Previous Page Next Page 
సినీ బేతాళం పేజి 21

                                 


    కుర్ర హీరో వెంటనే వంద పడేశాడు.
    "ఈ చెప్పుల కోసం ఇంత ఖర్చు చేస్తున్నావ్ - సంగతేమిటి బాబూ! ఈ చెప్పుల వెనుక ప్లాష్ బాక్ కధేమైనా ఉందా?" చెప్పులు కుడుతూ అడిగాడు ముసలాడు.
    జరిగినదంతా దుఃఖం ఆపుకుంటూ చెప్పాడు కుర్రహీరో. ముసలాడు జాలి పడ్డాడు. అతన్ని చూసి.
    "ఏడవకు నాయనా! సినిమా జీవితంలో ఇలాంటి అవస్తలు తప్పవు. ఓడలు బళ్లవుతాయి. బళ్ళు ఓడలవుతాయ్. హిట్ పిక్చర్స్ అనుకున్నవి ప్లాప్ అవుతాయ్ . "ప్లాప్" అనుకున్నవి హిట్టవుతాయ్. మన గీత బావుంటే షూట్ చేసిన సెక్స్ దృశ్యాలు కనకవర్షం కురిపిస్తాయి. లేపోతే సెన్సార్ కత్తెరకు బలై కేవాలం టైటిల్స్ మిగుల్తాయ్....." అన్నాడు జాలిగా.
    కుర్ర హీరోర అతని సినీ వేదాంతం చూసి ఆశ్చర్యపోయాడు.
    "తాతా! ఇన్ని సినిమా నీతులు చెప్తున్నావ్. అసలు నువ్వెవరు? శాపవశాత్తూ చెప్పులు కుట్టేవాడుగా మారిన సినీ వంశీయుడివని నా కనుమానంగా వుంది . నీ ప్లాష్ బాక్ చెప్పవూ?"అనడిగాడు గోముగా.
    తాత కన్నీళ్లు తుడుచుకుని 'అవును బాబూ! నేను ఒకప్పుడు ప్రోడ్యూసర్నే! సినిమాకు బలం కేవలం నటీనటులే అని, కధా కాకరకాయా కాదనీ మనస్పూర్తిగా నమ్మి అగ్రశ్రేణి తారలతో సినిమా తీశాను. ఆ సినిమా నాలుగురోజులే ఆడినా పాపం ప్రేక్షకులు మాత్రం గొప్పా బీదా అనే విచక్షణ లేకుండా చెప్పులు తెర మీదకు విసిరి వెళ్ళేవాళ్ళు. ఆరోజు నుంచీ నాకు ఆ చెప్పులే జీవనాధారమయ్యాయ్. ఎప్పటికయినా ఈ చెప్పుల షాపు మీద సంపాదించిన డబ్బుతో ఓ సినిమా తీసి ఆ చెప్పుల దాతలందరి ఋణం తీర్చుకుంటాను బాబు." అంటూ కుట్టిన చెప్పులు హీరో కందించాడు.
    హీరో ఆ చెప్పులు తొడుక్కునేసరికి పోలీసులొచ్చి జీప్ లో తీసుకెళ్ళి కోర్టులో నిలబెట్టారు. హీరోయిన్ అతని కేదురుగ్గా బోనులో నిలబడింది.
    "నిన్ను రేప్ చేసిన వ్యక్తిని గుర్తు పట్టగలవా?" అడిగాడు లాయరు.
    "అయ్యో ఎందుకు పట్టలేను? అదిగో ఆ కుర్ర హీరోయే నన్ను రేప్ చేశాడు. ఇలా రేప్ చేయకూడదు, ఇది ఇల్లీగల్ , అని నేనంత చెప్పినా వినిపించుకోలేదు" అందామె.
    "అతను నిన్ను ఏ రోజు రేప్ చేశాడు?"
    "ఏ రోజేమీటి నా మొఖం! గత నెలరోజులుగా రోజూ మా ఇంటి కొచ్చి నన్ను రేప్ చేస్తూనే ఉన్నాడు" అందామె తొణక్కుండా.
    జడ్జి గారు ఆ జవాబు విని నవ్వారు.
    "రాజయ్యా! ఆ హీరోయిన్ కుర్ర హీరో మీద అబద్దపు కేస్ ఎందుకు పెట్టింది? ఆమె జవాబు విని జడ్జీగారు ఎందుకు నవ్వారు? కుర్ర హీరోకి శిక్ష పడుతుందా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే తెలుసుగా ఏమవుతుందో?"
    "నీ యవ్వ భలే కజ్జేప్పావే! అయినా జవాబు తెలీదనుకోకు! ఆ గోప్ప్ నటుడూ , ఆ హీరోయినూ కలిసి ఆ కుర్ర హీరోకి దెబ్బ కొట్టాలని ఆడిన నాటకం 'రేప్' అలా చేస్తే ఆ కుర్ర హీరో జైలు కెళ్తడని , అప్పుడు మళ్ళీ తామిద్దరూ సినీ రంగాన్ని ఏలవచ్చని అనుకున్నారు. కానీ ఆ హీరోయిన్ స్వతహాగా తెలివికలది కాదు కాబట్టి అతను గత నెల రోజులుగా రోజూ మా యింటి కొచ్చి నన్ను రేప్ చేస్తూనే ఉన్నాడని కోర్టులో చెప్పింది. దాంతో ఆ కుర్ర హీరో నిర్దోషి అన్న విషయం తేలిపోయింది. ఆమె తెలివితక్కువ తనానికి జడ్జి గారు నవ్వారు. ఆ కుర్ర హీరోకి శిక్ష పడే ప్రసక్తే లేదు."
    ఈ విధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా మళ్ళీ సెన్సార్ ఆఫీస్ వైపు ఎగిరిపోయింది.
            
                                               ***

                         

 Previous Page Next Page