మాధవి మందహాసం చేస్తూనే __ "నీ మాటలకు నాకు కోపమెందుకు రావడం లేదో తెలుసా?" అంది.
"తెలియదు" అన్నాడు మోహన్.
"ఇలాంటి కబుర్లు నేను మీ నోటనే కాదు, చాలా మంది నోట విన్నాను. వారిలో నాకు దగ్గరి బంధువులున్నారు, స్నేహితులున్నారు. భర్త దగ్గర లేని ఆడదాని పట్ల పురుష ప్రపంచానికి అంతులేని సానుభూతి ఉంటుంది. అది విని నాకు అలవాటై పోయింది " అంది మాధవి.
"ఈ సంగతి మీ చేల్లిలికి చెప్పండి! అదేదో మహాపపామనీ, ఆ పాపం నే నొక్కణ్ణి మాత్రమే తలపెడ్తున్నాననీ ఆవిడ అనుమానం"అన్నాడు మోహన్.
మాధవి చటుక్కున ఒక అడుగు ముందుకువేసి, "దీనికి నేను అందరికీ ఇచ్చిన సమాధానమేమిటో తెలుసా?" అంది.
"తెలియదు" అని వాక్యం పూర్తీ చేసెంతలో అతని చెంప చెళ్ళుమంది. కళ్ళు గిర్రున తిరిగాయి.
"దుర్మార్గుడా! నా మీద జాలిపడితే ఎంతో కొంత అర్ధమయింది. సుఖంగా కాపురం చేసుకుంటున్న నా చెల్లుల్ని గురించి ఆ పాడు మాటలేమిటి? నీ కసలు మతి ఉండే మాట్లాడుతున్నావా?" అంది మాధవి.
మోహన్ చెంప తడుముకుంటూన్నాడు. అతని కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్ళు తిరిగాయి. ఇటువంటి పరాభవం అతనికి కొత్తకాకపోవచ్చుగానీ, ఆ క్షణంలో అతను సిద్దబడి లేడు.
ఈ ఇంట్లోని అవకాశం ఇంక పూర్తిగా తన చేతులు దాటి పోతున్నదని మోహన్ గ్రహించాడు. బహుశా తనకు మళ్ళీ ఈ ఇంట్లో అడుగుపెట్టే అవకాశం కూడా లభించకపోవచ్చు.
అతను చటుక్కున మాధవి కళ్ళమీదపడి, నన్ను కొట్టంప, తన్నండి! మాటలతోనూ, చేతలతోనూ అవమానించండి! నన్ను అడిహ్యంచుకోండి! కానీ నా కోరిక కాదనకండి. ఈ కోరిక తీరకుండా నేను బ్రతకలేను" అన్నాడు.
మాధవి తెల్లబోయింది. తన చెంపపెట్టుతో అతనిక్కణ్నుంచి వెళ్ళిపోతాడని ఆమె ఆశించింది. అలా జరక్కపోవడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
"వెళ్ళిపో _ ఇక్కణ్నించి!" అసహ్యంతో అరిచిందామే.
"నేను వెళ్ళను, వెడితే చచ్చిపోతాను" అన్నాడు మోహన్ అమెవ్ పాదాల ముందునించి లేవాకుండా.
"నీలాంటివాడు చచ్చిపోతే ఈ లోకానికి నష్టంలేదు. వెళ్ళిపో?" అంది మాధవి.
"నిజంగా చచ్చిపోతాను" అన్నాడు మోహన్.
"నిజంగా చచ్చిపో" అంది మాధవి.
మోహన్ లేచి నిలబడి, "అయితే కడసారి చూపులకు ఒక్కసారి లతను కూడా ఇలా పిలవండి" అన్నాడు.
"లతా!" అని పిలిచింది మాధవి.
ఒక్క ఉదుటున లత అక్కడికి వచ్చింది.
"ఇతను చావడానికి వెడుతున్నాడు. ఆఖరిసారిగా ఓసారినిన్నూ, నన్నూ, చూసి వేడతాడుట" అంది మాధవి.
"అవును లతా! మిమ్మల్ని పొందని నా ఈ జన్మ వ్యర్ధం. ఈ రాత్రంతా నేను నా జేవితంలో ఏమేంచేశానో అలోచించుకో౦టాను. రేపు సాయంత్రం ఊరి చివర కొండమీద దూకి నన్ను నేనే అంతం చేసుకుంటాను. ఆఖరిసారిగా మిమ్మల్నీద్దర్నీ తనివితీరా చూసుకుని వెళ్ళిపోతాను" అని ఎంతో దీనంగా అన్నాడు మోహన్.
అతని మాటలు ఆ అక్క చేల్లెలిద్దర్నూ ఎంతో జుగుప్ప కలిగించాయి. ఐనా ఆ మూర్ఖుడితో మాట్లాడి లాభంలేదని ఇద్దరూ మౌనంగా వూరుకున్నారు.
మోహన్ నెమ్మదిగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.
అప్పుడు మాధవి చెల్లెలివంక తిరిగి, "ఎవడు వీడు? నీ ముందు ఇలా మాట్లాడే ధైర్యం వేడి కేలా వచ్చింది?" అంది.
లత నిట్టూర్చి, "అంతా నా ప్రారబ్డం" అంటూ క్లుప్తంగా మోహన్ కధ అక్కకు వినిపించింది.
"మనిషి చాలా మెండివాదులా ఉన్నాడు. ఈ రోజుల్లో మోడితనంతో సాధీంచేలేనిది లేడు" అంది మాధవి ఏమో ఆలోచిస్తూ.
"అంటే?" అంది లత కంగారుగా.
"నేను వాణ్ణి పరీక్షగా చూశాను. మనిషి నార్మల్ గా లేడు. చూడడానికి మామూలుగా కనబడుతున్నా వాడి బ్రెయిన్ లో ఏదో లోపముంది. ఆవేశంలో వాడి కళ్ళు అదో రకంగా ఉన్నాయి. రేపు వాడు నిజంగా ఆత్మహత్య చేసుకుంటాడని నా నమ్మకం" అంది మాధవి.
"ఇలాంటి వెధవలు చావాలి. అదే మన సమస్యకు అంతిమ పరిష్కారం" అంది లత.
"అది నువ్వుప్పుడంటున్న మాట! రేపు వాడు నిజంగా చచ్చిపొతే నీ మనసు పరిపరివిధాల పోతుంది. నువ్వు తీసుకున్న నిర్నయమ్లోని మంచి చెడ్డలను మళ్ళీ మరొక్కసారి బేరీజు వేసి చూస్తావు. అప్పుడు నీ ఆలోచనలింకోదారికి మళ్ళిపోతాయి. మనిషి ప్రాణాన్ని తీస్తే ఈ నైతిక విలువల ప్రయోజనమేమిటి?" అంది మాధవి.
లత భయంగా అక్క వైపు భయంగా చూసి, "అక్కా! నువ్వు గోరంతలు కొండతలు చేస్తున్నావేమోనని భయం వేస్తోంది. నీలో పరపురుషుడి గురించిన ఆలోచనలు వస్తే దామోదరాన్ని పెళ్ళిచేసుకో _ తప్పితే మఫన్ పట్ల రావంతాకూడాసానుభూతి ప్రకటించకు. వాడు చాలా దుర్మార్గుడు. నీ వంటి అసాధారణ యువతి సానుభూతికి వాడు తగడు" అంది.
మాధవి నవ్వి , "సానుభూతి చూపకుండా ఎలా ఉండగలనే? నా దృష్టిలో అప్పుడే వాడు ఆత్మహత్య చేసుకున్నాడు." అంది.
10
"అక్కయ్య అతను నిజంగా చచ్చిపోయాడేమోనని భయపడుతోంది" అంది లత.
రామారావు తల పకించి, "ఆమె అనుమానంలో నిజముంది. మోహన్ చాలా మొండివాడు. ఇప్పుడు నేను చాలా విచారిస్తున్నాను. అతన్ని మన ఇంటికి రానిచ్చి అనవసరంగా కొరివితో తలగోక్కోవడమైనందుకు". అన్నాడు.
"ఇందులో ఇబ్బందేముంది? చస్తే చావనివ్వండి" అంది లత.
విషయం నువ్వన్నంత సులభం కాదు. మోహన్ చస్తే జీవితాంతం మనకు సుఖాశాంతులు౦ డవు."
"అంటే ఏమంటారు?" అంది లత విసుగ్గా.
"అతన్ని గురించి లోపాయికారీగా వాకబు చేశాను. పూర్తీ నిజం దొరక్కపోయినా చాలా చోట్ల అతను తాననుకున్నది సాధించనట్లే కనబడుతోంది. నీ మీది నమ్మకంతో అతనిలో మార్పు తీసుకురావద్దామని నేను మనింటికి ఆహ్వానిస్తే, ఇది విషమ సమస్యగా పరిణమించింది" అన్నాడు రామారావు.
ఇందులో నాకు సమస్య ఏమీ కనిపించడంలేదు. అతన్ని గురించి మర్చిపొతే ఎ గొడవా ఉండదు" అంది లత తేలికగా.
"చూడు లతా! మోహన్ నా చిన్ననాటి స్నేహితుడు బలహీనత ఎలావున్నా మనిషి మంచివాడు. బంధుమిత్ర వ్భేధం లేకుండా. అయినవాళ్ళన్నది సరుకు జేయకుండా అందరు అడవాళ్ళ జోలికి వెళ్ళడం బలహీనత అనిపించుకుంటుంది. తప్పితే చెడ్డతనంవిధమైన వివాహాలు వచ్చాయిగానీ , ఒకప్పుడు సామూహిక వివాహాలు అమల్లో వుండేవి. ఆ రోజుల్లో అయితే మోహన్ నెవరూ తప్పుపట్టి ఉండేవారు కాదు" అన్నాడు రామారావు.
"సాముహీక వివాహాల గురించి మీరు నాకు చెప్పడానికి కారణమేమిటి? మోహన్ ని ఇంకో మొగుడిగా స్వీకరించమంటారా?" అంది లత చాలా కోపంగా.
రామారావు ఆమె కోపాన్ని చూసి ముచ్చట పడలేదు. తాఫీగా చెప్పడం ప్రారంభించాడు. _ "నా ఆలోచనలు వేరు. అందులో లోపముంటే చెప్పు. నేను పవిత్రతకూ, శీలనికీ లంకే పెట్టే మనిషిని కాదు,. మొహాన్నీ పరిస్థితికి తీసుకురావడంలో నబా బాధ్యత వుంది. ఆ బాధ్యతలో ఒక ప్రశ్న అడుగుతున్నాను. అతని ప్రాణాలు రక్షించడం కోసం _ అతని కోరికను మన్నించగగలవా? ఇందుకు నా నుంచి ఎటువంటి పరిణామమూ ఉండదని హామీ ఇస్తున్నాను."
లత ఏదో అనబోయి ఆగింది, కొద్ది క్షణాలపాటు ఆమె మనసును సముదాయించుకుంది. ఆవేదననణుచుకుని చాలా నెమ్మదిగా, మరో పర్యాయం మోహన్ కోరిక గురించిన ప్రసక్తి నక ముందుకు వస్తే ఉరోసుకు చస్తానంటాను. మీరేం చేస్తారు?" అనడిగింది.
రామారావు తెల్లబోయాడు. "ఊహించని ప్రశ్న వేశావ్ లతా?" అన్నాడు.
"ఏం చేయను మరీ? చస్తానని బెదిరించి పనులు జరుపుకోవలసిన అవసరం మీ కారణంగా నా కొస్తుందని ఎప్పుడూ అనుకోలేడు" అంది లత.
"ఊరుసుకో చావల్సినంత అసహ్యకరమైన పనా అది?" అన్నాడు రామారావు.
"మనం గుడికి వెళితే జోళ్ళు బయట వదిలి వెడతాం. జోళ్ళకు మలినం ఉంటుంది. కాబట్టి అలా చేస్తారంటారు. జోళ్ళు వేసుకున్న వారి కాళ్ళు మలినం కాకుండా కపాడాతాయి కాబట్టి ఫరవాలేదు. మన దేశంలో కాలికి జోడు కొనుక్కునే స్తోమత కూడా ఇవ్వకపోయినా వారికి దైవభక్తీఉంది. వాళ్ళ కాళ్ళ కంటె మన జోళ్ళు మాత్రం బయట వదలాలి. చూడ్డాని కిది అర్ధంలేని విషయంగా కనబడవచ్చు. కానీ ఇందులోని పరమార్ధం ఒక్కటే _ క్రమశిక్షణ! గుడిలోకి జోడు అపవిత్రం. అది ఖచ్చితంగా పాటించవలసిందే. మండుటే౦డలో గుడికి ప్రదక్షణం చేయాల్సివస్తే కాళ్ళు కాలినా సరే, బొబ్బలేక్కినా సరే _ జోళ్ళు౦డకూడదు. ఆ విధమైన నియమమే గుడుపట్ల మన గౌరవాన్ని పెంచుతుంది జీవితంలో కూడా క్రమశిక్షణ అవసరం. శీలానికి పవిత్రతకూ లంకే పెట్టక పోతే జీవితంలో కూడా క్రమశిక్షణ ఉండదు. ప్రతి ఇల్లూ ఒక వ్యభిచారపు కొంపగా మారిపోతుంది. మామూలు సంసార జీవితం స్థభించిపోతుంది. పిల్లలపట్ల తల్లిదండ్రులను నిర్లిప్తత పెరుగుతూంది. ఎవరు పిల్లలో తెలియదు. మీరు చెప్పిన పూర్వం సామూహిక వివాహాలుండేవి. వారిని అనాగరికులని అంటారు. అందులో ఉండే ఇబ్బందులను గ్రహించి కొన్ని వేలసంవత్సరాల అనంతరం ఇప్పటి పద్దతి వచ్చింది. మీరు నాగరిక పద్దతుల నించి అనాగరిక పద్దతలను మారాలంటున్నారు. అదీ ఎందుకని _ ఒక పరమ మూర్ఖుడి ప్రాణాలు రక్షించడం కోసం! మోహన్ నా గురించి చావాలనుకుంటే నేను చాలా సంతోషిస్తాను. వాడెంత త్వరగా చచ్చిపోతే నేనంత సంతోషిస్తాను" అంది లత ఆవేశంగా.