Previous Page Next Page 
ష్....మాట్లాడొద్దు పేజి 16

    అలా అపూర్వతో అనగలిగాడు కానీ...అతనికి ఈ కేసు జటిలంగా తోస్తోంది.
    ఏదో ఒకటి చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు.  ఈ సారి హంతకుడు ఫోన్ చేస్తే వెంటనే ట్రేస్ చేయగలగాలి.
    అందుకు తగిన ఏర్పట్లు చేసుకోవాలి.  ఆ హంతకుడిని సజీవంగా కుదరకపోతే  చంపివేయాలి.
    ఒక ధృడ నిశ్చయానికి వచ్చాడు కృపాల్
    జేమ్స్ డేవిడ్ సోఫాలో  కూర్చుని ఎదురుగా ఉన్న టివి వైపు చూస్తున్నాడు.
    టివిలో ఏదో హారర్ షో  వస్తోంది. దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.  సోఫా చివర   చాందిని కూర్చుంది.
    "చాందినీ డియర్...ఆ పార్ధసారధి బాగా ఎంజాయ్ చేసినట్లు ఉన్నాడు కదూ!..."
    ఏం  చెప్పాలో తోచలేదు చాందినికి.
    ఊహ తెలియక ముందు తనని  తీసుకొచ్చాడు జేమ్స్ డేవిడ్.  అప్పట్నుంచి వికృతి భావాలు నింపాడు. రక్తం తాగించాడు. విస్కీ తాగించాడు. నైతిక విలువలు కాలాసేలా చేసాడు.
    జీవితమంటే ఏమిటో అర్ధం కాకుండా చేసాడు.  జేమ్స్ డేవిడ్  చెప్పినట్టు చేయడం తప్ప మరొకటి తెలియదు. ఆమె ఒంటి మీద పింక్ కలర్ ట్రాన్స్ పరేంట్ నైటీ వుంది.
    "ఈ నైటీలో  నుంచి నీ  అందాలు సృష్టంగా కనిపిస్తున్నాయి కదూ"!   అంటూ నైటిని సర్రున చించేసాడు.
    కంగారుపడలేదు చాందిని.
    ఇది ఆమెకు కొత్తకాదు.  అతని రాక్షస రతిని అనుభవించింది. అయినా ఆమెలో బాధ, భయం వుండవు. అలా తయారుచేసాడు.
    ఎక్కడో...ఎప్పుడో విషకన్యలు  వుంటారని తెలుసుకానీ, యిప్పుడు చాందినీని మీదికి లాక్కుని ఆమె పెదవుల్ని గట్టిగా కొరికాడు.
    చిన్నకేక...ఆమె గొంతులోంచి..
    రక్తం చివ్వున చిమ్మింది.
    "వెరీ టేస్టీ...నీ రక్తం బావుంటుంది"  అన్నాడు మరోసారి ఆమె పెదవిని కొరకడానికి సిద్ధపడుతూ.
    బలవంతగా కళ్లు  మూసుకుంది చాందిని.  అతనికి అడ్డు చెబితే మరింత రెచ్చిపోతాడు.
    ఒసారిలా అడ్డు చెప్పినందుకు గాజు పెంకులు పరుపులో పరిచి తనని వాటిమీద పడుకోబెట్టి తనమీద అతను పడుకున్నాడు.
    ఆ రాత్రంతా ఆ నరకం అనుభవించింది. తను అరిస్తే అతనికి ఆనందం...తను బాధపడితే అతనికి సంతోషం.
    అందుకే అన్ని భావాలను చంపుకుంటుంది. ఒక్కసారి తప్పుదారిలోకి వెళ్లాక, వెనక్కి  రావడం ఎంత కష్టమో...ఆమెకు అనుభవ పూర్వకంగా తెలిసింది.
    జేమ్స్ డేవిడ్ లేచి ఫ్రిజ్ దగ్గరికి వెళ్లాడు.  ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసాడు.
    లోపల మనిషి  గుండె ఊపిరితిత్తులు, కిడ్నీలు వున్నాయి.
    మరో మనిషి అలా...ఆ క్షణంలో వాటిని  చూసివుంటే స్పృహ కోల్పోవలసిందే.
    ఫోర్క్ స్పూన్ తో  గుండెలోకి గుచ్చాడు.  దాన్ని ప్లేట్ లోకి  తీసుకున్నాడు.
    టీపాయ్ మీద వున్న బ్రాంది సీసాను పైకెత్తి అలాగే తాగాడు.
    గుండెని పెదవుల మధ్యకు తోసాడు.
    చాందినికి  వామ్టింగ్ సెన్స్ షన్  కలిగింది.
    ఎన్నోసార్లు  చాందినీ యిలాంటి పరిస్ధితుల్లో చావాలనుకుంది.
    ఎంతగా అలవాటైనా ఈ  నరకం, జమ్స్ డేవిడ్ ప్రవర్తన ఆమెను వణికిస్తోంది.
    "ఏయ్ చాందినీ...నువ్వు యిప్పుడు బట్టలు విప్పి డాన్సు చేయి" అన్నాడు.
    చాందిని చిరిగిన నైటీని విప్పేసింది. నగ్నంగా అతని ముందు డ్యాన్స్  చేయడానికి సిద్ధపడింది.
    నీరసంగా కళ్లు  తెరిచాడు భార్గవ.
    పొత్తి కడుపుకింద నొప్పిగా అనిపించింది. చేయి పోట్టమీదకి వెళ్లింది. కుట్లు  కనిపించాయి.
    "అమ్మ" నీరసంగా అన్నాడు.
    "నీళ్లు కావాలా?" ఆ గొంతు విని అటువైపు చూసాడు.
    ఎదురుగా డాక్టర్ పార్ధసారధి.  అతని గడ్డం పెరిగి వుంది.   మొహంలో కళ తగ్గింది.  తను పెద్ద నేరంచేసినట్టు ఫీలవుతున్నాడు.  కూతురి మీద ప్రేమతో తప్పు చేస్తున్నాడు.
    చాందిని మీద కోపం పీకల్దాక వచ్చింది. ఇదంతా అమెవల్లే వచ్చింది.  తన  వీక్నెస్ యింతవరకు తనని తీసుకువచ్చింది.
    "మీరు" నీరసంగా అడిగాడు భార్గవ.
    "నా పేరు పార్ధసారధి...డాక్టర్ పార్ధసారధి"
    "నాకు...నాకేమైంది  డాక్టర్"
    తల వంచుకున్నాడు డాక్టర్ పార్ధసారధి.
    ఏమని చెప్పాలి?  నీ కిడ్నిల్లో ఒక కిడ్నీ తొలగించామని చెప్పాలా?
    ఆ రోజు  జేమ్స్ డేవిడ్ యితని కళ్లు, కాలేయం, అన్నీ తొలగించమని చెప్పినప్పుడు, అతని పరిస్ధితి చూసి కొంత,  అతన్ని కాపాడాలని మరికొంత ఉద్దేశంతో, యిప్పడప్పడే ఆపరేషన్ చేయడం కుదర్దని ఒక కిడ్నీ మాత్రం తొలగించాడు.
    "చెప్పండి డాక్టర్...నాకేమైంది?"
    "నీ కిడ్నీల్లో ఒక కిడ్నీ తొలగించాం"
    "డా...క్టర్"  భార్గవ గొంతులో బాధ, భయం.
    "మరేం ఫర్వాలేదు...మీ ప్రాణానికి వచ్చిన  భయం ఏమీలేదు..."
    విరక్తిగా నవ్వాడు డాక్టర్.
    "నేనిప్పుడు బ్రతికి వున్న, చచ్చినట్టే డాక్టర్...యిక్కడ్నుంచి తప్పించుకునే  మార్గంలేదు...నాకోసం నా భార్య" అతని కళ్లు కన్నీళ్లు ను వర్షిస్తున్నాయి.
    "ముందు   మనం ఈ నరకంలో నుంచి బయటపడాలి"  అన్నాడు పార్ధసారధి.
    "ఎలా...ఎలా డాక్టర్ గారూ... వాడొక రాక్షసుడు...వాడి కన్ను కప్పి పోవడం మనవల్లకాదేమో"
    "ఏదో ఒకటి చేయాలి...వాడివల్ల నేను నా వృత్తికే  కళంకం తెచ్చిపెట్టాను"  బాధతో నుదురు కొట్టుకున్నాడు పార్ధసారధి.
    అక్కడ ఎవరు ఎవర్ని ఓదార్చాలో అర్ధంకావడంలేదు.
    ఇక్కడిలా జరుగుతుంటే...మరో గదిలో వున్న జేమ్స్ డేవిడ్ మాత్రం...చాందిని చేసే నగ్న నృత్యాన్ని చూస్తూ అప్పుడప్పుడు ఆమె శరీరాన్నిబ్లేడుతో గాయపరుస్తూ.....రక్తసిక్తమైన ఆమె నగ్న దేహాన్ని చూస్తూ పైశాచికానందం  పొందుతున్నాడు.
                                                  *    *    *
    కృపాల్ పొలీసు స్టేషన్ లోకి  అడుగుపెట్టగానే ఫోన్ మోగింది.  రిసీవర్ ఎత్తి "ఇన్స్ పెక్టర్ కృపాల్ స్పీకింగ్"  అన్నాడు.
    "సార్...నేను కానిస్టేబుల్ శివరావును  మాట్లాడుతున్నాను.  మార్కెట్ నుంచి వస్తుంటే యిక్కడో యాక్సిడెంట్  జరిగింది. నా కళ్లముందే ఓ లారి ఆటోని గుద్దేసి పైకి  ఎక్కించి మరీ చంపారు. ఆ లారి సిటీ వదిలి దూరంగా వెళ్లింది. వెంటనే దగ్ర్లో వున్న పొలీసుస్టేషన్ కు  కూడా ఇన్ ఫామ్  చేసాను. ఆ లారి గుద్దేసింది. యాదగిరి ఆటోని.  అందులో యాదగిరి డెడ్ బాడీ నుజ్జు నుజ్జుయింది. యిదంతా కావాలని చేసినట్టుంది సార్."
    కృపాల్ పిడికిళ్లు  బిగుసున్నాయి.
    "యాక్సిడెంట్  జరిగింది ఎక్కడా?"
    "మార్కెట్ కు  ఆనుకుని వున్న వన్ వే రోడ్ పై  సార్..."
    "నేను వస్తున్నాను.  నువ్వు అక్కడే వుండు"  చెప్పేసి వెంటనే బయటకు వచ్చాడు.
                                        *    *    *

    మార్కెట్ దగ్గర జనం గుమికూడారు.  యాక్సిడెంట్ అయిందన్న వార్త గుప్పుమంది.  అందరూ యాంగ్జయిటీ గా  చూస్తుండిపోయారు.
    కృపాల్ జీపు దిగి జనాన్ని తోసుకొని లోపలికి వెళ్లాడు.
    ఆటో నుజ్జునుజ్జుయింది.  యాదగిరి శవం గుర్తుపట్టడానికి వీల్లేకుండా వుంది. అతను వేసుకున్న కాకిరంగు చొక్కా రక్తంతో తడిసిపోయింది.
    అతని జేబులో నుంచి వంద రూపాయల నోటు బయటకు వచ్చింది....
    కొత్త  నొటు...తను అతని నిజాయితీకి బహుమతిగా  యిచ్చిన నోటు.
    దాన్ని అతి భద్రంగా దాచుకున్నాడు.  అతనికి నిజాయితీగా తను బహుమానంగా వంద  రూపాయలిస్తే అదే నిజాయితీ అతని ప్రాణాలను బహుమతిగా అతని నుంచి తీసుకుంది.
                                      *    *    *
    మధ్యాహ్నం  అన్నం కూడా తినలేదు కృపాల్.  అతనికి పదే పదే యాదగిరి శవం కళ్లముందు కదలాడుతోంది. ఆరోజు అతను మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి.
    పెద్దగా చదువుకోలేకపోయినా,  అతని నిజాయితీ అతని సంస్కారం...అప్పడే ఫోన్ మోగింది.
    రిసీవర్ ఎత్తి "హలో"  అన్నాడు కృపాల్.
    "హలో...పాపం షాక్ తిన్నావా  మిస్టర్ కృపాల్...చూశావా...నీకు షాక్ మీద షాక్ ఎలా యిస్తున్ననో...ఏం చేయను...నువ్వు బుద్ధిగా కూచుని నా ఫైల్  క్లోజ్ చేస్తే ఈ బాధ వుండేది కాదు...పెద్ద సిన్సియర్ డ్యూటి అంటూ నన్ను పట్టుకోవాలని చూస్తున్నావు.   అలాంటప్పుడు నీ సిన్సియారిటీకి చిన్న చిన్న  బహుమతులు యివ్వకపోతే ఎల వుంటుంది.యాదగిరి చచ్చిపోయాడుకదు... నా గురించి ఇన్పర్మేషన్  యిచ్చాడు  కదు...పోనీలే చచ్చాడుగా!"
    కోపంలో ఏం  మాట్లాడాలో కూడా అర్ధం కాలేదు కృపాల్ కు..
    "నా ఫోన్  ట్రేస్ చేయమని చెప్పావుగా...అందుకే యింకా మాట్లాడి నికా చాన్సు యివ్వ దలచుకోలేదు. బై..." ఫోన్ డిస్ కనెక్టు అయింది.
    కాసేపట్లో ఆ ఫోన్ అబిడ్స్ నుంచి అని తెలిసింది. అదీ పబ్లిక్ టెలిఫోన్  బూత్ నుంచి,  అక్కడికి వెళ్లేసరికి అతను  ఉడాయిస్తాడు.
    కృపాల్ ఫోన్ పెట్టేసి తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు.
    యాదగిరి చెప్పిన
    మాటలు గుర్తొచ్చాయి.
    ఆ నలుగురు కుర్రాళ్లని మిథిలానగర్ కు   తీసుకెళ్లాడు.  ఇంటి  నెంబరు పదహారు ముందే ఆటో ఆపాడు.  ఆ కుర్రాళ్లు గేటు లోపలికి దూకారు.
    అయినా అక్కడ తను మొత్తం చూసాడు,  తనకేమి కనిపించలేదు.
    సమ్  థింగ్  ఈజ్ రాంగ్.  ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది.
    అప్పడే అపూర్వ స్టేషన్ లోకి  అడుగు పెట్టింది.
    "సార్...నాన్నగారు తీసుకెళ్లిన  కారు సిటీ అవుట్ స్కర్ట్స్ దాటాక రోడ్డు పక్కన చెట్ల మధ్య వుందట" చెప్పింది  అపూర్వ రావడంతోనే.
    "అది మనకు పెద్దగా ఉపయోగాపడకపోవచ్చు అపూర్వ గారు...కారు ఎవరో డ్రైవ్ చేసి,  ఆ పొదల్లో వదిలేయవచ్చు...మనక్కావలసింది అది  కాదు... డాడీని  కిడ్నాప్ చేసిన వ్యక్తి గురించి...అసలు కిటుకు అంతా  ఆ మిథిలానగర్ లోని యింటి నెంబర్ పదహరులోనే వుంది.  అసలు యిదంతా ఎందుకు జరుగుతుందో అనే విషయం దగ్గరే మన పరిశోధన  మొదంతా ఎందుకు జరుగుతుందో అనే విషయం దగ్గరే మన పరిశోధన  మొదలవ్వాలి. సిటీలో అవయవాలు అమ్మే వ్యాపారం జరగడంలేదు.  అలాంటి రాకెట్ ఏదీ లేదు.
    సిటీలో వున్న క్రిమినల్స్ ఎవరూ ఈ పని చేయడంలేదు.  ఫోటోలో వున్న వ్యక్తుల  గురించి మనం ఎంక్వయిరీ చేయాలి.
    అన్ని రాష్ట్రాల నుంచి ఇన్  ఫర్మేషన్  వస్తుంది.  పత్రికలో కనబడుటలేదు అనే ప్రకటన కేవలం ఉద్దేశపూర్వకంగానే యిచ్చాడు.
    చాందినీ అనే అమ్మాయి పేరు అసలో,  నకిలీనో అలాగే జేమ్స్ డేవిడ్.
    వీళ్లిద్ధారే  ఈ నేరాలకు ప్రధాన  సూత్రధారులు.  ఇదంతా పధకం ప్రకారం చేసి వుండొచ్చు.  ఇప్పుడు మనం ఓ సైకాలజిస్టుని   కలవాలి."
    "సైకాలజిస్టా?  అతనవసరమేమిటి?"
    "కొన్ని నేరాలు  డబ్బుకోసం మరికొన్ని నేరాలు సెక్స్ కోసం జరుగుతాయి. యినికాక,  మానసికమైన  ఉన్మాదం లో  వుండే మానియాక్ లు  వుంటారు. అలాంటి లక్షణాలు బహుశ ఈ నేరస్తుల్లో వుండొచ్చు.
    అలాంటప్పుడే సాధారణంగా యిలాంటి హత్యలకు, దారుణాలకు మోటివ్ వుండదు.  నిజంగా ఆ నేరస్ధుడు అవయవాల వ్యాపారమే చేసే వాడయితే,  ఆ శవాలను మనకు పార్శిల్ చేయడు.  మనుల్ని భయ పెట్టడం కూడా అతని పైశాచిత్వానికి పరాకాష్ట...మనం ఆ కోణంలో ప్రొసీడవుదాం" చెప్పాడు కృపాల్.
    అపూర్వ కృపాల్ వైపే చూస్తుండిపోయాడు.ఎంత విశ్లేషణ...పొలీసు లంటే కేవలం ఫిజికల్ ఫోర్స్ మాత్రమే ఉపయోగిస్తారనుకుంది. ఇంతటి విశ్లేషణ మరొకరికి అసాధ్యం అనిపించింది. 

 Previous Page Next Page