Previous Page Next Page 
13... 14.... 15 పేజి 38


    విశాల్ బిగ్గరగా నవ్వుతూ "ఎవరు నమ్ముతారు? పత్రికళ మీద పరువునష్టం దావావేస్తాను. నీ దగ్గిర ఏ సాక్ష్యముందని....." అనబోతూ హఠాత్తుగా ఆగిపోయాడు. చప్పున రాజువైపు తిరిగి, "....సెర్చ్ హర్" అని అరిచాడు.

    మధూహ ఆఖరి ప్రయత్నంగా  బెల్ స్విచ్ గట్టిగా నొక్కింది. అప్పటికే రాజు దగ్గిరగా వచ్చి దిండు క్రిందనుంచి కాలింగ్ బెల్ నీ, టేప్ రికార్డర్ నీ తీసాడు. విశాల్ కళ్లు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. "చాలా సరంజామాతో వచ్చావే" అని రాజువైపు తిరిగి, "నేను చెప్పలేదూ. ఈ.....(అని ఒక బూతుమాట వాడి) పాములాటిది అని" అంటున్నాడు.

    రాజు మధూహ చెంపమీద బలంగా సాచికొట్టాడు. ఆమె కళ్ళనీళ్ళు గిర్రున తిరిగాయి. విశాల్ రికార్డర్ లోంచి క్యాసెట్ తీసి, ఆపరేషన్ కి వుపయోగించే ఫోర్ సెప్స్ తో టేప్ బయటికి లాగసాగాడు. మధూహకి నిస్ససహాయతతో కూడిన నిస్సత్తువ ఆవరించింది.

    అయిపోయింది. ఇంతకాలం పడిన శ్రమ అంతా వృధా అయిపోయింది. తనకే సంబంధమూ లేకపోయినా, తనకే నష్టమూ జరగకపోయినా..... ఒక సామాజిక దురన్యాయాన్ని ఎదుర్కోవటానికి ఇంతపనిచేస్తే చివరికి ఇలా అయింది.

    ఒక్కటే ఆశ.

    ఇన్ స్పెక్టర్ ఏమయ్యాడు?

    ఆమె ఆలోచించటం మానేసింది.

    ఈ లోపులో రాజు టేప్ అంతా బయటికి లాగి, సింక్ లోని నీళ్ళలో పడేసాడు. విశాల్, మధూహ వైపు తిరిగి నవ్వేడు. ఆ నవ్వు వికృతంగా భయంకరంగా వుంది. మధూహ వెన్నులో చలి పుట్టింది.

    "డాక్టర్ విశాల్ శత్రువుల్ని అంత మామూలుగా వదలడు. చెప్పు. నీకు ఏ శిక్ష విధించమంటావ్?" అన్నాడు మధూహ భయబ్రాంతురాలై చూస్తోంది.

    "యూట్రెస్ తీసెయ్యనా?" కామ్ గా అడిగాడు. 'చాక్లెట్ కొని ఇవ్వనా' అని  చిన్న పిల్లని అడిగినట్టు.

    మధూహ సన్నగా వణుకుతోంది. మనుష్యుల్లో ఇంత సాడిస్ట్ లనీ చూడటం అదే ప్రథమం.

    "రాజూ" పిల్చాడు విశాల్. "నీ ఒకప్పటి ప్రియురాలని శాశ్వతంగా గొడ్రాల్ని చేస్తే నీకేమయినా అభ్యంతరమా? స్త్రీత్వాన్ని తొలిగిస్తే అబ్జెక్షనా?"

    మధూహ ఆకులా కదిలిపోయి, "న్నో.....న్నో" అరవబోయింది. నోటమాట రాలేదు.

    "ఆమెని పట్టుకో రాజూ! మత్తు కూడా ఇవ్వొద్దు. అలాగే ఆపరేషన్ చేసేద్దాం. హిస్ట్రెక్టమీ.....కొద్దిగా బాధగానే వుంటుందనుకో. కానీ ఎంత అరచినా బయటకు వినపడదు. ఆపరేషన్ థియేటర్ కదా...." నవ్వేడు.

    రాజు ఆమెని టేబిల్ కి అదిమిపెట్టి పట్టుకున్నాడు. ఒక్కప్పుడు 'ఐ లవ్వూ' అన్న చేతులవి. తనని పెనవేసిన చేతులవి.  ముంగురులు నిమిరినవి. ఇదంతా ఆలోచించి ఆమె మనసు రాటు  దేలిపోయింది. అరిచే ప్రయత్నంకూడా చేయలేదు. ఇన్ ఫాక్సుయేషన్ వయసులో ఆకర్షణని ప్రేమ అనుకున్నందుకు.....తప్పుడు ఎంపిక చేసుకున్నందుకు.....తనకి అది శిక్ష అని మాత్రం అనుకుంది.

    డాక్టర్ విశాల్ ఆపరేషన్ పరికరాల్తో ఆమెకాళ్ళ దగ్గిర నిలబడ్డాడు. రాజు ఆమెని గట్టిగా పట్టుకుని వున్నాడు. డాక్టరు పొత్తికడుపు భాగాన ఇన్ సర్షన్ మొదలు పెట్టబోయాడు.

    అప్పుడు వినిపించింది తలుపు కొట్టిన చప్పుడు. మధూహ గాఢంగా శ్వాసతీసుకుంది. విశాల్ తలుపువైపు అనుమానంగా చూస్తూ, "ఎవరదీ?" అన్నాడు.

    "ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్" బయట్నుంచి వినపడింది.

    ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. "అతనెందుకు వచ్చాడు?" స్వగతంగా ప్రశ్నించాడు విశాల్.

    "నేను తీసుకొచ్చాను" అంది మధూహ. ".....మీ ఆటలు కట్టించటానికి"

    విశాల్ కామ్ గా "వెళ్ళి తలుపు తీయి రాజూ" అని, మధూహవైపు తిరిగి, "......ఇప్పటివరకూ జరిగింది ఒక్కవిషయం బయటకు రాకూడదు. గుర్తుంచుకో. తరువాత నిన్ను దేవుడు కూడా రక్షించలేడు" అన్నాడు.

    భైరవమూర్తి లోపలికి వచ్చాడు డాక్టర్  విశాల్  అతడితో "ఇప్పుడే ఆపరేషన్ ప్రారంభించబోతున్నాను. ఏమిటంత అర్జెంటు పని ఇన్ స్పెక్టర్?" అన్నాడు.

    భైరవమూర్తి నవ్వేడు. "నా ముప్ఫై ఏళ్ళ సర్వీసులో ఇలాంటి డబాయింపులు చాలా చూసాను డాక్టర్ కాసెట్ లోంచి తీసేసినా టేప్ పాడవదు. అదీ, మధూహ సాక్ష్యం.... ఈ రెండు చాలు కనీసం ఏడేళ్ళు నిన్ను కటకటాల వెనక్కీ తోయటానికి"

    మధూహ గుండెల్నిండా శ్వాస తీసుకుంది. అప్పటివరకూ వున్న టెన్షన్ తగ్గింది.

    "కానీ టేప్ రికార్డర్ సాక్ష్యం ఆధారంగా  కోర్టు శిక్షవేయదు ఇన్ స్పెక్టర్"

    "కానీ జనం నమ్ముతారు. వాస్తవం వాళ్ళకి తెలుస్తుంది. నేనూ మధూహ సాక్ష్యం చెపుతాము. అది చాలు కదా నువ్వు సమూలనంగా నాశనం అవటానికి"

    "కేసు ఎలాగూ నిలవనప్పుడు మీకేమిటి ఇందులో ఇంటరెస్టు?"

    భైరవమూర్తి పక్కనున్న టేబిల్ దగ్గిరకు లాక్కుని కూర్చుంటూ "మూడు లక్షలు ఇవ్వండి. ఇఅడంతా మార్చిపోతాను" అన్నాడు.

    మధూహ దిగ్భ్రాంతురాలై చూసింది. తను వింటున్నది నిజమేనా అన్న అనుమానం కలిగింది ఆమెకు.

    "ఒక్కనిముషం టైమిస్తున్నాను. ఆలోచించుకుని చెప్పండి. మీరోప్పుకోకపోతే నాకొచ్చే నష్టం ఏమీలేదు. మిమ్మల్ని ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకెళ్తాను. ఈ అమ్మాయికి సంబంధించినంతవరకూ నాకన్నా మీరే ఎక్కువ శత్రువులు. కాబట్టి నాగురించి కాకపోయినా, కనీసం మీ  గురించయినా కోర్టులో సాక్ష్యం చెపుతుంది ఏం? అంతేనా?"

    మధూహ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఫిర్యాదు చేసినవాడికే నమ్ముకున్న న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తే అతడెలా నిర్వీర్యుడవుతాడో.....అలా వుండిపోయింది.

    డాక్టర్ విశాల్ తెలివితక్కువ వాడేమీ కాదు. ఈ కేసు కోర్టుకెళ్ళి పేపర్లలో ఆవార్త వచ్చి, అందరికీ వివరాలు తెలిస్తే......దాని పరిణామాలు ఎలా వుంటాయో ఊహించగలడు.

    "లక్ష ఇస్తాను"

    "రెండు లక్షలు...." ఇన్ స్పెక్టర్ అన్నాడు. విశాల్ ఇవ్వనన్నట్టు అడ్డంగా తలూపాడు. భైరవమూర్తి ఒక క్షణం ఆలోచించి..... "లక్షా యాభైవేలు. అదే  ఫైనల్" అన్నాడు. ఒక్కక్షణం అక్కడ నిశ్శబ్దం.

    "వారంలోగా సర్దుతాను"

    "రేపటిలోగా సర్దాలి. ఆ తరువాత కేసు రాస్తే బాగోదు."

    తప్పదన్నట్టు విశాల్ తలూపాడు. భైరవమూర్తి రాజువైపు తిరిగి, "నువ్వో క్షణం బయటకెళ్ళు" అన్నాడు రాజు ఏదో అనబోయి మనసు మార్చుకుని వెళ్ళిపోయాడు.

    "ఇతడిని ఎంతవరకూ నమ్మొచ్చు?" రాజు వెళ్ళినవైపే చూస్తూ అడిగాడు భైరవమూర్తి.

    "అతడు నా అసిస్టెంటు"

    "కానీ కళ్ళు పోయినప్పుడు పదిహేనువేల కోసం నిన్ను బ్లాక్ మెయిల్ చేసాడు. ఈ అమ్మాయిని ముందు ప్రేమించానన్నాడు. తరువాత నీ కోసం వదిలేసానన్నాడు. కళ్ళుపోగానే మళ్ళీ ప్రేమన్నాడు. ఇప్పుడు తిరిగి నీవైపు వచ్చేసానంటున్నాడు. ఇలాటి వాళ్ళని నమ్మటం కష్టం. క్రిమినల్స్ తో నాకున్న కాంటాక్టుని బట్టి చెపుతున్నాను...."

    "మరేం చేద్దాం?"

    "వీళ్ళిద్దర్నీ విడగొట్టాలి...."

    "ఎందుకు?"

    "ఈ అమ్మాయి చాలా అందంగావుంది. ఎప్పటికయినా అతడిని వల్లో వేసుకుంటుంది. నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తారు. అందుకే ఈ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలి."

    ఉరితీతకు సిద్ధమైన ఖైదీముందు తలారీ, జైలరూ మాట్లాడుకుంటున్నట్టు వారిద్దరూ ఆమెని ఎలా చంపాలా అని మాట్లాడుకుంటున్నారు. మధూహ దిగ్భ్రాంతితో చూస్తోంది.

    "ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఈమె చచ్చిపోయినట్టు రికార్డు సృష్టించటం కష్టం కాదు" అన్నాడు విశాల్.

    మధూహ హఠాత్తుగా అక్కణ్ణుంచి లేచి తలుపువైపు పరుగెత్తబోయింది. భైరవమూర్తి కాలు అడ్డుపెట్టాడు. పడబోయినదాన్ని పట్టుకున్నాడు. ఆమెని గట్టిగా అదిమిపెట్టి......"చాలా బావుంది శరీరం....రిటైర్ అవబోతున్నవాడిని...నాకే ఆవేశం కలిగిస్తోంది" అని విశాల్ వైపు తిరిగాడు. "మీరీ అమ్మాయికి హిస్ట్రెక్టమీ చేద్దామనుకుంటున్నారు కదూ"

    "అవును"

    "దానికన్నా అనుభవించటం మంచిది కదా"

    డాక్టర్ విశాల్ లాటి సాడిస్టు కూడా విస్తుబోయి చూసాడు. భైరవమూర్తి నవ్వేడు. "అవును, యూట్రెస్ ని తీసెయ్యటం కన్నా అనుభవించటం మంచిది కదా అంటున్నాను" అన్నాడు.

    "ఎలాగూ చంపదల్చుకున్నప్పుడు..... ఒకసారి ఇద్దరం అనుభవించి చంపుదాం. ఏం? రాజు ఏమన్నా ఫీలవుతాడని నీకు భయమా?"

    "రాజు సంగతి  నాకు బాగా తెలుసు. డబ్బుముందు అతడికి ఏదీ ఆగదు. అదీగాక ఈ అమ్మాయిలో అతడు చూడనిది ఏదీ మిగల్లేదు" అంటూ మధూహని పట్టుకున్నాడు విశాల్. కాపలాగా వుండటం కోసం....భైరవమూర్తి బయటకు నడిచాడు. అతడి వెనుకే తలుపు మూసుకుపోయింది.

    మధూహ విశాల్ చేతుల్లో గింజుకోసాగింది. విశాల్ మొహం వికృతంగా మారింది. రాక్షసబలంతో ఆమెని వివస్త్రని  చేయటం ప్రారంభించాడు. ఆమె ప్రతిఘటిస్తోంది. కానీ బలం చాలటం లేదు. అందులోనూ అప్పుడే కాంపోజ్ ఇంజెక్షన్ ఇవ్వబడిందేమో శరీరం తూలుతోంది. అయినా సరే......అతన్నించి తప్పించుకోవటం కోసం సర్వశక్తులూ కూడగట్టుకొంటోంది.

    అతడి మొహాన్ని రక్కేసింది. అతడి చొక్కా చిరిగిపోయింది. కానీ ప్రతిఘటించేకొద్దీ అతడిలో పశుబలం ఎక్కువ అవుతోంది. ఆమె ఆపరేషన్ గౌను దాదాపు వూడిపోయింది. చేతుల్లోకి బలం తెచ్చుకుని, అతడిని విసురుగా తోసేసి తలుపువైపు పరుగెత్తింది. అయితే ఆమెకన్నా ముందే అక్కడికి చేరుకున్న విశాల్ మళ్ళీ తలుపు గడియపెట్టేసాడు.

    ఆమెని రెండుచేతుల్తోనూ ఎత్తి ఆపరేషన్ టేబిల్ మీద పడేసేడు. ఆమెకు స్పృహ తప్పుతూండగా, నిస్సహాయమైన స్థితిలోవున్న ఆమెని ఆక్రమించుకోసాగాడు.

    ఆపరేషన్ గౌను నేలమీదకు జారిపోయింది. నగ్నంగావున్న ఆమె శరీరంమీద అతడి నఖక్షతాలు, మెడచుట్టూ దంతక్షతాలు రూపు దిద్దుకోసాగాయి.

    అయిపోయింది.

    అంతా అయిపోయింది.

    ఒక సామాజిక దురన్యాయాన్ని ఎదుర్కొనే యజ్ఞంలో తనే సమిధ అయిపోయింది.

    ఒక కన్నీటి చుక్క చెక్కిలి మీదకు జారుతుండగా, సత్తువ కోల్పోయి అతడికి లొంగిపోతున్న తరుణంలో....

    హఠాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది.

    అద్దం పగిలిన శబ్దం.

    ఆపరేషన్ థియేటర్ "సీల్డ్" కిటికీ తాలూకు అద్దం అది.

 Previous Page Next Page