Read more!
 Previous Page Next Page 
రాజ హంస పేజి 3

 

    ఈ సన్నివేశం గమనించి చుట్టూ పక్కల కూర్చున్న వాళ్ళు ఒకటే నవ్వులు.
    పత్రికలో పేజీలు  తిరగేస్తుంటే ఓ శీర్ధిక కనిపించి కుతూహలం చెలరేగింది. "సెక్స్ సమస్యలు - సందేహాలు.'
    ఊర్వశి మాటలు ఇంకోసారి జ్ఞాపకమోచ్చాయి.
    ఉత్సాహంగా చదవసాగింది.
    "నాకు పద్నాలుగేళ్ళు..... ఒకబ్బాయితో లైంగిక సంబంధమేర్పడింది....
    "నాకు నలభయ్యేళ్ళు , బహిష్టు లాగిపోయాయి. మావారు రోజూ రమ్మంటారు. అలా జరగవచ్చా?"
    "నాకు భావప్రాప్తి కలుగకముందే మా వారికి....."
    ఇంక మొగవాళ్ళు.
    "నాకు పద్నాలుగేళ్ళ వయసొచ్చినప్పట్నుంచి హస్త ప్రయోగం అలవాటుంది. దానివల్ల ఏమయినా హానా?"
    "నాకు ఎక్కువసేపు .....పాల్గొనాలని వుంటుంది కానీ శీఘ్రస్కలనం .....పరిష్కారమేమిటి"
    "నాకు.....రెండోసారి పాల్గొనాలని వుంటుంది కాని శక్తి చాలటం లేదు. ఏం చెయ్యాలి?"
    "నా భార్యకి వక్షోజ సౌందర్యం లేదు. అందువల్ల ఇతర ఆడవాళ్ళ మీదకి మనసు పోతోంది.
    ఇలా ప్రశ్నల దొంతరలు.
    రాజహంసకు ఒళ్ళు గగుర్పొడుస్తోంది. రక్తం వేడెక్కినట్టయి నరాలు జివ్వుమనిలాగాయి. నరాలలోకి వెచ్చటి ఆవిరి.
    ఏమిటిది?
    ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. మధ్యలో చిన్న కునుకులాంటిది పట్టినా వెర్రెక్కించే కలలు.
    అప్పట్నుంచీ ఆవారపత్రిక విడవకుండా చదవసాగింది.
    ఒకసారి తల్లి చూసింది. "ఏమిటే అంత ఆసక్తిగా చదువుతున్నావు?" అంటూ ఏదో అనుమానంతో గభాల్న చేతిలోంచి పత్రిక లాక్కుని చదువుతున్న పేజి చూసింది.
    "ఛీ ఛీ ఏమిటే ఇది? యిదా నువ్వు చదువుతోంది? ఈ సారేప్పుడయినా యిలాంటివి చదువుతూ కళ్ళబడ్డావంటే మీ నాన్నగారితో చెప్పి భరతం పట్టిస్తాను." అని గదమాయించింది.


                                                              2

    ఒకసారి ఓ ఆలోచన మనసులో ప్రవేశించిందంటే వ్రేళ్ళు విస్తరించినట్టుగా నరనరాల వ్యాపిస్తుంది గాని మళ్ళీ బయటకు రాలేదు. అయితే ఆ ఆలోచన రూపు రేఖలు మరో విధంగా మలచబడవచ్చు.
    రాజహంస విషయంలో అదే జరిగింది. రోజులు గడిచిన కొద్ది ఆమెకు తన అందచందాల గురించి అవగాహన, తనలో ఓ ప్రత్యేకత ఉన్నదన్న అవగాహన లేకపోతే అహం ప్రబలసాగినాయి.
    డిగ్రీలోకి వచ్చేశాక ఆమెకు తన భావాలమీద పూర్తీ ఆత్మవిశ్వాస మొచ్చేసింది.
    "ఓ ఠీవి, దర్పం, హొయలు, వ్యక్తిత్వం ఆమెలో పుష్కలంగాచోటుచేసుకున్నాయి.
    మాటలో, నడకలో చూపుల్లో కొన్ని మేనరిజమ్స్ అలవాటు చేసుకుంది.
    ఆమె ఎక్కడ నడిస్తే అక్కడ ఓ కాంతికిరణం వ్యాపించినట్టుగా వుండేది" ఓ మృదు సుగంధం వీచినట్టుగా వుండేది.
    అమ్మాయిలు ఆమెను చూసి అసూయ పడేవారు.
    అబ్బాయిలు ఆమె వెంట పిచ్చి కుక్కల్లా పడేవారు.
    సాధారణంగా అందమైన అమ్మాయి కనబడితే అబ్బాయిల అల్లరి చెయ్యటం, వెకిలి చేష్టలు చెయ్యటం ఏడిపించటం - ఇలాంటి పనులు చేసేవారు. కాని ఆమె విషయంలో అలా జరగలేదు. ఆరాధించటం, ఆమెతో స్నేహం చెయ్యాలని ఉబలాటపడటం, ప్రేమలేఖలు రాయటం.....ఇవన్నీ జరిగేవి.
    కాలేజి లేక్చర్లర్లు సైతం ఆమెతో మాట్లాడటానికి విపరీతమైన ఉత్సాహం ప్రదర్శించేవాళ్ళు.
    ఇంగ్లీషు లెక్చరర్ చక్రపాణిని అమ్మాయిలూ చాలా యిష్టపడుతూ వుండేవారు. అతని ఇంగ్లీషు వాగ్ధాటి పర్శనాలిటీ చాలామంది ఆకర్షితులవుతూ వుండేవారు.
    కో ఎడ్యుకేషన్ వున్న కాలేజీల్లో అందం, పర్శనాలిటీ వాక్చాతుర్యం వున్న లెక్చరర్లు మీద అమ్మాయిలు హీరో వర్షిప్ పెంచుకోవటం పరిపాటి. అలాగే చక్రపాణి మీద చాలామందికి హీరో వర్షిప్ వుండేది.
    అతను నవ్వుతూ మాట్లాడుతూనే తన జాగ్రత్తలో తాను వుంటూ ఎవరికీ అందకుండా జాగ్రత్తపడుతూ వుండేవాడు. కాలేజి గోడలమీద తమ పెర్లేక్కుతాయేమోనన్న భయం కొంతవరకూ కారణం కావచ్చు.
    అతను మనిషి, కోరికలకు అతీతుడేమి కాదు. రాజహంసని చూసి చలించకుండా వుండలేకపోయాడు.
    క్లాసులో లెసన్ జరుగుతున్నప్పుడు పదేపదే ఆతని చూపులు రాజహంసమీదకు ప్రసరిస్తూ వుండేవి. షేక్ స్పియర్ యాజ్ యూ లైకిట్ అత్యద్భుతంగా వర్ణించి చెబుతూ విద్యార్ధులు తన్మయాస్థలో వుండగా తాను మాత్రం తన్మయంగా ఆమె వైపు చూపులు వెదజల్లేవాడు.
    రాజహంస యిది గమనించక'పోలేదు. ఆమె లోలోన గర్వపడ్డది. తోటి అమ్మాయిలూ ఆమెను చూసి అసూయ పడుతున్నారన్న సత్యమా ఆమెకు తెలుసు.
    ఒకరోజు తల్లితో ఎగ్జిబిషన్ కెళ్ళింది. అలా సాయంత్రాలు ఎగ్జిబిషన్ కు వెళ్ళడం, సినిమాల కెళ్ళడం, షికార్ల లూ పిక్నిక్ లకు పెద్ద పెద్ద హోటళ్ళ కు వెళ్ళటం ఆమె కెంతో సరదా, కాని తల్లి చాలావరకూ కఠినంగా వుండటం వల్ల ఆమె సరదాలూ, ఆశలూ తీరేవి కావు. తల్లి ప్రక్కనే అలా నడుస్తూ వుండటం యిబ్బందిగా ఉన్నా బలవంతాన భరిస్తూ వుండేది.
    ఎగ్జిబిషన్ అంతా కోలాహలంగా వుంది. రకరకాల స్టాల్స్ కళ్ళు మిరుమిట్లు కొలిపే కాంతులీనుతూ, దీప తోరణాలతో అలంకారాలు, బోలెడు తినుబండారాలు , స్వీట్స్, భారీ సైజు తో వుండి మసాలా చల్లిన అప్పడాలు, ఉప్పు, కారం జల్లిన మొక్కజొన్న కండెలు, యిదివరకేప్పుడూ తిననట్లు క్యూలో నిలబడి కొనుక్కుని అతి ఆబగా వాటిని తింటూ, లైఫ్ ఎంజాయ్ మెంటంతా అందులోనే వున్నట్లు అనుభూతి పొందుతూ వుండటం....
    అసలు మనిషికి తిండి మీద గల వ్యామోహం ప్రపంచంలో దేనిమీద వుండదు. అంతేగాక బయట ప్రపంచంలో అనాగరికంగా కనిపించే చర్యలు - అంటే రోడ్డు మీద బడ్డీల ప్రక్కన నిలబడి బహిరంగంగా తినటం .....యింలాంటివి ఈ నూతన ప్రపంచంలో కడుగు పెట్టేసరికి నాగరికంగా మారిపోతాయి.
    జాయింట్ వీల్, మోటారు సైకిలు తిరిగే వెల్ ఆఫ్ డెత్ మేజిక్ షో , బాల్ రూము డాన్సులు కుక్కలా ప్రదర్శనలు.
    అన్నిటికన్నా మించి కన్నులపండుగగా తిరిగే జంటలు.....
    ఇహ కొన్ని.....
    భర్త బావుంటే భార్య అంద వికారంగా వుంది. భార్య బావుంటే భర్త అంద విహీనుడుగా వున్నాడు.   

 Previous Page Next Page