Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 10

 

    సీ.    పద్మకాశద్యుతి ప్రతికాశమై చన
                  పావకస్థానంబు పైఁ దనర్చు
        ప్రాణాలీలాపాన పరిపూర్ణ సంచార
                   కుంభక స్థాన తత్కుహరమందు
        తాలుమూలాంతర ద్వాదశ స్థానమౌ
                          పరనాళవీధుల ప్రబలఁ దెలిసి
        లింగాంగ సంధాన లీలానుకూలమౌ    
                  హంసాక్షరద్వయం బాశ్రయించి
    
    గీ.    ఉర్వివర్ణద్వయంబున కూర్ధ్వమైన
        వర్ణభేదంబు లన లేనివనిత గనుచు
        వనితకనుచూపులో నున్న వర్ణమగుచుఁ
        బదులనై దింట శోభిల్లు బ్రహ్మబిలము.
    
    సీ.    కదలక యధారకమలంబులో నున్న
                భుజగకన్యకఁ గూర్చి పొదలఁ దీర్చి
        సమమైన మలకలు చక్కఁగా సవరించి
                షణ్మండలంబులు సంధిపఱచి
        పరిమిత షట్చక్ర పద్మాంతములయందు
                  పరిపూర్ణ బంధముల్ పరగ నునిచి
        ప్రాణవాయుస్థాన పటుకళా సంపూర్ణ
                  ఘంటానినాదంబు కలయఁదెలిసి

    గీ.    తెలిసి విధుమండలంబులఁ దేటపడగ
        పడగలాఱింటఁ బవనంబు ప్రణవనాద
        నాదపరిపూర్ణ చిత్కశానంద మగుచు
        పదులనైదింట శోభిల్లు బ్రహ్మఆబిలము.

    సీ.    ఆధార చక్రంబునందు భక్త్యంగంబు
                  వసుధాంశచౌదళ వారిజంబు
        పీతవర్ణము క్రియాభిధ కల్గినది శక్తి
                  ధాత పూజారియై తనరు నచట
        నాల్గక్షరంబులు నమరు బీజంబులై
                   పరమును జిత్తంబు పరుగెనందు
        నాసంబుముఖము నౌవాసన ద్రవ్యంబు
                   పదపదార్ధంబుగాఁ బక్వశుద్ధి

    గీ.    యొనర నైష్టిక సద్భక్తి యుక్తముగను
        లీఅవర్దిల్లు నాచారలింగమునకుఁ        
        గోరి యర్పించి శేషంబుఁ గొన్న యట్టి
        భక్తలింగంబు నిరంతంబు ప్రస్తుతింతు.
        
    సీ.      స్వాధీష్టచక్రాన సలిలాంశమగునాఱు
                     దళముల పద్మంబు దనరుచుండు
        నందుఁబాయక యుండు నాఱక్షరంబులు
                     శ్వేత వర్ణంబని చెప్పనొప్పు    
        పూని మహేశ్వర స్థానంబు నిజమది
                     పూజారి విష్ణుండు పొదలు జ్ఞాన
        శక్తి యటమెలంగు చామముఖంబగు  
                      పాణి సుబుద్దియై పరగుచుండు
    
    గీ.    చాల యవధాన భక్తీచే మేలురసము
        లలమి చేకూర్చి సుగురులింగార్పితంబు
        చేసి శేషంబుభోగించి చెలగునట్టి
        పరమమాహేశ్వరుల నేను బ్రస్తుతింతు.
    
    సీ.    మణిపూరమును చక్రమం దనలంశంబు
                   పరికింప దశదశపద్మమచట
        నరుణవర్ణము పదియక్షరంబులు నందు
                   రుద్రుండు పూజారి రూడినిచ్చ
        శక్తిని వాసంబు చక్షులే వదనంబు
                   యదిప్రసాదిక మార్గ మనగనొప్పె
        నల నిరహంకారహస్త పద్మంబున
                    రూపద్రవ్యంబు లారూఢముగను
    
    గీ.    పక్వమొనరించి యవధాన భక్తీ యుక్తి
        యరయఁ జేకూర్చి లింగసమర్పితంబుఁ
        గొన్న శేషంబు భోగించి కుశలుఁడైన
        యా ప్రసాదిని వినుతింతు ననుదినంబు

    సీ.    సత్యమనాహతచక్ర ప్రభావంబు
                  పది రెండు రేకుల పద్మ మునికి
        యనిలాంశ మగు ద్వాదశాక్షరంబులు కూడి
                  హరితవర్ణంబుచే నలరియుండు
        నరయనీశ్వరుఁడు పూజారియై చెలువొందు
                  నాదిశక్తియు నందు మోదమలరు
        సరవి ముఖమును త్వక్స్పర్శయే ద్రవ్యంబు
                  నిత్యమానసహస్త నియతిఁబూని
        
    గీ.    లీల శోధించి సుచరాఖ్య లింగమునకు
        యుక్తమొనగూడ ననుభావ భక్తీక తన
        నర్పితము చేసి స్వీకార మందినట్టి
        ప్రాణలింగిని నిరతంబు ప్రణుతిఁ జేతు.    

    సీ.    స్వచ్చమైన విశుద్ధ చక్రంబునందున
                  పదియాఱు దళములపద్మ మరయ
        నందు పదాఱవు నక్షరంబులు గల్గి
                  యంబరాంశంబందు నతిశయిల్లు
        నింద్రనీలచ్చాయనెనయు పరాశక్తి
                 యలసదాశివుఁడు పూజారిఁ దలఁవ
        కర్ణదేశంబును వర్ణింప ముఖసీమ
                 జ్ఞానహస్తంబును పూని శబ్ద

    గీ.    పదపదార్ధము నానందభక్తీ గూర్చి
        సారమైనట్టి నిత్యప్రసాదనామ
        లింగమున కిచ్చి శేషంబులెస్సగొన్న
        శరణులగునట్టి ఘనులనే నన్ను తింతు.

    సీ.    సలలితమా జ్ఞాయ చక్ర ధర్మంబది
               ద్విదళ పద్మముకాంతి తేజరిల్లు
        ప్రణవాంశమగు దాన ప్రకటింపశక్యమే
                అందుల రెండు బీజాక్షరములు
        యందుబాయకయుండు నమ్మహబిచ్చక్తి
                 పూజారి పరశివుఁడూ ర్జితముగ
        నిర్ణయింపఁ గపోతవర్ణ మచ్చోటను
                  హృదయంబు ముఖపద్మ మది దలంప

    గీ.    పరిణయంబనుద్రవ్యమే భావహస్త
        మునను జేకూర్చి మహాలింగమునకుఁ దృప్తి
        యవును సమరస భక్తీచే నలరి లింగ
        మైక్య సుస్థలవర్తుల నభినుతింతు.    

 Previous Page Next Page