Home » Vasundhara » మా ఊళ్ళో మహానుభావుడు

  

    మీ వంటి నర్తకీరుణి మా ఊరు రావడం మా అందరి అదృష్టం ...." అన్నాడు రమాకాంతం, తన తన మామూలు ధోరణీలో.

    "అలా అనకూడదు. మీ వంటి పెద్దలున్న యిటువంటి గ్రామానికి రావడం నాదే అదృష్టం __" అంది లీలాసుందరి.

    రమాకాంతం యాభై సంవత్సరాల ముఖంలో _ పాతికేళ్ళ పడుచు సిగ్గు అరుణిమ కనబడింది. అయన గంభీరంగా ఉండాలని ప్రయత్నించినా ఆ అరుణిమ దాగలేదు. తను చేతిలోని కాగితాన్ని మరోసారి చూసి అక్కడ తనపేరు రాసుక ఇవ్వాళానుకున్న డబ్బు వేయబోతూ _ ఆ ప్రయత్నంగా అందులో రాజారావు పేరుకోసం వెతికాడు.  అక్కడ నూటపదహార్లు చూసి _ అరె _ అనుకున్నాడు తర్వాత నర్సన్న పేరు చూశాడు. అక్కడా నూటపదహార్లు రాస్తూ _ "నర్సన్నే అనుకున్నాను, రాజరావూ రసికుడే !" అనుకున్నాడు అలా తట్టలేదు.

    కాగితం రమాకాంతం నుంచి అందుకుని __ థాంక్స్ !" అని ఆయనవైపు కృతజ్ఞతతో కూడిన చిరునవ్వొకటి విసిరి వెళ్ళిపోయింది లీలాసుందరి.

    ఆ నవ్వు రమాకాంతంలో కొత్త జ్యోతి ని వెలిగించింది. కానీ అది తాత్కాలికానుభూతి. వయసు ముదిరినా, అనుభవం పెరిగినా _ అందమయిన చిన్నది కనబడితే మగవాడి మనసు చెదరడం అసహజం కాదు. ఎటొచ్చీ ఆ చెదిరిన మనసు చిన్నదానిపై తదేఅధ్యానానికి దారితీస్తే ఇబ్బంది.

    లీలాసుందరి వెళ్ళిపోగానే _ "ఈ ఊళ్ళో _ మీ ఎరికలో స్వార్ధం కోసం ప్రజల్ని పీడించే భూస్వాములు పేర్లేమయినా ఉంటే చెప్పండి . ముందు మనం వాళ్ళకు రక్షణ ఏర్పాట్లు చేయాలి....." అన్నాడు రవి.

    ఎందుకూ అని ఆడగబోయి ఆగిపోయాడు రమాకాంతం. నక్సలైట్ల దృష్టి అటువంటి వారిమీదే నన్న విషయమాయనకు గుర్తుంది. అయన తడబడుతూ - "ఏమో _ ఎం చెప్పగలం ..... నేను మాత్రం కాదు ...." అన్నాడు.

    "రవి నవ్వి __ " ఆలో౦చించండి. రాజారావుని దోషిగా పట్టించడానికి మీ రివ్వబోయే జాబితా సహకరిస్తుంది....." అన్నాడు.

    రమాకాంతం సాలోచనగా తలపకించి ఉలిక్కిపడ్డాడు. అప్పుడాయన కళ్ళలో స్పష్టమయిన, నిజమయిన భయం గోచరించింది.

    సందేహం లేదు, రాజరావు నక్సలైటు ......!

    ఊళ్ళో కమతగాళ్ళను బాధపెట్టి , కౌలు దారుల బాధలను లెక్కచేయకుండా , ప్రజల్లో చాలామంది దృష్టిలో కూరడయినవాడు చలమయ్య! ఈ విషయంలో ఇంకెవరి పేరు చెప్పాలన్నా చలమయ్య తర్వాతే!

    ఎలాగో ప్రయత్నించి రాజరావా చలమయ్యఇంట్లోనే మకాం పెట్టాడు.

    అంటే చలమయ్య తనకు తెలియకుండానే పక్కలో బల్లెన్ని తెచ్చుకున్నాడు.

    "చలమయ్య ....." అంటూ అస్పష్టంగా గోణికాడు రమాకాంతం.

    రవి ఉత్సాహంగా __ "మంచి క్లూ యిచ్చారు. చలమయ్యంటే __ రాజారావుగారు౦టున్న ఇంటి యజమాని ...." అన్నాడు.

    "ఊం" అన్నాడు రమాకాంతం అన్యమనస్కంగా.

    "ఇంకా ఏమయినా పేర్లు చెప్పగలరా?"

    రమాకాంతం మరికొన్ని పేర్లు చెప్పాడు కానీ, అయన ముఖంలో గాంభీర్యం వెలసింది. నిజంగా చలమయ్యనూ, మరి కొందర్ని పొట్టనబెట్టుకోవదానికే రాజరావీ ఊళ్ళో అడుగు పెట్టాడా? మేకవన్నె వాక్యానికి సార్ధకత కల్పించడాని కింతకంటే] సరయిన వ్యక్తి దొరకడు. పాపం.... చలమయ్య.....

    రమాకాంతానికి చలమయ్య మీద జాలి కలిగింది. చలమయ్య  గురించే ఆలోచిస్తూ _ అలా కూర్చుండిపోయాడాయన. ఆఅనేదావు ఆలోచనలో పడ్డాడని గుర్తించి, రవి అక్కణ్ణుంచి లేచి వెళ్ళిపోయాడు.

    రమాకాంతానికి మనసు మనసులో లేదు. నక్సలైట్ల దురంతాల గురించి అయన పేపర్లలో చదివాడు. అయితే ఆయనిప్పుడు నక్సలైట్ల దురంతాల గురించి కాక __ చలమయ్య దురంతాల గురించి ఆలోచిస్తున్నాడు

    "చలమయ్య అంతం సమీపించింది. ...." అనుకున్నాడాయన.

    స్వర్గ నరకాలు వేరే లేవనీ _ మనిషి తమ చేసిన కర్మకు ప్రతిఫలం జీవితకాలంలోనే అనుభవిస్తాడనీ పెద్దలంటారు. ఇప్పుడు చలమయ్య విషయంలో అదే జరుగుతో౦దా? అతడు చేసిన ఘాతుకాలకు ప్రతిఫలం అనుభవించబోతున్నాడా?

    చలమయ్య చేసే వడ్డీవ్యాపారం ఊళ్ళో చాలామంది కొంపలు కూల్చింది. దొంగతనం చేశారన్న అనుమానంతో అతడనేకసార్లు పాలేళ్ళను స్థంభాలకు కట్టేసి, కొరడాలతో బాదాడు. ఆ బాధ భరించలేక . చేయని నేరాన్ని కూడా ఎందరో ఒప్పుకున్నారు. చలమయ్య మనిషి కాదు __ రాక్షసుడని చాటుగా ఎందరో అనుకున్నారు.

    అయితే, ఊరిమొత్తానికి చలమయ్యేక్కడేనా అలాంటి వాడు? అటువంటి వారు మరికొందరున్నారు. కానీ, చలమయ్య గురించి రమాకాంతానికి బాగా తెలుసు. మిగతా వారి గురించి చూచాయగా వింటే _ చలమయ్య ఘాతుకాల నాయన కళ్ళారా చూశాడు. అలా కళ్ళారా చూసిన ఘాతుకాల్లో _ ఒక వ్యవహారంలో ఆయనకూ భాగముంది.

    అప్పుడున్నట్లుండి రమాకాంత౦ శరీరంలో వణుకు పుట్టుకొచ్చింది. తరచి తరచి ఆలోచిస్తూ _ తన మెదడులో అట్టడుగున దాగిన జ్ఞాపకాల పూతలనాయన ఇప్పుడు _ అనుకోకుండా బయటకు తీశాడు. ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలని గానీ, తన్ను తాను విమర్శించుకోవాలని గానీ అయన అనుకోలేదు. అనుకోకుండా జరిగే అనేక విషయల్లాగే ఇదీ జరిగింది.

    ఆ విషయం ఈనాటికి సుమారు ముప్ఫై ఏళ్ళకు పైగా క్రితం నాటిది. అయినా రమాకాంతనికి అంతా ఇప్పుడు కళ్ళముందు జరుగుతున్నట్లే ఉంది.

                                                     18

    అప్పుడు రమాకాంతానిది పాతికేళ్ళ ప్రాయం హుషారయినా యువకుడిగా గ్రామంలో మంచిపేరు సంపాదించుకున్నాడు. ఉన్నవాళ్ళలో కాస్త చదువుకున్నవాడు కావడంవల్ల అతడంటే చాలామందికి గౌరవభావం కూడా ఉండేది.

    అప్పుడు రమాకాంతానికి తెలివుంది. సంస్కారముంది, సమయస్పూర్తి ఉంది, పాపాభీతి ఉంది. వీటన్నింటినీ మించి పదవీ వ్యామోహం కూడా ఉమ్దడంవల్ల అతడు చలమయ్య స్నేహం పట్టాడు.

    చలమయ్యంటే గౌరవభావం కలవారా ఊళ్ళో బాగా తక్కువ. అయితే ఇంచుమించు ఊరు ఊరంతా అతడికి భయపడుతుంది.

    చలమయ్య ధనసహాయం పేరిట చాలామందికి అప్పులిచ్చి _ ఇచ్చిమ్డానికి రెట్టింపుకి తక్కువకాకుండా వసూలు చేస్తూ౦టాడు. డబ్బు అవసరమున్న వాళ్ళూ, బాకీ ఉన్న వాళ్ళు కూడా అతడికి భయపడుతూ౦టారు. అప్పులివ్వగల స్తోమతుడీ, ఇస్తే వసూలు చేసుకోలేమనే భయం గలవాళ్ళు తమ వ్యవహారాలు చలమయ్య ద్వారా చేయించుకునేవారు. అందువల్ల వాళ్ళకూ అతడి అవసరముంది ఈ విధంగా ఇంచుమించు ఊరు ఊర్నంతా తన గుప్పిట్లో ఉంచుకున్న చలమయ్యకు ఒకే ఒకవ్యక్తి కోరకరాణికొయ్యగా మిగిలిపోయాడు. అతడి పేరు ఆనందమూర్తి.

 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra