Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 19


    
    "నో" శౌరి ఆవేశంతో అరిచాడు "అది కుదరదు"
    
    "మీరిక్కడ ప్రేక్షకుడు మాత్రమే" సూటిగా అంది ప్రణయ. "నిర్ణయం తీసుకోవాల్సింది క్విజ్ మాస్టర్."
    
    ఇద్దరి బాధ్యతల్నీ ఆమె పరోక్షంగా గుర్తుచేస్తుంటే అప్పుడు జోక్యం చేసుకుంది ప్రబంధ...
    
    ఆడిటోరియం హఠాత్తుగా నిశ్శబ్దం.
    
    "ఒకే ప్రశ్నకి ఒకేసారి జవాబు అన్న ప్రపోజల్ నాకూ ఆమోదయోగ్యమే. సో... ఇప్పుడు నేను చెప్పిన జవాబు కరెక్టు అయినా, అది కేన్సిల్ చేయండి. అంటే మా టీం ఓ ప్రశ్నకి జవాబు చెప్పటంలో ఫెయిలయింది."
    
    "సరే" పరిష్కారం కుదిరిన క్విజ్ మాస్టర్ స్కోర్ మార్క్ చేస్తున్న రాధ వేపు చూశాడు కరెక్టు చేయమన్నట్లుగా.
    
    "నౌ.... ది క్వశ్చన్ గోస్ టు టీం వై బాంకింగ్ అన్నది బావిలోనియా ఈజిప్టు నాగరికతల్లో ప్రారంభమైనట్లు ఆధారాలు మనకున్నాయి. ప్రస్తుతం అమలులో వున్న మోడరన్ బాంకింగ్ ప్రపంచంలో తొలిసారి అమలులోకి వచ్చింది ఏ దేశంలో?"
    
    "ఇటలీ" టక్కున అన్నాడు ఆదిత్య.
    
    "రైట్" ఇప్పుడు టీం ఎక్స్ మాఫియా అనే అంతర్జాతీయ స్థాయి సీక్రెట్ సొసైటీ తొలిసారి మొదలయింది ఎక్కడ?
    
    నోరు తెరవబోయిన సుధీర్ ని వారించింది ప్రబంధ నెమ్మదిగా తోచింది చెప్పి నీతోపాటు నన్నూ ఫూల్ ని చేయకు" జావగారిపోయిన సుధీర్ తల పంకించాడు బుద్దిమంతుడిలా "బాక్సింగ్ లో నల్ల జాతీయుడు అంటే నాకు
    
    "బాగా తెలిసింది మహమ్మద్ ఆలీ. అందుకే అతని పేరు చెప్పాను."
    
    "అంతకంటే నోర్మూసుక్కూచుంటే బెటరు" కోపాన్ని అదిమిపెడుతూ అన్న ప్రబంధ క్విజ్ మాస్టర్ వేపు చూసింది.
    
    మరో అయిదు సెకండ్లలో గడువు పూర్తవుతుందనగా చెప్పింది. "మాఫియాకి ఆరిజన్.... ఇటలీలోని సిసిలీ."
    
    "యూ ఆర్రైట్ మిస్ ప్రబంధా! నౌ..."
    
    ప్రణయ ఉద్విగ్నంగా చూస్తూంది.
    
    "ఏదన్నా క్రిమిని మనం చంపితే మనిషి రక్తంలా ఎర్రగా వుండదు. కారణం?"
    
    "క్రిమి రక్తంలో ఆక్సిజన్ వుండదు" ఆదిత్య అన్నాడు. "అంతేకాదు మనిషి రక్తంలోలా హెమోగ్లోబిన్ కూడా వుండదు. అందుకే అది ఎరుపుగా వుండదు."
    
    "రైట్" ప్రబంధ టీం వేపు చూస్తూ అడిగాడు "క్లియోపాత్ర తోడబుట్టిన ఇద్దరు అన్నదమ్ముల పేర్లతోబాటు ఆమె మొదటి యిద్దరు భర్తల పేర్లు ఏమిటి?"
    
    "టోలమీ ఎయిట్ అండ్ టోలమీ నైన్! వీళ్ళిద్దరూ క్లియోపాత్ర తోడబుట్టిన అన్నదమ్ములు. ఇద్దరు భర్తలు కూడా వీళ్ళే..." ప్రబంధ చెప్పింది.
    
    "రైట్! ప్రముఖ బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే డైరెక్ట్ చేసిన మొదటి హిందీ చిత్రం షత్రం జ్ కే ఖిలాడీ కథా రచయితెవరు?"
    
    "మున్సీ ప్రేమ్ చంద్" చెప్పింది ప్రణయ.
    
    "నిండు కొలువులో వస్త్రాపహరణం... సరిగ్గా ఈ మధ్య ఓ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన సన్నివేశాన్ని పత్రికలు ఇలాంటి కాప్షనుతో పబ్లిష్ చేశాయి. ఏ రాష్ట్ర మది?"
    
    "తమిళనాడు" ప్రబంధ వెంటనే జవాబు చెప్పింది. "అలా జైర్గింది ఎమ్మెల్యే జయలలితకి"
    
    "రైట్! భారత రత్న పొందిన తొలి భారతీయుడు?"
    
    "చక్రవరర్తుల రాజగోపాలాచారి"
    
    అప్పటికి ఏభై రెండు నిముషాలు పూర్తికావడానికి మరో అయిదు నిముషాలు మిగిలి వున్నాయి.
    
    కేవలం అయిదు మార్కుల్లో వెనుకబడివున్నారు ప్రబంధ, సుధీర్.
    
    "నౌ టీం ఎక్స్... నేమ్ ద ఫస్ట్ బస్ దట్ వెంట్ టు అమెరికా"
    
    "కొలంబస్."
    
    "వెరీ రైట్ మిస్ ప్రబంధా!"
    
    ఆడిటోరియంలో కరతాళధ్వనులు.
        
    "వాట్ రోప్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ టైయింగ్ థింగ్స్?"
    
    "యూరోప్" ఆదిత్య జవాబుకి ప్రణయ నవ్వింది మృదువుగా.
    
    "రైట్ మిస్టర్ ఆదిత్యా!" అభినందించకుండా వుండలేకపోయాడు క్విజ్ మాస్టర్ "మిస్ ప్రబంధా! డిక్ ఫ్రాన్సిస్ అనే రచయిత ఓ ప్రముఖ సంఘటన ఆధారంగా 'బ్లడ్ ఆఫ్ స్పోర్ట్స్' అనే పుస్తకాన్ని రాశాడు. ఆ సంఘటన ఏమిటి?"
    
    "ప్రిన్స్ ఆగాఖాన్ కి చెందిన ఓ రేస్ హార్స్ కిడ్నాప్ అయి చనిపోయింది. ఆ సంఘటన ఆధారంగా రాసిన నవలది"
    
    "రైట్..." టైం చూసుకున్నాడు. ఏభై రెండు నిముషాలకి మిగిలింది మరో అరనిముషం మాత్రమే.... "మిస్ ప్రణయా! ఈ బంచ్ లో ఆఖరి ప్రశ్న ఆరక్షరాల ఇంగ్లీషు రచయిత పేరు చెప్పాలి.... అతడి పేరులోని చివరి మూడక్షరాలు హెచ్ ఓ ఆర్."
    
    టక్కున ఆదిత్య మొహంకేసి చూసింది ప్రణయ.
    
    అప్పటికే ఆలోచనల్లోకి జారిపోయాడు ఆదిత్య.
    
    ఒకటి...రెండు....మూడు...ఇరవై...ఇరవై ఏడు...సెకండ్లు దొర్లిపోతున్నాయి.
    
    ఆడిటోరియంలో ఇసుక రేణువు రాలితే చప్పుడు వినబడేటంత నిశ్శబ్దం.
    
    చెప్పాల్సిన వ్యవధి గడిచిపోతుండగా అసంకల్పితంగా అంది ప్రణయ "చివర హెచ్ ఓ ఆర్ అనే మూడక్షరాలు వచ్చే ఆరక్షరాల ఇంగ్లీషు రచయిత పేరు ఆథర్."
    
    "రైట్!" నీరసంగా అన్నాడు క్విజ్ మాస్టర్.
    
    ప్రణయని అభినందిస్తూ ఆడిటోరియంలో చప్పట్లు.
    
    స్కోరు చెప్పింది మిస్ రాధ. తొలి గడువు ఏభై రెండు నిముషాలలో టీం ఎక్స్ సాధించింది అరవై అయిదు మార్కులైతే, టీం 'వై' స్కోరు చేసింది డెబ్బై....
    
    కరతాళధ్వనులతో నిండిపోయింది హాలు.
    
    "మిగిలింది..." క్విజ్ మాస్టర్ ప్రొఫెసరు రాధాకృష్ణ నిర్లిప్తంగా అన్నాడు. "స్పాంటేనిటీ టెస్ట్..... అంటే ముందు చేసినట్టు నాలుగు నిముషాల వ్యవధిలో ఎనిమిది ప్రశ్నలకి జవాబులు చెప్పాలి. జవాబు చెప్పాల్సింది పది సెకండ్ల వ్యవధిలో ఒక్కో జవాబుకి నాలుగు మార్కులుంటాయి. అంటే మొత్తం ముఫ్ఫై రెండు మార్కులు ఇప్పుడు అయిదు మార్కుల లాగింగ్ లో వున్న టీం ఎక్స్ తో ప్రారంభిస్తున్నాను..."

 Previous Page Next Page