Home » Avasarala ramakrishna rao » Sampengalu Sannajaajulu

 

    'మీక్కూడా అక్క చెల్లెళ్ళున్నారుగా, వాళ్ళకూ మీకు ఎలాంటిదో అలాంటి సంబంధమే' కృష్ణమూర్తి గబగబా వెళ్ళిపోయాడు. నాకు చాలా అసహ్యం వేసింది. ఏ లోపమూ లేకుండానే ఎంత నీచంగా మతాడుతున్నారు! వేలెట్టి చూపించడానికి అవకాశం యిస్తున్న మధురను దుయ్యబట్టడానికి ఎందుకు సందేహిస్తారు?
    పగలల్లా ఎక్కడేక్కడ తిరిగి వచ్చినా మధుర రాత్రిళ్ళు మాత్రం మాతో పాటు డాబా మీద కూచుని చదివేది. ఎప్పటికప్పుడు మరింత ఉత్సాహంగానూ, సరదాగానూ కనపడుతున్న ఆ అమ్మాయిని పనిగట్టుకు నిందించడం కూడా నాకు కష్టంగానే కనిపించేది. ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా పెట్టుకుని తర్జనభర్జనలు చెయ్యడానికి నాకు తగినంత కాల వ్యవధి లేకపోయింది. పరీక్షలు అయిపోయేదాకా ఆమెను ఒక కంట కనిపెట్టి ఉండడం తప్ప మరేమీ చెయ్యలేకపోయాను.
    ఆఖరు పేపరు అయిపోగానే నాలో కలిగిన ఆనందం పరకాయ ప్రవేశం చాతనయిన వాళ్ళకి గానీ తెలీదు. అందులో నేను వూహించిన 'పోయేటిక్ డిక్షన్' ఆఖరి ఎస్సే పేపరులో పడడం చేత నాకు మరీ ఆనందంగా ఉంది. 'తండ్రీ విశ్వనాధా! నన్ను కృతర్దురాల్ని చెయ్యి. మళ్ళీ వచ్చి నీ దర్శనం చేసుకుంటాను. ఈ జన్మకి ఇదే ఆఖరి పరీక్ష చెయ్యి' అనుకున్నాను. కాని ఈ జన్మకి పరీక్ష అనేది ఆ నిముషం నుండే ప్రారంభించబడిందని నాకు తెలీదు!
    నేను సామాన్లు సర్దుతుంటే మధుర అక్కడికి నాతొ ఏదో చెప్పడానికి వచ్చినట్టు వచ్చి అటూ యిటూ తిరుగుతుంది.
    "ఏం కావాలి మధురా, నీ సామాన్లు కట్టడం పూర్తయిందా?'
    'ఇవాళ మేం అలహాబాదు వెడదామనుకుంటున్నామండీ మీరూ రాకూడదు, సరదాగా అన్నీ చూడొచ్చు.?'
    'నేను కిందటేడు చూశాను. నువ్వు ముందుటేడు చూడొచ్చులే, బయల్దేరు.'
    'లేదండీ , మాట యిచ్చేశాను, అతనే మానుకుంటాడో.'
    'నీ యిష్టమోచ్చినట్టు మాటలూ, మనసులూ యిచ్చేస్తే ఇవతల వాళ్ళే మనుకుంటారో , లోకం ఎమనుకుంటుందో ఆలోచించవా? ఇప్పటికే మతి మీరిపోయావు. పరాయి పురుషుడితో ఒంటరిగా మరో వూరు వెళ్ళడానికి కూడా ఏమాత్రమూ సందేహించడం లేదు నువ్వు. ఇందుకేనా నువ్వు ఇక్కడికి వచ్చిందీ, ఇందుకేనా మీవాళ్ళు నిన్ను యిక్కడికి పంపిందీ?"
    'మీరు తొందర పడుతున్నారండీ.'
    'ఇప్పటికే ఆలశ్యం చేశాననుకుంటున్నాను. ఇంక వూరుకొదల్చుకోలేదు. నువ్వు వూరు విడిచి వెళ్ళడానికి ఎంతమాత్రం వీల్లేదు. ఆ మురళీకృష్ణ మూర్తి గారిని పంపి సాయంకాలం రైలుకి రెండు టికెట్లు రిజర్వు చేయించి అప్పుడే తెప్పించాను. నా బాధ్యత నన్ను సక్రమంగా నిర్వర్తించనీ. వచ్చే ఏడు అలహాబాదే వెడతారో, ఆలిండియా టూర్ కే బయల్దేరుతావో నాకు తెలీదు. ఇప్పటి మటుకు నాతొ ఎత్తుకు నైనా సరే తీసుకు పోతాను. ఇంకా అలా చూస్తావేం, వెంటనే సామాన్లు సర్దుతావా, నన్ను సర్ధమన్నావా?'
    మధుర అంతసేపూ ఆగి ఒక్కసారి ఫకాలుమని నవ్వేసింది. ఏం మనిషి బాబూ యిది!

                                                  *    *    *    *
    బాగా చీకటి పడే వేళకు రైలు పాట్నా చేరుకుంది. మేము తెచ్చుకున్న పూరీలు తిని అమ్మకానికి వచ్చిన 'చాయ్' కొనుక్కు తాగేం. చాలా రోజుల్నుంచి నిద్ర లేదేమో నా కళ్ళు కూరుకు పోతున్నవి. 'సరే మీరు నిద్రకి ఉపక్రమిస్తున్నారు కాబోలు! రేపొద్దున చేబుతాలెండి' అంది మధుర. నేనొకసారి రైలు పెట్టెలో చూశాను. చాలావరకు హిందీ వాళ్ళు. దూరంగా అక్కడక్కడ పరీక్షలకని వచ్చిన తెలుగు వాళ్ళు ఒళ్ళు తెలియకుండా నిద్రిస్తూ ఉన్నారు. మధుర నుండి ఏమైనా వినాలనుంటే ఇదే మంచి తరుణం. ఎంచేత ఆమె గొంతుక మరీ పెద్దది. ఆమె స్వరూపం తో పాటు స్వరమూ నలుగుర్ని ఆకర్షించడం నా కిష్టం లేదు. అందుకే బలవంతాన నిద్ర ఆపుకుని మరో కప్పు ' చాయ్' సేవించి 'అక్కర్లేదు, ఇప్పుడే చెప్పు' అన్నాను.
    'మీరు తొందరపడి నన్ను లాక్కొచ్చారు. పాపం కేశవ ఏమనుకున్నాడో. అయినా అపార్ధం చేసుకునే మనిషెం కాదులెండి. అతని ఎడ్రసు కి కవరు రాసి పడేసి మరీ రైలేక్కేను. పాపం బాగా ఆశా భంగం పొందుతాడు. 'నాకు మాత్రం ఒక్క విషయం వూహ కందకుండా ఉంది. బాగా చదువు కున్నవారు మీరు నన్నెందుకు అందరితో పాటు అంత తక్కువగా ఊహించారు?' ఇందులో బాగా చదువుకున్నవారు అన్నమాట నాకు ఎత్తి పొడుపుగా కనిపించింది. ఇంకా దేశంలో ప్రతి ఒక్కరూ చదువుకున్న ఆడదాన్ని ప్రత్యేకంగా చూడ్డమూ అది ఒక సహజమైన విషయంగా భావించక పోవడమూ నాకు విచారాన్ని కలుగేజేసింది.
    'చదువుకున్న ఆడది కాపురం చేస్తుందా? ఉద్యోగం చేస్తున్నది చెప్పినట్టు వింటుందా?' అనే మాటలు యిప్పటికీ కూడా ఏం తక్కువ వినపడ్డం లేదు. ఈ విషయంలో సాటి స్త్రీ లోకం చేసే విమర్శ మరీ కర్ణకఠోరంగా ఉంటుంది.
    ఈనాటికీ కూడా చదువు విషయంలో స్త్రీలకూ తగిన అవకాశాలు లేవు. చాలాచోట్ల మగవాళ్ళతో కలసి చదవవలసి రావడమే మన దేశంలో అడపిల్లల కున్న ముఖ్య దురదృష్టం. క్లాసుకి నలభై మంది మగ పిల్లలుంటే పదిమంది కూడా ఆడపిల్ల లుండరు. పాఠాలు చెప్పే గురువులలో కూడా నూటికి తొంబై మంది పుల్లింగమే. చాలావరకు హైస్కూళ్ళలో బాలికలకు ప్రత్యెక సదుపాయాలు ఉండవు. తల్లిదండ్రులూ , ఉపాధ్యాయులూ ఒకరి మీద మరొకరు బాధ్యతలు వేసి ఆడపిల్లల అవసరాలు గమనించరు. క్రమశిక్షణకు క్రమక్రమంగా శిక్ష జరిగుతున్న ఈ రోజుల్లో ఏదైనా ఫంక్షన్ నాడు గాని వర్షం వచ్చి గొడుగు తెచ్చుకొని వాడు గాని ఆడపిల్లలు పడే అవస్థ అనుభవించినవాళ్ళకి గానీ తెలీదు. ఇటువంటి నిస్సహాయతనుండి నిబ్బరంగా పైకి రావాలంటే అదనపు సాహసం అవసరం. ఇన్ని విధాల యిబ్బంది పడినా కళాశాలలలో చేరడానికి ప్రతి నిముషం ముందంజ వేసే అమ్మాయిల గుండె నిబ్బరం మెచ్చుకోదగ్గది. అగ్రాసనాలనూ ఆకాశాలను అలంకరించే అదృష్టానికి ఆడవాళ్ళు కూడా నోచుకున్నారంటే అది అన్నివిధాల ఆనందించవలసిన విషయమే. కాని, అదే పరిస్థితిలో ఆడపిల్లల చదువు అంతంత మాత్రంగానే ఉండడం అన్ని విధాల విచారించవలసిన విషయం.
    'మీరు నామాట వింటున్నట్టు లేదు. నిద్రా ఆలోచనా ముద్రా?'
    'బాగా చదువుకున్నవారు' అని నువ్వు ఎందుకన్నావా అని ఆలోచిస్తున్నాను. నాకేం రెండు కొమ్ములు మొలవలేదుగా? అలా అయితే ప్రీవియస్ అయిపోయిందిగా యీ పాటికి నీకొక కొమ్ము మొలవాలిగా? అయినా అలా జరిగినా మొగాళ్ళు వూరు కుంటారా, వెంటనే శృంగభంగం చేసేయ్యరూ?'
    'అయ్య బాబోయ్, మీతో మాట్లాడ లేమండి బాబూ -- నేనేదో తెలివితక్కువగా మాట్లాడేస్తుంటాను."
    'ఆ కేశవ్ రావు గురించి ఏదో చెప్పబోతున్నావ్ గా .... చెప్పూ.'
    'ఏది మీరు సరిగ్గా వినందే....అతని మీద మీకు ముందే దురభిప్రాయం ఉన్నట్టుంది. ఎవరేం చెప్పేరో ఏమో.'
    'ఎవరూ ఏం చెప్పక్కర్లేదు. తన చుట్టూ తిరిగే ప్రతి మొగాడి మీదా ఆడది వీలైనంత వరకు దురభిప్రాయం కలిగి ఉండడమే మంచిది. తప్పుడు అంచనాల వల్ల కలిగిన సదభిప్రాయంతో కాలు జారితే తరువాత విచారించి లాభం ఉండదు మరి. మన యూనివర్శిటీ లో మనకు తగిన అవకాశాలు లేక అక్కణ్నుంచి యిక్కడికి ఇన్ని వందల మైళ్ళ దూరం వచ్చాం. దేనికి? బుద్దిగా చదువు కోడానికా, హద్దు మీరి తిరగడానికా? ఏళ్ళ తరబడి కష్టపడి వేలకి వేలు ఖర్చు పెట్టి ఎందుకింత దూరం వచ్చాం మధురా, యోగ్యత పెంచుకోడానికా, తగ్గించుకోదానికా?'    
    ఈసారి కలకలలాడే ఆమె మోహంలో కన్నీరు ఉబికింది.
    'మేము ఒక్క పొరబాటు పని కూడా చెయ్యలేదు. పైగా నేను వెళ్ళిందగ్గర్నుంచీ వచ్చేదాకా ఆ కేశవ ఒక్కలా సహాయం చేశారు. హాస్టలులో స్టూడెంట్స్ తో పరిచయం చేశాడు. ముఖ్యమైన ప్రశ్నలన్నీ ముందుగానే చర్చించుకునే అవకాశం కల్పించాడు. ఎక్కడా దొరకని నోట్సూ, లైబ్రరీ పుస్తకాలూ తెచ్చి పెట్టేడు. నాకు దొరకని ముందు టేడు ప్రశ్నా పత్రాలన్నీ ఎవరి దగ్గరో సంపాదించి యిచ్చేడు. ఎన్ని విదాలో ప్రోత్సహించి ప్రతి పరీక్షకూ సాగనంపెవాడు. నిజం చెప్పవలసి వస్తే అతనే లేకపోతె ఇప్పుడు ఆన్సరు చెసిందానిలో సగమైనా ఆన్సరు చెయ్యలేక పోయేదాన్ని. అతని కెంతో యిబ్బందయ్యేది. వేళకి రాలేదని వాళ్ళ గైడు తిట్టి పోసేవాడుట. నాతొ తిరుగుతున్నానని వాళ్ళ ఫ్రండ్సందరూ అనేక రకాలుగా ఏడిపించే వారట. ఇదంతా భరించి అయన నాకు ఇంత ఉత్సాహమూ, ప్రోత్సాహమూ ఇవ్వడం ఎందుకు?'
    'ఎందుకు, అదే నిన్ను అడగ బోతున్నాను.'
    'ఆగండి, అదే మీకు చెప్పబోతున్నాను.'

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra