Home » Yerramsetti sai » Rendo Manasu


    "ముందు గుడికి తీసుకెళ్ళండి! దేముడికి దణ్ణం పెట్టుకున్నకే ఇంటి కెళ్ళాలి" అన్నది సావిత్రి.
    "మీ దేవుడు చాలా మంచివాడండీ. మీరు కోరిన కోరికల్లా తీర్చేస్తున్నాడు.......చలపతిని క్షేమంగా ఇంటికి తీసుకోచ్చేశాడు! మీరడగ్గానే నా జ్వరం తగ్గించేశాడు......" నవ్వుతూ అన్నాడు శ్రీకాంత్!
    చలపతి ఆశ్చర్యంగా సావిత్రి వేపు చూశాడు.
    "శ్రీకాంత్ కి అంత జ్వరం వచ్చిందా?"
    "అవును! అందుకే ఆరోజు మీ ఆపరేషన్ అయిన తర్వాత ఆయన్ని కూడా తీసుకెళ్ళి దణ్ణం పెట్టుకున్నాను......."
    "ఓహో........" అతని కెందుకో ఆ విషయం అంతగా నచ్చలేదు. తనూ సావిత్రి గుడికెళ్ళడంలో ఒక అనుభూతి ఉంది. తనను పక్కన నుంచో బెట్టుకొని తన కోసం దేముడిని ప్రార్ధించడంలో ఓ పవిత్రత వుంది! మరి అదే సావిత్రి శ్రీకాంత్ ని కూడా అలాగే గుడికి తీసుకెళ్ళి దేముడిని ప్రార్ధించడంలో ఔన్నత్వం కనిపించడంలేదు!
    శ్రీకాంత్ తన ప్రాణ స్నేహితుడు. తనని ఎన్నో విధాల ఆదుకొన్న నిజమైన స్నేహితుడు . తనకి ప్రాణదానం చేసిన దేవుడే తననుకొంటాడు! అంచేత సావిత్రి కూడా అతనిని అభిమానించవలసిందే! అతనిని గౌరవించవలసిందే కాని ---
    కారు గుడి ముందు ఆగింది!
    చలపతి దిగి నుంచున్నాడు. సావిత్రి కూడా దిగింది. శ్రీకాంత్ స్టీరింగ్ ముందే కూర్చున్నాడు.
    "మీరు కూడా రండి!" శ్రీకాంత్ వేపు చూస్తూ అంది సావిత్రి.
    "నేనెందుకు లెద్దూ. నా తరుపున మీరే థాంక్స్ చెప్పేయండి.........నవ్వుతూ అన్నాడు శ్రీకాంత్!
    "ఊహు! అదేం కుదరదు! రావాల్సిందే......."
    తనూ వారితో పాటు వెళ్ళక తప్పలేదు శ్రీకాంత్ కి.
    ముగ్గురూ దేముడి ముందు చేతులు జోడించారు. చలపతి ఆలోచనలు దేముడి మీద లేవు. సావిత్రి , శ్రీకాంత్ ల చుట్టూ తిరుగుతున్నాయ్. సావిత్రి శ్రీకాంత్ ల మధ్య ఇంత అనుబంధం ఎప్పుడు పెరిగిపోయింది?
    అంతకు ముందెప్పుడూ ఇంత చనువుగా పలుకరించుకోవడం , ప్రవర్తించడం తను చూడలేదు. కారు ఇంటివేపు బయల్దేరింది.
    "ఈ మాత్రం చిన్న విషయానికి ఎంత హడావుడి చేసేవురా చలపతీ! తలుచు]కొంటే నవ్వొస్తుంది" నవ్వుతూ అన్నాడు అతను.
    "ఆదుర్దా ఏమయినా చేయిస్తుందిరా బాబూ!" తనూ నవ్వేస్తూ అన్నాడు చలపతి.
    ఆ సాయంత్రం చలపతి స్నేహ బృందం అంతా వచ్చి అతనితో కాసేపు గడిపి వెళ్ళారు.
    "పాపం - మీ ఆవిడ సగమై పోయింది ఈ క్షోభకి........." అంది రాజ్యలక్ష్మి.
    "వీళ్ళ ఫ్రెండ్ శ్రీకాంత్ గారు కూడా అంతే. ఎంత శ్రద్ధ తీసుకున్నారో తెలుసా? చలపతి పరిస్థితి ఎలా ఉందీ.....ఆరోజు రెండు మూడు గంటలకోసారి ఆ ఆఫీసుకి ఫోన్ చేసి చెపుతూనే ఉన్నారు......."
    చలపతికి అనందం కలిగింది. అలాంటి స్నేహితుడిని సంపాదించుకోగలిగినందుకు గర్వం కూడా కలిగింది.
    శలవు పూర్తయిన మర్నాడే ఆఫీస్ డ్యూటీ లో జాయినయ్యాడు శ్రీకాంత్! దాంతో చాలా బిజీ అయిపోయాడు. ఉదయం వెళ్ళినవాడు రాత్రి వరకూ ఇంటికి రావడం కుదరలేదు.
    బాగా ఆలస్యమయిపోతే హోటల్ కి వెళ్ళి భోజనం చేసి వస్తున్నాడు. ఈ విషయం సావిత్రి గమనించింది.
    "మీరు ఇంట్లో భోజనం చేయడం లేదేక్కువగా! నిష్టూరంగా అడిగింది శ్రీకాంత్ ని.
    శ్రీకాంత్ లేచి వంటింటి వేపు నడిచాడు. అతన్ని అనుసరించింది సావిత్రి.
    "ఏమిటి మాట్లాడుతున్నారు?" అడిగిందామె.
    "అదే - వాడి ఉద్యోగం పోయిన సంగతి చెపుతున్నాడు...."
    "మధ్యాహ్నం నుంచీ అదో గొడవయిపోయింది!"
    "వాడితో ఇదే చావనుకోండి! అన్నీ సమస్యలుగా తీసుకొంటాడు. ప్రతి చిన్న విషయం కూడా భయంకరంగా కనబడుతుంది వాడికి! అంతెందుకు కాలేజీలో వుండగా వాడు సిగరెట్లు మూలానా కలిగే జబ్బుల గురించి లేక్చరిచ్చాను, అంతే వెంటనే సిగరెట్లు మానేశాడు అక్కడితో ఆగక నానా గాభరాపడిపోయాడనుకొండి. కొంచెం దగ్గు వస్తే 'ఒరేయ్! నాకు టిబి అని అనుమానంగా వుందిరా అంటూ మోత పెట్టేవాడు."
    సావిత్రికి నవ్వాగలేదు. ఇద్దరూ గట్టిగానే నవ్వేశారు.
    వాళ్ళ నవ్వులు విన్న చలపతికి ఎందుకు నవ్వుతున్నారో అర్ధం కాలేదు. కాని నవ్వులో ఏదో కొత్తదనం కనిపించింది. అంత హృదయపూర్వకంగా, నిర్మలంగా ముందెప్పుడూ నవ్వగా తను చూడలేదు. అమెనంతగా ఆకట్టుకొన్న విషయమేమిటి? భోజనం చేస్తున్నంత సేపూ అతనితో అంతగా మాట్లాడాల్సిన అవసరమేమిటి? అసలు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవలసిన విషయాలేముంటాయ్?
    వారు స్నేహితులు కారు! ప్రేమికులు కారు! భార్యాభర్తలు కాదు! కొంచెం పరిచయమున్న వాళ్ళు. అంతే! అంత మాత్రాన్న ఇంత సాన్నిహిత్యం , గంటల తరబడి మాట్లాడుకొనేంత చనువూ, కలిసి నవ్వు కొనేంత సరదా - ఎక్కడి నుంచి వచ్చినఃయ్.
    ఒకవేళ తను హాస్పిటల్లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్యా ఇంతటి అనుబంధాన్ని కలిగించగలిగిన సంఘటనలేమయినా జరిగాయా? చనువుని ఈ విధంగా పెంచేయగలిగినంతగా వారి ప్రవర్తనలో మార్పు లోచ్చినాయా?
    చలపతికి గుర్తు కొచ్చింది. అవును, తనారోజు ఏం చేశాడు హాస్పిటల్ లో చేరడానికి కెళ్ళేముందు , వాళ్ళిద్దరినీ దగ్గరకు పిలిచి వారి చేతులు రెండూ కలిపి, తను తిరిగి రాని పక్షంలో, ఆరోజు నుంచే వారిద్దరూ ఒకటయినట్లు భావించుకోవాలని కోరలేదూ?
    అలాంటి భావనలు మనసులో ఉంచుకొని, ఆ ఇంటిలో అన్ని రోజులు మరొకరు లేకుండా వారిద్దరే మసులుతుంటే ఎలాంటి సంఘటనలూ జరక్కుండా ఎలా ఉంటాయ్? ఇద్దరూ వయసులో ఉన్నవారే. ఇద్దరకూ కోరికలున్నాయ్! ఈనాడు కాకపోతే మరికొన్ని రోజులకయినా తాము ఒకటవుతారన్న విషయం తెలిసినవారే!
    అదీగాక శ్రీకాంత్ కి సావిత్రిలో అతని ప్రియురాలు పోలికలు కనబడుతుంటే నిలవగలగడం సాధ్యమా? అలాంటి అద్భుతమయిన అవకాశాన్ని ఎవరయినా దూరం చేసుకొంటారా? చలపతి ముఖం వివర్ణమయిపోయింది.
    దీని కంతకూ బాధ్యుడు తను. తనో తెలివితక్కువ వెధవ, బుద్దీ హీనుడు. అసలలాంటి భావన ఎందుకు కలుగజేయాలి వాళ్ళకి?
    తను చనిపోతే సావిత్రికి సహాయం చేయమని శ్రీకాంత్ ని అర్ధించాలి గాని వివాహం చేసుకోమని అడగటం ఏమిటి? బ్రతిమాలి వప్పించడం ఏమిటి? అక్కడితో ఆగక ఇద్దరి చేతులూ కలపడమేమిటి? ఇంతకంటే అవివేకమేమయినా ఉంటుందా? తనకంటే చాదస్తుడింకెవడయినా ఉంటాడా?
    చలపతి నిస్సహాయంగా కళ్ళు మూసుకున్నాడు.
    వారిద్దరూ మూర్ఖత్వాన్ని ఆధారంగా తీసుకుని హాయిగా ప్రేమ కలాపాలు మొదలు పెట్టారు. తన తెలివితక్కువ ఆసరాగా తీసుకుని తన కళ్ళే మూసి ఆటలాడుతున్నారు. సావిత్రి పతివ్రతే. తనకు నమ్మకముంది? కాని ఆ ప్రాతివత్యం ఎన్నాళ్ళుంటుంది?
    మొగుడు మూడొందలు సంపాదించుకొనే గుమాస్తా పక్షి! శ్రీకాంత్ లక్షాధికారి ! గొప్ప పదవిలో ఉన్న ఆఫీసరు.
    మొగుడు మలక్ పేటలో డెబ్భై అయుడురూపాయల అద్దె ఇంటిలో , ఇరుకు గదుల్లో ఉంటాడు. శ్రీకాంత్ సినిమా సెట్టింగ్ లా కనిపించే భవనంలో ఉంటాడు.
    మొగుడుగాడు అన్నీ వాడే అయి చూసుకోవాలి. శ్రీకాంత్ కి ఎంతమంది నౌకర్లు కావాలన్నా వినియోగించుకొనే తాహతు ఉంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra