8
ఆ రోజు రాజారావు వద్దకు ఇద్దరు మాత్రం విద్యార్ధులు వచ్చారు. అతడా రోజల్లా యిల్లు కదలలేదు చాటింపు వినలేదు. అందువల్ల ఆశ్చర్యపడ్డాడు. తన విద్యార్ధులల్లో ఒకడిని _ "ఏమోయ్ జగ్గన్నా _ మనవడు బాగా అల్లరి చేస్తున్నాడేమిటీ __ వచ్చేసరికి ఆలస్యమయింది _" అంటూ పలకరించాడతడు.
నలభైఅయిదేళ్ళ జగ్గన్న సిగ్గుపడుతూ నవ్వాడు.
"ఈ వేళి౦కెవరూ వచ్చేలా లేరే?"
"వాళ్ళెందుకోస్తారండీ __ ప్రెసిడెంటుగారి స్కూలు కెళ్ళు౦టారు!" అన్నాడు రామన్న.
"ప్రెసిడెంటు గారి స్కూలేమిటి?"
"చాటింపు మీరు వినలేదా?" అంటూ జగన్న వివరాలు చెప్పాడు.
రమాకాంతమిలా ఎందుకు చేశాడో రాజారావు కర్ధంకాలేదు. మొదట్లో తానాయన్నడిగే యిది ప్రారంభించాడు. అప్పుడాయన అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు నలుగురూ తన దగ్గరకు వచ్చి నేర్చుకోవడం ప్రారంభించేసరికి _ అయన తనకు పోటీగా మరో స్కూలెందుకు పెట్టాడు? ఆయనకు యనమేఅ సదభిప్రాయం లేదా?
"సరే _ మగాళ్ళ మాట అటుంచు. ఆడాళ్ళు కూడా ఎవరూ రాలేదు ....."
"తాము రాకుండా _ పెళ్ళాల్ని పంపిస్తే ఏం బాగుంటు౦దని మానిపించేస్తూంరండి. అయినా కొత్తొక వింత కదండీ __ ఏమిటో చూద్దామని వెళ్ళు౦టారు. రేపట్నుంచి మళ్ళీ అంతా ఇక్కడికే వస్తారు!"
"ఛా _ ఇందులో పోటీ ఏమిటి రామన్నా! వాళ్ళక్కావలసింది చదువు అది చెప్పే గురువుకాదు. నా బాధేమీటంటే' ఈ రెండు నేలల్లోనూ నేను రోజూవచ్చే మీ అరవైమందినీ బాగా అర్ధంచేసుకున్నాను. ఎవరికేలా చెబితే అర్ధం చేసుకున్నారో గ్రహించాను . ఇప్పుడా శ్రమంతా వ్యర్ధమైపోయింది. మళ్ళీ కొత్తగా ఆ కుర్రాళ్ళేవరో పాఠాలు మొదలేడితే __ ఒకరికొకరు అర్ధంకావడానికి మళ్ళీ యింకో రెండు నెలలు పడుతుంది. అంతా వృధా శ్రమ కదూ!"
"అవుననుకోండి. వాళ్ళ కంతాలోచనేది?"
"సరే __ ఈ వేల్టికింక పాఠాలోద్దు. రేపు నేనీ విషయం ప్రెసిడెంటుగారితో మాట్లాడతాను_" అన్నాడు రాజారావు.
జగ్గన్న, రామన్న వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే వసంత వచ్చి __ "పాప పడుకుందండీ _ ఇక మనం కూడా పడుకుందామా __" అంది.
"కాసేపిక్కడకూర్చుని కబుర్లు చెప్పుకుందాం __" అన్నాడు రాజారావు.
"కబుర్లు పడుకునే చెప్పుకోవచ్చుగా __" అంది వసంత.
"అదికాదు. అలా కూర్చో __" అన్నాడు రాజారావు అతడు తను విన్న విశేషాలు చెప్పగానే వసంత ఫక్కుమని నవ్వింది.
"మనకేమీ తోచక సరదాగా బోలెడు దొడ్డి ఉంది గదా. కూరగాయల మొక్కలు వేశాం రోజూ కష్టపడి వాటి గురించి తోటపని చేస్తున్నాం. రేపోవేళ అవి కేజీల కొద్దీ కూరలు కాసినా వాళ్ళకూ, వీళ్ళకూ పంచిపెట్టడం తప్ప మరో ప్రయోజనం లేదు. అదే వ్యాపారస్థడకయితే _ ఎంత లాభం? ప్రతి కాయా తూచి తూచి అమ్ముకుంటాడు. కూరలు బాగా కాయని మొక్కలకు ఎరువుకూడా వేస్తాడు. మీకూ, రమాకాంతంగారికీ కూడా అదే తేడా __" అంది వసంత.
"రాజారావు సాలోచనగా భార్యవంక చూసి __"చదువు చెప్పడం ద్వారా ఊళ్ళో నా పలుకుబడి పెరిగిందంటావా?" అనడిగాడు.
"అ సంగతి వేరే చెప్పాలా?"
"అయితే __ అయితే ..." రాజరాజావొక్క క్షణం తడబడి __"నేను మాత్రం వ్యాపారస్థుణ్నెందుక్కాకూడదు?" అన్నాడు.
వసంత ఏదో అనబోయింది. కానీ ఆమె మాట్లాడేలోగానే ఎవరో తలుపు తట్టారు. రాజారావు లేచివెళ్ళి తలుపు తీశాడు.
బయట నిలబడ్డ వ్యక్తి జగ్గారావు.
"నా యీ రాక మీ అయిద్దరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందనుకుంటాను ....." అన్నాడతడు లోనికి వచ్చి.
"లేదు __ అనుమానాన్ని కలిగిస్తోంది __" అన్నాడు రాజారావు గంభీరంగా.
జగ్గారావు తడపడ్డాడు __ "ఎందుకని?"
"ఇది మిమ్మల్ని రెండోసారి చూడడం రెండుసార్లూ ఇదే సమయంలో మీరు మా యింటికొచ్చారు. మళ్ళీ అప్పటిలాగే ఓపూట ఆశ్రయానికా?" అన్నాడు రాజారావు.
"ఈసారి పూట కాదు, జస్ట్ ఫిప్తీన్ మినిట్స్ ......" అని వసంతవైపు తిరిగి __"అక్కయ్యగారికి టీ కలిసి తేవడానికి పావుగంట పట్టదనుకుంటాను __" అన్నాడు.
అతడి చనువుకు ముగ్దురాలవుతూ వసంత లోపలకు వెళ్ళిపోయింది.
"ఆ మర్నాడుదయం ప్రెసిడెంటుగార్ని కలుస్తానన్నారు. ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్నీ వూళ్ళో చూడలేదు. ఇంతకీ మీ ఉద్యోగం సంగతేమయింది ?" అన్నాడు రాజారావు.
"ఉద్యోగాలంత సులభంగా లేవండీ __ ప్రతిదానికీ డబ్బు, పలుకుబడి కావాలి. రెండూ లేవు నాకు ....." అన్నాడు జగ్గారావు నిట్టూర్చి.
"అయితే ప్రస్తుతం ఏం చేస్తున్నారు?"
"ఏమీలేదు , ఖాళీ, కానీ నిరుద్యోగసమస్యను పరిష్కరించడానికో ఉపాయం కనిపెట్టారు. అది ప్రభుత్వానికి నచ్చదు. నేనే అమలుచేస్తాను....."
"ఏమిటది?" అన్నాడు రాజారావు కుతూహలంగా .
"అమ్మో _ అది దేవరహస్యం. చెబితే నా తల వేయివ్రక్కలు కాదూ?" హాస్యంగా మాట్లాడ్డానికి తాపత్రయ పడుతూ జగ్గారావాలా అనేసరికి మూడు టీలు కలిపి తీసుకొచ్చింది వసంత.
"పావుగంట కానీ అయిపోలేదు కదా __" అంటూ నవ్విందామె.
"పావుగంట దాటగానే, వెళ్ళిపోవాలని గుర్తుచేస్తున్నా రనుకుంటాను. అవతల నాకు చాలా వ్యవహారాలునాయి. మీరూండమన్నా ఉండను __" అంటూ టీ అందుకున్నాడు జగ్గారావు.
" నిరుద్యోగినంటూ వ్యవహారాలంటూ రేమిటీ?" రాజారావు ఓసారి టీ చప్పరించి అడిగాడు.
జగ్గారావు బదిలివ్వకుండా టీ తాగసాగాడు. కాసేపు మౌనం ఆ గదిలో రాజ్యమెలింది.
టీ తాగడమయ్యాక జగ్గారావు తన జేబులోంచి ఓ కవరు తీసి రాజారావు కందించి __"మీరు శ్రమ అనుకోకుండా ఈ కవరు రేవు రమాకాంతంగారికి అందజేయాలి. ఈ వేళ కలుసుకు౦దామంటే నాకు సమయం చిక్కలేదు. ఇప్పుడాయన నిద్రపోయే సమయం __" అంటూనే అతడు వాచీ చూసుకుని__"మరి నాకు సెలవిప్పండి __"అ అంటూ లేచాడు.