Previous Page Next Page 
అంకితం పేజి 38


    జాన్ తలూపాడు. "ప్రేమ, ఆప్యాయత అనేవి మనిషికి చాలా ముఖ్యం. సాటి మనిషిమీద అవే నమ్మకాన్ని కలిగిస్తాయి."

    క్లుప్తంగా అన్నా, ఆ మాటల్లో చాలా అర్థం వుందనిపించింది. నేను వాటి గురించే ఆలోచిస్తూండగా కారు హాస్పిటల్ చేరుకుంది.

    చాలా రాత్రయింది. అందరం కారు దిగాం.

    కారు దిగగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను లోపలికి పరుగెత్తాను. అప్పటికే అంకిత్ ని చూసి చాలా రోజులై పోయింది.

    మంచి నిద్రపోతున్నాడు వాడు.

    మొహం ప్రశాంతంగా వుంది. మరుసటి రోజునుంచీ సుమద్యుతి నెమ్మదిగా ముందుకు వెళ్ళింది. గాలిలో నడుస్తూన్న దేవకన్యలా ఆమె పయనించింది. ఆమె కళ్ళలో అది దుఃఖమో- ఆనందమో-ఆవేదనో- అనురాగమో-అన్నీ మిళితమైన మిశ్రమ భావమో తెలీదు కానీ అది మాత్రం ఒక అనురాగమో- అన్నీ మిళితమైన మిశ్రమ భావమో తెలీదు కానీ అది మాత్రం  ఒక అపురూపం దృశ్యం!

    ఆమె నేలమీద కూర్చుని- వాడి మొహంలోకి నీళ్ళునిండిన కళ్ళతో చూస్తూ, ముంగురులు సవరిస్తోంది. నిద్రాభంగం కలిగించకుండా నిశ్శబ్దంగా ఆప్యాయతని అందిస్తోంది. పుత్ర ప్రేమని ఆస్వాదిస్తోంది.

    నేనా దృశ్యాన్ని చూస్తూండగా వెనుకనుంచి నర్సు వచ్చి "మీ భార్యగారి నుంచి ఫోను" అంది. అరుంధతి అప్పటివరకూ కనపడలేదని, అప్పుడు గుర్తొచ్చింది నాకు. అంకిత్ ని చూసే తొందర్లో ఆ విషయం గుర్తించలేదు.

    "ఇంతరాత్రి తను ఇంటికి ఎందుకు వెళ్ళింది?" అడిగాను.

    "తెలీదు సర్. అరగంట క్రితంవరకూ ఇక్కడే వున్నారు" అంది నర్సు.

    నేను వెళ్ళి ఫోన్ అందుకుని "హలో" అన్నాను.

    "ప్రయాణం బాగా జరిగిందా?" అట్నుంచి తీయగా వినిపించింది. అరుంధతి కాదు, కృపానంద్ కంఠం!

    వెన్నులోంచి చలిపుట్టి వళ్ళంతా పాకింది. ఒక కొండచిలువ, కాళ్ళ మీదనుంచి జరజరా వెళ్ళిన భావనతో శరీరం జలదరించింది. ఉలిక్కిపడ్డాను.

    "మాట్లాడవేం?....... ప్రయాణం బాగా జరిగిందా?" రెట్టించాడు.

    అతడి స్వరంలో అదే సాడిజం! ఒక చిన్న జంతువుని పంజాతో నొక్కిపట్టి, ఆ అమాయక జీవి భయంతో వణికిపోతోంటే కనపడే సాడిజం!

    అట్నుంచి కృపానంద్ నవ్వుతూ అన్నాడు. "..........నువ్వు నాతోపాటు అదే విమానంలో ప్రయాణం చేస్తున్నావనీ, నా వెనుక వరుసలో పేపరు మొహానికి అడ్డుపెట్టుకుని కూర్చున్నావనీ, నా వెనుక వరుసలో పేపరు మొహానికి అడ్డుపెట్టుకుని కూర్చున్నావనీ నాకు తెలుసు. ఆ జాన్ గాడు నా భార్యని తీసుకుని వేరేగా మరోవైపునుంచి విమానంలోకి రావటం కూడా చూసాను. అయినా నేనేమీ గొడవ చెయ్యలేదు. ఎందుకో తెలుసా?" ఆగాడు.

    ".....గొడవ చేయటం వలన ఏమీ లాభంలేదని నేను గ్రహించాను. నీమీద కిడ్నాప్ కేసులేదు. అదేవిధంగా నా భార్య తన కిడ్నీ ఇవ్వదల్చుకుంటే, కోర్టులో ఇంతకుముందు వాజ్యం నడిపినట్టు ఈసారి నడపలేను. అలా..... రెండు ద్వారాలూ మూసుకుపోయాయి. మీరు విజయగర్వంతో నవ్వుకుంటూ వుండి వుంటారని నాకు తెలుసు. అందుకే నేనూ మీతోపాతూ ప్రయాణంచేసి వచ్చాను. మీకన్నా తొందరగా పావులు కదిపాను. అక్కడే-మీ కన్నా నా తెలివితేటలు ఎక్కువ అని నిరూపణ జరిగింది! మీ విజయగర్వపు నవ్వు చెదిరిపోబోతోంది!!"

    "ఏం చేసావ్ ముందు అది చెప్పు" కటువుగా అన్నాను.

    "ఏం చేసానో అరుంధతిని-అదే నీ భార్య నడుగు."

    అప్రయత్నంగా నా చేతిలో రిసీవర్ వణికింది. అటు ఫోన్ అందించిన చప్పుడు.....వెక్కిళ్ళ శబ్దం. "......అరుంధతీ......" అన్నాను ఆందోళనగా! అట్నుంచి సమాధానం లేదు.

    ఆమె ఏడుస్తూన్న ధ్వని మాత్రం వినిపిస్తోంది. "ఏం జరిగింది అరుంధతీ?" అంటూ కంగారుపడ్డాను. ఆమెనించి సమాధానం లేదు. అంతలో ఆమె చేతిలోంచి కృపానంద్ రిసీవర్ లాకొన్నట్టున్నాడు. "......ఏం జరిగిందో నేను చెప్పనా?" అని అడిగాడు. ఆ తరువాత మళ్ళీ చిన్న నవ్వు. ".......అరుంధతి ప్రస్తుతం నా ఎదురుగా నగ్నంగా నిలబడి వుంది!" కామ్ గా అన్నాడు.

    అగ్నిపర్వతంలోంచి ఒక్కసారిగా లావా ఎగజిమ్మినట్టు నా శరీరం లోంచి రక్తం మొహంలోకి తన్నుకొచ్చింది. అతడిని తిట్టడానికి కూడా నా నోట మాటరాలేదు. భరించలేనంత నిస్సత్తువ ఆవరించింది. ముందుకు తూలాను.

    "నీ భార్యని వర్ణించమంటావా?"

    నా పెదవులు ఆవేశంతో వణకసాగాయి.

    "ముప్ఫై రెండేళ్ళు వుంటాయనుకుంటాను కదూ.....పిల్లలు పుట్టకపోవటం వాళ్ళ బింకం ఇంకా చెడలేదు. నీ భార్య ఇంకా కన్యేనేమో అని.....నా వుద్దేశ్యం..... కరెక్టేనా?"

    ఒకవైపు కోపం, మరోవైపు రంపంతో పరపరాకోస్తున్నట్టు బాధ!!! ఫోన్ విసురుగా పెట్టేద్దామనుకున్నాను కానీ అరుంధతి విషయం తెలుసుకోవాలి.

    "నీకేం కావాలి?" ఇరిటేటింగ్ గా అడిగాను. అతడు నా మాటలు పట్టించుకోలేదు. తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు. "..... నీ భార్యకి కనీసం అబార్షన్ కూడా అవలేదనుకుంటాను. పోత్తికడులు చూస్తే అలానే అనిపిస్తోంది. అన్నట్టు నీకు వివరాలు చెప్పలేదుకదూ- మీ ఆవిడ రెండు చేతులూ చెరోవైపూ కట్టేసాను. గోడవైపు తిప్పి, ప్రస్తుతం కాళ్ళు కట్టేస్తున్నాను."

    ఒక క్షణం నిశ్శబ్దం.

    "ఆఁ! కట్టేసాను. రెండు అడుగులు వెనక్కి వేసి నిల్చొని మీ ఆవిడ్నే చూస్తున్నాను. నీ భార్య వెన్నెముక చాలా బావుందోయ్, నున్నగా. చిన్న వంపు...... తెల్లటి వళ్ళు....."

    "స్టాపిట్............." గొంతు పిక్కటిల్లేలా అరిచాను.

    అతడు నవ్వేడు. "సర్లే ఆపుతున్నాను. ఆపేముందు నీకోవిషయం చెపుతాను. అదే ఆఖరి విషయం!! ప్రస్తుతం నేనెలా వున్నాననుకుంటున్నావ్? నగ్నంగా వున్నాననుకుంటున్నావా? లేదు. నిజంగా లేదు. ఆఫ్ కోర్స్...మీ ఆవిడని వెనుకనుంచి చూస్తోంటే అలా తయారవ్వాలనిపిస్తోందనుకో. ఇంతకీ ఏం చెప్తున్నానూ? నేనేం చేస్తున్నాను అన్నది చెపుతానన్నాను కదూ...... ఫోర్క్ కోసం వెతుకుతున్నాను. ఫోర్క్ అంటే తెలుసుగా...... భోజనాల్లో కూర్చోబోతున్నాను. కుర్చీ పక్కనే ఒక బౌలు వుంది. బౌలు అంటే తెలుసుగా....పాత్ర. ఆపరేషన్ ధియేటర్ లో ఉపయోగిస్తాం. బౌలు. మనిషి అవయవాలు కత్తిరించి, వృధా పదార్థాలు పడేసే పాత్ర!! చాకు సిద్ధంగా వుంది. తళతళ మెరుస్తోంది."

    "రన్నింగ్ కామెంటరీ ఆపి, స్కోర్ చెపుతాను విను. నా భార్యనీ, కూతుర్ని నా దగ్గిరకు చేర్చటానికి నీకు కార్లో పది నిముషాలు పడుతుంది. కారు తీసుకునిరా. మా నాన్న దగ్గిర పేజర్ కూడ తీసుకో. సింహాచలం కొండ దగ్గిరకు వచ్చాక, ఎటు తిరగాలో పేజర్ లో చెపుతాను. రాలేదనుకో స్కోరు 10/1 అవుతుంది. మరో అయిదు నిముషాల తరువాత 10/2 అవుతుంది. వికెట్లేమిటి అని అడగవేం?"

    "ఏమిటి?"

    "నీ భార్య కిడ్నీలు." అతడి స్వరంలో నవ్వు మాయమైంది...... "సరిగ్గా పావుగంట తర్వాత నీ భార్య కిడ్నీలు నీకు పంపుతాను. అందుకే సరిఅయినపొజిషన్ లో ఆమెని సిద్ధంగా నిలబెట్టి వుంచాను. కత్తీ ఫోర్కూచాలు. ఒకదాన్తో చర్మాన్ని కోస్తాను. రెండోదాన్ని వాటిల్లో గుచ్చి, వాటిని బయటకు తీస్తాను" నేనెలాటి రాక్షసుడినో నీకు తెలుసుగా. అలాటి రాక్షసుడు నాలోంచి బయటకు రాకుండా వుండాలంటే పావుగంటలోగా శ్వేత నా దగ్గిర వుండాలి. ఇదేదీ మూడో కంటికి తెలియకూడదు....."

    ఒక క్షణం ఆగి పూర్తిచేసాడు. "రెండు నిముషాల్లో నువ్వు బయల్దేరాలి. సుమద్యుతి, శ్వేతలతో సహా...."

    రెండు నిముషాలు.

    సరీగ్గా రెండే రెండు నిముషాలు.

    ఫోన్ పెట్టేసి నేను ఆలోచనలో పడ్డాను.

    ఇంతలో వెనుకనుంచి జాన్ వచ్చాడు. ఏం జరిగిందని అడిగితే, అంతా చెప్పాను. "-మనిషిలో ఇంత రాక్షసత్వం వుంటుందనుకోలేదు. అతడికి శ్వేతతోపాటు సుమద్యుతి కూడా కావాల్ట. లేకపోతే పావుగంట తర్వాత అరుంధతి కిడ్నీలు రెండు పార్శిల్ చేసి పంపిస్తాడట."

    మిగతా వివరాలు చెప్పలేదు నేను. వినటానికే విలవిలలాడిన - నేను నోటితో ఏం చెప్పగలను? చెప్పినదంతా విని జాన్ కూడా నోటమాట కొంచెం సేపు రానట్టు వుండిపోయాడు. "ఇది..... ఇది ఇలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. అంతా సవ్యంగా అయిపోయింది కదా అనుకున్నాను" తెప్పరిల్లిన తరువాత అన్నాడు. ఇద్దరిమధ్యా ఒక క్షణం నిశ్శబ్దం. ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేచి, "నేను వెళ్తున్నాను" అన్నాను.

    చప్పున తలెత్తి, "అతడి కండిషన్స్ కి వప్పుకుంటున్నావా?" విస్మయంగా అడిగాడు.

    "లేదు. అంకిత్ కి ఆపరేషన్ జరిగి తీరాలి. సుమద్యుతి ఇక్కడే వుంటుంది."

    "అతడు వప్పుకోడేమో?"

    "వప్పుకోడు. కానీ ఏం చెయ్యగలడు? నన్నూ అరుంధతినీ చంపేస్తాడు అంతేగా!...... ఇక్కడ అంకిత్ బ్రతుకుతాడు. అదీ కావల్సింది........." అంటూ జాన్ దగ్గరికి వెళ్ళాను. అతడి కళ్ళలోకి లోతుగా చూస్తూ అన్నాను. ".............అంకిత్ కోసం  ప్రపంచం మొత్తాన్ని దహనం చేయటానికి కూడా సిద్ధంగా వున్నాను. అటువంటిది వాడి కోసం అతడి తల్లితండ్రులమైన మేమిద్దరం మరణించాలనేది కండిషన్ అయితే, అది చాలా చిన్న బేరం!!" నా నిర్ణయాన్ని దృఢంగా చెప్పాను.

    జాన్ సమాధానం చెప్పలేదు. నేను డాక్టర్ మహారధి వద్దకు వెళ్ళాను.

    "ఆపరేషన్ ప్రారంభం కావటానికి ఇంకా ఎంతసేపుంది డాక్టర్" అడిగాను.

    "ఇంకో పావుగంటలో ప్రారంభం కాబోతుంది" ఇంగ్లీషులో అన్నాడు డాక్టర్.

    "నాకు మీ పేజర్ ఒకసారి కావాలి."

    డాక్టర్ మహారధి మొహంలో విస్మయం కనపడింది. "........ఎందుకు?" అని అడిగాడు. అతడు అలా అడగటంలో ఆశ్చర్యం ఏమీలేదు. పేజర్ అంటే అదోరకమైన టెలిఫోన్ లాటిది. అయితే దానిద్వారా సంభాషించే వీలుండదు. కేవలం అవతలివాళ్ళు చెప్పదల్చుకున్న రెండు మూడు వాక్యాలు సిగరెట్ పెట్టె  సైజులో వున్న ఆ పరికరపు 'తెర' మీద కనపడతాయంతే. అందుకే డాక్టర్ "ఎందుకు?" అని అడిగాడు.

    "అతడిని వెళ్ళనివ్వండి డాక్టర్. నేను చెపుతాను" అన్నాడు వెనుక నుంచి జాన్ డేవిడ్.

    సరిగ్గా వెంటనే సింహాచలం కొండవద్దకు వెళ్ళలేదు.

    మెడికల్ షాప్ కి వెళ్ళాను.

    మహారధి క్లినిక్ లో సంగ్రహించిన ప్రిస్కిప్షన్ పేపరుమీద 'ఎకోనైట్' కాంపౌండ్ పేరు వ్రాసాను. దానితోపాటూ, ఎందుకైనా మంచిదని డైగోక్సైన్ కూడా వ్రాసాను. షాపువాడికి అనుమానం రాలేదు. మామూలుగానే ఇచ్చేసాడు.

    అంత భయంకరమైన విషాలు కూడా మామూలుగానే  యిచ్చెయ్యటానికి కారణం డాక్టర్ ప్రిస్కిప్షన్ ! మహారధి సంతకాన్ని ఆవిధంగా పోర్జరీచేసి విషాన్ని సంపాదించగలిగాను.

    నేనేం చెయ్యదల్చుకున్నానో నాకు కరెక్ట్ గా తెలుసు!

    నన్ను చూడగానే అతడు అడగబోయే మొదటి ప్రశ్న -"సుమద్యుతి ఏది?"

    తీసుకురాలేదంటాను. అంతే.. చాలా ఇరిటేట్ అవుతాడు. నా కళ్ళముందే నా భార్య కిడ్నీలు- ఆమె శరీరంనుంచి చీల్చటానికి ప్రయత్నిస్తాడు. అదిగో...... అప్పుడే నేనీ ట్రంపుకార్డు వేయదల్చుకొన్నాను. ట్రంపు కార్డు అంటే నేను గెలవటం కాదు. అతడిని గెలవనీయకుండా చేయటం!! అందుకే ఆ వ్యూహం ఆలోచించాను.  

 Previous Page Next Page