Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 16


    అయినా ఈ రోజు ఏదీ పట్టించుకోకుండా బేస్కట్ వీల్ పేడర్న్ లో వున్న వుడ్  ప్లోరింగ్ పై నుంచి  హాలు దాటింది.

 

    ఆమెను చూడగానే పనివాళ్లంతా ఆదేశం కోసం సిద్దమన్నట్టు ముందుకొచ్చారు.

 

    "డాడీ ఇంకా రాలేదా?" అని అడగబోయి ఆగిపోయింది.

 

    చిరాగ్గా హేండ్ రైల్ పట్టుకుని స్టెయిర్స్ దాటి పైనున్న బెడ్ రూం కేసి నడుస్తూ ఠక్కున ఆగిపోయింది.


 
    గది లోపలనుంచి సన్నని మూలుగులు, గుసగుసలు.

 

    ముందు అర్దంకాలేదు.

 

    ఖచ్చితంగా ఏ పక్కనుంచీ వినిపిస్తున్నదీ, సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ గది అయినా వున్నది ఆకార్డియన్ డోరు కావడంతో అంతా వినిపిస్తోంది స్పష్టంగా.

 

     అనుమానం లేదు. తాతయ్య బెడ్ రూమ్ నుంచే.

 

    మామూలుగా అయితే "గ్రాండ్ పా" అంటూ పిలుస్తూ గదిలోకి రావడం అలవాటేగానీ ఇప్పుడు డోర్ ని పక్కకీ లాగి గభాల్న అడుగుపెట్టింది విజూష.

 

    క్షణంపాటే ఆమె చూసింది.

 

    టీవీలో నగ్నంగా రెండు శరీరాలు ఒకరికొకరు హత్తుకుని...

 

    సడెన్ గా మనవరాలు రావడంతో ఠారెత్తిపోయిన  గౌరీనాధంగారు రిమోట్ తో కేసెట్  ఆపుచేసి "ఏంట్రా ఇంత ఆలస్యమైందీ?"అక్కడికీ ఆమె కోసమే ఎదురుచూస్తున్నట్లుగా.

 

    ఆరు పదులు దాటిన తాతయ్య ఏ బాద్యతా లేకుండా ఇంటిపట్టున వుంటున్నాడన్న విషయం ఒక్కటే కాదు ఈ మధ్య తరచూ బ్లూ ఫిలిం కేసెట్లు చూస్తున్నట్లు తెలుసుకుంది.

 

    ఇదిగో ఇప్పుడు దొరికిపోయాడు.

 

    నుదుట పట్టిన స్వేదం తుడుచుకుంటూ "భోంచేద్దామా?"అన్నాడు మనవరాలి మొహంలో నిట్టూర్పుకి కాస్త కంగారుపడుతూ.

 

    "లేదు గ్రాండ్ పా... నాకు కాస్త రిలాక్స కావాలనుంది" అంటూ సెటిలైపోయింది సోఫాలో.

 

    అదిరిపడ్డాడు గౌరీనాదంగారు.

 

    పాతికేళ్లక్రితం భార్య పోయిన దగ్గర్నుంచీ ఒంటరిగా బ్రతుకుతున్న గౌరీనాధంగారికి కొడుకుకన్నా మనవరాలంటేనే భయం.

 

     పెద్దా చిన్నా  అని చూడకుండా కడిగేస్తుంది.

 

    "ఆ రిమోట్ ఓసారి ఇవ్వండి గ్రాండ్ పా"

 

    "అబ్బే... ముందు భోంచేద్దాం రా" అన్నాడు మరింత ప్రేమను అభినయిస్తూ.

 

    "లేదు గ్రాండ్ పా! ఎనిమిదిన్నరకల్లా డిన్నర్ ముగించేవాడికి ఇప్పటిదాకా నీ ఆకలి గురించి పట్టించుకోలేదూ అంటే అంతగా నిన్ను చూస్తాను"

 

     కంపించిపోయారాయన.

 

    "నా మాట విను విజ్జూ.. .ఏదో ఇంగ్లీష్ ఫిల్మ్ బాగుంటుందని లైబ్రరీలో చెపితే తెచ్చా.

 

    కానీ మహా చండాలంగా వుంది.

 

    పైగా సెన్సార్ అయినట్టు లేదు" తడబడిపోయారాయన విజ్జూ చేయి పట్టుకుని

 

    బయటికి లాక్కుపోబోతుంటే "కనీసం ఆ పిక్చర్ పేరైనా చూడనియ్ గ్రాండ్ పా" అంది.

 

    గౌరీనాధంగారి పట్టు విడిపించుకుని వి. సి. ఆర్ లోని కేసెట్ బయటకు తీసింది సెకండ్ల వ్యవధిలో.


 
    "సో" చిన్నపిల్లాడిలా నేలచూపులు చూస్తున్న తాతయ్యతో అంది "ఇంగ్లీషు పిర్చరని అబద్దం చెబుతావా గ్రాండ్ పా"

 

    "అది కాదమ్మా అసలు..."

 

    ఆర్దోక్తిగా అంది "తెలుగు పిక్చర్ గ్రాండ్ పా. పేరు నర్తనశాల.

 

    "నిజమా?" అప్పుడు చూసారాయన.

 

    నిజమే!

 

    కేసెట్ మీద తెలుగు పేరుంది.

 

    మరి ఇంగ్లీషు సినిమా వస్తుందేమిటి?

 

    "నర్తనశాలని ఇంగ్లీషులోకి డబ్ చేస్తారా?" అమాయకత్వాన్ని నటించాడు.

 

     "లేదు గ్రాండ్ పా. చూసేవాళ్లకి అనుమానం రాకుండా ఒక తెలుగు పౌరాణిక సినిమా మీద రికార్డు చేసారు."

 

    " ఏమిటి?"

 

    "బ్లూ ఫిలిం"

 

    పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపోయాడు గౌరీనాధం.

 

    "ఛ... బ్లూ ఫిల్ములంటే యివా?"

 

    "చాలు గ్రాండ్ పా... బిల్డప్ చాలు. సిన్సియర్ గా బ్లూఫిలిం తెచ్చుకుని చూస్తున్నానని ఒప్పేసుకో. లేకపోతే...."

 

    "మీ డాడీకి చెబుతావా?"

 

    "ఛ.... నీతో కలిసి నేనూ చూస్తాను"

 

    "పిచ్చితల్లీ" సిగ్గుతో ఆమె కళ్లలోకి చూడలేనట్టు తల మరెటో పెట్టి దగ్గరకొచ్చాడు

 

    "మహా గడుగ్గాయి. టక్కున పట్టేసింది. మీ బామ్ముండేది చూసావ్ వట్టి. వెర్రిబాగుల్ని."

 

    "అంటే ఆ రోజుల్లోనూ ఈ అలవాటుందా గ్రాండ్ పా?"

 

    "వద్దమ్మా ఇలాంటి ప్రశ్నలడిగి  నన్ను ఇబ్బంది పెట్టకు. ఏదో తప్పయింది.

 

    బ్లూఫిలిమ్స్ తెచ్చికుని చూస్తూ నీకు రెడ్ హాండెడ్ గా దొరికిపోయాను  అసలిదంతా...."

 

    "నువ్వు మళ్ళీ  పెళ్లి చేసుకోకపోవడంతో వచ్చిన చిక్కనుకుంటాను గ్రాండ్ పా"

 

    "మళ్లీ పెళ్లా?"

 

    ఓ అట్టడుగు పొరల్లోనో మనవరాలి ప్రపోజల్ కాస్త ఆహ్లాదంగా అనిపించినా  బిడియంగా అన్నాడు -


 
    "మీ బామ్మ పోయేసరికి నేను నడివయసుకి వచ్చేసానమ్మా అందుకే పెళ్ళిమాట తలపెట్టలేదు."

 

    "కానీ ఇలాంటి కార్యక్రమంతో సంతృప్తి పడిపోతుంటారన్నమాట"

 

    ఇక వదిలిపెట్టదు.

 

    ఓ అరగంట బుర్ర తింటుంది.

 Previous Page Next Page