Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 27


    "You are too old for mini skirts
    Let us go the out skirts
    You are too young to be grand maa
    And look excellent without a pyzama....."

 

    ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. అయినా కళ్ళలో మెరుపు కనబడింది. నేత్రకి తన మీద తనకే జాలివేసింది. ఈ అమ్మాయిల్ని స్పెల్ - బౌండ్ చేసే విధంగా సంభాషణ చెయ్యాలంటే తను కనీసం పది సంవత్సరాలు మానసిక వయసు  తగ్గించుకోవాలి.

 

    అదే సమయానికి దూరంగా ఎవరితోనో మాట్లాడుతున సర్పభూషణరావు వీళ్ళవైపు చెయ్యాలంటే తను కనీసం పది సంవత్సరాలు మానసిక వయసు  తగ్గించుకోవాలి.

 

    "మీ  హాబీస్ ఏమిటి....?" అని అడిగాడు నేత్ర, హంసలేఖతో మూడోసారి.

 

    "తన హాబీస్ నన్నడగండి నేను చెబుతాను" స్వర్ణ కల్పించుకుని అంది. "ఎల్విస్ ప్రిస్లీ అంటే ప్రాణం. క్లిఫ్ రిచర్డ్స్ అంటే చెవి కోసుకుంటుంది. డాన్సింగ్ ఈజ్ హర్ లవ్. ఇవన్నీ కాక కెమెస్ట్రీ తన అభిరుచి."

 

    నేత్ర  ఏదో  అనబోతుండగా బేరర్ వచ్చి "మిమ్మల్ని పిలుస్తున్నారు" అంటూ వెళ్ళిపోయాడు. అద్దాల అవతల సర్పభూషణరావు తోక తొక్కిన పాములా వున్నాడు.

 

    "ఏమిటి.... ఒంటరి అమ్మాయిల దగ్గర కబుర్లు చెబుతున్నావు?"

 

    "నీకేమిటిట నష్టం......" అన్నాడు నేత్ర అంతే పొగరుగా.

 

    "వాళ్ళు నా కూతుళ్ళు."

 

    నేత్ర నవ్వి "ఓహో...." అన్నాడు. ఎస్బీఆర్ కి ఆ నవ్వు మరింత కంపరం కలిగించింది. అతడి చెయ్యి  జేబులోకి వెళ్ళింది. అతి కష్టంమీద రివాల్వర్ తీయకుండా తమాయించుకొని అన్నాడు. "చూడు...... నువ్వు రెడ్డి  నాయుడింట్లో పనిచేసే జీతగాడివనీ, నీకు సూటూ బూటూ వేసి  యిక్కడికి సి.బి.ఐ. వాళ్ళు తీసుకొచ్చారనీ నాకు తెలుసు. పెద్దమనిషిగా సలహాయిస్తున్నాను. మీ వూరెళ్ళి ఏ కూలిపనో చేసుకో. ఇక్కడుంటే ప్రాణాలు పోతాయి. నీ మంచికోరి చెపుతున్నాను."

 

    నేత్ర  ఒకక్షణం  తెల్లబోయి, వెంటనే సర్దుకున్నాడు. ఉబికి ఉబికి వస్తూన్న నవ్వు దాచుకుని "నీ తల్లి....... పోనీయరాదేవయ్య....... గిట్టాటిసారా నాకు  మావూర్లమల్ల దొరుకుద్డా.....? భలేగుంది నీ కూతురు. సస్తే సస్తం. భయపడ్తం...? నెలరోజుల్లో అన్నీ నేర్చుకుంట. నేనే నేత్రనౌత" అని కన్నుకొట్టి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

 

    సర్పభూషణరావు అటే చూస్తూ నిలబడ్డాడు. జీవితం మొత్తంలో అతడితో  అలా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు.

 

    ఆ మరుసటి రోజు కూడా నేత్ర తన కూతుర్ని కలుసుకున్నాడని అతడికి తెలీదు. వాళ్ళిద్దరూ పక్కపక్క  సీట్లలో కూర్చుని సినిమా చూశారు. తను యాదృచ్చికంగా ఆ అమ్మాయిని సినిమా హాల్లో అప్పుడే చూసినట్టు  నటించాడు ఆమెనే ఫాలో అవుతున్న నేత్ర. ఈ రెండోసారి మీటింగ్  వారిని మరింత  దగ్గిర చేసింది.

 


                                                         *    *    *

 

    అదే రోజు రాత్రి పొరుగు దేశానికి ఒక టెలిగ్రాం వెళ్ళింది. పైకి  చాలా మామూలుగా కనబడే  ఆ టెలిగ్రాంని డి -  కోడ్ చేస్తే ఇలా వుంటుంది.

 

    "అనుకున్న పరిశోధన దాదాపు పూర్తయింది. ఫలితాల పట్ల నేను చాలా  సంతృప్తి చెందాను. అక్కడ మీరు చెయ్యవలసిన ఏర్పాట్లు పూర్తి  చేసి  రెడీగా  వుండండి. త్వరలోనే యుద్ధం మొదలు పెట్టవలసి రావొచ్చు"

                                                                               -క్యూ

    
                                  *    *    *

 

    "మిస్టర్ నేత్ర...... యిదిగో మీరడిగిన ప్లాటు" అంటూ చూపించింది అహూబిల.

 

    మూడో అంతస్తులో ప్లాటు అది. పూర్తిగా ఫర్నిష్ చేయబడింది.

 

    "థాంక్యూ........" అన్నాడు నేత్ర  చుట్టూ చూస్తూ.

 

    అక్కడ  కావల్సింది సౌఖ్యం కాదు. పూర్తిచేయవలసిన  పనికోసం  అది  ఉపయోగపడుతుందా లేదా అన్నది.

 

    "అవును........ నీ తార్కిక జ్ఞానానికి జోహార్లు" అన్నాడు నేత్ర.

 

    "మా అమ్మా నాన్నగారు నెలరోజులపాటు బదరీ  యాత్ర  కెళ్తున్నారు. కభ్యంతరం లేకపోతే నెలరోజులు నేనూ యిక్కడే వుంటాను".

 

    "అటువంటి ఆలోచన సంఘ విద్రోహ చర్య అవుతుంది  బిలా"

 

    ఆమె తటపటాయించి, మీ  బెడ్ రూం చూపిస్తాను రండి" అంది.

 

    "థాంక్స్ ..........నేను చూసుకోగలను" అతడు సూట్ కేస్ లోంచి పరికరాలు తీస్తూ అన్నాడు. అతని చేతిలో ఒక మినీ  టెలిస్కోప్ వుంది.

 

    "అంతేనంటారా.....?" అడిగింది.

 

    "ఆఫీసు వర్క్  మధ్యలో క్షుద్ర కార్యక్రమాలు నా కంత నచ్చవ్ అహూబిలా. సారీ...." అంటూ ఆమెను బలవంతంగా పంపి, స్టాండ్ కి టెలిస్కోప్  అమర్చాడు. రాత్రి ఏడయింది.

 

    టెలిస్కోప్ లో ఎదురిల్లు స్పష్టంగా  కనిపిస్తూంది. పై కిటికీలో హంసలేఖ  అద్దం ముందు నిలబడి తల  దువ్వుకోవడం  కనిపిస్తూంది. ఆమె అప్పుడే స్నానం చేసి వచ్చినట్టుంది. ఇంకా  టవల్ లోనే వుంది.

 

    అది ఆమె  ప్రైవేట్  గది అవటంతో ఆ టవల్ కూడా  నిర్లక్ష్యంగా చుట్టుకుంది. అంచు పై నుంచి  వక్షద్వయం బంధాలు తెంచుకున్నట్టు స్వేచ్ఛగా వుంది. ఆమె రెండు చేతులూ పైకెత్తి జుట్టు  ముడి వేసుకుంటూంది. చాలా  ఆరోగ్యకరమయిన శరీరం ఆమెది. మామూలు అమ్మాయిలకన్నా  కాస్త  పొడుగు  ఎక్కువ  అవటంతో ఆ టవల్  ఆమె శరీరాన్ని సగం  కూడా  కప్పలేకపోతూంది. దీపపు వెలుగులో ఆ శరీరం, అందమైన టవల్ లో షాక్ చేయబడిన  తెల్లటి  కేక్ లా  వుంది.

 

    పవర్ ఫుల్ టెలిస్కోప్ అది. స్పష్టంగా కనపడుతుంది. హిమాలయాలపై  అంచునుంచి వేల లక్షల సంవత్సరాలు అనంతానంతంగా జారిన మంచు ఆ కొండ  రాళ్ళని  నునుపు చేసినట్టు ఆమె తెల్లటి  భుజాల నున్నగా మెరుస్తూన్నాయి. అయితే  అతడు ఆమె అందం గురించి, వంపుల గురించి పట్టించుకోలేదు. టేబుల్  దగ్గరికి వెళ్ళి గబగబా నాలుగు  లైన్లు  వ్రాసి, ఆ కాగితాన్ని  ఉండచేసి  మధ్య ఎయిర్  గన్ లో  పెట్టి షూట్ చేశాడు. అది వెళ్ళి  ఆమె రొమ్ముల  మధ్య  తగిలింది. హంసలేఖ  కెవ్వున  కేకపెట్టి, వెనక్కి గెంతు  వేసి, తనకి తగిలిన కాగితంవైపు  అనుమానంగా  చూసి  భయం భయంగా విప్పింది. కిటికీలోంచి బయటకు చూసింది. ఎవరూ  కనబడలేదు. కిటికీ  తలుపులు మూసేసీ, కొంచెం  సేపు  ఆగి, వణికే వేళ్ళతో ఆ కాగితాన్ని విప్పింది.

 

    నాలుగే వాక్యాలు.

 

    ప్రియమైన మీకు,

 

    నేను..... నేత్రని. కన్ను మూసినా, తెరిచినా సన్నిహితులనుకున్న వాళ్ళు కళ్ళముందు కనబడడం పూర్వకాలస్నేహలక్షణమట. కిటికీ మూసినా తెరిచినా మీరే కనపడాలని ఎదురింటి ప్లాటు తీసుకున్నాను. ఈ శుభ సందర్భంలో మీరు మా యింటికి వస్తే సంతోషిస్తాను".                                                                                                

 Previous Page Next Page