Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 24

 

    "నాకు మల్లెలు ఎందుకని కదూ?"
    "అహం, అదేం కాదు.......' తడబడ్డాడు రామచంద్ర.
    "నాకూ అనిపించింది. ఈ మల్లెల సౌరభాలు నాకు ఎందుకని. కానీ బలహీనురాల్ని. ఈ పరిమళాలను దూరం చేసుకోలేను. ఈ గుబాళింపులలో నా హృదయం చిత్ర వధ పొందుతోన్న నరకయాతనను సహితం సహించగలను కాని, పువులకే దూరమయి పోవటం నా తరం కావటం లేదు."
    దీర్ఘంగా నిట్టూర్చాడు రామచంద్ర. వారిజ బెదురుగా అతని వంక చూస్తూ "కాస్త కాఫీ తాగుతారా ' అంది దీనంగా. 'ఇది భోజనం సమయం. కాఫీ ఇచ్చి పంపిస్తావా?"
    "ఏంటీ మీరు ఇక్కడ భోజనం చేస్తారా? నిజంగా? అబ్బా! అనందం పట్టలేక గుండెలు పగిలిపోతాయేమో అనిపిస్తోంది. ఈ దౌర్భాగ్యురాలి మీద మీకెంత దయ! ఏ దేవుడు ప్రసాదించాడు మీకీ అమృత హృదయం?"
    భావోదేగంతో వారిజ కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. గబగబా వంటింట్లోకి నడిచింది వారిజ. వీరన్న పెళ్లి పూర్తియ్యాక యింటి కొచ్చాడు రామచంద్ర.
    ఇల్లు తాళం పెట్టి వుంది . తరవాత పక్కింటి వాళ్ళ అమ్మాయి తాళం చెవి తెచ్చి ఇచ్చింది .
    "లతగారూ , పిన్నిగారూ వాళ్లతో కలిసి సినిమాకు వెళ్ళారు." అని చెప్పింది. ఆ అమ్మాయి ఇచ్చిన తాళం చెవి తీసుకుని మూసిన తలుపుల వంక కొన్ని క్షణాలు చూస్తూ నిలుచుండిపోయాడు రామచంద్ర. తను ఎంతో సహనంతో తెరుస్తున్నా, లత మూర్ఖంగా మూసేస్తోన్న తన హృదయ దారాలలా అనిపించాయి, ఆ మూసినా తలుపులు రామచంద్రంకి. తాళం తీసి ఆ శూన్య గృహంలోకి అడుగు పెట్టడానికి నమస్కరించలేదు. గమ్యం లేకుండా నడక ప్రారంభించాడు. తనకు తెలియకుండానే చాలా దూరం వచ్చాడు. కాలువ వేపు మళ్ళుతుండగా వారిజ ఆపింది. వారిజ ఇక్కడుందనే అతనికీ తెలీదు."
    "ఇప్పుడెం చేస్తున్నావు వారిజా! నువ్వు వండుకున్నదే పెట్టు."
    "భలేవారు, ఏ జన్మలోనో నేను చేసుకున్న పుణ్యం ఫలించి నా యింటికి భోజనానికి వచ్చారు. ఈరోజు బద్దగించిన? మళ్ళీ ఇలాంటి రోజుకు నోచుకుంటానో లేదో? అయినా ఏం చేస్తున్నాను? బంగాళాదుంపలు వేయిస్తున్నాను. కొబ్బరికాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను అంతే! ఆ మాత్రమైన లేకుండా ఎలా తింటారు?"
    సంతోషం వాళ్ళ ఒక వింత కాంతితో , సంతృప్తితో మెరిసిపోతున్న వారిజ ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు రామచంద్ర. ఈ యువతికి తానూ చీరలు తేలేదు, నగలు తేలేదు. కేవలం తనకు వండి వడ్డించటంలో నిర్భరానందాన్ని పొందగలుగుతుంది.
    "ఈ వూరు యందుకొచ్చావు వారిజా మళ్ళీ? ఎన్నాళ్ళుంటావు?"
    "ఎందుకొచ్చానో మీకు తెలుసు చచ్చిపోయే వరకూ ఇక్కడే వుండాలని నా ఆశ. మరి ఏమవుతుందో?"
    "నాకోసం వచ్చిన దానివి నాకు కనబడకుండా ఇన్నాళ్ళు ఎలా వుండగలిగావు?"
    బంగాళాదుంపలు వేయిస్తోన్న వారిజ ఒక్క క్షణం రామచంద్ర ముఖంలోకి చూసి తల దించుకుంది.
    "మీ కంటికి నేను కనబడకపోయినా , నాకు మీరు కనిపిస్తూనే ఉంటారు. బాహ్య దృష్టికి కాదు,మనో నేత్రానికి ఆ భావనలతో బ్రతకటానికి అలవాటు పడిపోయాను. మీరు పెళ్ళి చేసుకున్నారని విన్నాను." ఒక్క క్షణం ఆగి వారిజ సిగ్గుపడుతూ నవింది మధురంగా.
    "మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు నన్ను ప్రేమిస్తున్నారని తెలుసు. నేను మీ కంటికి కనిపించటం వల్ల మీలో అశాంతి రేపిన దాన్నవుతాను . చల్లని మీ సంసారంలో కలతలకు కారణ భూతురాలినవుతాను. అందుకే కనిపించలేదు. మీరు తిట్టినందుకు కాదు. ఆ నిందకు కారణం నా మీద ద్వేషం కాదని నాకు తెలుసు. నన్ను చూడగానే మీకు ఆపరాని అనందం కలిగింది. ఆ ఆనందాన్ని గుర్తించటానికి లజ్జ వచ్చింది. అ లజ్జ తో ఒక రకమైన చికాకు కలిగింది. ఆ చికాకు నామీద ప్రదర్శించారు. అంతే!
    "నేను నున్ను అంత తిరస్కరించి మాట్లాడినా నీకు కోపం రాలేదా?" ఆశ్చర్యంగా అడిగాడు రామచంద్ర.
    "మీ మీద కోపమా! కలలో కూడా రాదు. అయినా మీ మనసు నాకు తెలియక పోతేగా! మీ పెదవులు నన్ను తిట్టినా , మెచ్చుకున్నా, మీ మనసులో నా మీద మమత మాసిపోదుగా!" చిరునవు నవాడు రామచంద్ర.
    "ఏమిటా ధైర్యం నీకు?"
    "మీ వ్యక్తిగ్తంలో నాకున్న విశ్వాసమే ఈ ధైర్యం . మీరు ఒకనాడు నన్ను నిజంగా ప్రేమించారు. తరువాత ఎంత ద్వేషం కలిగినా ఆ ప్రేమను మింగేయ్యలేదు. ఈసోదికేం లెండి. ఇంత రాత్రి వేళ షికారు బయలు దేరారేం?"
    "వీరన్న పెళ్ళి కరిపించి వస్తున్నాను."
    "వీరన్న పెళ్ళి చేసుకున్నాడా/ ఎంత మంచి వార్త! ఎవరిని?"
    "రంగానాయికి అని ఒక కూలి మనిషిలే! ఇద్దరి మనసులు కలిశాయి. సుఖంగా పెళ్ళి చేసుకున్నారు. అదృష్టవంతులు."
    "పెళ్ళికి నన్ను పిలవలేదు వీరన్న!"
    "వాడికి తెలుసా నువిక్కడున్నట్లు?"
    "ఏమో! మీరు చెప్పలేదా?
    "ఊహు.....పిలిస్తే వచ్చేదానివా?"
    "ఎందుకు రాను? పోనీయండి - అయిపోయిందిగా!"
    "వీరన్న పెళ్ళి చూడాలని నిజంగా - అయిపోయిందిగా!"
    "వీరన్న పెళ్ళి చూడాలని నిజంగా నీకుందా?"
    "వీరన్న మీ కాత్మియుడని నాకు తెలుసు. అందుకే అతనంటే నాకూ అభిమానం. నేను అభిమానించే వ్యక్తీ సుఖంగా పెళ్లి చేసికుంటుంటే చూడాలని వుండదా?" రాబోయే నిట్టుర్పును అణచుకున్నాడు రామచంద్ర.
    "రండి - వడ్డిస్తాను" చాలా రోజుల తర్వాత తిరిగి వారిజ వడ్డిస్తుండగా భోజనానికి కూర్చున్నాడు రామచంద్ర.
    "ఆ రోజు సగంలో వదలి వెళ్ళిపోయాను కదూ?" బాధగా నవుతూ అన్నాడు.
    "మీకు పుణ్యం వుంటుంది - ఇవాళ మాత్రం అలా చేయకండి."
    "చెయ్యమన్నా చెయ్యను .......నాకెంత ఆకలిగా వుందో నీకేం తెలుసు?"
    'అన్నీ వట్టి కబుర్లే ......నిజంగా ఆకలయితే తినండి మరి...."
    "నిజంగానే ఆకలి వారిజా! తిండి కోసం కాదు - ప్ర్రేమ కోసం . స్వచ్చమైన అనురాగం కోసం దహించుకు పోతున్నాను." మనసులో అనుకున్నాడు రామచంద్ర.
    రామచంద్ర భోజనం ముగించి లేచాడు. మళ్ళీ పడక కుర్చీలో కూర్చోబోయాడు. వారిజ దగ్గరగా వచ్చి మృదువుగా అంది ........." ఇప్పటికే పొద్దుబోయింది. ఇంక వెళ్ళండి......."
    "వెళ్తాలే!" బద్దకంగా అన్నాడు.
    'అలా కాదు.....లేవండి . అవతల మీ శ్రీమతి మీకోసం కళ్ళలో వత్తులేసుకుని చూస్తూ వుంటుంది."
    "నీకెలా తెలుసు?"
    "మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీకోసం ఎంత తహతహలాడాతారో నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది?' నోటి చివరకు రాబోయిన మాటల్ని ప్రయత్నం మీద వెనక్కు లాక్కుని లేచాడు రామచంద్ర.
    'సరే! వెళ్తాను." వారిజ తన మెడలో వున్న సన్నని గొలుసు తీసింది.
    "ఇది రంగనాయకికి ఇవండీ. వద్దంటే నేను వూరుకోనని చెప్పండి."
    "ఎందుకు వారిజా ఇది?"
    "ఇందాక చెప్పాను.....మీ కాత్మియుడయినప్పుడు వీరన్న నాకూ కావలసిన వాడయ్యాడని ...ప్రస్తుతం నా దగ్గరున్నది ఇదే! తీసి కెళ్ళి ఇవండీ."
    "ఇక్కడేం చేస్తున్నావు నువ్వు?"
    "ఎంతసేపటికి అడిగారు ? కొత్తగా పెట్టిన ప్రైమరీ స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నాను."
    "అంటే ......నువు...."
    "సినిమాల్లో నటించటం మానేసి చాలా రోజులయింది. "ఒక్కసారి వారిజ ముఖంలోకి చూసి ఇంకేమీ ప్రశించకుండా గొలుసు అందుకుని చీకట్లోకి నడిచాడు రామచంద్ర.

                                                       9

    రామచంద్ర ఇచ్చిన బంగారు గొలుసును తెల్లబోయి చూశాడు వీరన్న. "ఇదేమిటి బాబూ! ఎందుకిది?"
    "రంగనాయికికి ఇయ్యమని వారిజ ఇచ్చింది."
    "వారిజ గారా! ఆవిడ ఇక్కడికి వచ్చారా?" ఆశ్చర్యంగా అడిగాడు వీరన్న.
    "ఊ....." పరధ్యానంగా, ముక్తసరిగా చెప్పాడు రామచంద్ర వీరన్న కొన్ని క్షణాలు రామచంద్ర ముఖం వంక చూస్తూ మాట్లాడకుండా వూరుకుని, చివరకు తగ్గు స్వరంతో, "మీరింకా ఆవిడను కలుసుకుంటూనే ఉన్నారా?" అన్నాడు.
    రామచంద్ర విసురుగా అంటే?" అన్నాడు.
    "నేను మీకు చెప్పవలసిన వాడిని కాను - కానీ....."
    "చెపుతున్నాను - నన్ను కాల్చుకు తినే పతివ్రతామ తల్లి లతను వదిలినా అశాంతిని మటుమాయం చేయగల మధుమూర్తి వారిజ దగ్గర కెళ్ళి పతితుడ్నయిపోతున్నానని నీ బాధ. అవసరం లేదు. బాధపడకు. ఆ అదృష్టం నా ముఖాన లేదు. నిన్న కాకతాళీయంగా వారిజను కలుసుకున్నాను. అంతే!" కసిగా అన్నాడు రామచంద్ర.

 Previous Page Next Page