Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 13

                                 

    - మీలో గొప్పగుణం 'స్పాంటేనిటీ' ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు వెంటనే తడుముకోకుండా , ఒక జోక్ గాని, హాస్యోక్తిగాని వెయ్యటం వెన్నతో పెట్టిన విద్య.

     - మీతో స్నేహం చేసుకోవాలని చాలా మంది ఉవ్విళ్లూరుతూ వుంటారు.

     - మీ వైపు సముద్రం ఉప్పెనలా వస్తున్నా ఇంకోవైపు  తిరిగి చదరంగం ఆడుకోగల  మనస్తత్వం మీది.

    - మీ మృదువైన మాటలు నలుగురినీ ఆకర్షిస్తాయి. మీరు వీలైనంతవరకూ తెలివి తక్కువగా వుండటానికి ప్రయత్నిస్తారు.మీలో  వున్న తెలివితేటలను (మిగతా వాళ్లలాగా) అవసరం లేనప్పుడు కూడా, ఎల్లప్పుడూ ప్రదర్శించడానికి ఇష్టపడరు.

    - మీరు సమయానికి చాలా మంచి విలువనిస్తారు.

    - బస్సులో  రూపాయిన్నర టికెట్టు కోసం రెండు రూపాయిలిచ్చి 'చిల్లర వద్దులే' అనే స్వభావం కాదు మీది.

     - ఏ విషయంలోనైనా కచ్చితంగా వ్యవహరించటం మీకు ఇష్టం.

    - శుభ్రంగా వుండటం కూడా మీ నిత్యవసరాలలో ఒకటిగా భావిస్తారు.

    - ఒక సాయంత్రం పార్టీ వుంటే ఆ పార్టీకి వెళ్లటం కన్నా ఆఫీసులో కూర్చొని పని పూర్తి చెయ్యటం మంచిదిగా మీరు భావిస్తారు.

     - మీకు పగటిపూట కలలు కనడానికి తీరికుండదు. రాత్రిపూట అదృష్టదేవత  కోసం ఆలోచించే ఓపికుండదు. స్వశక్తినే నమ్ముకుంటారు.

    - మీరు దేని గురించో  బాదపడుతున్నట్లుగానో, సమస్యలతో సతమతమైపోతున్నట్లుగా కనిపించడానికి అసలిష్టపడరు.

     - విచారించడం అన్నది మీ స్వభావం కాదు.

     - మీరెంతో  నిజాయితీ పరులు. మిమ్మల్ని నేను కూడా నమ్ముతాను.

    - మీకిష్టంలేని  పనులు చెయ్యవలసి వచ్చి నప్పుడు మాత్రం అబద్దాలు ఆడటంగానీ,  ఆఖరికి మీ అమ్మమ్మ, నానమ్మతద్దినాలని చెయ్యడం గానీ చక్కగా నటించగలరు.

    ప్రేమ గుడ్డిది అన్నవిషయం మీకు వర్తించదు. మీ ప్రేమికుల తప్పొప్పులను చూపించటానికి మీరు వెనుకాడరు.

    స్నేహం అంటే ప్రాణం పెట్టేమీరు, స్నేహితులు మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూడటాన్ని ఎన్నటికీ  సహించరు.

    నిర్లక్ష్యంగా, తెలివిలేని తనము, చెడుస్వభావం మొదలైన వాటిని మీరు అసహ్యించుకున్నంతగా మరెవరూ అసహ్యించుకోరు.

    మీరు చాలా వరకూ నెమ్మదస్తులు, మర్యాదస్తులు. కానీ, ఒక పాయింట్ దాటిన తర్వాత చాల రెచ్చిపోయి నెర్వస్ గా ప్రవర్తిస్తారు.

    మీలో జాలీ, సమర్దత సమపాళ్లలో వుండటంవల్ల డాక్టర్లగానో, కామర్స్ వైపో మంచి పేరుతెచ్చుకుంటారు.

     మీరు మొహమాటస్తులవటం వల్ల చిన్న విషయాలకి కూడా బాధతప్పదు.

    మీకు చాలా పొదుపరులనే చెప్పాలి. మీరు లేని వాటితో కష్ట పడటం కన్నావున్న వాటిలోనే జీవించడానికి ఇష్టపడతారు. అందువల్ల ఎక్కువ ఖర్చకి వెనుకాడతారు.

     "ఇతరుల తప్పులను గుర్తుపట్టినంతగా మీరు మీ తప్పులను తెలుసుకోరు" అన్న గట్టివిమర్శ మీపై వుండనే వుంది.

     తెలిసీ తెలియకుండా ఇతరులు మీ గురించి విమర్శచేస్తే మీకు విపరీతమైన కోపమొస్తుంది.అయినా బయటపడరు.

    మీలో స్వతంత్రం పట్ల మక్కువ ఎక్కువ. విశాలమైన ఇళ్ళల్లో, హాయిగా జీవించాలనే మనస్తత్వం మీది.

     "LACK OF TACT" మిమ్మల్ని తరచూ  బాధపెడుతూ వుంటుంది. మీ యొక్ నిర్మొహమాటం అవతల వారిని  బాధపెడుతుంది.

    ప్రతిదాన్ని తేలికగా నమ్మే స్వభావంమీది. ఇది కూడా మిమ్మల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంది.

     నిర్లక్ష్యం, ఆడంబరత్వం, కంట్రోల్ లేకపోవటం, అవతల వాళ్ల దృష్టి మీమీద పడాలన్న తపన, పొగడ్తలకి లొంగిపోవటం మీరు మ అధిగమించవలసిన బలహీనతలు.
   
                                                              5. అక్షరాల ఒద్దిక:

    ప్రతీ అక్షరాన్ని ఒద్దికగా వ్రాసి, పదాలకీ పదాలకీ మధ్య ఖాళీ సరిగ్గా వుంచి, పేజీకి సమాంతరంగా వాక్యాలు వ్రాస్తే వాళ్లు నాయకత్వ లక్షణాలు కలిగి వుంటారు. అలాగని చేతివ్రాత సరిగాలేనివాళ్లు, మార్జిన్స్ సరిగా వదలలేనివాళ్లు, తక్కువ అని కాదు.  ఈ రెండు మనస్తత్వాలని,  వ్యక్తిగత గుణాలని  పరిశీలిద్దాం.

         

 Previous Page Next Page