Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 29

రాగ అప్పటికి పూర్తిగా తెలివిలోకి రాలేదు. ఏదో పలవరిస్తోంది. ఒక్కొక్కసారి, "మమ్మీ! ఐ యామ్ వెరి సారీ మమ్మీ! వెరి వెరి సారీ మమ్మీ! ఇంకెప్పుడు నిన్ను హార్టు చెయ్యను డాడీ దగ్గరి కెళ్తను అనను గాడ్ ప్రామిస్ "అంటోంది. ఇంకో సారీ "డాడ్! ఐ మిస్ యు డాడ్! నేను నీతోనే వుంటాను. మనం జూ పార్క్ కి వెళ్దాం. ఐస్ క్రీమ్ కొనుక్కుందాం. మమ్మికి కూడా ఒక ఐస్ క్రీమ్ కొని యిద్దాం . మమ్మీ కోపం అంతా పోతుంది." అంటోంది. మూసిన కను కొలకుల చివర చిన్న నీటి బిందువులు ఒంటి మీద తెలివి లేని దశలో గూడా ఆ పసిమనసు ఎంత క్షోభించి పోతుందో చెబుతున్నాయి.
చెయ్యగలిగిందేమి లేక గుడిసె మట్టి గోడలను అనుకుని కూర్చుంది యమ్మాయమ్మ.
దారిద్ర్యామే అన్నీ బాధలకు మూలమనుకునేది. మనిషి తిండి కోసం, బట్ట కోసం మనుగడ కోసం ఎన్నెన్ని ఘోరకార్యాలైనా చేస్తాడని అనుకునేది. ఈ పాప కలిగినింట్లో పుట్టింది. డబ్బుకి సంబంధించినంతవరకు దేనికి లోటు లేదు. ఈ క్షోభకంతకు కారణం ఏమిటని చెప్పుకోవాలి. ఆడవాళ్ళు చదువుకుని విజ్ఞానవంతులై తమకు ఒక వ్యక్తిత్వం వుందనుకోవాలా? మగవాడు పెద్ద వాళ్ళయిన తల్లిదండ్రుల్ని గౌరవించి యింట్లో పెట్టుకోవడం తప్పనుకోవాలా? ఇంటి పరిస్థితుల కారణంగా గాని , బయటి యిబ్బందుల కారణంగా గాని, ,మరి ఏ ఇతర కారణంగా కాని, మగవాడు తగినంత కారణం లేకుండా తన్ని అవమానించినప్పుడు స్త్రీ ఎదురుతిరగడం తప్పనుకోవాలా? ఎక్కడ జరిగింది పొరపాటు?ఎలా సహనం వహించవలసినది సర్దుకుపోవలసింది , త్యాగాలు చెయ్యవలసింది స్త్రీ మాత్రమేనా?
రోజుకి కొన్ని వందల ఉత్తరాలు పోస్టులో వస్తున్నాయి అణువేదకి. ప్రగాడమైన సానుభూతి ప్రకటిస్తూకొందరు, "పాప ఫోటో పత్రికలో చూశామని పాపకి సంబంధించిన వివరాలేమైనా తెలియజేస్తే పాపని వెదకటానికి సాయం చేస్తామని" మరికొందరు, " నువు ఎంత ప్రఖ్యాత నర్తకివైన పసిపాప విషయంలో యింత నిర్లక్ష్యం పనికిరాదని , "మరికొందరు "ఎన్ని కష్టాలకైనా తట్టుకుని ఆత్మాభిమానంతో నిలబడి స్త్రీ జాతికే తలమానికంగా ప్రకాశిస్తున్నారని, "మరికొందరు, "అడ్డానికికింత అహంకారం పనికి రాడు మరీ కన్ను పోయేంత కాటుక పెట్టుకుంటారా ఎవరైనా? ఇప్పుడు చూడు. అటు సంసారం పాడు చేసుకుని, యిటు రత్నం లాంటి కూతురికి దూరమై నువు పొదుతున్న సంతోషం ఎలాంటిది," అని మందలిస్తూ కొందరు, "పాపని వెదికి పట్టుకొచ్చిన వాళ్ళకి మంచి బహుమానమిస్తామని ప్రకటించి వుండవలసింది బహుమానం మీది ఆశతో నైనా ఎవరైనా పాపని  తెచ్చి యిచ్చేవారేమో? నాట్య ప్రదర్శనలిచ్చి బోలెడు సంపాదించారు. కన్న కూతురి విషయంలోనైనా యింత పినాసితనం పనికి రాదని, " అని నిష్టురాలతో మరికొందరు, రకరకాలుగా ఉత్తరాల వర్షం కురుస్తోంది ఆమె మీద. ఒక్కక్క ఉత్తరం చదువుతున్న కొద్ది ఆశ, ధైర్యం కలగడానికి మారుగా నిరాశా, నిస్పృహ ఎక్కువ అవుతోంది. రాగ దూరమై నలభై ఎనిమిది గంటలు గడచిపోయాయి. ఇనతవరకు ఏ ఆచూకి తెలియలేదు ఏ మాత్రం ఆసక్తి లేకుండా విసుగ్గా మరొక ఉత్తరం తెరిచింది. ఇంగ్లీషులో వుంది ఉత్తరం.
"శ్రీమతి అనువేద గారికి,
మీరెవరో నాకు తెలియదు మాది మధ్య ప్రదేశ్ హిందూ దేశంలోని ముఖ్యమైన స్థలాలన్నీ చూసుకుంటూ, కోణార్క దేవాలయానికి వచ్చాను. అక్కడ ముఖశాలలో శిల్పాలు చూస్తుండగా, ఎనిమిదేళ్ళ పాప నా దగ్గిర కొచ్చి , "అంకుల్! మమ్మికి ఫోన్ చేయాలి. ఫిప్టి ఎన్ పి వుంటే ఇస్తారా?' అని అడిగింది ఇంగ్లీషులో ఆ పాప వొంటి మీద దెబ్బలున్నాయి. ముఖం మీద బురద మరకలున్నాయి. మురికోడుతూ వుంది. పాప ఇంగ్లీషులో ముద్దుగా మాట్లాడే వరకు అడుక్కునే వాళ్ళ పిల్ల అనుకున్నాను. పాపని నేను వివరాలడిగే లోగానే ఎవరో ఒరియా వచ్చి పాపని రెక్క పట్టుకులాగి భుజం మీద వేసుకుని, "మా అమ్మాయే మతి స్థిమితం లేనిది" అన్నాడు. అతడు వెళ్ళిపోయిన కొంతసేపటికి పాప ఫోటో పేపర్లో చూసినట్లు గుర్తొచ్చింది. పేపర్లోని చిరునామా బట్టి మీకీ ఉత్తరం వ్రాస్తున్నాను ఇంతకంటే ఏమి చెయ్యలేకపోతున్నాను.
క్షమించండి.
ఇట్లు
ఒక టూరిస్ట్.
తను కూర్చున్న కుర్చీ , ఆ నేల, ఆయిల్లు, ఏ అధ పాతాళాలలోకో జారిపోతున్నట్లనిపించింది అణుకి. చెవుల్లో "మమ్మీ! మమ్మీ!" అంటున్న రాగ పిలుపు కళ్ళముందు కాళరాత్రి అందకారాలు. తన రాగ ఎక్కడో, ఎవరినో ముష్టేత్తుకుంటోంది, తనకి ఫోన్ చేసి సారీ చెప్పడం కోసం, ఆ ఒరియావంత్ ఎవరో, పోలిసుగా జీవన్ దగ్గిరకే రాగలిగిన వ్యక్తీ, ఒరియాపంత్ గా అపరిచిత వ్యక్తీ దగ్గిరికి వెళ్లలేడా? అలాంటి వ్యక్తుల చేతుల్లో చిక్కుకుని ఏ అవస్థలు పడుతుందో మమ్మికి ఫోన్ చెయ్యాలని ఆరాటపడే ఆ మనసు తల్లి కోసం ఎంత తల్లడిల్లిపోతోందో. తల తిరుగుతున్నట్లు అనిపించింది. "నో!" అని తనని తను హెచ్చరించుకుంది.
పదేళ్ళ వయసులో తల్లిని పోగొట్టుకుంది. తండ్రి వోదార్చే అండగా నిలబడే బదులు తను పిచ్చివాడై పొతే అతడికి తల్లిగా మారి, తండ్రినే ఓదార్చింది. తల్లి పోయిన దుఖం, గుండెల్లోనే దాచుకుని, యింటి భారమంతా తన భుజాల మీద వేసుకుంది. తండ్రి లక్షలు గడించకపోయినా, తిండికి, బట్టకి లోటు లేదు. అందుచేత ఆర్ధికంగా పెద్దగా యిబ్బందులు ఎదుర్కోవలసి రాలేదు. చిన్నప్పటి నుంచి డాన్సు నేర్చుకుంటూ స్కూల్లోను, కాలేజిలోను కూడా ప్రతి ఫంక్షనులో డాన్సు చేసి ప్రశంశలు అందుకునేది. బి.ఎ వరకూ యిటూ చదువు, అటు డాన్సు రెండూ నేర్చుకుని, గ్రాడ్యుయేట్ తరువాత పూర్తిగా దాన్సుకే అంకితమైపోయింది. డాన్సర్ గా పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించుకుంది.
ఇటూ పినతండ్రిని, అటు మేనమామని గౌరవిస్తూనే చాకచక్యంగా తన వ్యవహారాలన్నీ తనే చూసుకునేది. చిన్నప్పటి నుంచి బాధ్యతలు మోసి, మోసి అలసి పోయిన అణువేద పెళ్ళి చేసుకున్నాకైనా బరువు బాధ్యతలన్ని భర్త మీద వేసేసి నిశ్చింతగా గృహిణిగా కాలం గడుపుదామని ఎన్నో కలలు కంది. అయితే విధి ఎక్కడికక్కడ డీ కొంటునే వుంది. జీవన్ తన భార్య బాధ్యతలు తన మీద వేసుకోకపోగా మరింతగా బరువు బాధ్యతలు పెంచాడు. అలాగే సంసారాన్నొకదారికి తేవాలనుకుంటే యిప్పుడి దెబ్బ.
"నేను క్రున్గిపోనుం కృంగిపోకూడదు. కృంగిపొతే నా రాగని ఆ రాక్షసుల చేతుల్లోంచి విడిపించే వాళ్ళుండరు. రాగని కాపాడుకోవాలి" పట్టుదలతో అనుకుని లేవడానికి ప్రయత్నించింది. తులిపోయింది. ఆమె కింద పడిపోకుండా రెండు అందమైన చేతులు ఆమెని పట్టుకున్నాయి. అవి జలజవి. అణుని జాగ్రత్తగా వాలు కుర్చీలో కూర్చో బెట్టి వేడి హార్లిక్స్ గ్లాసులో కలిపిచ్చి, అణు చేతిలో ఉత్తరం అందుకుని చదివింది. ఒక కుర్చీ అణు దగ్గిరగా లాక్కుని కూర్చుని, "ఏం చేద్దామనుకుంటున్నావిప్పుడు?" అడిగింది. అణుకి మొదటి నుంచి ఎంతటి తీవ్రమైన దుఖమైనా, ఎంతటి దారుణమైన బాధ కలిగినా మరొకరి ముందర బయట పడడం యిష్ట ముండదు.
జలజ ముందర బయటపడడం అసలు యిష్టం లేదు. తనని తన్ను అదుపులోకి తెచ్చుకుంటూ," జీవన్ ఎలా వున్నాడు?" అని అడిగింది.
జీవన్ కి నేనేదో బాడీ గార్డ్ అయినట్లు మాట్లాడతావేమిటి? ఏదో చుట్టాలు కదాని చికాకులో వున్నారు కదాని చేతనైనా సాయం చేద్దామనుకున్నానంతే నేను లేనప్పుడు నువు జీవన్ ని చూడ్డానికి వచ్చావటగా! ఇద్దరూ ఘోరంగా లవాడేసుకున్నారటగా!"
"లవాడుకున్నామా!"

 Previous Page Next Page