Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 9

   

  "లేదండీ _ నేను అంధ్రాలోనే ఉంటున్నాను. ఎటొచ్చీ సుభాష్ గారు ఆ గురవుకాబట్టి అప్పుడప్పుడాయన్ను కలుస్తూంటాను. ఇంతకీ ఈ ఊరేలాగుంటుంద౦టారు?"

    "ఓరోజుండి వెళ్ళిపోయే మీకీఊరేలాగుంటేనేం?"

    "ఓరోజుండి వెళ్ళిపోతానని నేనలేదెం _ మీ యింట్లో మటుకు ఈ ఒక్కరాత్రికి ఉంటానన్నాను......" అన్నాడు జగ్గారావు.

    "అదికాదేలెండి _ ఈ ఒక్క రాత్రీ తర్వాత మీరెవరో. నేనెవరో అన్నారుగదా __ అందుకుని అలా అనుకున్నాను. ఊరికేం _ ఫస్టుక్లాసు  నాకు నచ్చింది!"

    "హమ్మయ్య _ ఒక ప్రోత్సాహకరమైనమాట చెప్పారు." జగ్గారావు ఆవులించాడు.

    "వసూ!" అన్నాడు రాజారావు గట్టిగా.

    అప్పుడే దొడ్డి గుమ్మంద్వారా ఆడవాళ్ళనందర్నీ పంపించి దొడ్డి తలుపు వేసుకుని వస్తోంది. వసంత.

    "హమ్మయ్య !" అనుకున్నాడు రాజారావు తనూ ఆవులిస్తూ.

                                               6

    మరో రెండు మాసాల్లో రాజారావుకాఊళ్ళో మంచిపేరూ, ప్రఖ్యాటీ లభించాయి. అతడి దగ్గర చదువుకోడానికి ఊళ్ళో నిరక్షరాస్యులు పెద్దా, చిన్నా చాలామంది కుతూహలం చూపించసాగారు. రాజారావు చదువుచెప్పే పద్దతులూ. అతడి నెమ్మదితనం చాలామంది నా కర్షించాయి. నిస్వార్డబుద్ధితో విద్యాదానం చేయబూనిన రాజారావు దంపతులను ఊళ్ళోవాళ్ళకి మానవాతీతులుగా అనిపించసాగారు.

    దీనికితోడు మంచి పేరు  సంపాదించడానికి రాజారావు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. చదువులో చిన్న చిన్న పోటీలు పేట్టి బహుమతులిచ్చేవాడు, పోటీలు కూడా వ్యక్తి గత ద్వేషాలు రెచ్చగొట్టకుండా, వాళ్ళలో పట్టుదలను కలిగించేవిగానే ఉండేవి. ఒక పాఠమిచ్చి ఆ పాఠాన్ని పదిరోజుల్లో పూర్తీచేయగలిగిన వాళ్ళ౦దరికీ ఏదో బహుమతి ఇస్తాననేవాడు. దాంతో చాలామంది పట్టు బట్టి పదిరోజుల్లో ఆ పాఠాన్ని పూర్తిచేసేవారు. పోటీలో నెగ్గినవారు చాలా మంది ఉండడంతో వ్యక్తిగత ద్వేషాలకు తావుండేదికాదు.

    అప్పుడప్పుడు రికార్డ్ ప్లేయర్ , టేపురికార్దరూ, స్లయిడ్ పోజక్టరు వగైరాలతో అందరికీ వినోదం కలిగించేవాడతడు.  ఈ విధంగా రాజారావు కాలక్షేపం పేరుతో ప్రారంభించిన ఈ విద్యాదానోద్యమం __ ఒక పెద్దసంస్థగా మారిపోయింది. ఇప్పుడు రాజారావుకు కాలక్షేపంమాటటు౦చి తీరుబడి దొరకడం కష్టంగా ఉంటో౦ది. అతడి శిష్యుల సంఖ్యఅరవై దాటింది.

    ఊళ్ళో చదువుకుని ఇంకా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న కొందరు యువకుల్లో రాజారావు సంస్థపెట్టే ఉద్దేశ్యం వారెవ్వరికీ లేదు. ఎందుకంటే రాజారావు విద్యార్ధులకు కలిగిస్తున్న సదుపాయాలు కలగజేసే ఓపిక, స్తోమతు అందరికీ ఉండవు.

    అందరిలోకీ నరహరినీ విషయమెక్కువ బాధించింది. అతడు బియ్యే ప్యాసయ్యాడు ఉద్యోగంచేసే ఉద్దేశ్యముంది. కానీ, అందుగురించి ఎక్కువ దూరం పోవాలని మాత్రం లేదు. రాజమండ్రిలో ఏదయినా బ్యా౦కు ఉద్యోగం సంపాదించాలని తాపత్రయపడుతున్నాడు. అయితే కనీసం ఆర్నెల్ల దాకా అతడు వేచివుంటే __ వస్తుందా, రాదా అన్న విషయం తెలుస్తుందని రామాకాంతం నరహరి తండ్రికి చెప్పాడు. అంతకాలం నరహరి అగగలడు. పురుష లక్షణంగదా అన్న తాపత్రయం తప్పితే అతడికి ద్యోగ మవసరం కాదు.

    ఆర్నెల్ల వరకూ తనకు గ్యారంటీగా ఉద్యోగం లేదని తెలసిపోయేక నరహరికా వూళ్ళో తోచడం కష్టమయి పోయింది. ఆ ఊళ్ళో అతడిలా తోచకుండా ఉన్న వాళ్ళు మరి నలుగురున్నారు. మొత్తం ఈ అయిడుగుర్నీ ఓ రోజున రమాకాంతం పిలిచాడు.

    " ఏమయ్యా _- మనూళ్ళో మెరికల్లాంటి కుర్రాళ్ళు అయిదుగురున్నారంటే వాళ్ళు స్వాగతంమరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అవుననడానికి మొహమాటపడి, కాదనడానికి మన సోప్పకొకపోవడంవల్ల అందరూ అయనవంక అయోమయంగా చూస్తుండిపోయారు. అప్పుడు రమాకాంతం చిరునవ్వొకటి విసిరి _" మీకు ఉద్యోగలిప్పిస్తానని నేను వాగ్దానం చేశాను. అవునా?"
అనడిగాడు.

    ఈసారి సమాధానవివ్వడానికి కెవరూ సందేహించలేదు." "అవును_" అన్నారంతా ఏకకంఠంతో.

    రమాకాంతం మళ్ళీ మందహాసం చేసి ఓ అయిదు నిముషాలు మౌనం వహించాడు. క్రమంగా అయన ముఖం తీవ్రలోచననుసూచిస్తూ గంభీరంగా మారిపోయింది.

    ఉన్నట్టుండి __ "మీలాంటి కుర్రాళ్ళు౦డీ __ మనూరిపరువు నిలువునా తీసేసారు గదయ్యా!" అన్నాడాయన.

    యువకులైదుగురూఒక్కసారే ఉలిక్కిపడ్డారు.

    "అవునయ్యా __ ఇన్నేళ్ళుగా నేనీ వూరి పంచాయితీ బోర్డు ప్రెసిడెంటుగా ఉన్నాను. ఈ వయోజనవిద్య గురించి నా కెప్పుడూ తట్టనేలేదు. అందుకు కారణ మేమంటారు?__ నేనాట్టే చదువుకోలేదు కనుక. చదువుకున్న వాళ్ళు సాధించినవీ, సాదిస్తున్నవీ __ నేను చదువుకాకుండానే సాధించాను కనుక. పెద్దచదువులు చదివిన వాళ్ళకే ఉద్యోగాలిప్పించేటంత ఎత్తులో నేనున్నాను కనుక. నన్నలా వొదిలేయండి. అనేక      సంవత్సరాలుగా మనూర్ని౦చి సలహా యిచ్చారా?' ఉన్నట్లుండి రమాకాంతం ముఖంలో బాధ కనబడింది_ "ప్రతిసారీ ఎన్నికలలో ఎంతో డబ్బు ఖర్చుపెట్టి ఓట్లు కొనుక్కుంటే ప్రేసిడెంట్ నౌతున్నాను. కానీ ఈ రోజీవూరికి కొత్తగా వచ్చిన మనిషి కనీ ఖర్చు లేకుండా వూళ్ళో బోలెడు పలుకబడి సంపాదించాడు. అతగాడిలా పలుకుబడి సంపాదించేసుకుంటూ౦టే మనలాంటి వాళ్ళం విడ్డూరం చూస్తున్నాం!"

    ఈసారి నరహరి మాట్లాడేడు __ "ఈ విషయం మాకూ బాధగా ఉంది. ఎన్నాళ్ళుగానో మేమూ ఆలోచిస్తున్నాం . కానీ ఈ విషయంలో సంతోషించవలసింది. కూడా ఒకటుంది. ఎక్కడివాడయినా ఎవరో ఒకరివల్ల మన గ్రామంలో బోలేడు మంది వయోజనాలు విద్యావంతులవుతున్నారు. ఆయనకు సహాయం చేయడం ద్వారా మనమూ మనకర్తవ్యాన్ని పాటించాలి __"

 Previous Page Next Page