17. ఇలాంటిచేతివ్రాతగల స్త్రీలు సహజంగా నిజాయితీ కలవారైవుంటారు. మామూలు స్త్రీలు అలక, నయగారాలు, సెల్ప్ పిటీ - ఇటువంటివి మీలో కనిపించవు.
18. మీరు అనుకున్నవి సాధించటానికి ఒకోసారి క్రూరంగా ప్రవర్తించే వీలుంది. అయితే మీరు క్రూరులు కారు.
19. మీది గొప్ప ఆత్మవిశ్వాసం. ఇలాంటి ఆత్మవిశ్వాసాన్ని సాధారణంగా మొగవాళ్లు ఇష్టపడరు. ఓరకంగా మిమ్మల్ని గౌరవిస్తారు.
20. మీరు ఇష్టపడని వ్యక్తుల్ని, వాళ్ల సిద్దాంతాల్ని వ్యతిరేకించడం ద్వారా లేదా అసహ్యించుకోవటం ద్వారా, వాగ్వివాదం సృష్టించుకోవటం ద్వారా కాకుండా తప్పించుకోవటం ద్వారా దూరమౌతారు. మీరు ఒకసారి స్నేహితులను ఇష్టపడితే వారెంత అవకతవక పనులు చేస్తున్న, వారంటే పక్షపాతం చూపుతారు.
21. మీ స్నేహితుడు షోలే సినిమాలో ధర్మేంద్రలాగ ఏ వాటర్ ట్యాంకో ఎక్కి అల్లరి చేసినా లేదా అదే సినిమాలో హేమమాలని లాంటి వసపిట్టో అయినా వాళ్లు 'మీవాళ్లు' కాబట్టి వాళ్లని ఇష్టపడతారు. క్షమిస్తారు. అదే పని మీకు పరిచయంలేని వ్యక్తి చేస్తే చాలా దారుణంగా విమర్సిస్తారు.
22. మీరు ఇతరులని ఎంత ఇష్టపడతారో అంతగా వాళ్లు స్పందించక పోతే మీలో మీరే ద్వేషాన్ని పెంచుకొని వాళ్లనుంచి విడిపోతారు.
23. మీరు మీ ఆశయం కోసం త్యాగం చేయరు. అంటేమీరు స్వార్దపరులనో, నిజాయితీ లేనివాళ్లనోకాదు. పరిస్థితులకోసం అవసరాలకోసం ఆశయాలను మార్చుకోవాలనే సత్యాన్ని బాగా ఆకళింపు చేసుకొనే తెలివైనవాళ్లై వుంటారు.
24.ఇటువంటి చేతివ్రాతవున్న స్త్రీలు బాగా చదువుకొని ఆపైన పి. హెచ్. డి. చేసినా సరే, భార్యగా ఒక వ్యక్తిత్వమున్న మగవాడితో స్థిరపడటమే తృప్తిగా భావిస్తారు.
B.వాక్యాలు పైకి వ్రాసేవారు:-
మొదలుపెట్టినప్పుడు తిన్నగా వ్రాసినా కాగితం చివరి కొచ్చేసరికి -మొదలు పెట్టిన చోటునుంచి వాక్యాలు పైకి వ్రాసేవారు ఎక్సైటెడ్ జీవితం అంటే ఉత్సాహం వున్నవాళ్లు అయివుంటారు. సాధారణంగా రచయితలూ, వ్రాత పని ఎక్కువగా ఇలా పైకి పోవడం సంభవిస్తుంది. మొదటి వాక్యం సరిగా మొదలుపెట్టి,పేజీ చివరికొచ్చేసరికి ఎడమవైపుకన్నాకుడివైపు ఖాళీ ఎక్కువవున్నట్లైతే అది వాక్యం పైకి పోవటాన్ని సూచిస్తుంది.
1. ఇలా వాక్యాలని చివరికొచ్చేసరికి పైకి వ్రాసేవాళ్లు చుట్టుపక్కల వాళ్లపై అధికారం చలాయిస్తారు. ఇతరులు తమ అదుపాజ్ఞలలో వుండకపోవటం వల్ల బాగా నష్టపోతారనేది వీళ్ల అభిప్రాయం. ఆశ్చర్యంగా ఒక్కోసారి అదే నిజమౌతుంది.
2.ఇతరుల జీవితంలో ఎలా నడుచుకుంటే బావుంటుందో మీరు చెప్ప గలిగినా, వారిపై మీకు వుండే చిన్న చూపువల్ల ఆ ఇతరులు బాధపడే అవకాశముంది.
3. మీ తెలివిన, మీ ఔదార్యాన్ని ఎవరైనా గుర్తించకపోతే అహంకారం, అభిమానంల స్థానంలోఅవమానం, బాధ చోటుచేసుకొని మిమ్మల్ని వేధిస్తాయి.
4. మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవటంలో అశక్తులనే చెప్పుకోవాలి.
5.ఆతిధ్యం ఇవ్వటంలోమీకు మీరేసాటి.
6. గొప్ప గొప్పవారి చహచర్యం చేసేమీరు, ఆ విషయాన్ని అధ్బుతంగా నలుగురికీ తెలియజేస్తారు. ఇది ఒక 'కళ'
7. కన్నీళ్ళు, జాలి, దయ, క్షమాపణ - ఇటువంటి వాటిమీద మీకు చాలా నీచమైన అభిప్రాయం వుంటుంది.
8. మిమ్మల్ని మీరు రాజు/ రాణి గా భావిస్తూ వుంటారు. ప్రేమ విషయంలో కూడా ఇలాగే భావించి అప్పుడప్పుడు దెబ్బతింటారు. ప్రేమకు కావలసింది అర్దం చేసుకొనే మనసే గాని, అజమాయిషీ చేసే గొప్ప మనిషి కాదు అని మీరు అర్దం చేసుకొనే సరికి విఫల ప్రేమికులవటమో లేదా మీ ప్రేయసి /ప్రియుడు వేరొకరిని వివాహం చేసుకోవటమో జరగవచ్చు.
9. జీవితం పట్ల మీకున్న అమితాశక్తి ఆశావాదం మిమ్మల్ని మెట్ట వేదాంతం బారి నుంచి రక్షిస్తుంది.
10. వేరొకరి సాయం పొందటం మీకు అసలిష్టం వుండదు. వారి ముందు అశక్తులుగా నిలబడటం అనేది మీ యొక్క ఆఖరి చర్య.
11. మీకు సాయం చెయ్యాలనుకొనే వారిని కూడా, మీరు శత్రువులుగా పరిగణించే ప్రమాదం వుంది.
12. ఎంతటి కష్టతరమైన బాధ్యతనైనా సునాయాసంగా భుజానవేసుకొని పూర్తి చేయటమంటే మీకు ఇష్టం.
13.హాస్యాన్ని గానీ, సంతోషాన్నిగానీ ఇష్టపడే మీరు మీకు ఎదురుతిరిగే వాళ్లని దూరంగా నెట్టివేసి, మీ వెంట వచ్చే బంధువులను, స్నేహితులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ వారితోనే గడపటానికి ఇష్టపడతారు.
14. పొగడ్తలకు, కృతజ్ఞతలకు మీరు తేలికగా లొంగిపోతారు. అలాగే ప్రేమ విషయంలో మోసపోయే అవకాశం కూడా వుంది.