానికి ప్రయత్నించిందామె. అతనేలాగూ కొద్దిరోజుల్లో తనను పెళ్ళాడే విషయమై సృజన్ బాబుతో మాట్లాడతాడు" అప్పుడు-- తామిద్దరికీ మధ్య జరిగిన విషయాలన్నీ -- అతని దగ్గర దాచినట్లు తెలిసిపోతుంది . ఆ తరువాత అన్నయ్యకిక తన మొఖమేలా చూపగలదు?
"సాయంత్రం కాలేజీ నుంచి వస్తుంటే శ్రీపతి గారు కనిపించారు అన్నయ్యా!" అంది సాధ్యమైనంత మామూలుగా మాట్లాడుతూ.
"ఎక్కడ ?"
"నాంపల్లి దగ్గర ....."
"ఏమ్మన్నారు? వారం రోజుల్నుంచి శెలవులో వున్నట్లు తెల్సింది నాకు ---"