Home » Yandamuri veerendranath » మంచు పర్వతం

  

        "ఆలోచించు రాధా! ప్రాక్టికల్ గా సాధ్యంకాదని భయపడుతున్నావేమో? మనలో ఆత్మవిశ్వాసం వుంటే సాధ్యంకాని దేదీలేదు. ఈ రోజుల్లో యిది వింత విషయం కాదు".
   
    "ఒక వేళ నేను 'కాదు' అంటే....?"
   
    "దేవదాసునయితే అనను. పెళ్ళి చేసుకోవాలి గాబట్టి మావాళ్ళు చెప్పినమ్మాయినే చేసుకుంటాను నువ్వు కాదన్నప్పుడు ఎవరైనా ఒకటే జీవితంలో నేను ఆశించిన సంతోషాన్ని పొందలేదు అనికూడా అనను. ఆ అమ్మాయితో రాజీ పడటానికి ప్రయత్నిస్తాను".
   
    "నాకు ఆలోచించడానికి కొంత వ్యవధి కావాలి".
   
    "తప్పకుండా నీ నుంచి జవాబు వచ్చాకే నా భవిష్యత్తు నిర్ణయించుకుంటాను". రాధ లేచి నిలబడింది.
   
    "రాధా!" మార్దవంగా పిలిచాడతను. "స్త్రీ పురుషులు శరీరాన్ని ఏకం చేసుకునేది సుఖాన్ని అనుభవించడానికే అయితే ఆ కలయిక అణువణువునా ఏకం కావాలని వుంది. అది శారీరక వాంఛ కాదు. మానసికంగా మనిద్దరం ఏకం కావాలి. నీమీద నాకున్న ప్రేమను, మాటల్లో చెప్పలేని భావాన్ని నీకు నా స్పర్శలో అందించాలని వుంది. నాది కోరిక కాదు. కోరికయితే ఒకసారితో తీరిపోతుంది. నాకు నువ్వు కావాలి. ముఫ్ఫయి సంవత్సరాలు నువ్వెవరివో తెలియకుండా పెరిగాను. మిగిలిన జీవితం నీకు తోడుగా జీవించాలి".
   
    "రెండు రోజుల్లో కలుస్తాను సుభాష్".
   
    "అలాగే" అతడి ముఖంలో చిరునవ్వు చెరగలేదు. దగ్గరగా వచ్చి ఆమె చేతి నందుకున్నాడు. అతడామెను స్పర్శించడం అదే మొదటిసారి. ఒకసారి ఆమెను గుండెలకు హత్తుకుని మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. నీ నిర్ణయం ప్రతికూలం అయితే ఇదే నా వీడ్కోలు అన్నట్లనిపించిందామెకు.
   
                          *    *    *
   
    అనూరాధకు నిద్రపట్టడంలేదు. మోహన్ ఇంకా ఇంటికి రాలేదు. ప్రతిరోజూ ఆలస్యంగా రావడం, తను ఏ పరిస్థితిలో వున్నా బలవంతంగా కోరిక తీర్చుకోవడం అలవాటయిపోయింది.
   
    మ్యారేజ్ ఈజ్ ఎ లీగలైజ్ డ్ ప్రాస్టిస్ట్యూషన్. పెళ్ళనేది చట్టబద్దమైన వేశ్యావృత్తి.
   
    పిల్లలిద్దరూ పడుకున్నారు. అతను ఆప్యాయంగా పలకరించకపోయినా అతడంటే ప్రేమ వాళ్ళకు. బహుశా ఆ తప్పు తనదేనేమో తమ మధ్య పొరపొచ్చాలు ఆ పసివాళ్ళకు తెలియకూడదని జాగ్రత్త పడుతూ, అతడిమీద గౌరవం తగ్గిపోకుండా కాపాడగలిగింది. ఆ విషయం కూడా వాళ్ళకు అర్ధంకాహ్డు. అత్తగారు తగని గారాబం చేస్తుంది. తప్పు చేసినప్పుడు దండించకుండా అడ్డుపడి వాళ్ళను ఆకట్టుకుంటుంది. కాని తాను లేకపోతే వాళ్ళకు సమయానికి పాలుకూడా కలిపి ఇవ్వదు.
   
    డైవర్స్ అంటే మోహన్ ఎప్పటికీ ఒప్పుకోడు. బంగారుబాతులా అయిపోయింది తను. గట్టిగా మాట్లాడితే పిల్లల గురించి గొడవచేస్తాడు. తనమీద కక్ష మాతా పిల్లలమీద చూపిస్తాడు. తన భవిష్యత్తుకోసం పిల్లల్ని బలిపెట్టగలదా? కన్నందుకు వాళ్ళకు తనవల్ల హాని కలగకుండా చూడటం తన కనీస బాధ్యత. సుభాష్ కి ఇద్దరు చెల్లెళ్ళున్నారు. తమ పెళ్ళివల్ల వాళ్ళ భవిష్యత్తు కేమయినా దెబ్బ తగిలితే? ఎవరికీ మేలు చెయ్యకపోయినా ఫర్వాలేదు. హాని మాత్రం చెయ్యకూడదు. పరోక్షంగానైనా మరొకరికి బాధ కలిగించడం మానవత్వంకాదు. సుభాష్ కీ, తనకూ ధైర్యం వుండవచ్చు కాని ఈ సంఘం ఒక పెద్ద గొలుసులాంటిది ఏ లింకు వూడిపోయినా మరొకరికి ఆధారం కరువవుతుంది. తన జీవితం సగభాగం అన్ని అనుభవాలతో గడిచిపోయింది. కాని సుభాష్ ముందున్నది బంగారు భవిష్యత్తు చూస్తూ చూస్తూ అతడినీ రొంపిలోకి లాగి బాధపెట్టడం జరగాకూడదు.
   
    "నిద్రపోకుండా నా కోసం ఎదురు చూస్తున్నావా? గుడ్" అంటూ వచ్చి మీదపడబోయాడు మోహన్. విస్కీ వాసన గుప్పుమంది.
   
    "నీ కోసం నేను ఎదురు చూస్తున్నది దీనికోసం కాదు. నీతో మాట్లాడాలి. కాస్సేపు దూరంగా కూర్చో" సీరియస్ గా అంది.
   
    "అబ్బ! ఈ రోజేమిటి మాట్లాడేది? ఇవ్వాళ నేను సంతోషంగా  వున్నాను. ఆ మూడ్ లేదు" మళ్ళీ మీదపడుతున్న అతడిని బలవంతంగా తోసేసింది.
   
    "తర్వాత నా మాట వినిపించుకునే మూడ్ వుండదు".
   
    "సర్లే, ఏమిటో త్వరగా చెప్పు" జేబులో డబ్బుతీసి లెక్క పెట్టుకుంటూ అడిగాడు. అదీ సంగతి పేకాటలో డబ్బు వచ్చిందీరోజు.
   
    రాధ అతడి మొహంలోకి చూసింది పరిశీలనగా.
   
    ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటే హృదయం గర్వంతో ఉప్పొంగాలి. నాలో ఏం వుందని ఇతడికి నేనంటే ప్రేమ? అన్న ఆలోచన రావాలి. కృతజ్ఞతతో అతడిమీద ప్రేమ రెట్టింపవ్వాలి కాని, ఇతడినా నేను ప్రేమించింది? అంత పొరపాటు ఎలా చేయగలిగాను? అన్న ప్రశ్నలు మనసులో మెదిలే స్థితికి ప్రేమికుడు రానిచ్చినప్పుడు అంతకంటే దౌర్భాగ్యం మరొకటుండదు.
   
    "ఏంటా ఆలోచన? విషయమేమిటో త్వరగా చెప్పు. నాకు నిద్ర వస్తోంది" విసుక్కున్నాడు మోహన్.
   
    "నాకు ఇచ్చిన స్థలంలో చిన్న ఇల్లు కట్టుకుందామనుకుంటున్నాను లోన్ కోసం అప్లయ్ చేశాను. కాని ఆ ఒక్క లోన్ తో పనికాదు. నగలు అమ్మేస్తాను. వేరే అప్పులూ తీసుకుంటాను".
   
    "అయితే నన్నేం చేయమంటావ్?"
   
    "నేను నిన్ను డబ్బులు అడగడంలేదు. కొన్నాళ్ళవరకూ నా జీతం ఇంట్లోకి ఖర్చుపెట్టడం కుదరదు అని చెపుతున్నాను".
   
    "బాగానే వుంది. బాధ్యతలన్నీ పంచుకుంటానని అందరితో గొప్పగా చెప్పుకున్నావు. త్వరలో నా చెల్లెళ్ళిద్దరూ పురిటికీ వస్తారు. అదేగా నువ్వనుకుంటున్న ఖర్చు? నా తిప్పలేవో నేను పడతాలే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో నీ డబ్బుమాత్రం అడగను సరేనా?" కోపంగా అన్నాడతడు.
   
    పెళ్ళయి అయిదేళ్ళు దాటిపోయినా అతడి చెల్లెళ్ళింకా కొత్త పెళ్ళికూతుర్లే ప్రతి పండగకూ వాళ్ళ కోసం ఏదన్నా పంపాల్సిందే. తమ్ముళ్ళకే అవసరం వచ్చినా ఆదుకోవాల్సిందే.
   
    "ఇంతవరకు వాళ్ళకు చెయ్యగలిగిందంతా చేశాం. మన పిల్లల కోసం ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చిందిప్పుడు".
   
    "అవునవును కన్నావుగా ఇద్దరు ఆడపిల్లల్ని ఇప్పటినుండే కూడబెట్టుకో పదే పదే నన్నంటావు. మీ నాన్న చేసింది అదే పనిగా? ఓ స్థలం కొని మొహాన కొట్టాడుగాని ఓ చిన్న ఇల్లయినా కట్టించి ఇచ్చాడా? ఇప్పటికయినా బుద్ది వచ్చిందా అంటే అదీలేదు. ఇప్పటికీ వాళ్ళకోసమే సంపాదిస్తున్నాడు".
   
    "మా నాన్న ఏం చేసినా తన స్వయంకృషితో సంపాదించిణ డబ్బు అది. దాని గురించి అడిగే అర్హత మీకు లేదు. మరొకరి కష్టార్జితాన్ని దానంచేసే గొప్పవాడు కాడాయన".
   
    "ఓహో! అంతవరకు వచ్చిందా వ్యవహారం? 'నా జీతం నా ఇష్టం నువ్వెవడివి అడగటానికీ?' అంటున్నావన్నమాట".

    "నువ్వు ఎలాగయినా అనుకో మోహన్. మనకంటూ ఓ స్వంత ఇల్లు అవసరం. దానికోసం ఎంతయినా కష్టపడతాను. కాని ఒక్క విషయం ఆ ఇంట్లో నువ్వూ, నేనూ, మన పిల్లలూ మాత్రమే వుండాలి. మరెవరైనా వచ్చి రెండు రోజులుండి వెళ్లిపోవాలి. అంతే! మీ అమ్మగారయినా సరే!"

    "అదే అల్టిమేటమ్ అయితే నేనూ ఆ యింటికి రాను. నా వాళ్ళను వదులుకుని రావలసిన అవసరం లేదు నాకు".
   
    "అదే నిర్ణయం అయితే అలాగే కానీ! నా పిల్లల నెలాగో పోషించుకోగలను. కాని నా నిర్ణయం మారదు. నీ బెదిరింపులకు ఇక లొంగను".
   
    "పిల్లలమీద నీకెంత హక్కుందో నాకూ అంతే వుంది. వాళ్ళను నా దగ్గరే వుంచుకుంటాను. ఏ గంజో పోసి పోషించుకుంటాను. అమ్మను తెచ్చి పెట్టుకుంటాను వాళ్ళకోసం. ఇలాంటి పిచ్చి వార్నింగులు నాకివ్వకు. నేను బెదరను. పైగా నీకే నష్టం. నీ ఇంటినీ, సంపాదననీ చూసి నీ వెంటపడి వస్తానని భ్రమపడకు".
   
    మగవాడి అండ లేకుండా స్త్రీ ఒంటరిగా బ్రతకలేదన్న ధైర్యం అతడిలో అహాన్ని పెంచుతోంది. పిల్లలను శిక్షిస్తుంటే చూసి భరించలేని మాతృహృదయంలోని బలహీనత అతడి పాలిట వరం. ఇరవై ఒకటో శతాబ్దంలోకి అడుగు పెడుతున్న స్త్రీ ఈ దేశంలో యింకా సెకండ్ క్లాస్ సిటిజన్ లాగే బ్రతుకుతోంది.
   
    రాధ భారంగా నిట్టూర్చి పడుకుంది.
   
                              *    *    *
   
    ఉదయం తొమ్మిదిగంటలవుతోంది. సీరియస్ గా చదువుకుంటున్న సుభాష్ విసుగ్గా వచ్చి తలుపు తీశాడు. ఎదురుగా అనూరాధ. ఆమె ముఖం చూడగానే అతడికి అర్దమయిపోయింది ఆమె జవాబేమిటో.
   
    "లోపలకురా కూర్చో" ఆహ్వానించాడు ముఖంలో భావం కనుపించనివ్వకుండా.
   
    "నా జవాబు ముందుగా వినిపించనీ" సోఫాలో కూర్చుంటూ అంది.
   
    "అర్ధం అయిపోయింది రాధా! మరే ప్రశ్నలు వెయ్యదలుచుకోలేదు. ఆ విషయం గురించి యిక మాట్లాడవద్దు. ఒక్క క్షణం కూర్చో కాఫీ తెస్తాను?" లోపలకు వెళ్ళిపోయాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra