నర్సన్న రాజారావు ముఖంలో భావాలు పసిగట్టాడు. అతడి కుత్సాహమూ, దాంతోపాటే కొంత ధైర్యమూ కూడా రాగా _ "రాజారావుగారూ! మీరిందాకా మాటల్లో ఓ అజ్ఞాత వ్యక్తి ప్రసక్తి తెచ్చారు. నా కళ్ళలోకి సూటిగా చూసి _ ఆ వ్యక్తేవరో చెప్పండి విషయం నేను రహస్యంగానే వుంచుతాను ........" అన్నాడు.
"క్షమించాలి . అది మాత్రం నన్నాడగొద్దు __ " అన్నాడు రాజారావు చటుక్కున.
నర్సన్న బిగ్గరగా నవ్వి __ "నాకు తెలుసు. మీరు చెప్పలేరు. ఆ అజ్ఞాతవ్యక్తి ఎవరో నాకు తెలుసు. అతడి పేరు మీరెందుకు చెప్పారో కూడా నాకు తెలుసు __" అన్నాడు.
అసంభవం _ ఆ వ్యక్తి కెవరూ మీరు తెలుసుకొలేరు __" అన్నాడు రాజారావు. కానీ అతడి మనసులో ఆశ్చర్యంగా వుంది. నర్సన్నకు నిజంగా అగ్నతవ్యక్తి గురించి తెలిసిందా? లేదా నాటకమాడుతున్నాడా?"
"మీరంతా నమ్మకంగా ఎలా చెబుతున్నారో నాకు తెలుసు. ఆ అజ్ఞాతవ్యక్తి ఎవరో కాదు __ మీరే _ అవునా?"
రాజారావు వెంటనే తల అడ్డంగా ఊపాడు.
"అనుభవం అబద్దమాడదు __" అన్నాడు నర్సన్న. "మీ కంటే బయసులో పెద్దవాడ్ని . తెలివిలో మిమ్మల్ని మించిలేకపోవచ్చు. కానీ, మీ అబద్దాల్ని నేను పసిగట్టగలను. కీర్తిభారాన్ని మోయడం మీ కిష్టంలేక్ _ దాన్నో అజ్ఞాత వ్యక్తి మీదకు నెట్టేస్తూన్నారని నే వ్యర్ధం చేసుకున్నాను. నే నంటున్న దబద్దమని నా కళ్ళలోకి చూసి చెప్పండి ......"
రాజారావు ఇబ్బందిగా ముఖం పేట్టి _ "అందరి కళ్ళలోకీ నేను సూటిగా చూడలేను. మాటిమాటికీ మీరు నన్ను కళ్ళలోకి సూటిగా చూడమనడం నా కిబ్బందిగానే వుంది __" అన్నాడు.
"పోనీ, కళ్ళు మూసుకునే నిజం చెప్పండి ...."
"ఎందుకులెండి? మీ రేమనుకున్నా నాకేమీ నష్టం లేదు. కానీ నీతో మీకున్న పనేమిటి?' అన్నాడు రాజారావు మాట మారుస్తూ.
"కీర్తిభారాన్ని మోయిలేక మీరో అజ్ఞాతవ్యక్తిని సృష్టించారు. నాకా అజ్ఞాత వ్యక్తితో పనిపడింది. నేను మిమ్మల్నొకటడుగుతాను. నా మాట అభ్యర్ధించాడు.
"కాదనుకూడదనే ఇందాకట్నుంఛీ అంటున్నారు. చెప్పదల్చుకున్న మాటేమిటో మాట మాత్రం కూడ అనడం లేదు ......"
అలా నన్ను కంగారు పెట్టకండి __" అన్నాడు నర్సన్న _ "ఇది సామాన్య విషయం కాదు రమాకాంతాన్నో డించడమే నా జీవితాశయమని నెరవేర్చగలడు......."
"ఎలా?"
"ఈ ఊళ్ళో ఒక మహానుభావుడున్నాడనీ, అతడికి ప్రజాసేవ తప్ప మరో ఆశయం లేదనీ ప్రజలకు తెలిసింది. న ఆభిప్రాయ౦లో ఆ మహానుభావుడు పట్ల కుతూహలం పెరిగింది.. నా అభిప్రాయంలోఆ మహానుభావుడిని అగ్రస్థానంలో ఉంచుతారు. కాబట్టి ...." నర్సన్న ఏదో అనబోయాడు. కానీ సంకోచం అతడి గొంతునొక్కేసింది.
రాజారావులిక్కిపడ్డాడు. నర్సన్న అభిప్రాయం అతడికి చూచాయగా అర్ధమయింది. ఆ గ్రహింపు అతడి ఆశ్చర్యంలో ముంచేసింది.
"రాక్షసీ ! నీ పేరు రాజకీయా __ వర్ధిల్లు _-" అన్నాడో గొప్ప రచయిత . తను ఏదో సందర్భంలో ఏ ఉద్దేశ్యమూ లేకుండా చెప్పిన ఒక విషయం రాజకీయ ప్రయోజనాలకు అద్భుతంగా ఉపయోగపడబోతోంది.
" చెప్పండి _ ఆగిపోయారేం?" అన్నాడు రాజారావు.
"చేప్పమంటారా?" అన్నాడు నర్సన్న అనుమనంగా. అంతవరకూ ఉన్న గాంభీర్యం ఇప్పుదతడి ముఖంలో అతడి కళ్ళలోకి ప్రతిభిస్తున్నాయి.
"సంకోచించక౦డి. మీరు చెప్పేది నేను రహస్యంగానే ఉంచుతారు _" అన్నాడు రాజారావుతడికి హమీనిస్తూ.
తను చెప్పేది వింటే కానీ, మాటివ్వలేవన్న రాజరావలా అనగానే తను చెప్పదల్చుకున్న దతడి కర్ధమయి పోయిందని నర్సన్నకు తెలిసిపోయింది. అతడికిప్పుడు మొండి ధైర్యం వచ్చింది __ '" ఆ అజ్ఞాత వ్యక్తిని నేనేనని చెప్పండి. ఏ ఒక్క ముక్క ఎన్నికల్లో నాకెంతో బలాన్నిస్తుంది. నా జీవితాశయం నెరవేరుతుంది......"
ఆగండి నర్సన్నగారూ _" అన్నాడు. రాజారావు. "నన్ను మీరు అబద్దమాడమంటున్నారు. అది నావల్లకాదు ....."
ఒక అబద్ద మాడి మీరొక అజ్ఞాత వ్యక్తిని సృష్టించారు. ఎందుకు మీరా అబద్దమాడారు.? కీర్తి ప్రతిష్టలను భరించలేక! అలాగే ఇప్పుడు మళ్ళీ మరో అబద్దమాడండి. ఎందుకో తెలుసా? ఇప్పుడు మీరు చెప్పిన అబద్దం నిజమయివడమే కాక __ మీరు కలలు కంటున్న విధంగా మన గ్రామాన్ని బాగుచేస్తాను. నాకు డబ్బంటే లక్ష్యంలేదు. కేవలం రమాకాంతా డించాలానే ఎన్నికల్లో నిలబడుతున్నాను. రమాకాంతానికి నాకున్న చొరవ, సాహసం, డబ్బూ లేవు. అన్ని విధాలా నేను మీ ఆశయాలకు తగినవాడ్ని ....." అన్నాడు నర్సన్న.
"క్షమించాలి __" అన్నాడు రాజారావు __"మీరొక పొరపాటు అభిప్రాయంలో ఉన్నారు. అజ్ఞాతవ్యక్తి నా కల్పనా అనుకుంటే అది మీ భ్రమ. అతడి పేరుతో ఎన్నికల్లో గెలవాలని ఆశించడం మీకు భావ్యంకాదు. మీ ఆశయాలు మంచివి. తలచుకుంటే మీరు నిజంగానే గ్రామాన్ని బాగుచేయగలరు. అయితే ఆ నమ్మకాన్ని నాకు కలిగించి లాభం లేదు. ప్రజలకు కలిగించండి. ఎన్నికల్లో నేగ్గేక ప్రజల కేం చేయాలనుకుంటున్నారో __ అవన్నీ ఇప్పుడే చేయండి. అప్పుడు మీరెవరి సాయమూ లేకుండానే అన్నికల్లో నెగ్గగలరు. ఆఖరికి నా అబద్హం సాయం కూడా అవసరముందడు. మరో విషయం . అబద్దాన్నా శ్రయించుకుని పైకి పోవలంనుకుంటే _ అదీ అబద్ధమే అవుతుంది. నా చేత మీరు చెప్పించాలనుకుంటున్న అబద్దం _ప్రజల నోటిలో దానంతటదే నిజం కాగలదు. అంతా మీ చేతుల్లో ఉంటుంది ....."
నర్సన్న నిరుత్తరుడయ్యాడు. రాజారావు తనను బాగా దెబ్బతీసినట్లతడు గ్రహించాడు. అగ్నతవ్యక్తి తను కావాలనుకోవడం రాజారావు హర్షించలేదు. అతడిలో తనపట్ల ఏర్పడిన దురభిప్రాయం పోవాలి. రమాకాంతం పట్ల ద్వేషం తప్ప, తనలో పదవీ వ్యామోహం లేదని అతడికి తెలియాలి.
"రాజారావుగారూ __ మీరు చెప్పింది నిజమే! అయితే నా బాధ మీకర్ధం చేసుకోవడం మీరూ, నేనూకూడా ఊరి బాగుకోరేవాళ్ళమే! కానివే మనవంటి వాళ్ళంకాక, ఆ రమాకాంతం ప్రెసిడెంటయితే ఊరిన్నేళ్ళనుంచీ ఎలా గుందో _ ఇకముందూ అలాగే ఉంటుంది. అతగాడు ప్రెసిడెంటు కాకూడదు. నేను చెప్పింది మీకు నచ్చకపోతే _ పోనీ మీరే అతడికి వ్యతిరేకంగా ఎందుకు నిలబడకూడదు? మీకు నా పూర్తీ సహకార ముంటుంది ......"