నాకెందుకనో భయమెయ్యలేదు. బహుశా నా శక్తిమీద నాకు నమ్మకమో, శక్తికి మించిన ఆత్మవిశ్వాసమో, మొండితనమో మొదట్నుంచీ ఉండటం కొంతవరకూ కారణం కావచ్చు.
దగ్గరకొచ్చి రెండు చేతుల్లో నన్ను యిముడ్చుకోటానికి ప్రయత్నించాడు. బలవంతంగా తోసేసి లేచి నిలబడి, తలుపు దగ్గరకు వేగంగా పోతున్నాను. చేజారిపోతున్నానన్న ఆతృతతో అతనమాంతం నామీద పడి బలంగా పట్టుకుని మంచం దగ్గరకు ఈడ్చుకు పోతున్నాడు. శక్తినంతా వినియోగించి విడిపించుకునేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. ఇద్దరి మధ్యా జరుగుతూన్న పెనుగులాటలో వగరుస్తున్నాం. అతని బలం ముందు నా బలం చాలటం లేదని అర్థమయింది. కాని లొంగి పోవటమిష్టం లేదు. పమిట చిరిగింది. జాకెట్ చిరిగింది. చివరకు మంచం మీద నన్ను పడవేసే సమయంలో చేతికేదో వస్తువు చిక్కింది. ముందూ వెనుకా చూడకుండా గట్టిగా తలమీద మోదాను. అమ్మా అన్న మూలుగు, అతన్నుంచి విడివడి బయటకు పరిగెత్తుతూ వెనక్కి తిరిగి చూసేసరికి తల చిట్లి రక్తం స్రవిస్తూ ఉండటం కనిపించింది.
బయటకు పారిపోయేదాన్నేమో, ఆ సమయానికి అత్తగారు ఇంటిముందు కారు దిగుతూండటం వల్ల ఆ ప్రయత్నం విరమించుకొన్నాను.
ఆ రాత్రి...
ఎంతకూ నిద్రపట్టటం లేదు. ఎప్పటిలా నా చవట మొగుడు గోడ వైపు తిరిగి పడుకొని ఉన్నాడు. మగాడిలో ఎన్ని విశిష్ట లక్షణాలున్నా, ఆ ఒక్కటీ లోపిస్తే ఎంత హీనంగా చూడబడతాడో అర్థమవుతోంది. అబ్బ! అతన్ని... ఆ క్షణంలో వాణ్ణి అని సంబోధించాలనిపిస్తోంది. చూస్తోంటే ఒళ్ళంతా ఎంత కంపరంగా ఉందో.
భయం వెయ్యటం లేదుగాని చాలా అసహనంగా ఉంది. నాకో గమ్యమంటూ ఉండాలి కదా. చివరకు మామగారితో మాట్లాడాలని నిర్ణయించుకుని లేచి ఇవతలి కొచ్చాను.
మామగారూ, అత్తగారూ వేర్వేరు గదుల్లో పడుకుంటారు. ఎంచేతనో తెలీదు. వాళ్ళిద్దరి మధ్యా ఉన్న సంబంధం యాంత్రికంగా ఉంటుంది. అర్థరాత్రి వేళప్పుడు కాసేపు ఆమె గదిలోకి వెళ్లి వస్తాడు.
ఆయన గదిలోకెళ్ళేసరికి చేతిలో విస్కీ పోసి ఉన్న గ్లాసుతో కనిపించాడు. కొంచెం కొంచెం సిప్ చేస్తున్నాడు.
తటపటాయిస్తూ తలుపు దగ్గరే నిలబడిపోయాను. తలెత్తి నావంక చూశాడు. నా సందేహం గమనించినట్లు 'ఫర్వాలేదు రా' అన్నాడు.
లోపలికెళ్ళాను.
ఆయన కెదురుగా మరో కుర్చీ ఉంది. కూచోమన్నట్లుగా సౌంజ్ఞ చేశాడు. ఏం చెయ్యాలో తెలీక చెప్పినట్లు చేస్తున్నాను.
"ఏమిటో చెప్పు" అన్నట్లు చూస్తున్నాడు.
నేవచ్చింది చెప్పటానికి. అర్థం లేకుండా పదిసార్లు అడిగించుకోటానికిక్కాదు.
మెల్ల మెల్లగా నా మనసులో రగులుతూన్నదంతా చెప్పేశాను.
వింటూ 'అయ్యో పాపం' అన్నట్లు చూస్తున్నాడు. తర్వాత బాధ భరించలేనట్లు గ్లాసులో ఉన్నదంతా ఒక్క గుక్కలో త్రాగేశాడు. అప్పటికది మూడో పెగ్గో నాలుగో పెగ్గో అయి ఉంటుంది.
"జరిగిందానికి చాలా బాధపడుతున్నాను" అన్నాడు. లేచి దగ్గరకొచ్చాడు.
తలమీద చెయ్యేసి సానుభూతి చూపిస్తూ దువ్వుతాడు కాబోలనుకున్నాను.
అచ్చమలాగే జరిగింది.
ప్రపంచంలో ఉన్న సానుభూతంతా తనలోనే ఉన్నట్లు..... ఓ.... కురిపించేస్తున్నాడు. తల, జుట్టు నిమురుతున్నాడు. బుగ్గలు నిమురుతున్నాడు. పెదాలు నిమురుతున్నాడు. సానుభూతి చూపించాలంటే అవన్నీ ముట్టుకోటం దేనికో అర్థం కావటం లేదు. తర్వాత వీపు నిమిరాడు. అంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాత ఛాతీ నిమరటానికి చేతులు సన్నద్ధమై ముందుకు జరుగుతున్నాయి.
"చేతులు తియ్యండి?" అన్నాను కటువుగా.
"ఎందుకని?"
"ఎందుకనేమిటి? మీ సానుభూతి భరించటం దుస్సహనంగా ఉంది.
"ఏమనుకున్నాడో ఏమో చేతులు తీసేశాడు. "నా సహాయం నీ కవసరమనుకున్నాను" అన్నాడు.
"ఏ విధంగా?"
"నీ యవ్వనం నిరర్థకం కాకుండా ఉండటానికి"
"మీకెన్నేళ్ళు?"
"యాభై ఎనిమిది?"
"ఈ వయస్సులో నా కోరికలు తీర్చగల పటుత్వం మీలో ఉందని నేననుకోవటం లేదు.
దెబ్బ తిన్నట్లు కనిపించాడు. కాని నిలత్రొక్కుకుని "చూడకుండా నా పటుత్వం గురించి నీకెలా తెలుసు?"
"కొన్ని కొన్ని చూడకుండానే తెలుస్తాయి. అయినా అత్తగారి గదిలో మీరెంతసేపుండి వస్తున్నారో అనుకోకుండా కళ్ళబడుతూనే ఉంది."
"దాని మొహం దాని దగ్గరేముంది పస? ఏదో మొక్కు తీర్చుకోటానికి వెళ్ళి వస్తున్నాను. నీలాంటి చిన్న దాన్తో అయితే విజృంభించగలను."
"ఓ కోడలితో ఇలా మాట్లాడటం అసహ్యంగా లేదూ?"
"హ హ్హ హ్హ హ్హ" అంటూ నవ్వాడు. "అబ్బో! చరిత్రలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. అదో థ్రిల్. ఇంకా ఇంతకంటే భయంకరమైనవి కూడా...."
"చెప్పకండి అసహ్యమేస్తోంది. నేను మీ దగ్గరకు కోరికల గురించి చర్చించటానికి రాలేదు. నా జీవిత సమగ్రత గురించి విలువైన సలహా చెబుతారేమోనని వచ్చాను."
".... బాగా. సంపన్నులయిన, సంఘంలో పరపతితో ఉన్న కుటుంబీకుల కోడలివి. చేతిలో బోలెడు డబ్బుంటుంది. కావాలంటే ఎక్కడికైనా కారులో పోగలవు. నీకు సహకరించటానికి మేమున్నాము. విషయం బయటకు పొక్కకుండా"...."