Previous Page Next Page 
హనీమూన్ పేజి 34


    "ముందది తెలాలిగా ?"

    "ఏమిటది?"

    "ఆరులక్షలు!"

    "అరవ్తేలక్షలన్నా రేమిటిందాక?"

    అరగంట సేపు అర్ధం తెలిని మాటలతో గడిపాక అతనికి మాకూ కూడా చిరాకు పుట్టుకొచ్చింది.

    "మీ స్ధలం ఎంతకిస్తారో చెప్పండి ముందు!" అడిగాడు సారది కోపం అణచుకుంటూ

    "అరవ్తే లక్షలకే?"

    "అరవ్తే లక్షలకు ఒక్క ప్తెస కూడా తగ్గదు."

    "అరవ్తే....అరవ్తే....అరవ్తే ....మీకు స్కూలో లెక్కలు చెప్పిన వెధవేవడో నాకు తెలీటంలేదు. గజం  మూడు వేల చొప్పన రెండు వేల గజాల ఖరిదేంతో తెలిదా? చిన్న పిల్లాడు చెప్తాడి లెక్క"

    "మేమూ చెప్పాంగా ఆరు లక్షలని"

    "అందుకే మీకు లెక్కలు చెప్పినవాడు వెధవ అంటున్నాను."

    "అంటే...."

    "2000 గజాలు ఖరీదు  అరవ్తే లక్ష లవుతుంది. ఆరులక్షలుకాదు.

    "మాకు ఓ విధమయిన భయం ప్రారంభమయింది. అరవ్తేలక్షలు కేవలం స్ధలానికే అవుతుందనేసరికి. మా లెక్క ప్రకారం, స్ధలానికి, రెండు సినిమాహల్స్ కి కలసి నలభయి లక్షలు మాత్రమే అవుతుంది.

    "అయితే పుట్టి స్దలనికే అరవ్తే లక్షలంటారు!" షాక్ నుంచి కోలుకుంటూ అడిగాడు సారధి."

    "అవును!"

    "ఆరులక్షలకు కుదరదంటారు."

    "మీకు పిచ్చేకిందని నా అనుమానం."

    "అబ్బే....అలాంటిదేం లేదు."

    "లేపోతేఅ ఇలా మాట్లాడారు"

    "చాలామంది మాట్లాడతారు"

    "వాళ్ళూ తప్పక పిచ్చాళ్ళే అయుంటారు."

    "కాదు."

    "ఆల్ ర్తేట్- నా టైమ్ వేస్టు అవుతోంది" అన్నాడతను టైమ్ చూసుకుంటూ.

    "సరే మేము మళ్ళి మా బోర్టు మెంబర్స్ తో మీటింగ్ పెట్టుకుని మీ స్ధలం  గురించీ నిర్ణయం తీసుకుంటాం."

    "తీసుకోండి!" అన్నాడతను అసహనంగా లేచి నిలబడుతూ.

    "ఆరులక్షలకు కుదరదంటారు."

    "నాకు  టయిమయింది."

    "సరే"

    అందరం బయటకు వచ్చేశాము.

    ఆ రోజుతో  సినిమాహాలు ప్రపోజల్ రద్దయిపోయింది.

    ఆ తరువాత మరో నెలరోజులు ఇంకొన్ని ప్రాజెక్ట్స్ గురించీ స్టడి చేశాక అన్ని వదిలేసి మామూలుగా రోజూ సాయంత్రం సమయాల్లో పార్క్ లో కలుసుకోవటం, సినిమాల గురించీ కబుర్లు చెప్పుకోవటంలో మునిగిపోయాం. ఆ తరువాత మరో నెలరోజులకు పూర్తి మావూలు జీవితానికి అలవాటు పడిపోయారందరూ.

    అయితే మా ఆఫీసర్ కి మాత్రం  ఇంకా ఎప్పటికయినా మేమేదో చేస్తామన్న నమ్మకం మాత్రం అలాగే ఉంది.

    ఎటొచ్చి పేచి ఎక్కడ వచ్చి పడింది అంటే మా ఇళ్ళల్లోనే మా వాళ్ళను ఆ రోజుల్లో గొప్పగా చ్తేర్మన్ గారి భార్య అని, మేనేజింగ్ డ్తెరెక్టర్ గారి భార్య అని మా పేటలో పిలిచిన ఆడాళ్ళంతా ఇప్పుడు అదే హొదాని అవహేళనగా మార్చారు.   
          

    అది పాపం  మా వాళ్ళిద్దరూ భరించలేక మాకు వార్నంగ్ ఇచ్చారు ఇంకోసారి అలా గాలిలో వ్యాపారం చేయటం ఇండస్టి లు పెట్టటం లాంటివి చేయడానికి వీల్లేదని -అసలు ఇంట్లో విషయాలు తప్పితే ఇంకోటి మాట్లాడగూడదని హెచ్చరికలు చేశారు. ఆడాళ్ళతో  గొడవ పెట్టుకోవడం కొరివితో తల గోక్కున్నట్లే అని తెలీటంవాళ్ల మేము ఆ రోజు నుంచి మా బిజినెస్ ప్రాజెక్టు  గురించీ పార్కులోనో, లేక హొటల్లోనో రహస్యంగా కలుసుకుని మాట్లాడుకోసాగాము. అది కూడా ఎప్పడూ కాదు మా ఊళ్ళో ఎక్కడయినా ఎద్తేనా కొత్త షాఫ్  తెరచినప్పడో, లేదా పేపర్లో ఎవరో ఏదో  పరిశ్రమ పెట్టారని  ఇంకెవరో దానికి ప్రారంభోత్సవం చేశారని, పేపర్లో చదివినప్పుడు మాత్రం ఆ ఆలోచనలు వచ్చి డిస్కషన్స్ స్టడి మొదలు పెడతామన్న మాట! కొద్దిరోజులపాటు ఆ ఆలోచనలు మమ్మల్ని చాలా బిజీగా ఉంచుతాయ్.

    అవన్ని గుర్తుండే మా వాళ్ళు ఇప్పుడు మేము హొటల్ గురించీ మాట్లాడేసరికి  వార్నింగ్ ఇచ్చారన్నామాట.

    పొద్దున్న  తొమ్మిది గంటలకు జాన్సీ స్టేషన్ చేరాల్సిన మార్తెలు ఎలాగోలా మధ్నాహ్నం ఒంటిగంటకు చేరుకుంది. అందరం కిందకు దిగి సామాన్లు లెక్క పెట్టాము. పదమూడున్నయ్ ఈసారి మాకేం చేయాలో అర్ధంకాలేదు. ఇంకేరివయినా కూడా కిందకు దింపెశామేమో అని అనుమానం వచ్చి ప్రతిది పరీక్షగా  చెక్ చేశాము  అన్నిమావే! అందులో ఎలాంటి  సందేహమూ లేదు.

    ఇంటిదగ్గర బయల్దేరెప్పుడు తొమ్మిదితో బయల్దేరిన గుర్తు మాకు. తీరా  ర్తేలేక్కాక ఒఅకటి తక్కువయిందన్న అనుమానంతో సరిజూస్తే మొత్తం పదకొండు కనిపించినాయ్ ఇప్పడేమో పదమూడు లెక్కతెల్తున్నాయ్.

    "మనం ఈ సామనుని అంతగా  పట్టించుకాకూడదు. పట్టించుకున్నకొద్ది తెగ కన్ ప్యూజన్ అయిపోతుంది." అన్నాడు సారధి.

    "అదే బెస్ట్!" అన్నాన్నెను.

 Previous Page Next Page