Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర

 

         రేపు సరిగ్గా ఈ సమయానికి తను అరెస్ట్ చేయబడతానని అతడికి తెలుసు. ఎంత లేదన్నా సాయంత్రం వరకూ పోలీస్ స్టేషన్ లో, కోర్టులో గడపాలి.
   
    అతడికేం చేయాలో తోచలేదు.
   
    తనకోసం ఆమె అక్కడ ఎదురుచూస్తున్న సమయానికి ఇక్కడతనని అరెస్ట్ చేయటానికి ఇన్ స్పెక్టర్ వస్తాడు. ఇది ఇలా జరక్కుండా, ఆమెకి దీని సంగతి ముందే తెలియాలి. అంటే....శర్మ చెప్పాలి.
   
    కానీ ఆయన చెప్పుతాడని తను అనుకోవటం లేదు. ప్రొద్దున్నే ఆఫీసుకు బయల్దేరినట్టు వెళ్ళి, సాయంత్రం కోర్టునుంచి తిరిగొస్తాడు. ఆమె ఇదంతా పేపర్లో చదివి తెల్సుకోవాల్సిందే.
   
    ఏది ఏమైనా రేపామె తనకోసం ఎదురుచూస్తుంది.
   
    తను కలుసుకోవాలి.
   
    లేదా ఫోన్ చేసి ప్రోగ్రాం ఎల్లుండికి మార్చుకొమ్మని చెప్పాలి. అతడి చెయ్యి ఫోన్ వరకూ వెళ్ళి ఆగిపోయింది.
   
    శర్మగారు తీస్తే...?
   
    ఏదో తప్పు చేస్తున్న భావన.
   
    ఒకవేళ ఆమె ఎత్తినా కూడా-ఏం మాట్లాడతాడు? రేపు కాదు. రేపు అరెస్ట్ అవబోతున్నాం. ఎల్లుండి కలుసుకుందాం- అని చెపుతాడా? అసలు కలుసుకున్న కొద్దిసేపటివరకూ, లేక మాట్లాడవలసిన సందర్భం వచ్చిన కొద్దిసేపటివరకూ తను మాట్లాడగలడా?
   
    శర్మగారి భార్య చాలా అందంగా వుంటుంది అని అందరూ అనుకోవటం అతడు చాలాసార్లు విన్నాడు. మాధవే రకరకాలుగా అసూయపడింది. కానీ ఇప్పుడు అతడు ఈ అలౌకికమైన స్థితిలో వున్నది ఆమె అందాన్ని తల్చుకుని కాదు, జీవితపు మెటాఫిజికల్ ఎమ్జీనెస్ ని భాషలోకి ఆమె అనువదించిన వైనాన్ని తలుచుకుని! తన శూన్యతను గురించి ఎవరికైనా ఉత్తరం వ్రాయవలసి వస్తే తను అచ్చు యిలాగే వ్రాసేవాడు!
   
    ఒక గుడ్డివాడికి మరో మూగవాడు తోడైన భావం.
   
    అయినా తోడున్నాడనే అభయం.
   
    రకరకాల ఆలోచన్లలో అతడు చాలాసేపు నిద్ర లేకుండా గడిపాడు.
   
    రేపేం చేయాలన్నదే ప్రశ్న.
   
    ఎటువంటి పరిస్థితుల్లోనైనా "తాజ్" కి వెళ్ళాలి ఆమెని చూడాలి. కలుసు కోవాలి. మాట్లాడాలి.
   
    అప్పుడొచ్చింది అతడికి ఆలోచన..... మొత్తం దైరెక్టర్లందర్నీ బయట పడెయ్యగల ఆలోచన.
   
    అతడు మరి ఆలస్యం చేయలేదు.
   
    రాత్రి రెండవుతూంది.
   
    ఫోన్ దగ్గిరకి లాక్కొని వరుసగా ఫోన్ లు చేయడం ప్రారంభించాడు.
   
                           12
   

    డిప్రెషన్ అనేది ఒక మేఘం లాంటిది. చుట్టూ కమ్ముకుని వుంటుంది. అదీ మానసికమైనది.... డిప్రెషన్ లో వున్నప్పుడు ఏమీ తోచదు. ఆలోచన సాగదు. డిప్రెషన్ రావటానికి ప్రాణాలు పోయేటంత సమస్యకూడా అవసరం లేదు. చిన్న చిన్న కారణాలు చాలు. అయితే చిన్న సూర్యకిరణం మబ్బుల్ని చెదరకొట్టినట్టు, డిప్రెషన్ ని (తాత్కాలికంగానైనా కనీసం) పోగొట్టటానికి చిన్న సంఘటన చాలు. అతడి విషయంలో అదే జరిగింది.
   
    తనను ఒక స్త్రీ గమనిస్తూ వుంది.
   
    ఇంతకాలం తన వెనుక వుండి తన విజయాన్ని గమనిస్తూంది.

    ఆమె గురించి అతడికేమీ తెలియదు. సౌందర్యవతి అని తెలుసు. అప్పటి అందం లీలగా జ్ఞాపకం వుంది. ఈ ఉత్తరంలో అణువణువునా భావుకత తొణికిసలాడుతూ వుంది.
   
    వాన గుంటలో నీరైనా చాలనుకునేటంత దాహంతో కొట్టుకుంటున్న మనిషిని అకస్మాత్తుగా నారికేళ జాలం దొరికిన ఉద్వేగం. ఉహూ, ఇది సరియైన ఉపమానం కాదు..... అతడెప్పుడూ పరాయి స్త్రీని కోరలేదు. తన దురదృష్టం స్వభావికమైనది.
   
    అది ఎవరూ బాగుపర్చలేనిది అనుకుంటూ వచ్చాడు ఇప్పటివరకూ! ముందే చెప్పినట్టు పనిలో స్వాంతన పొందాడు, కానీ ఇప్పుడు హఠాత్తుగా ఏదో కొత్తద్వారాలు తెరుచుకున్నట్టు అనిపించింది. షోకేస్ లో తన చీరెకట్టు చూడటానికి పనికట్టుకొచ్చిన అమ్మాయి ఈమే! గోపీమాధుర్ చెంప బ్రద్దలు కొట్టింది ఈమే!
   
    ...మనసు విహంగమై ఎగిరిపోతున్న భావన. ఆ నాలుగు పేజీల ఉత్తరం, అతడిని నిలువునా వూపేస్తుంది. రవ్వంత ఆప్యాయతకు నోచుకోనివాళ్ళకూ, జీవితంలో ప్రేమకోసం తహతహలాడే వాళ్ళకూ, తాము చేసిన పనికి దొరకనివాళ్ళకూ-
   
    వాళ్ళకే తెలుస్తుంది దాని విలువ.
   
    ఎక్కడో సుదీర తీరాలనుంచి వేణునాదం అస్పష్టంగా వినిపించి మనసుని పరవశం చేస్తున్నట్టు వుంది.
   
    ఈ పదిహేను సంవత్సరాల్లో ఆమె మొహం మశూచివల్ల అంధ విహీనమైపోయి వుండవచ్చు. లేదా వృద్దాప్యం ఆమెని ముఫ్ఫై అయిదేళ్ళకే మింగేసి వుండవచ్చు. అతడి ఆలోచన ఆ కారణంతో సాగలేదు. పరిచయానికి వాంఛ క్లైమాక్స్ కావచ్చు. కానీ వాంఛ పరిచయానికి నాంది కాదు. ముఖ్యంగా అతడి విషయం.... చిన్న పిల్లవాడి మనస్తత్వం. గోలు కొట్టగానే స్టిక్ గాలిలోకి ఎగరేసి పిచ్చెక్కినట్టు వూగిపోయే క్రీడాకారుడికి తెలుస్తుంది ఒక చిన్న అభినందన.....ప్రేక్షకుల్లోంచి చప్పట్ల పొగడ్త.....వెన్ను నిమిరి, నిన్ను నేను గమనిస్తున్నాను సుమా అన్న చిన్న సూచన.....అని ఇచ్చే ఆనందం ఏమిటో....
   
    ఆ ఆనందం ఇచ్చిన కొత్త శక్తితో, రాత్రి రెండింటివరకూ ఫోన్ లు చేస్తూనే వున్నాడు దాదాపు యాభైవేళా రూపాయలకి ఒక చిన్న సైజు మాఫియా లీడరుతో అగ్రిమెంటు కుదిరింది. మిగతాదంతా వాళ్ళు చూసుకుంటామని హామీ ఇచ్చారు.
   
    వాళ్ళు సరిగ్గా ఆ పని నిర్వర్తిస్తారా లేదా అన్న ఆలోచన కన్నా, రేపు పదింటికి జరగబోయే సంఘటన తాలూకు ఆలోచన్లతో మరి నిద్రపట్టలేదు. ఏడింటికీ లేచి తయారయ్యాడు.
   
    ఎనిమిది..... ఎనిమిదిన్నర ఒక్కొక్క డైరెక్టర్ నుంచే ఫోన్ రాసాగింది. 'ఇంకా ఇన్ స్పెక్టర్ రాలేదేమిటి' అని.
   
    తన పథకం ఫలిస్తున్నట్లు తోచింది. 'నేనిప్పుడే ఆఫీసుకి వస్తున్నాను. మీరూ అక్కడికే వచ్చేయండి. అక్కడ చెపుతాను వివరాలు" అన్నాడు.
   
    తొమ్మిదింటికల్లా దైరెక్టర్లందరూ ఆఫీసులో సమావేశమయ్యారు. అందరి మొహాల్లోనూ ప్రశ్నార్ధకం స్పష్టంగా కనిపిస్తోంది. అతడు పోలీసు స్టేషన్ కి ఫోన్ చేశాడు. అట్నుంచి ఇన్ స్పెక్టర్ "మీరా? ఇప్పుడే మీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. ఐ యామ్ సారీ నిన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు".
   
    "ఏమిటి, ఏమయింది?"
   
    "ఈ చీరెల మీద డిజైన్లు ప్రింటుచేసే పరికరాలున్న ఇల్లువూరికి ఇరవైమైళ్ళు అవతల దొరికింది. ఎవరో ఇన్పార్మెంట్ ద్వారా తెలిసింది ఈ విషయం. తెల్లవారు జామున నాలుగింటికి దాడి చేశాం".
   
    "ఎవరైనా దొరికారా?"
   
    "ఒకడు దొరికాడు. కానీ వాడికేమీ తెలీదు. కేవలం అచ్చులొత్తేవాడు మాత్రమే. మిగతావాళ్ళకోసం వెతుకుతున్నాం. ఈ రాకెట్ త్వరలోనే బయటపడుతుందని మాకు విశ్వాసం వుంది. ఆ ఇంట్లోనే ముంబాయి రైల్వే టిక్కెట్లు కూడా దొరికాయి. ఈ చీరెలు పట్టుకుని వాళ్ళ యజమాని తరచు ముంబాయి వెళ్ళేవాడని ఆ దొరికినవాడు చెప్పాడు. వాడికింతకన్న ఎక్కువ తెలీదు-"
   
    "మొత్తానికి మమ్మల్ని అరెస్టు చేయటంలేదు. అంతేనా!"
   
    "ఇన్ని వివరాలు తెలిశాక కూడా మిమ్మల్ని అరెస్టు చేస్తే ఐదు లక్షలకి తక్కువ కాకుండా పరువునష్టం దావా వెయ్యరూ?"
   
    "ఛాఛా, అలాంటిదేమీ లేదు కానీ వాళ్ళని తొందరగా పట్టుకోండి ఇన్ స్పెక్టర్!"
   
    "తప్పకుండా!"
   
    ఫోన్ పెట్టేసి, రవితేజ తనవైపే ఆతృతతో చూస్తున్న డైరెక్టర్లకి జరిగిన సంగతంతా చెప్పాడు. తనుచేసిన ఏర్పాట్ల విషయం కూడా.
   
    రెండు నిముషాలపాటు ఆ గదిలో తుఫానులాటి అలజడితో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. పరస్పరాభినందనల్తో మార్మోగింది. అందరి మొహాల్లోనూ అప్పటివరకూ వున్న టెన్షన్ ఎవరో చేత్తో తీసేసినట్టు పోయింది. ముంచేస్తుందనుకున్న కెరటం వెనక్కి వెళ్ళిపోయినట్టు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
   
    రవితేజకి వచ్చిన ఆలోచనకి అందరూ అతడిని అభినందించారు. చట్టం పరిధి ఎంత చిన్నదో తల్చుకుంటుంటే అతడిక్కూడా ఆశ్చర్యంగానే వుంది......అయినా సాధించాడు. అదీ సంతోషం. ఈ రోజు సాధించిన విషయం తక్కువేమీ కాదు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra