Read more!
 Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 4

 

    సిక్స్ జీరో నైన్ ;లోకి నడిచారు యిద్దరూ. తలుపూ మూసేసింది ఆమె .
    "కూర్చో"
    తనతో పాటే ఆమె కూడా సోఫాలో కూర్చుంది.
    "ఇప్పుడు చెప్పు "
    "ఇందాక నేను ఇంటర్యూ కెళ్ళాను కదండీ! భోజనం చేయలేదు కదా! కాఫీ అయినా తాగుదామని ఆ పక్కనే వున్న హోటల్లో కెళ్ళానండీ! తీరా అర్దరివ్వబోతుంటే గుర్తుకొచ్చిందండీ-
    జేబులో డబ్బుల్లేనని! కాఫీ అయినా తాగకపోతే ఎలాగా అని ఆలోచిస్తుంటే ఫ్యామిలీ రూమ్ లో నుంచి మాటలు వినిపించాయండీ!"
    శ్రీదేవి కళ్ళు పెద్దవయ్యాయి.
    కొంచెం భారంగా ఊపిరి పీలుస్తోంది.
    డిటెక్టివ్ కధ వింటున్నట్లు వింటోంది.
    "ఎవరి మాటలు?" తను చెప్పేవరకూ కూడా ఆగలేకపోతోంది .
    "నేనూ అదే అనుకున్నానండీ- గొంతు ఎక్కడో విన్నట్లుందేమి టబ్బా అని"
    "ఎవరిగొంతుకది?"
    "ఇంకెవరిదో అయితే నాదెం పొయిందండీ! మీ ఆయనదే"
    ఆమె ముఖం వాడిపోయింది. ఓ పక్క కోపం, మరో పక్క అవమానం .
    "రెండో గొంతుకేవరిది?"
    "ఇది కాఫీ బ్రేక్ కి సరయిన టైమ్"
    "అబ్బ! గొంతు ఎండిపోయినట్లయింది. ఉదయం నుంచీ భోజనం ఎలాగూ లేదు. కాఫీ అయినా తాగితే కొంచెం సొగసుగా వుండేది"
    "ఇప్పుడే కాఫీ పెట్టి వస్తానుండు"
    అంటూ లోపలికెళ్ళి స్టౌ మీద కాఫీ డికాక్షన్ వుంచి ఓ ప్లేటు జీడిపప్పు, పకోడీ, తీసుకొచ్చి అతని ముందుంచింది.
    "తింటుండు. కాఫీ తెస్తానీలోగా! పొద్దుట్నుంఛీ కాఫీ లేదంటున్నావ్ పాపం!"
    సురేష్ పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది.
    ఈ టిఫినూ, కాఫీ వల్ల దగ్గర దగ్గర అర్రూపాయలు లాభం!
    ఆ రాధిక కాఫీ తాగించమంటే 'పరాయి ' వంక పెట్టి తప్పించుకుంది.
    పకోడీ ఒకటి తిన్నాక ఇంకొంచెం ఇన్పర్మేషన్ అందించాడు.
    "రెండో గొంతు ఎవరిదా అనుకుంటూ కిటికీలో నుంచి చూశానండీ!"
    "ఎవరున్నారక్కడ?"
    "ఇంకెవరండీ? అదే?"
    శ్రీదేవి ఉలిక్కిపడింది.
    "ఎవరూ? వాళ్ళాఫీస్ లో పనిచేసే రాజేశ్వరేనా?"
    "ఇంకా అనుమానం ఏమిటండీ?"
    శ్రీదేవి ముఖంలో రోషం, కసి!
    "నిజం చెప్పొద్దు? నాకు భలే కోపం వచ్చింది? ఇంట్లో జయలలిత బాబులాంటి సెక్సీ భార్యను పెట్టుకుని నాసిరకం పిల్లతో కబుర్లు చెప్పడానికి ఏం రోగామండీ? పోనీ మీరేమయినా అందవికారా? మీ ముఖం చూస్తె ముద్దెట్టుకోకుండా వదలబుద్ధి కాదెవారికీనూ?"
    మాట్లాడుతుంటే అనందం పట్టలేక ట్రాన్స్ లో కెళ్ళి పోతోంది.
    "బైదిబై -- మీరు కాలేజ్ లో చదువుతుండగా ఎవరయినా మిమ్మల్ని మాధురీదీక్షిత్ అంటూ కేకలు వేసేవారా?"
    "ప్రసాద్ అతని గాంగ్ వాళ్ళు అరచేవాళ్ళు."
    "నిజం చెప్పమంటారా? ప్రసాద్ ,  అతని గాంగ్ ఎలాంటి వాళ్ళయినా కానీండి గానీ మీకయితే సెంట్ పర్సెంట్ కరెక్టు పేరు పెట్టారు. ఇప్పుడే ఇలా వున్నారంటే అప్పుడు మరీ రెచ్చిపోయిన అందంతో వీరవిహారం చేసి వుంటారు."
    శ్రీదేవి కొంచెం సిగ్గుపడింది.
    "అబ్బే! మీ ముఖస్థితి కోసం కాదండీ! ఫాక్ట్ ని ఎప్పుడూ గౌరవించటం నా పాలసీ అండీ! పోనీ మీ హజ్ బెండ్ ఆ పిల్ల వెంట పడ్డానికి ఆమెకేమంత గొప్ప. కొలతలున్నాయండీ? మీ కొలతలముందు పరమ బలాదూర్. మహా అయితే ట్వంటీ సిక్స్ -- ట్వంటీ ఎయిట్ --- ధర్టీ సిక్స్ ఉంటాయేమో! మరి మీవో -- నాకయితే సరిగ్గా తెలీదనుకొండి! ఎప్పట్నుంచో అడుగుదామనుకుంటూనే మర్చిపోతున్నాను- ఇంతకూ మీ కొలత లేమిటండీ అసలు ?"
    "ధర్టీ ఎయిట్ , ట్వంటీ ఫోర్ . ధర్టీ సిక్స్ " చప్పున చెప్పిందామె.
    "చూశారా! మీ మేజర్ మెంట్స్ క్కడ , దాని మేజర్ మెంట్స్ క్కడా? రెండింటికి కనీసం దగ్గర పోలికలయినా ఉన్నాయా?"
    "ధూ! నేనెక్కడ, అదెక్కడా? నాగలోకానికి, నక్కకీ ఉన్నంత తేడా-"
    "ఎగ్జాక్ట్ లీ! అయినా గానీ మీ ఆయనగారు దానివెంట పడుతున్నాడంటే కొంచెమయినా సిగ్గుండక్కర్లేదూ?"
    శ్రీదేవి ముఖంలోకి మళ్ళీ కసి వచ్చేసింది.
    "ఈ మగాళ్ళంతా ఇంతే! ఇంటి కోడి పప్పుకూరతో సమానమంట" ఉక్రోషంగా అంది.
    "అందరూ అలా గుడ్డాళ్ళయి పోతారంటే! నెన్నమ్మనండీ! మైగాడ్ చెప్పుతానండీ ఆయన పొజీషన్ లో నేనుంటే మాత్రం మీ పొజిషన్ ఇలా ఉండేది కాదండీ! అగరొత్తులెలిగించి మరీ పూజలు చేసే వాడిని మీకు ."
    ఆమె ఆనందంగా ,అభిమానంగా చూసిందతని వేపు.
    "ఏదో అభిమానం కొద్ది అంటున్నావ్?"
    "నోనోనో ! అభిమానం కాదండీ! రియల్ గా మీ మెజర్ మెంట్స్ చూసి ఫీలయి చెప్తున్నాను మీరు గదిలో వుంటే కిటికీ దగ్గర, రోజూ మీనా, నగ్మా, కూష్ బూ, దివ్యవాణి వగైరాలు క్యూ కట్టి విజల్స్ వేసి పిలిచినా గానీ కన్నెత్తి చూడను - ఆ !"
    ఆమె మరింత పొంగిపోయినట్లు తెలుస్తూనే వుంది.
    "ఏది మీ చేయి ఇలా ఇవ్వండోసారి"
    శ్రీదేవి చేయి అందించింది అప్రయత్నంగా.
    "ఆహా! ముట్టుకుంటేనే ఒళ్ళు జల్లుమంటోంది. ఇంత ఎలక్ట్రిసిటీ వున్న మిమ్మల్ని మర్చిపోయి డ్రైబాటరీ ఆ రాజేశ్వరీ చేయి ఇలా నిమురుతున్నాడంటే-"
    అప్పుడు స్పృహలో కొచ్చి సురేష్ చేయి విసిరి కొట్టింది శ్రీదేవి.
    "ఏయ్! ఏమిటీ పిచ్చిపనులు/ దూరంగా కూర్చుని మాట్లాడలేవూ?" పైట సరిచేసుకుంటూ అంది.
    "పొద్దుట్నుంచీ కాఫీ కూడా లేదు కదండీ! ఆ నిస్త్రాణలో ఏం చేస్తున్నానో నాకే తెలీలేదు "
    'అయ్యో ! కాఫీ స్టౌ మీద పెట్టి మర్చేపోయాను! ఇప్పుడే తెస్తానుండు" అంటూ లోపలికెళ్ళి ఓ పెద్ద కప్పు నిండా బోర్నవిటా తీసుకుచ్చి అందించింది.
    సురేష్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
    ఇంత బోర్నవిటా బయట తాగలంటే పడి రూపాలవుతుంది.
    ఇవాళ నిజంగా ప్రొద్దున లేచి ఎవరి ముఖం చూశాడో ఏమో గానీ తెగ లాభంగా ఉంది !
    "ఇంతకూ వాళ్ళిద్దరూ ఏమేం మాట్లాడుకుంటున్నారు?" మరింత కుతూహలంగా అడిగింది.

 Previous Page Next Page