" సాక్షాత్తూ మన ఎస్సీగారే."
" అంటే?"
"అనుమానించాల్సిన అవసరంలేదు మేడమ్. వయలుతోసంబంధం లేకుండా మహామబహుల్ని సైతం పాదాక్రాంతం చేసుకోగల ఆడదామె. మన డిపార్ట్ మెంట్ లోని చాలామంది పెద్దలు ఆమెకోసం వెంపర్లాడటం నాకు బాగా తెలుసు."
"మిత్రకి అక్కడ పనేముంటుంది?"
"మిత్ర ఉన్నవాడు, పలుకుబడిగలవాడు మాత్రమేకాదు, వయసులో ఉన్న మగాడుకూడా."
"అంటే మిత్ర వుమెనైజర్ కూడానా?" అసంకల్పితంగా అనేసింది .ఆమె క్రమశిక్షణగల ఏ.ఎస్.పి. మాత్రమేకాదు. మిత్ర విషయంలో అసలు సిసలయిన ఆడపిల్లకూడా.
మురారి మొహం చూశాకగాని ఆమె గుర్తించలేదు తను ఎంత తెలివితక్కువగానోరుజారిపోయిందీ. " అదికాదు మిష్టర్ మురారి. ఒకనాడు నాకు తెలిసిన మిత్ర చాలా డిసిప్లిన్డ్ గా ఉండేవ్యక్తి" సమర్థించుకోబోయింది.
"మార్గనెట్ సంగతి మీకు తెలీదు మేడం! కానీ వెళ్ళీనవాళ్ళు గంగలో మునక్కుండా వెనక్కిరాడు అన్న భావాన్ని మరోలా వ్యక్తంచేశాడు.
"ప్రవరాఖ్యుడు ఆ ఇంట అడుగు పెట్టినా పతనమయిగాన వెనక్కిరాడు."
మనసుని మెలిపెట్టే కలవరం క్రమంగా ఆమెను వివశురాల్ని చేస్తుంటే రోషంగా టేబుల్ మీదవున్న ఓ ఫైలు నందుకుంది.
మిత్ర ఇంత దారుణంగా పతనమయిపోరయాడా? ఒకవేళ మార్గరేట్ ఇంట్లో నే వుంటే ఈపాటికి ఏం చేస్తుంటాడు?"
తనదీ అనుకున్న సొత్తైదో చేజారి ప్రవాహంలోకొట్టుకుపోతున్నంత గగుర్పాటుతో అయిష్టంగా చాలా మామూలు ఆడపిల్లలా ఆలోచిస్తూంది.
" మేడం" మురారి పిలిచాడు. "ఏమిటీ చాలా టెన్ షన్ కి లోనవుతున్నట్టున్నారు."
"ఈ ఫైలు ...." తొట్రుపడింది.
"రణధీర్ నేరాలకి సంబంధించిన వివరాలున్న ఆ పైలు మీరు ఇంతకుముందు చూసిందేగా?"
" యా.... అప్పటికిగాని ఆమె తేరుకోలేదు. "అతనిమీద ఛార్జిషీటు పైల్ చేశాంగా!"
" ఈరోజే...."
"మీరు ఓమారు మల్లిని కలుసుకుని ధైర్యం చెప్పండి. రణధీర్ ని ఈ కేసులో ప్రాసిక్యుట్ చేసితీరాలి!"
"ఎస్ మేడం.ఐ విల్ బి ఆన్ జబ్" శాల్యూట్ చేసి వేగంగా బయటకి నడిచాడు.
అయిదు నిముషాలపాటు చాలా అశాంతిగా గడిపింది.
అదిగో అప్పుడు అపాయింట్ మెంట్ కోసమని ఏ స్లిప్ లోపలికి తీసుకొచ్చాడు కానిస్టేబుల్.అంగీకరించేది కాదే్మో కాని, తనను కలుసుకోవాలని వచ్చింది నగర మహిళామండలి అధ్యక్షురాలు.
"లోపలికి పంపు"
ఆదేశించిన మేనక ఆమె లోపలికి రావడానకి పట్టిన అరనిముషం లోనూ ఆలోచించింది.
మిత్ర ఇప్పుడేం చేస్తుంటాడు?
* * * *
" నేనే రణధీర్, మిత్రని మాట్లాడుతున్నాను."
ఫ్యాక్టరీ వర్క్స్ మేనేజర్ చాంబర్ లో కూర్చున్న మిత్రమొహంలో అలజడిలేదు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు. కాని పిడికిలిని రిసీవరు చుట్టూ బిగించి జవాబుకోసం ఎదురుచూస్తున్నాడు.
రెండుక్షణాలు నిశ్సబ్దం. "చెప్పు" ఆవలివేపునుంచి హేళనగా వినిపించింది రణధీర్ గొంతు.
"జవాబు చెప్పటానితి ఇంత ఆలస్యం చేశావేం? భయపడుతున్నావా?"
" దేనికి బామ్మర్ది?" నవ్వాడు వ్యంగ్యంగా.
ఓ ఆపరేషన్ లో విఫలమయిన మిత్ర ఇరవైనాలుగు గంటలపాటు నిర్విరామంగా శోధించి సాధించాడు అసలు నిజాన్ని. తన మనిషిని చేజిక్కించుకుని ప్రలోభంలో ముంచి తనను దారుణంగా దెబ్బతీశాడు రణధీర్. మరోసారి తోకతొక్కాడు. కావాలని రెచ్చగొట్టాడు.
"రణధీర్!" వివరణ కాదు. హెచ్చరిక అది. "ఏం ఆశించి నా మనిషిని ట్రాప్ చేసావు.ఎందుకు నాకింత నష్టాన్ని కలగచేసావు అన్నది నాకు అర్థంకాని విషయమయినా, నువ్వు చాలా మూల్యాన్ని చెల్లించబోతున్నావు."
"గూడ్... నేనే చేయించినట్టు తెలుసుకున్నావు."
క్షణం నిశ్శబ్దం.
"అంతే కాదు .ఏం చేయాలో కూడా నిర్ణయించుకున్నాను."
" మిష్టర్ బామ్మర్దీ" రణధీర్ అవహేళనగా నవ్వాడు. " ఇలాంటి చచ్చు బెదిరింపులకు నేను భయపడే స్థాయిలో లేను."
"అవును. మీ అయ్య హోం మినిష్టర్ కదూ!"
"ఎస్... ఈ రాష్ట్రంలోని శాంతిభద్రతలకి ఆయన ఇనా ఛార్జి... అంటే ఇక నీ ఆట ముగిసినట్టే."
"రణధీర్! నేను తెగించినవాడిగా రాజ్యంకన్నా బలవంతుడ్ని."
" కాని నాకన్నాకాదు."
" ఏం? అండతో తప్ప గుండెతో నన్ను ఎదుర్కోగలవా?"
" నీ చెల్లెలు ఎప్పుడూ చెప్పలేదూ?"
"రణధీర్ " మిత్ర మొహం జేవురించింది. " నాతో ఏదన్నా చెప్పగలిగేచెల్లెలే ఐతే నీకథ తనే ఎప్పుడో ముగించేది. నీ ఆధీనంలోకి వచ్చాక నీ భార్య అయింది తప్ప, నా చెల్లెలిగా మిగల్లేదు."
"మిగిలితే ఏం చేసేవాడివి?"
"దానిచేతనే నీ కుత్తుక కత్తిరింపచేసేవాడ్ని."
నువ్వు వినిపించింది.
" నువ్వు వినిపించింది.
"నవ్వకు రణధీర్ గెట్ ప్రిపెర్డు. చాలా ఘాటుగా నీకు జవాబు చెప్పబోతున్నాను."
"ఎలా ... మేనక అండతోనా?" నోరుజారాడు రణధీర్.