Home » Yandamuri veerendranath » సిగ్గేస్తోంది!

   

     ధరణి విస్తుబోయి, "అవును" అంది.
   
    "తాతయ్య ఒక్కడే ఉద్యోగం చేస్తే, అమ్మమ్మ ఇంట్లో వుండేదా?"
   
    ధరణి తలూపింది. వాదు తనలో తనే మాట్లాడుకుంటున్నట్టూ, "మమ్మీ ఇంట్లో వుంటే పిల్లలెంత లక్కీనో కదా!" అన్నాడు.
   
    కమ్చీతో కొట్టినట్టు అయింది ధరణికి. కనుకొలకుల్లో నీళ్ళు నిలిచాయి.
   
    వాడు స్వగతాన్ని కొనసాగించాడు. ...."సోమవారం కాగానే హాస్టల్ కి వెళ్ళి పోనక్కర్లేదు. స్కూల్ నించి రాగానే మమ్మీ ఇంట్లోనే వుంటుంది."
   
    ధరణికి తన చిన్నతనం జ్ఞాపకం వచ్చింది. తల్లి పెద్దగా చదువుకోలేదు. కానీ ఆవిడకి తెలిసినంతగా పిల్లల మనస్తత్వం చదువుకున్న తనకి తెలియదేమో! పిల్లలు బడినుండి వచ్చేసరికి ఆవిడ నవ్వుతూ ఎదురొచ్చి వాళ్ళ చేతిలోంచి బ్యాగ్ లు అందుకునేది. అంతేగానీ పక్కింటి ఆవిడతో ముచ్చటలాడుతూనో, నిద్రపోతూనో ఆవిడ ఎప్పుడూ పిల్లలకి కనపడేది కాదు!
   
    ధరణికోసం పెరట్లోని సన్నజాజులు మాలకట్టి ఉంచేది! ధరణి పరికిణీలమీద తనచేత్తో రకరకాల ఎంబ్రాయిడరీలు చేసేది. రోజూ ఏదో చిరుతిండి స్వయంగా చేసిపెట్టేది. పరీక్షలప్పుడు పిల్లలతో బాటు మేల్కొనేది. ఆవిడకి వాళ్ళు చదివేది అర్ధంకాకపోయినా "ఊ.... తప్పు చదివావు..... మళ్ళీ చదువు" అనేది.
   
    తల్లికి చదువు రాదు అన్న విషయం ధరణికి పెద్దయ్యేవరకూ తెలియనే తెలియదు. ఒకసారి ఆవిడ ఇంగ్లీషు పుస్తకం తిరగేసి పట్టుకుని "ఊ..... అప్పజెప్పు!" అంటే ధరణికి అప్పుడు తెలిసింది. ఆవిడకి చదువు రాదని! ఆ అమాయకత్వం, అజ్ఞానం ఎంత బాగుండేది? ఇప్పటి సూపర్ పిల్లలకి ఉండే ఇన్ని దిగుళ్ళూ, ఆలోచనలూ అప్పటి జనరేషన్ కి ఉండేవి కావు! మరి - తల్లిగా తనేం చేస్తోంది? పుట్టగానే మిల్క్ పౌడర్లూ, ఫారెక్స్ లూ, ఆ తర్వాత కార్న్ ఫ్లాక్స్, న్యూడిల్స్...పులిహోర కూడా రెడీమేడే! పిల్లలతో గడిపే సమయం కూడా ఓవర్ టైంలు చేసి, క్షణాలని రూపాయలతో లెక్కకట్టే తల్లులు ఎంతమందో?
   
    వేళకి అమ్మ అన్నం తినిపిస్తూ చెప్పే కాశీమజిలీ కథలూ, చిన్న కృష్ణుడి కథలకి బదులు శాటిలైట్ టెలికాస్ట్ శరణ్యమయింది!
   
    అయితే నాణేనికి మరొకవైపు కూడా వుంది. తన తల్లిదండ్రులకన్నా-తాము ఆర్ధికంగా బావున్నమాట నిజం. వచ్చిన జీతంలో బస్ ఖర్చులకీ, మిగతా ఆఫీసు ఖర్చులకీపోను రెండువేల దాకా మిగుల్తోంది. రోళ్ళూ రోకళ్ళకి బదులు మిక్సర్లూ, వాషింగ్ మిషన్లు వచ్చాయి. తన తల్లి ఫ్యాన్ గాలి ఎరగదు. తమకి కూలర్ వుంది. తనకి ఆర్ధిక స్వాతంత్రం వుంది. బస్సులో కీచకులూ, ఆఫీసుల్లో కిరాతకులూ వున్నారు. కొన్ని ప్లస్సులూ.. కొన్ని మైనెస్సులూ....
   
    ఏది మంచిది?
   
    ఏ ఆంత్రోపాలజిస్టూ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేడేమో.
   
    ....
   
    అలికిడికి ఆమె ఆలోచన్లనుంచి తెప్పరిల్లింది.
   
    స్కూల్ కి సంబంధించిన మదన్ పిల్లలు చదువుకుంటున్న గదిలోకి, వచ్చాడు. కిటికీలోంచి చూస్తున్న ధరణికి ఆ సమయంలో అతను అక్కడికి ఎందుకు వచ్చాడో అర్ధంకాలేదు.
   
    "గంగా" అని పిల్చాడు. హాల్లో చదువుకుంటున్న అమ్మాయిల్లోంచి - ఓ పదేళ్ళపాప అతడి దగ్గరికి వెళ్ళింది.
   
    "లైబ్రరీలో అచ్యుత్ వున్నాడు. వెళ్ళి ఒక గంటపాటు వాడికి సాయం చెయ్యి, పుస్తకాలు సర్ధమని చెప్పాను. ఇద్దరూ కలిసి సర్దండి" అంటూ తనతో తీసుకువెళ్ళాడు.
   
    వాళ్ళు వెళ్ళాక పిల్లలు తమ చదువులో మునిగిపోయారు. అయితే అందులో ఒక పాప - మరొక అమ్మాయివైపు చూసి సన్నగా నవ్వటం ధరణి సునిశిత దృష్టి దాటిపోలేదు. ఏదో గతపు ఒక చిన్న అనుభవం తాలూకు రహస్యాన్ని పంచుకున్నట్టుగా వుంది ఆ నవ్వు.
   
    ధరణి ఆ చీకటిలోనే తొందర తొందరగా నడుచుకుంటూ, హాస్టల్ ముందువైపుకి వచ్చింది. అప్పటికే మదన్ ఆ పాపని వరండా చివరివరకూ తీసుకెళ్ళి, అక్కడున్న గదిలోకి ప్రవేశించాడు. అక్కడంతా వేలుగ్గా వుండటంతో ధరణి దూరంగా ఆగిపోవలసి వచ్చింది. ఆ గది ద్వారంపైన 'లైబ్రరీ' అని వ్రాసివుంది. గుమ్మం దగ్గిర అచ్యుత్ అనే కుర్రవాడు నిలబడి వున్నాడు.
   
    ధరణికి అక్కడికెలా చేరుకోవాలో అర్ధంకాలేదు.
   
    ఈ లోపులో ఇద్దర్నీ పుస్తకాలు సర్ధమని చెప్పి మదన్ బయటకొచ్చాడు. తలుపు దగ్గిరగా చేరవేసి, తన క్వార్టర్ వైపు వెళ్ళిపోయాడు.
   
    ధరణి మొహంమీద ఎవరో చరిచినట్టయింది. ఏదో అగ్నిపర్వతంలా బ్రద్దలవుతుందనుకున్నది అతి సాధారణంగా ముగిసిపోయింది.
   
    అనవసరంగా తను ఏమేమో వూహించుకున్నాననుకుంది. సిగ్గుతో మొహం ఎర్రబడగా, అక్కడనుంచి వెనుదిరిగింది. అంతలో దూరంగా వాచ్ మెన్ అటు రావటం కనిపించింది. ఆమె కెటు తప్పుకోవాలో తెలియక వెనుకవైపుకి పరుగెత్తింది.
   
    అదే ఈ కథని ఒక మలుపు తిప్పింది.
   
    .......
   
    కిటికీలోంచి అంత వెలుగు ఎందుకు పడుతోందో ఆమెకి అర్ధంకాలేదు. మూసివున్న కిటికీ తలుపు సందుల్లోంచి పడే వెలుగు కిరణం మామూలు లైటు వెలుగుకన్నా ఎక్కువ వుంది. ధరణి కిటికీ సందుల్లోంచి లోపలికి చూడటానికి ప్రయత్నించింది. ఆమె అనుమానం నిజమే. దాదాపు వెయ్యి క్యాండిల్స్ బల్బులు పెట్టినంత వెలుగ్గా వుంది లోపల. లైబ్రరీకి అంత వెలుగు ఎందుకో ఆమెకి అర్ధంకాలేదు.
   
    లోపల అచ్యుత్ ఒక్కొక్క పుస్తకాన్నే అందిస్తూంటే, గంగ వాటిని వరుసగా సర్దుతూంది. దులిపి సరిగ్గా పెడుతోంది. అచ్యుత్ కి పధ్నాలుగేళ్ళదాకా వుంటాయి. నిక్కరు వేసుకుని వుండటంవల్ల వయసుకన్నా చిన్నగా కనపడుతున్నాడు. అదీగాక మొహం కూడా చాలా లేతగా అమాయకంగా వుంది.
   
    పదేళ్ళవయసున్న గంగ ఆరోగ్యంగా వుంది. వయసుకన్నా రెండు మూడేళ్ళు పెద్దదిగా కనపడుతోంది. గుండ్రటి మొహం, పెద్ద కళ్ళు, కళ్ళకి సరిపడా బుగ్గలు కొద్ది కొద్ది మార్పుల పరిమాణాల్ని సంతరించుకోవటానికి ఆయత్తమవుతూ విచ్చుకోవటానికి సిద్దపడుతూన్న మొగ్గలా వుంది ఆ పాప శరీరం.
   
    "ఇదంతా సర్దేసరికి అర్దరాత్రి అవుతుంది" అంటోంది గంగ.
   
    "నీకు నిద్ర వచ్చినప్పుడు మీ హాస్టల్ దగ్గిర దింపి, నన్నొచ్చి ఇక్కడే పడుకోమన్నారు మదన్ గారు" అన్నాడు అచ్యుత్.
   
    "ఇక్కడెల పడుకుంటావ్? భయం వెయ్యదూ?"
   
    "ఆ మూల పక్కవుందిగా, తలుపేసుకొని పడుకుంటే భయం వెయ్యదు-" హీరోలా చెప్పాడు అచ్యుత్.
   
    "నువ్వూ మీ హాస్టల్ కి వెళ్ళిపోవచ్చుగా"
   
    "అది దూరం కదా వెళ్ళగలుగుతే వెళ్ళమన్నారు. చీకట్లో ఆ ముళ్ళచెట్ల మధ్యనుంచి వెళ్ళటం భయమైతే ఇక్కడే వుండి పొమ్మన్నారు. తలుపు గెడవేసి పడుకుంటే ప్రొద్దున్నే వచ్చి లేపుతానన్నారు" అరలో ఆఖరి వరస పుస్తకాలు సర్దేసి అన్నాడు.
   
    ఇంకొక్క బీరువా మిగిలి వుంది.
   
    ఇద్దరూ దాని దగ్గిరకు వెళ్ళారు.
   
    బీరువా పై 'అర' గంగకి అందలేదు. అచ్యుత్ స్టూల్ ఎక్కి సర్దసాగాడు. అతడి పక్కనే నిలబడి గంగ క్రింద అరలో పుస్తకాలు దులుపుతోంది. అకస్మాత్తుగా ఆ అమ్మాయి పుస్తకాలు దులపటం ఆపి, ఒక పుస్తకంలో బొమ్మలు ఆసక్తిగా చూడటం దరణి గమనించింది.
   
    ఆమెకి అనుమానం రాకపోవును. కానీ పుస్తకంలో ఒక పేజీ తిప్పి చూడగానే గంగ చప్పున తలెత్తి పైకి చూసిన విదానం ధరణికి అనుమానం తెప్పించింది.
   
    అచ్యుత్ నిక్కర్ లో వున్నాడు. అతడి మోకాళ్ళ దగ్గిర క్రింద నిలబడి వున్నది గంగ. పైకి చూసి, అప్రయత్నంగా దూరం జరిగి, కాస్త తటపటాయించి, అతడు తనని గమనించటంలేదని నిశ్చయించుకుని, మరింత దూరంగా జరిగి.... చాలా మామూలుగా వున్నట్టు కనపడుతూ పుస్తకంలో బొమ్మలు ఆసక్తిగా చూడసాగింది.
   
    పేజీ తిప్పగానే గంగ మొహంలో కనపడిన మార్పునిబట్టి ఆ పేజీలో "బొమ్మ" వుందని ధరణి గ్రహించగలిగింది. ఏదైనా చ...ది....వే మేటరు వున్నట్లయితే, గంగ మొహంలో అంత వేగంగా మార్పు రాదు. ఆమె దూరం జరగటంబట్టి, ఆ బొమ్మ ఎలాటిదో ధరణి వూహించగల్గింది.
   
    లైబ్రరీలో అలాటి బొమ్మల పుస్తకాలు ఎందుకుంటాయో ఆమెకి అర్ధంకాలేదు. తన ఆలోచనలో ఏదైనా తప్పు వుందా అని ఆమె ఒక క్షణం తర్కించుకుంది.
   
    ఆమె ఆలోచన సరి అయినదే అన్నట్టుగా అచ్యుత్ కూడా పై అరలో పుస్తకం తెరచి చూడసాగాడు. ఒక్కక్షణం అలాచూసి, గంగని గమనించాడు. గంగ దూరంగా అదే పనిలో నిమగ్నమై వుండటం చూసి, స్టూల్ దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తనుకూడా ఆమె దేన్ని చూస్తోందో గమనించాడు. ఆ అలికిడికి గంగ పుస్తకం మూసెయ్యబోయింది.
   
    "ఇదిగో ఈ పుస్తకంలో కూడా అలాటి బొమ్మలే వున్నాయి" అన్నాడు అచ్యుత్ అమాయకంగా.
   
    "ఛీ. ఇవన్నీ పాడుబొమ్మలు...." అంది గంగ.
   
    "మరి నువ్వెందుకు చూస్తున్నావ్?"
   
    "నేను చూడటంలేదు ఏముందో అని చూస్తున్నానంతే" పుస్తకాన్ని దూరంగా విసిరేస్తూ అంది.
   
    "నువ్వు చూడటం నేను చూసాలే. నీ పుస్తకంలోకన్నా ఇందులోనే బావున్నాయి".

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra