"సినిమాలంటే నాకు కోపంలేదు. కళాత్మకమైన విలువలు లేని సినిమాలంటే , కేవలం వ్యాపార దృష్టితో తీసే సినిమాలంటే అసహ్యం. సినిమాలను ఓ కళాతపస్సుగా ఎంచి, దానికోసం జీవితమంతా ధారపోసిన వాళ్ళ౦టే నాకు గౌరవమే శాంతారాం, బి. మంచ్ రాయ్, సత్య జిత్ రే మృణాళ్ సేన్ వీళ్ళ గొప్పతనాన్ని కాదనలేదు."
ఎందుకంటే ఆలోచన వచ్చిందోగాని గౌతమ్ వున్నట్లుండి ఆడిగాడు. "ఒకవేళ అకోవకు చెందినవారు ఎప్పుడయినా తారసపడి మిమ్మల్ని సినిమాలలో నటించమని అడిగితె వొప్పుకుంటారా?" అనడిగేశాడు.
విరాజి అతని ముఖంలోనికి కొంచెం ఆశ్చర్యంగా చూసి నవ్వి, "ఎందుకలా అడిగారూ ?" అన్నది.
"కొన్ని ప్రశ్నలు అలా అడగాలనిపిస్తూ వుంటాయి. చెప్పండి అవకాశమేస్తే వేస్తారా?"
"నన్నెవరు తీసుకుంటారు గౌతమ్?"
"ఏం మీకేం తక్కువ? మీలోవున్న విచిత్రాకర్షణ ఎంతమందిలో వుంటుంది?" అనాలానుకున్నాడు. కాని నోటిదాకా వచ్చిన ఊహను కష్టం మీద అణుచుకున్నాడు.
"ఊ?"
విరాజి నవ్వేసింది. "అలా జరిగితే .... అప్పుడు చూద్దాంలే" __ అంది.
భోజనాలు చెయ్యడం పూర్తయింది.
గౌతమ్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
తినేసి కడుక్కుని వచ్చి మంచం మీద కూర్చుంది.
"ఫిప్టీ ఫిప్టీ " అని ఆమె అన్నా అతనికి కాదుపునిండింది. బాధ్హకంగా కూడా వుంది.
ఏ వర్షం లాంటిదోవచ్చి యీ రాత్రికి కిక్కడ వుండి పోగలిగితే _ అంతదూరం నడిచిపోయే అవస్థ తప్పుతుంది కదా అన్న ఆలోచన మనసులో ప్రవేశించింది.
"మీ కుర్రాళ్ళు నిద్ర పట్టక పొతే ఏం చేస్తారు?"
"ఒంటరిగా __ యిదిగో యిలా దేయ్యంలా కూర్చుని ఆలోచిస్తూ వుంటారు" అని విరాజీ గల గలమని నవ్వి "నా కెందుకో నువ్వు మంచి రచయితవి కాగలవని అనిపిస్తూ వుంది" గౌతమ్ .
"ఎందుకని?"
"ఇలా సిల్లీగా ఆలోచిస్తుంటావు కాబట్టి"
గౌతమ్ కూడా నవ్వేశాడు. కొంచంమాగి అన్నాడు. "నేను మంచి రచయితను కానేమోనని న అనుమానం."
"ఏం?"
"ఏ సమస్య తీసుకొందామన్నా జీవితానుభవము చాలదనిపిస్తుంది. ఆస లేసమస్య తీసుకోవాలా అని కంగారు కంగారుగా వుంటుంది. ఏదన్నా కొత్త యితివృత్తం మొదలు పెట్టాలంటే చెయ్యి వణుకుతూ వుంటుంది. ఆత్మ విశ్వాసం చెదిరిపోతూ వుంటుంది."
"ఇవన్నీ మంచి రచయిత లక్షణాలు. మిటిమీరిన ఆత్మ విశ్వాసం కన్న ఆత్మ విమర్శ ఎంతో ఆరోగ్యంకరం. మనకేమీ తెలియదన్న అందోళన నుంచే మేధస్సు పుట్టుకు వస్తుంది. కాని నీవు చెప్పిన మొదటి విషయం రచయితతకు ముఖ్యంగా కావలసింది జీవితానుభవం కాదు. జీవిత పరిశీలన మన చుట్టూ ఎన్నో రకాల జీవితాలు విచిత్ర, విపరీత మనస్తత్వాలు ప్రపంచంలో కొన్ని కోట్లమంది మనుషులున్నా ఒకరి ముఖ కవళికలకూ యింకొకరి ముఖ కవళికలకూ సంబంధము లేనట్టే _ శైలిలో జీవన సరళిలో . ప్రవర్తనలో ఎంతో భిన్నత్వము వుంటుంది.
బ్రతకటానికి మనిషి ఎదుర్కోంటోన్న సంఘర్షణ; రూపు రేఖలు నిర్మించుకోలేక అనుక్షణము అతనుపడే యాతన, ప్రపంచాన్ని డబ్బు ఆడించే విచిత్రలీల మేధావులు , విద్యావంతులూ, అర్హతవున్న వారు నిరంతరము ఆర్ధికయిబ్బందులకు గురవుతూనే వుంటారు. అక్షర జ్ఞానం లేకపోయినా గడుసుతనము, కుటిలత్వము తెలసిన వారు. లేక క్రూరంగా వుండగలిగినవారు జీవిత సుఖాలను అనుభవిస్తూ వుంటారు. దీనికి వ్యాపార దక్షత అని పేరు పెడతారు. ముక్కు సూటిగా పోవడం, నిర్మలముగా వుండడము యీ రోజుల్లో బలహీనంగా పరిగణించ బడుతున్నాయి. ఇక్కడ ఇంకో విషయంకూడా గమనించాలి గౌతమ్ , సాహిత్యం నుంచి కొన్ని ముద్రలు చేరిగిపోవాలి మనము ఏది రాసినా ఏది అలోచించినా విశ్వజనీ సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి. తమ పరుధులని దృష్టిలో పెట్టుకుని మార్గము వెదుక్కోకూడదు. ఆడవాళ్ళ౦తా సంఘంవికృత హస్తాలలో నలిగిపోతున్న అభాగినులు; మొగవాళ్ళ౦తా రాక్షసులు. పేదవారంతా కన్నీటి నిలయాలు ధనికులంతా దుర్మార్గులు __ యీ ఆలోచనా పరిధి నుంచి వచ్చిందే ఉత్తమ సాహిత్యం అనే భ్రమ తొలగి పోవాలి. మనం గ్రుడ్డిగా అనుసరించిన కొన్ని కొన్ని యిజాలకు కాలదోషము పట్టింది గౌతమ్ మనిషిని __ వీతిగి అతీతమైన దృష్టితో పరిశీలించి ఏ యిజానికీ అందని లోతులని వెలికితీసి వాటికి సాహిత్య రూపము ఇవ్వగలిగినవారు నిజమయిన సాహితీ వేత్తడ అవుతాడు. నా నాస్తికుడు నాస్తికత్వపు మూర్ఖత్వము నుంచీ ఆస్తికుడు ఆస్తికత్వపు అజ్ఞానం నుంచీ హేతువేద రంద్రాన్వేషణ ళ అతిశయమునుంచీ బయట పడకపోతే _ మనకేడురుగా వున్న వెలుగు ఎలా దర్శన మివ్వదావు నిజాన్ని మభ్యపరిచే భేదభావాల నుంచి రచయిత విముక్తి పొందకపోతే ఏనాటికీ అతను ఉత్తమశ్రేణికి చేరుకోజాలడు.
గౌతమ్ కు ఆశ్చర్యంగా వుంది. ఆ చాలీచాలని కాంతిలో ఆమె ముఖం ! కదిలే కన్నులు .... వింతరంగుతో ప్రకాశిస్తున్నాయి. ఆ క్షణంలో అతడామేను చాలా ఆరాధి౦చాడు.
ఎవరీ స్రీ? ఇంతగొప్పగా, అధ్బుతంగా తన జీవితంలోకి ఎలా దూసుకుని వచ్చింది.
ఒక్కొక్కరిని చూస్తుంటే, ఒక్కొక్కరిని కలుసుకొన్నాక మనకు తెలియని అపురూప ప్రపంచము యింకా ఎంత వున్నదో, యింత కాలము నుంచి ఎంత పోగొట్టున్నాయోతెలసి వస్తుంది.
"ఏమిటలా చూస్తున్నావు గౌతమ్?"
"ఊ?"
"ఏమిటలా చూస్తుండిపోయావు?"
"నీ ...."
"ఊ?"
"నీ ...."
"నీకు నిద్ర వస్తున్నట్టుంది గౌతమ్"
"టైమెంతయి వుంటుంది?"
"అయ్యో? యిద్దరి చేతులకి వాచీలు లేవు పది దాటి వుంటుంది."
"చాలా సేపయింది. ఇహా వెడతాను" అంటూ గౌతమ్ లేచాడు.
"ఉండు . నేను మెయిన్ రోడ్డు దాకా వచ్చి దిగాబెడతాను" అంటూ విరాజికూడా లేచి నిలబడింది.
"మెయిన్ రోడ్డు అంటే దాదాపు ఫర్లాంగు దూరం. ఇంతదూరం మళ్ళీ నువ్వు తిరిగి రావద్దు?"
"ఏమీ ఫర్వాలేదు . నన్నేవరేం చేస్తారు రా" అంటూ అతనితోబాటు యింటిలో బయటకు వొచ్చి తలుపులు దగ్గరగా వేసింది. ఇద్దరూ నడవసాగారు.
ఆ ప్రాతంలో దాదాపు అంతా దిగువ తరగతికి చెందినవాడే. అప్పటికే చాలామంది నిద్రలోకి జారుకున్నట్టున్నారు. ఎక్కటుచడీ, చప్పుడూ లేదు. అక్కడక్కడా మాత్రం ఓ దీపం మిణుకుమిణుకు మంటోంది. బహుశా తాము అనుకున్న దానికంటే టైము ఎక్కువగానే అయివుంటుంది.
మధ్యలో ఓ సందు వచ్చింది. స్ట్రీట్ లైట్ కూడా లేకపోవడంవల్ల చాలా చీకటిగా వుంది.
విరాజి అతని దగ్గరకు జరిగి చేతిలోకి చెయ్యి తీసుకుంది. అ స్పర్శలో ఆప్యాయత , మమత, అనురాగంలాంటి ఎన్నో మధురిమలు పొంది అతను పులకించాడు. ఆ చెయ్యి అలా పట్టుకుని ఎంతోదూరం ఎంతదూరమైనా సరే ప్రయాణంచేయలన్న కోరిక కలిగింది. అలా కొన్నిక్షణాలు .... సందుదాటి మెయిన్ రోడ్డు మీదికి వచ్చాక ఆమె చెయ్యి వొదిలేసింది."
అతనికి ఎక్కడలేని నీరసం ఆవహింహినట్లయింది.
"ఇప్పుడు చాలా దూరం నడవాలి" అన్నాడు దుగులుగా.
"పోనీ అక్కడే విశ్రాంతితీసుకుని పొద్దుటే వెళ్ళిపోయేవారుగా "
"ఊ"
"అక్కడే...."
"ఆ మాటలు యిందాక చెప్పకపోయారా? అనుకున్నాడు.
"వస్తాను అంటూ కదిలాడు.
అతను కనుచూపు మరుగాయేవరకూ అక్కడే నిలబడి, తర్వాత వెనక్కీ తిరిగింది విరాజి.
5
గాడికి చేరేసరికి పెద్ద పెట్టున ఏడుపులు వినిపిస్తున్నాయి. అతని గుండె గబా గబా కొట్టుకుంది.
ఏం జరిగింది ?
గబగబ యింట్లోకి వెళ్ళాడు.