Previous Page Next Page 
విరాజి పేజి 14

   

    బంగారయ్య రెండోకూతురు ఓ చాపమీద పడుకో పెట్టబడి వుంది. చూసీ చూడగానే అతనికి జరిగింది అర్ధమయింది.

    ఆమె ఉరేసుకుని చచ్చిపోయింది. ఇంట్లోనివారంతా గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. బంగారయ్యా ఓ మూల కూర్చుని రెండు హేతుల్లో మోహందాచుకుని కుమిలికుమిలి ఏడుస్తున్నాడు.

    గౌతమ్ ఓ గంటసేపటిదాకా వికలమైన మనస్సుతో అక్కడే నిలబడి ఉన్నాడు.

    పద్మ __ ఇంట్లోని వసంతా ఆ అమ్మాయే చేసేది. ప్రొద్దుట అయిదు గంటలనుంచీ రాత్రి పదిగంటలకో పడుకునేవరకూ ఒక్కక్షణం వూరికనే కూర్చున్నట్లు కనబడేది కాదు. చలాకీగా ఏదో ఒక పనిచేస్తూ కనిపించేది

    అటువంటిది ......

    ఇహా నిలబడలేక గదికివొచ్చి తలుపులుతీసి చాపమీద కాసేపు నడుంవాద్దామని మళ్ళీ లైటు తీయబోతుండగా టేబుల్ మీద ఓ పుస్తకంక్రింద మడిచివున్న కాగితం కనిపించింది. దాన్నక్కడ అంతకుముందు చూసినట్లు గుర్తులేదు. తీసిచూశాడు.

    'గౌతమ్ గారూ!

    మీరో రచయిత అని తెలుసు. అందుకని ఆఖరి క్షణాలలో మీకు రాయాలనిపించి ఈ ఉత్తరం రాస్తున్నాను.

    కష్టపడటానికి నాకు అభ్యంతరం లేదు నాది కలలుగనే స్వభావం కూడా కాదు.

    మనిషి పేదరికంలో ఉన్నా, మధ్యతరగతి వాడయినా, సంపన్నుడయినా ఏదో ఒకరూపంలో కష్టాలు లేకపోతె అశాంతి వేన్నాడుతూనే ఉంటుందన్న సత్యం నాకుతెలుసు.

    కాని ....

    జీవితానికి ఓ సంపూర్ణతత్వం కోరుకోవడంలో తప్పులేదుకదా.

    అదీ వొదిలేద్దాం.

    తనదికాని జీవితాన్ని చివరిదాకా మేయ్యటం మనిషికి మాత్రం చాలా కష్టం.

    విశాఖపట్నం అక్కయ్యకు సుస్తీగా ఉన్నదంటే సపర్యలు చెయ్యటానికి నేను వెళ్ళాను. నన్ను చూసినప్పట్నుంచీ బావ కదలికల్లో రెపరెపలు కళ్ళలో సెగలు తెలుస్తూనే ఉన్నాయి.

    ఎందుకోచ్చినా అనిపించింది.

    తప్పించుకు తిరుగుతూనే వున్నాను. ఎంత కల్పించుకుని మాట్లాడుతున్నా. వెంటబడుతూ కవ్విస్తున్నా దూరదూరంగా తప్పుకుంటూనే ఉన్నాను. కాని అక్కయ్యకు బ్లీడింగ్ ఎక్కువై హాస్పటల్ లో చేర్చినప్పుడు అతనిలో పురుషత్వం పరులు విప్పినప్పుడు , అవకాశం బుసలు కొట్టడానికి సాయపడినప్పుడు ప్రతిఘటించినా, ప్రాధేయపడినా, నిస్సహాయంగా కన్నీళ్ళు పెట్టుకున్నా ఆ కఠోర హృదయం కరగనప్పుడు చివర లొంగిపోయాను.

    ఒకసారి లొంగిపోయాక చేకూరి డిస్టార్జి అయివోచ్చేశాక యింటికి వొచ్చేశాను.

    నాకు నేలతప్పింది.

    అసలే మా కుటుంబం కష్టాల్లో వుంది. నా బరువే మోయలేక పోతోంది ఇహా ఈ కొత్తసమస్యను కూడా ఎలా భరిస్తుంది?

    అమ్మకి ఈ విషయం తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటుంది నాన్నకి తెలిస్తే లం .... అని తిట్టి కత్తితో పొడిచి చంపేస్తారు.

    నిస్సహయస్థితిలో ఎను చేసినప్పుడు దాన్ని సరిదిద్ది తిరిగి నా జీవితాన్ని సరిపెట్టే ప్రయత్నం ఎవ్వరూ చెయ్యరు. నన్ను నిలబెట్టడానికి ఎవరూ ముందుకురారు.

    ఈ ప్రపంచం దృష్టిలో నాడి చాలా చిన్న అతి సామాస్య సమస్య. కాని నాకది ఉరితాడు తప్ప వేరే శరణ్యంలేని సమస్య.

    అందుకే ఉరితాడు బిగించుకుంటున్నాను.

    గౌతమ్ గారూ !

    మీరు రచయితా. మీ రచనల్లో వాస్తవికత ఉంటుంది. సామాన్యతలోంచి అసామన్యాన్ని సృష్టించడానికి రచయితకు ఓ ప్రత్యెక దృష్టి ఉండాలి.

    అసాధారణ విషయాలుచిత్రించి పాఠకులాని ఎక్కడికో తీసుకెళ్ళడం కన్న సాధారణమైన సంఘటనలోని విషాదాన్ని చిలికించగలిగినప్పుడు ఓ రచయిత జన్మ సార్ధకం రాగలదు. మీరంటే నాకు గౌరవం. అందుకే నా స్వగతాన్ని మీముందు ఉంచుతున్నాను. యిందులోంచి ఏమన్నా దొరికితే ఎరుకోండి. లేకపోతె అందరిలా మరచిపోయి మామోలుగా వుండిపొండి.

                                                                                                                          ___ పద్మ

    అతని కంటిలోంచి ఓ కన్నీటిచుక్క రాలి టఫ్ మని ఆ ఉత్తరంమీద పడింది.

                                                        *    *    *    *   

    ఒక్కో సంఘటన ఆ సంఘటన ఎలాంటిదయినా కానీ, దానికీ పరిస్థితులకీ సంబంధం ఉండనీ ఉండకపోనీ __ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఆ ప్రభావం వ్యక్తిమీద ప్రసరించి కొత్త యిన్స్పిరేషన్ యిస్తూ వుంటుంది. అందులో ఆ మనిషి సెన్సిటివ్ అయితే మరీనూ.

    పద్మ మరణం తర్వాత గౌతమ్ లో ఏదో అలజడి సంఘర్షణ మొదలయింది.

    ఈ ప్రపంచంలో ఎవరిదార్న వాళ్ళు బ్రతుకుదామని ఎంత నిజాయితీగా ప్రవర్తించినా _ తోటి మనిషి సాగనివ్వకుండా, తమ జీవితాల్లోకి దూసుకొచ్చి అడుగడుగునా ఏదో విలయాన్ని సృష్టిస్తూనే ఉంటాడు. ఆలోచనా సరలినీ , బ్రతకటానికి ఎన్నుకున్న మార్గాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.

    ఒక మనిషీమీద యింకొక మనిషి ప్రభావం అంత విచిత్రంగా ఉంటుంది.

    ఏ వ్యక్తీ తాను స్వీకరించిన రంగమెదయినా సరే కృషి లేకుండా పైకి రాడు. సాధననిరంతర అంతరంగ మధనం _ అతన్ని ఒక్కొక్క అంగుళం చొప్పున ముందుకు నెడుతూ వుంటాయి.

    ఆ కాస్త కాస్త దూరం కోసం వేసే అడుగులే జాగ్రత్తగా వేస్తూ వుండాలి.

    కళాకారుడు తాను ఎన్నుకొన్న పదంలో ఎంతటి విజయాన్నయినా సాధించనీ _ ఓ రకం విషాదం అజ్ఞతంగా అంతర్వాహనిలా ప్రవహిస్తూ వుంటుంది. సుఖంలోనే ఏదో దుఃఖం ఆనందపారవశ్యంలో ఓ బాధ అనుభవిస్తూ వుంటాడు.

    మధ్య మధ్య విశ్రాంతి తీసుకునే గూటిలోకి పోయినట్టుగా _ వెళ్ళిపోతూ వుంటాడు. ఆ విశ్రాంతిలో మనశ్శాంతి వుండను. ఏదో తప్పుచేస్తున్నానన్న భావన, కాలాన్ని మంచో చెడో నిర్ణయించుకోలేని సంఘర్షణ _ యివన్నీ కలసి చివరకు ఓ తపస్సులా రూపొందుతాయి.

    ఈ దశలో ఏపనీ చెయ్యాలనిపించదు. అది ఓ రకం సుషుప్తావస్థ.

    ఓ కళలో పైకి రావాలంటే మొదట దానిమీద గౌరవం వుండాలి. దానికోసం మిగతా ప్రపంచాన్ని త్యాగం చేసుకునే అంతటి "పిచ్చి" వుండాలి. చాలా సందర్భాలలో యీ పిచ్చి చాలా ఆరోగ్యకరం.

                                                                *    *    *   

    గౌతం దృష్టి చదువుమీద మళ్ళింది. లైబ్రరీకు వెళ్ళి తనకిష్టమైన పుస్తకాలను ఏరి తెచ్చుకుని ఎకదీక్షతో చదవసాగాడు.

    అతనికాశ్యర్యంగా వుంది. విజ్ఞానం యింత పోరోగామించినా, మునపటికన్న ఇప్పుడు సాఘికంగా ఎన్నో సదుపాయలున్నారచయిత లెందుకు విజ్రూభించలేకపోతున్నారు?

    అప్పుడు చదువుకునేందుకు ఇన్ని వసతులులేవు, ఇన్ని విశ్వవిద్యాలయాలు లేవు. క్షణాలమీద కావాల్సింది అందించే ఆధునిక పరికరాలు లేవు అయినా బాషమీద అధికారం , పాత్రల చిత్రణలో వైవిధ్యం ఇతివృత్తాలలో సంపూర్ణత్వం ఎలా సాధించగలిగారు?

    ఎన్నివేల సంవత్సరాల క్రిందటోరాయబడిరామాయణం, భారతం, ఇప్పటికీ విద్యావంతుల్లో , నిరక్షరాస్యుల్లో కూడా నలుగుతూ ఆ పాత్రలు ఇంటింటి పాత్రలై , ఆ గ్రంధాలకు ఎన్నో రూపాలు, ప్రతి రూపాలు, వాటిమీద మేధావుల , విద్యావంతుల పరిశోధన, నిశితమైన విమర్శ వ్యతిరేఖంగా ఎన్నో గ్రంధాలు.

    ఇంతటి ప్రభావం కలిగివున్నాయంటే యీ ఆధునిక యుగంలో కూడా అవి పరిపాలిస్తున్నాయంటే వాటిశక్తి కి ఎంత అనంతరం.

    ఈ నాటి రచయిత సృష్టించిన పాత్రలు ప్రజల్లో ఎంత పలికుబడి కలిగివుంటున్నాయి. ఆ పుస్తకాలు ఎన్ని సంవత్సరాలు నిలబడుతున్నాయి.

    ఈకాలం పాప్యూలర్ రచయితలు రాసిన నవల పదివేల కాఫీలు అమ్ముడయితే ( విద్య యింతగా వ్యాపించిన యీ  రోజుల్లో ) అదో మహత్తర మైనా ఘనకార్యంగా ప్రకటించుకున్నారు. అదో సంచలనంగా పభ్లిసిటీ యిస్తున్నారు.

    మరి యుగాలవెనక రాయబడి, లెక్కకు అందినన్ని సార్లు పునర్ముద్రణ పొంది, దేశావ్యాప్తంగా, అంతర్జాతీయంగా భాషలకు అతీతంగా నిలబడి వందల, వేలసంవత్సరాలు ప్రజల నరాలలోకి చొచ్చుకుపోయే రచనలు చేసిన కవి ఎంత శక్తి మంతుడై ఉంటాడు?

    వంద పేజీలపుస్తకంలో కాసిని కవితజల్లి ఆదిమహాకావ్యమంటున్నాం.

 Previous Page Next Page