అంతలో కొందరు కంపినీపనోలు __ అల పెళ్లాలు కూరలు కొనడానికి బజారుకు వెళ్తూ సీతాలుకు జరిగిన ఘోరాన్ని జూసి కారుతున్న రక్తాన్ని జూసి 'ఏటమ్మా' అంటే 'ఏటమ్మ' అని చుట్టురూచేరేరు.
"ఆడి సేతులుకాలిపోను . ఎంతకీ కాట్రాక్టోడైనా __ పైసాలు వుట్టి పుణ్యానికి ఇచ్చినట్టు ఆడదాన్ని అంత గట్టిగా కొడతాడా! అది సత్తేఏటి సేత్తాడు" అని ఒక కనికారం వున్న ఇల్లాలు అన్నది.
"అయినా దానిపక్కని పనిజేస్తున్న పోతూలాంటి మొగోలుకి కళ్ళు లేవేటి? నంజికొడుకుని గుమ్మిలో నేసి కప్పీడం మానీసి " అన్నది మరొక పౌర్శవంతురాలు.
ఆ శరీరంలో ఏటుందని కొట్టేడు, ముండగండడు. ఎండిపోయి __ ఎముకలే కనిపిత్తన్నాయి, కళ్ళు కావరం కాకపోతే గుణపాముతోని గుద్దుతాడా! ఆ ముండ పేణంపోకుండావుండడానికి అదెంత కష్టపడి బతుకుతుందో ఒర్ కూలోలూ! మీరు మొగోలైతే ఆ గండిడనిపట్టి తన్నండి" సలహా ఇచ్చింది__ అన్యాయంఅంటే అగ్గిలామండే ఒక ఇల్లాలు.
"కాంట్రాకక్టోడు కొట్టనేదర్రా. మేస్త్రీగాడు కొట్టేడు. ఆడి కడుపూ మన కడుపు నాటిడనే ఆలోసించినాము" పనోళ్ళు పౌర్షం లేకపోలెందన్నట్టు అన్నాడు ఒక పనోడు.
"మేస్త్రీ గాడైతే మాత్రం అంత మెడపోతరం ఏటి? ఆడు పులికాడ నక్కలాటోడు. ఆడేక్కడున్నా పట్టితీసుకొండి. నాలుగు పోతులు పొడిసి __ మన సీతాలు కలికి తప్పైపోయిందని మెక్కించి గుండుగీసి పంపించుదుంగాని" అని జట్టు పెద్ద అందరికీ అజ్ఞాపించేడు.
అవును అంతవరకు ఎవులుం పని సేయద్దు పదండంటూ పదండని కొందరు మేస్త్రీని వెదకడానికి వెళ్ళేరు. కొందరు అక్కడే కాపలావున్నారు.
ఇదంతా ఇంటి కిటికీ బొక్కలేళ్ళి సురిటేలకలాగ సూత్తన్నాడు సుదర్శనం. పనోలు పని అఫీసురకి తనకు సంతత్సరం అద్దెడబ్బు పోయిందని కూలోల్ని లోలోపలతిట్టుకొని సైకిలెక్కికోటేశ్వరరావుగారికి చెప్పడానికి వెళ్ళేడు.
జరిగినదంతా చెప్పి పని ఆగిపోకుండా కొత్తమేస్త్రీ నీ కొత్త పనివాళ్ళనీ పంపమని కాళ్ళూ __ ఏళ్ళూ నలుపుతున్నాడు. తన బతుకుతప్పా లోకంఅఖర్లే నోడు సుదర్శనం.
కోటేశ్వరరావుగారు సుదర్శనం చెప్పిన రెండవసారిమాటలు వినిపించు కోవడంలేదు. తన తనువంతా అక్కడ వుండిపోయిన ట్రక్కుమీదనే వుంది, కూలోలు కోపం ఏ క్షణంలో ఎలా వుంటుందో చెప్పలేము. లక్షాబదివేలు విలివజేసే ట్రక్కు.
ఆ ఆలోచనల నీడలో ఆవేశం అందోళనా చెందుతూ, అలసిపోయి వచ్చేడు మేస్త్రీ.
కోతెశావ్రరావు ఆధునిక అందాలతోకూడుకున్న అడవిలాంటిబంగ్లాలో కుర్చీమీద మృగురాజులా కూకున్నాడు.
అతనిముందు సేవరపిల్లిలా నిలబడ్డాడు కనకయ్య. మేస్త్రీ జరిగిన విషయం చెప్పుతూ గజగజలాడుతూన్నాడు.
మేస్త్రీ జడిసిపోతున్న తీరును గమనిస్తుంటే నక్కడదేదో కొంపలు తెగిపోయినపనే జరుగుండాలి. లేకపోతే కూలివాళ్ళు సామాన్యంగా బిగిసిపోరు ఇదేదో ప్రాణంమీదకి వచ్చిన కేసే...... అంతమందీ ఒకేమారు కట్టుగట్టి పని మానె సేరంటే తతంగం పెద్దదే జరుగుండాలి లేకపోతే ఆకాశాన్నైనా అరుపులతో అదిరించగలితే మేస్త్రీ హడలిపోతున్నాడు. వీడి బెదురు జూస్తుంటే __ నా ఇళ్ళు కదలనట్టేవున్నాడు. వీడు వెళ్ళాకపొతే అక్కడ నా లక్ష్యా ఏభైవేలు రూపాయల త్రాక్కుని ఆ లంజాకొడుకులు కాల్చీసినా కాల్చీస్తారు__ అసలే ఆ కూలోలు శ్రీకాకుళంవాళ్ళు. నీరులా ఎంత చల్లగుంటారో __అగ్గిలాగ అంత అంటుకుంటారు__ అని కోటేశ్వరరావుకి ఆలోచనలు కోట్లుకొలది ఊరుతున్నాయి.
"ఇంతకీ పోతారండీ __ అక్కడేవున్నారు. ఆ కూలిముండ సచ్చినట్టుగుంది. ఆ కూలోలు దాని చుట్టూ కూర్చొని కత్తులు నూరుతున్నారు. ఇదుగో ఇతగాడి గురించి కొందరు వెతుకుతున్నారు." అన్నాడు సుదర్శనం.
"ఎందుకూ?"
"ఎందుకేమిటి _ రెండు లాగాయింపులు లాగాయించీ సీతాలు కాలుకి మొక్కి తప్పుని వప్పుకుమని చెప్పాలని"
"అంతేకదా. చంపుతాం, నరుకుతాం, అనలేదుకదా? మరింకేం అనలేదు. కదా?"
"అనలేదు"
"అంటే వాళ్ళకు కావలసింది మేస్త్రీ కనిపించడం అంతేకదా! తప్పు జరిగిపోయిందని క్షమార్పణ చెప్పడం. అంతేకదా! దానికే ఇంతభయమో . కణక్యా గోల్లుతోపొయిందానికి గొడ్డలిపట్టుకుమ్తువా పరిస్థితిని అంత ప్రాణంమీదకు ఎందుకుతెచ్చుకోవాలి. ఎక్కడిదక్కడే సెట్లు చేసుకుంటే ఏ పూచీ వుండడు. కొట్టడం ఎందుకు? కొట్టించుకోవడం ఎందుకు?"
ఈమాట మేస్త్రీకి నెట్టి బద్దలుకొట్టినట్టు తగిలింది.
"అవును నేనుకొట్టెను. ఎవరికోసం నాకోసమా? కాదు నీకోసంమే కొట్టెను. కొట్టీ __కొట్టీ నీ కోసమే __ ఆ మేడలూ భవనాలూ కట్టించేను. తిట్టే __ తిట్టే సిమ్మెంటు రోడ్డులు పొయించేను __ నీకు లక్షలకొద్ది లాబాలోచ్చేయి. అప్పుడు కూలోల్ని కొట్టోదదనీ ఏనాడైనా అన్నావా ఇప్పుడు నా వంటిమీద దెబ్బపాడనీవ్వకుమ్డా చెప్పడానికి నీవంతు వచ్చేసరికి తిరిగి నా చెప్పేతీసి నా చేతిలోని నన్నేకొట్టుకొమంటావా? సేప్పాలంటే సీతాలుని నేనుకొట్టడానికిగాని ఆడి నన్ను తిట్టడానికి గాని మా ఇద్దరిమధ్యా ఎలాంటి లావాదేవీలులేవు. మీ పనులు ఎంతవేగం అయితే అంత వేగం డబ్బోస్తే మా బతుకులుమీద అన్ని గెంజనీల్లుజల్లుతారని మా ఆశ. ఆ అశతోనే నేనాపని చేసెను. మీరింతమాట అంటారని తెలిసుంటే ఆ ఆపని మొదట్లోనే మానుకుందును, నేను కూలోల్ని ఇంతవరకూ ధైర్యంగానే కొట్టెను. తిట్టను. కాని అవే దెబ్బలు తిరిగి నాకు తగుల్తాయన్న విషయం నాకు తెలిసేసరికి నా కెందుకో భయంవేస్తుంది" అని ధైర్యం భయం కలిపి చెప్పేడు మేస్త్రీ __
ఏదైమైనా ఇప్పుడు నువ్వా స్థలానికి వెళ్ళాకపొతే నా లక్షా ఏభైవేల రూపాయిల ట్రక్కు తగలబెడతారు. ఆ పని జరిగితే నీమీద నేను కేసు పెడతాను. ఆ కూలోలుచేత తిట్టో, దెబ్బో నువ్వు కాయాలిగాని నేను కేసు పేదతాను. ఆ కూలోలుచేత తిట్టో, దేబ్బో నువ్వు కాయాలిగాని నేను కాసే అవసరం లేదు, పిరికితనం సంపుకొని ధైర్యంగావెళ్ళు__ నాకు జరగబోయే నష్టం కన్నా నీకు తగిలే నాలుగుదెబ్బలే న్యాయం ఆలోచించుకో......"
ఆ మాటల్లో భావం అర్దమయింది. తాను ఇంతకాలం నమ్ముకున్న పక్షంనుండి తనకు దొరికిన ధర్మమేదో తాను తెలుసుకున్నాడు. ఏ పక్షమూకాని నాలాంటి మధ్యరకంమనిషి ఈవిధంగా శిక్ష అనుభవించాగలసిందే. ఈ విషపు 'నాగు' తోకపెట్టేకన్నా ఆ కష్టపాటోలు కాలుపట్టడం తప్పు లేదు __ అనుకున్నాడు మేస్త్రీ.
"సరే __ నేనే వెళ్తాను. కాని మీ పనికి తిరిగిరాను" తిరిగి వెళ్ళిపోయాడు. మేస్త్రీ.
అనుకున్నట్లే మట్టిపనోలు మేస్త్రీని పట్టుకున్నారు. మేస్త్రీ వాళ్ళు వేసిన ప్రతి శిక్షనీ వప్పుకున్నాడు.
మేస్త్రీ పనిపోయిందని తెలిసి కూలోలు బాధపడ్డారు. కొత్తపనోల్ని కోటేశ్వరరావు పనిమీద పెట్టగానే మేస్త్రీ బాధపడ్డాడు. కొత్త పనోలుకి మన కథ చెప్పాలని కూలోల్ని తీసుకుని మేస్త్రీ వెళ్ళాడు. సంగతితెలిసి కూలోలు కూలోలు ఏకమయ్యారు. అంతలో ఒకరోజున వర్షంపడి గోతిలో రాతిమెడ కూలిపోయింది.
_____౦ అయిపోయింది ౦ _____