Previous Page Next Page 
ఫస్ట్ క్రష్ పేజి 16

 

కానీ వినీల్ మాత్రం తీవ్ర షాక్ కు గురయ్యాడు. ఏంటిది. ఇవాళ ఇలా జరుగుతోంది. ఈ విజిత నా బ్రతుకును బజారుకు ఈడ్చేటట్లుంది. నా పరువు మంట కలిసేట్లుంది. ఓరి దేవుడా అని రెండు చేతుల్లో మొహం పెట్టుకున్నాడు.
ఎయిర్ హోస్టెస్ లు ఒక్కొక్కరే వచ్చి చెయ్యి ఊపి మరీ విజిత ని వినీల్ ని అభినందిస్తున్నారు.
వినీల్ ఇంకా షాక్ లో నే ఉన్నాడు.
వెనుక సీటు వాళ్ళు , పక్క సీటు వాళ్ళు కంగ్రాట్స్ చెపుతున్నారు.
మధ్యలో వినీల్ కోపంగా విజిత వైపు చూస్తున్నాడు.
విజిత నాకేం తెలుసు. అంతా మీ శిష్యురాలు అదిగో ఆ ఎయిర్ హోస్టెస్ పిల్లే చేసింది అని చెప్పింది. 
వినీల్ ఏడవలేక నవ్వు మొహం పెట్టుకుని అందరికి థాంక్స్ చెపుతున్నాడు.
ఇదేంటి ఈ విజిత రాక్షసిలా నా జీవితం లోకి ఇలా ఎంటర్ అయ్యింది. హుద్ హుద్ తుఫాను లా నా భావి జీవితాన్ని కకావికలు చేస్తోంది. నన్ను ఎవరు ఆదుకుంటారు అని వాపోతున్నాడు.
ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది.
వినీల్ దిగబోయాడు.
ఎయిర్ హోస్టెస్ ఆపింది.
సర్ మీకు గిఫ్ట్ వౌచెర్స్ ఇవ్వాలి. మీతో ఫోటో కూడా తీసుకోవాలి. ప్లీజ్ వెయిట్ చెయ్యండి. మా పైలట్స్ వస్తున్నారు. ప్లీజ్ అని ఎయిర్ హోస్టెస్ లు అందరూ ముక్త కంఠంతో రిక్వెస్ట్ చేశారు.
ప్లీజ్ ఉందామండి అంది విజిత  వినీల్ చెయ్యి పట్టుకుని ఆపుతూ. ఒకవైపు మనసులో హాయిగా నవ్వుకుంటోంది. అయ్యగారికి బాగా తిక్క కుదిరింది. ఇలా అయినా ఈ మనిషి మారి దారిలోకి వస్తాడేమో అని  ఆమె ఆశ.
ఇక ఆగక తప్పలేదు వినీల్  కి.
కొంతమంది పాసెంజర్స్ ను కూడా వెయిట్ చెయ్యమన్నారు.
ఈ లోపు పైలట్స్ వచ్చారు.
విజిత కి వినీల్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ అభినందనలు తెలిపారు అందరూ.
ఇద్దరినీ దగ్గరగా నిలుచోమని గిఫ్ట్ వౌచెర్స్ ఇచ్చారు.
అన్నిటికి సాక్ష్యాలుగా వీడియో తీశారు.  ఫోటోలు క్లిక్ మన్నాయి.
విజితని వినీల్ని ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని క్లోజ్ గా నిలుచోమన్నారు.
చెప్పిందే తడవుగా విజిత వినీల్ చెయ్యి లో తన చెయ్యి దూర్చేసింది .
వినీల్ కి బాక్గ్రౌండ్ లో ఎక్కడో నారదుడు ఆనందతాండవం చేస్తూ నారాయణ నారాయణ అంటూ చిడతలు వాయిస్తున్నట్లు వినపడుతోంది. అతను తన కింద భూమి ఓ అడుగు గాప్ ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడు. 
పైలట్స్ తో, ఎయిర్ హోస్టెస్ లతో, పాసెంజర్స్ తో ఇలా విడివిడిగా విజిత వినీల్ కి వీడియో,  ఫోటో లు తీశారు. అబ్బో ఎన్ని వీడియోలు,  ఫోటోలు అనుకున్నారు అందరూ. వృద్ధ జంటైతే వాళ్ళని చూసి ఒకింత అసూయ పడ్డారు కూడా. 
ఎయిర్ హోస్టెస్ లు ఇద్దరి మొబైల్ నంబర్స్ తీసుకున్నారు.
వీడియోలు, ఫొటోస్ వాట్సాప్ లో పంపుతామని మరీ మరీ చెప్పారు.
అంతటికీ కారణమైన వినీల్ శిష్యురాలైన ఆ ఎయిర్ హోస్టెస్ వినీల్ దగ్గరకొచ్చి స్పెషల్ గా సర్ నా గిఫ్ట్ అంటూ వినీల్ బుగ్గపై గట్టిగా ఓ ముద్దిచ్చి అతని చేతిలో ఓ పెద్ద క్యాడ్బరి చాకొలేట్ పెట్టింది. 
దానికీ ఆమె   ఫ్రెండ్ వీడియో తో పాటు, ఓ పది ఫోటోలు క్లిక్ మనిపించింది.  
ఆ అమ్మాయి పెదాల లిప్స్టిక్ ముద్ర వినీల్ తెల్లటి బుగ్గపై అందంగా కనిపిస్తోంది.
దాన్ని విజిత తన మొబైల్ ఫోటో లో క్లిక్ మనిపించింది.
ముద్దు పెట్టిన ఆ శిష్యురాలు అంతటితో ఊరుకోలేదు. మేడం ! మీరు సర్ ని ఒక కిస్ చెయ్యండి ప్లీజ్ అంది.
వినీల్ దూరంగా పారిపోబోయాడు. ఎయిర్ హోస్టెస్ లు అడ్డుగా నిలబడ్డారు.
విజిత వినీల్ తో వారి కోసం ప్లీజ్. మీరు అలా పారిపోతే బాగుండదు. బుగ్గ మీద కిస్ చేస్తాను లెండి అంది చెవిలో చెపుతున్నట్లు. 
వినీల్ దగ్గరికెళ్లి అతని బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టింది. అతని బుగ్గపై ఇంకో ముద్ర కూడా పడింది. ఇప్పుడు ఇంకా అందంగా తయారయ్యింది. విజిత మరోమారు ఫోటో క్లిక్ మనిపించింది.
క్లాప్స్ మారుమ్రోగాయి. ఒక ఎయిర్ హోస్టెస్ ప్రత్యేకంగా అంతా వీడియో తీసింది.
సర్ ఈ వీడియోలు,  ఫొటోస్ కూడా మీ ఇద్దరి మొబైల్ కి పంపుతాను అని ప్రామిస్ చేసింది ఆ శిష్యురాలు.
వినీల్ మొదటిసారిగా తన ప్రియ నేస్తం ఐన కోడింగ్ పై మండి పడ్డాడు మనసులో.  దానివల్లే ఈ ఎయిర్ హోస్టెస్ తనను సెలెక్ట్ చేసింది అని అతని భావన. తనపై తనకే కోపం వచ్చింది. నిజానికి ఆ సిట్యుయేషన్ లో ఇంకెవరైనా ఉంటె అడ్వాంటేజ్ తీసుకోనుండేవాళ్లు. కానీ తనకు సరిపోవడంలేదు. 
వినీల్ పరిస్థితి చూసి విజిత కి ఎందుకో పెద్దగా నవ్వాలనిపించింది. అందరూ ఉండేప్పటికీ రుమాలు అడ్డుపెట్టుకుని నవ్వుకుంది. ఆ నవ్వు చూసిన వినీల్ కు తన హృదయంపై ఎవరో గుంటూరు ఆవకాయ కారం పిచికారి చేసినట్లు ఫీల్ అయ్యాడు.


****


విమానం ఆగీ ఆగగానే అందరినీ వదిలించుకుని వినీల్ చక చక కిందకు దిగేసాడు.
అతని కోపం అరికాలి నుంచి నెత్తి మీది మాడు వరకు ప్రవహిస్తోంది.
విజిత అందరిముందు తనను భర్తగా డిక్లేర్ చేసింది.
అది అతనికి సుతరామూ నచ్చలేదు.
తనకేమో సరదాగా ఉంది.
వినీల్ కేమో చాలా ఇబ్బంది కలిగించింది.
అందునా అందరిముందు ముద్దు పెట్టడం అతని జీవితంలో మొదటిసారి అలా జరగడం.
అందుకే కాసేపు సిగ్గు, మొహమాటం, కోపం అన్నీ మిళితం అయ్యాయి.
ఆ కోపంతోనే వడివడిగా అడుగులు వేస్తున్నాడు.
అతని పరుగు విజిత అందుకోలేకపోయింది.
ఆమెకు ఒకవైపు నీల్ తో అలా చేయడం చాలా సరదాగానూ, తన జీవితంలో ఓ మలుపుకు నాందిగానూ ఆనందపడింది. 
నీల్ ! ప్లీజ్. నాకోసం ఆగు అని గట్టిగా అరిచింది.
ఆ అరుపుకు గోడకు కొట్టిన బంతిలా వెనక్కు వచ్చి విజిత తో పాటు నడిచి ఎయిర్పోర్ట్ బస్సు ఎక్కాడు.
విజితంటే ఎక్కడో మారుమూల అనురాగం, ప్రేమ వినీల్ లో తొంగి చూస్తుంటాయి అప్పుడప్పుడూ.
అవి ఆగాలన్నా ఆగవు. దాచాలన్నా దాగవు.
ఎయిర్పోర్ట్ బస్సులో చైర్స్ ఖాళీ ఉండటంతో విజిత కూర్చుంది.
నీల్ చెయ్యి పట్టి లాగి తన ప్రక్కన కుర్చీలో కూర్చోపెట్టింది. 
ఇబ్బందిగా తన పక్కనే కూర్చున్నా, తన చెయ్యి విజిత చేతిలో అలానే ఉన్నా, కోపం ఎక్కువ కావడంతో విజిత మొహం చూడలేకపోతున్నాడు నీల్.
సారీరా నీల్ బేబీ అంది గోముగా అతని చేయిపట్టుకుని. 
ఆ పిలుపుకు, ఆమె మాటలకు అతను కొంచెం కరిగాడు.
అది అతని స్పర్శలోనే తెలుస్తోంది విజితకు.
ఫరవాలేదు కాస్త కుదుటపడ్డాడు అనుకుంది.
బస్సు ఆగగానే ఇద్దరూ దిగారు.
నువ్వు మళ్ళీ నన్ను వదిలేసి పరిగెట్టావంటే ఈసారి ఏడుస్తా అంది విజిత.
ఆ ఏడుపు పవర్ ఏంటో నీల్ కు బాగా తెలుసు. చాలా భయం కూడానూ. 
అందుకే మెల్లగా ఆమె అడుగులో అడుగు వేస్తూ కన్వేయర్ బెల్ట్ వద్దకు చేరారు ఇద్దరూ. 
కన్వేయర్ బెల్ట్ లో ఇద్దరి లగ్గేజ్ తీసుకుని ట్రాలీ లో పెట్టాడు వినీల్.
నేను తీసుకొస్తానులే అని చెప్పాడు.
ఇద్దరూ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చారు. 
క్యాబ్ లో తాజ్ హోటల్ కి బయలుదేరారు.  
సాయంత్రం ఆరు గంటలకు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది.
ఫంక్షన్ అదే హోటల్ లో జరుగుతుంది. 
హోటల్ లో రెండు రూమ్స్ పక్క పక్కనే తీసుకుని అందులో చేరారు ఇద్దరూ.
వినీల్ ! రెస్ట్ తీసుకుని రెడీ గా ఉండు. ఆరుకు వెళదాం అంది విజిత రిక్వెస్ట్ చేస్తూ.
నాకు చాలా కోపంగా ఉంది విజ్జీ అన్నాడు.
తెలుసు. అది నీ మోహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాత్రి వరకు దాచుకో. ఫంక్షన్ పూర్తి కానీ. ఆ తరువాత నువ్వు ఏ శిక్ష విధిస్తే అది స్వీకరిస్తా అంది.
సరే అయితే అని బై చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
ఐదున్నరకు ఇంటర్కం మోగింది. లిఫ్ట్ చేసాడు వినీల్.
గుడ్ ఈవెనింగ్ నీల్.  రెడీ నా ! కిందకు వెళదామా అంది విజిత. 
యా రెడీ అన్నాడు వినీల్.
ఇద్దరూ ఫంక్షన్ హాల్ కు వెళ్లారు.
చాలా పెద్ద హాల్ అది.
డయాస్ అందంగా అలంకరించబడి ఉంది.
పోడియం ని సిద్ధం చేసి ఉంచారు. వెనుక అందమైన ఫ్లెక్సీ లు పెట్టి ఉన్నారు.
అందులో వెంకటరాజు ఫోటో, విజిత ఇండస్ట్రీస్ కి అవార్డు అని రాసి ఉంచారు.
హాలు నిండా చక్కాగా అమర్చినట్లు రౌండ్ టేబుల్స్ వేసున్నాయి అందరూ సరదాగా కూర్చునేందుకు, మాట్లాడుకునేందుకు.
ఆ టేబుల్స్ పై తాగేందుకు, తినేందుకు సిద్ధం చేస్తున్నారు.
అతిధులు ఒక్కొక్కరే వస్తున్నారు.
విజిత, వినీల్  డయాస్ కు దగ్గరగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు అవార్డు అందుకోవడం ఈజీ గా ఉంటుందని. 
లైవ్ టెలికాస్ట్ రెడీ చేస్తున్నారు.  
వినీల్ తన లాప్ టాప్ ను ఓపెన్ చేసి టేబుల్ పైన పెట్టి లైవ్ టెలికాస్ట్ చెక్ చేస్తున్నాడు.
ఇంతలో వినీల్ కి ఫోన్ వచ్చింది. రాజుగారి పి ఏ వద్దనుంచి.

 

 Previous Page Next Page