Previous Page Next Page 
ప్రేమ...పెళ్ళి....విడాకులు పేజి 3

 

సరేరా ముందు సంజయ్ కి ఫోన్ చెయ్యి. నేను మాట్లాడుతాను అన్నాను.
సంజయ్ లాయర్ అంకుల్ నీతో మాట్లాడుతాడు.
ఫోన్ తీసుకుని హాయ్ సంజయ్ ఎలా ఉన్నావ్ అని అడిగాను.
ఓకే   అంకుల్. ఫైన్ అన్నాడు. వాడి స్వరం స్థిరంగానే ఉంది. కంగారుగా ఏమీ లేదు. 
అమ్మయ్య అనుకున్నాను. 
మంజరి నీ పక్కనే ఉందా ? 
లేదు అంకుల్. వేరే రూమ్ లో పడుకునుంది.
మన మాటలు వినపడవు కదా ! 
ఉహూ వినపడవు. చెప్పండి.
తాను ఇండియా వచ్చేస్తానంటోందా ?  
అవును అంకుల్.
సరే మంచిది. ఇమ్మీడియేటగా ఫ్లైట్ బుక్ చేసి ఇండియా పంపేయ్. చాలా అర్జెంటు. అక్కడ ఉండనీకు. నీకు చాలా సమస్యలు వస్తాయి. నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. 
సరే అంకుల్.
డబ్బులేమైనా డిమాండ్ చేస్తోందా ?
నో అంకుల్. ఆ సమస్య లేదు. తరువాత ఏమన్నా డిమాండ్ చేస్తుందేమో తెలీదు.
ఓకే. ముందు ఈ గండం గడవని.  ఇప్పుడే ఇండియా కి టికెట్ బుక్ చేసి తనని పంపెయ్యి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. తన మెయిల్ మరియు ఫే స్ బుక్ పాస్వర్డ్స్ ఎట్టి పరిస్థితులలోనూ ఇవ్వకు. అవే మనకు కీలకం. మీ మధ్య పొద్దున జరిగిన సంభాషణ ఏమన్నా రికార్డు చేసావా. 
ఎస్ అంకుల్. తనకు తెలీకుండా లాప్టాప్ ఓపెన్ చేసి వీడియో రికార్డింగ్ ఆన్ చేసి ఉంచాను. 
అంతా రికార్డు అయ్యింది. 
తన ప్రేమ వ్యవహారం, తల్లి తండ్రులు బలవంతంగా తనకు ఇష్టం లేని పెళ్లి చెయ్యడం,  తాను ఇండియాకు వెళ్లాలనుకోవడం మొత్తం అంతా రికార్డు చేసాను.
రియల్లీ గ్రేట్ సంజయ్. 
అవి చాలా కీలకం. సరే. 
తను లేచాక ఇండియాకి వచ్చే ముందు ఎలాగైనా ఇవి కూడా రికార్డు చెయ్యి. తను తల్లి తండ్రులను చూడాలని ఇండియాకి వస్తున్నట్లు, అందుకు టికెట్ నీవే కొన్నట్లు, నీ బలవంతమేమి లేనట్లు, అంతేగాక తన పని పూర్తి అయ్యాక మళ్ళీ తిరిగి వస్తానన్నట్లు రికార్డు చెయ్యి. 
మిగతా విషయాలు తను ఇండియాకి బయలుదేరిన తరువాత నీతో తీరిగ్గా మాట్లాడుతాను.
సరే అంకుల్. మీరు చెప్పినట్లు చేస్తాను. 
మీతో మాట్లాడుతూనే ఫ్లైట్ బుక్ చేసాను. ఇంకొక పది గంటల్లో ఉంది. 
తాను రెడీగానే ఉంది ఇండియాకి బయలుదేరేందుకు.
 ప్రియుడ్ని చూడాలని తహతహ లాడుతోంది.
ఓహ్ గ్రేట్ సంజయ్. 
యువర్ రెస్పాన్స్ ఈజ్ వెరీ ఫాస్ట్.   
తన మైండ్ సెట్ అలానే ఉండనీ. మిగతావి నేను ప్లాన్ చేస్తాను. 
మరో ముఖ్య విషయం. ఈ మూడు నెలల్లో మీరు శారీరకంగా కలిసారా ?  
లేదంకుల్. తను ఏవో కారణాలు చెప్పింది. 
పెళ్ళైతే ఆరు నెలలు శారీరకంగా కలవమని మొక్కుకుందట. 
ఏదో వ్రతం పేరు కూడా చెప్పింది. నేను మర్చిపోయాను. 
అవి అన్నీ అబద్దాలని ఇప్పుడు తెలుస్తోంది. 
నేను ఇవన్నీ సిల్లీ విషయాలు డాడీ వాళ్ళ కెందుకులే అని చెప్పలేదు.    
వాళ్ళ ఇంట్లో అరెంజ్ చేసిన శోభనం రాత్రి కూడా మేము కలవలేదు. 
విడిగానే పడుకున్నాము. నేను ఎక్కువగానే నటించాల్సి వచ్చింది. తను ఇంత నాటకం ఆడుతోందని ఊహించలేదు. 
నీకు చాలా మేలు జరిగింది సంజయ్. న్యాయపరంగా అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి . సరే. ముందు తనని ప్రిపేర్ చేసి ఇండియా కి పంపించు. ఇక్కడ నేను డాడీ ఇంకొక ముఖ్య విషయం ప్లాన్ చేస్తాం. 
సంజయ్ తో మాట్లాడి ఫోన్ పెట్టింతరువాత చాలా రిలాక్స్డ్ గా అనిపించింది. మధు నావైపే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు ఏంచెప్తానా అని. 
'ఎనిమిది గంటలైంది. కాఫీ ఇవ్వనా. భోజనానికి లేస్తారా' అంటూ శ్రీమతి అడిగింది. 
ఆలోచనలో ఉన్న నేను గుర్తొచ్చినట్లుగా మధు ని అడిగాను. 
అవునురా వచ్చేప్పుడు మీ ఆవిడని అమ్మాయి ని కూడా తీసుకురాకపోయావా. 
రాత్రి సంజయ్ విషయం చెప్పిన దగ్గర నుంచి అందరికి మూడ్ అఫ్ అయిందిరా. 
వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. 
నేను బ్యాంకు నుంచి డైరెక్టుగా ఇటే వచ్చాను. 
పొద్దుటినుంచి ఇవే ఆలోచనలు. 
వర్కులో కూడా ధ్యాస ఉంచలేకపోయాను. 
ఆ పిల్ల అక్కడ వాడిని ఏ కేసులో ఇరికిస్తుందోనని భయంగా ఉంది. ఇప్పుడొకమారు మొదటినుంచి పునశ్చరణ చేసుకుంటుంటే ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. 
వాళ్ళందరూ కలసి మమ్మల్ని ట్రాప్లో పడేసారు.
డోంట్ వర్రీ రా. 
ఇప్పటివరకు అయితే అన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి. 
ప్రమాదమేమీ లేదు. 
సరే. నా రూంలో కూర్చుందాం రా అంటూ నా ఆఫీస్ రూమ్ లోకి దారి తీసాను శ్రీమతికి కాఫీ ఇమ్మని చెప్తూ. 
ఒక మారు నేను చెప్పినట్లు మీ వియ్యంకుడితో మాట్లాడు. 
ఫోన్ చేసి మీ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదట కదా అని మొదలు పెట్టు. మాటల్లో అసలు విషయం అడుగు. 
తనకి ఎవరితోనో లవ్ ఎఫైర్ ఉందట కదా అని. 
స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. నేను కూడా వింటాను మరియు రికార్డు చేస్తాను. 
ఒక తెల్ల కాగితం, పెన్ టేబుల్ పై పెట్టాను. 
ఏమన్నా అడగాలంటే దాంట్లో రాస్తానని చెప్పాను మధుకి.
ఓకే రా అని మధు ఫోన్ చేసాడు తన వియ్యంకుడు ముకుందరావుకి.
సర్ నమస్తే. ఎలా ఉన్నారు. క్షేమ సమాచారాలు పూర్తయ్యాయి.
మా విజయవాడ మీద అలుకబూనారు మీరు. 
ఇటువైపు క్యాంపు వేసుకుని రావొచ్చు కదా అడుగుతున్నాడు ముకుందరావు.
లేదండి. ఇక్కడే వర్క్ సరిపోతోంది. వచ్చే నెల విజయవాడకే క్యాంపు ఉంది. దాదాపు ఒక నెల అక్కడే ఉంటాను. 
ఓహ్ మంచిది. మంచి వార్త చెప్పారు. ఇంకేంటి విశేషాలు. మీ అబ్బాయి నుంచి ఏమన్నా సమాచారం ఉందా ?
అక్కడ అంతా ఓకే అండి. ఇద్దరూ బాగానే ఉన్నారు.  మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఫోన్ చేసాను. ఏమీ అనుకోరుగా.
అయ్యో అడగండి. మీరేం అడిగిన అభ్యంతరమేమీ లేదు. 
మీ అమ్మాయికి మావాడితో పెళ్లి ఆమె ఇష్టప్రకారమే జరిగిందా ?
ఇప్పుడు మీకెందుకు ఆ సందేహం వచ్చింది. అనుమానంగా అడిగాడు ముకుందరావు.
నేను ప్రాంప్ట్ చేసాను. అసలు విషయం అడిగెయ్యి అని. పేపర్ మీద రాసి చూపించాను.
మీ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదట. తనకు క్లాసుమేట్ తో ప్రేమ ఉందని చెప్పిందట. ధైర్యంగా చెప్పాడు మధు. 
ఆబ్బె అదేం లేదే. కంగారుగా అన్నాడు ముకుందరావు. ఖంగు తిన్నట్టు స్ఫష్టమవుతోంది ఆయన గొంతులో.
మీ అమ్మాయి మంజరినే మా వాడు సంజయ్ తో చెప్పిందండి. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, మీ బలవంతం మీదనే ఈ పెళ్లి చేసుకున్నానని. మా వాడి తో ఉండడం ఇష్టం లేదని కూడా తెగేసి చెప్పింది.
నేను ఈ లోపు సంజయ్కి వాట్సాప్ లో మెసేజ్ ఇచ్చాను. మంజరి కి అందుబాటులో ఫోన్ లేకుండా చూడమని. వాళ్ళ ఫాదర్ తో డిస్కషన్ జరుగుతోంది. తనేమన్నా మంజరికి ఫోన్ చెయ్యొచ్చని. 
ఫోన్ ఆల్రెడీ తన దగ్గర నుంచి తీసుకున్నాను అంకుల్ ఇలాంటి ప్రమాదాలుంటాయని.  సంజయ్ రిప్లై ఇచ్చాడు. 
శ్రీమతి ఇద్దరికీ కాఫీ తెచ్చింది వేడి వేడి పకోడీ తో పాటు. 
కాఫీ కప్పు ముందుకు జరుపుతూ మధుని తీసుకోమని సైగ చేసాను. 
మా అమ్మాయి తెలివిగల స్టూడెంట్ కదండీ. అందరూ డౌట్స్ కు ఇంటికి వస్తుంటారు. వాళ్లలో మగవాళ్ళు కూడా ఉంటారు. తను అందరని నాకు పరిచయంచేసే మాట్లాడుతుంది. అదీగాక మా ఆవిడ కూడా అదే కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ కనుక మా అమ్మాయి ఫ్రెండ్స్, కాలేజీ స్టూడెంట్స్ అందరూ వస్తుంటారు. అందరూ చదువు గురించి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేసుకుంటుంటారు. రాఖీ పౌర్ణమి రోజు అబ్బాయిలందరికీ రాఖీలు కడతారు మా అమ్మాయిలిద్దరూ. ఇవన్నీ ఈకాలంలొ సహజమే. అందులో తప్పేముంది అని ఎదురు ప్రశ్న వేసాడు మంజరి తండ్రి ముకుందరావు కొంచెం విసుగ్గా మాట్లాడుతూ.
పెళ్లయినప్పటినుండి అంటే మూడునెలల నుండి మీ అమ్మాయి మా వాడిని దగ్గరికి రానీలేదు. ఏవో కారణాలు చెప్పి దూరంగా పెట్టింది. మా వాడు కూడా ఈ విషయాలేవీ తెలీవు కాబట్టి సరిపెట్టుకుంటూ వచ్చాడు. వీడు ఆఫీస్ కి వెళ్ళగానే తాను ప్రియుడితో వీడియో చాటింగ్ చేస్తుండేది. నిన్న ఆఫీస్ మధ్యలో ఇంటికిరాగానే తన బండారం బట్ట బయలయ్యింది. 
మీ అమ్మాయి, తన ప్రియుడు బట్టల్లేకుండా వీడియో చాట్టింగ్ చేస్తూ పట్టుబడ్డారు. మా వాడి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాడు మధు. 
వాడి ఆవేశం చూసి నాకూ ఆవేశం వచ్చింది. 
మీరు చెప్పేవన్నీ ఉత్త మాటలు సర్. మా అమ్మాయి అటువంటిది కాదు. మీ అబ్బాయి లేనిపోని 

 

 Previous Page Next Page