గబగబా చీర మార్చుకుని, బొట్టు పెట్టుకుని జలజతో బయలుదేరింది. ఏ వ్యక్తీ కారణంగా తను భర్తతో విడిపోయి, ఇన్నేళ్ళు దూరంగా గడిపిందో ఆ వ్యక్తీ అండతో కూతురి జాడ తెలుసుకోవడానికి బయలుదేరడం చాలా ఐరానికల్ గా తోచింది. తీరా వీధిలోకి అడుగు పెట్టాక చూపు ఎటు తిప్పాలన్నా భయమే కలిగింది. ఏ చెత్త కుప్పలోనైన వొంటి నిండా దెబ్బలతో, "అమ్మా! అని పిలవడానికి కూడా శక్తి కేలుండా సోమ్మ సిల్లి పడిపోలేదు కదా! ఏ ఇంటిముందైనా తెలివి తప్పి పడివుంటే ఆ ఇంటి యిల్లాలు జాలి పడి లోపలికి తీసుకుపోలేదుకదా! ఎలా తెలుస్తుంది తనకి.
వరసగా ఒక్కో హాస్పిటల్ చూసుకుంటూ వెళ్తున్నారు. ఒక హాస్పిటల్ లో అదేరోజు దెబ్బలు తగిలి ఎడ్మిట్ అయిన ఒక అమ్మాయి వుందని తెలిసింది. ఆ అమ్మాయిని ఎవరూ ఐదేంటి పై చెయ్యలేదట అప్పటి వరకు. నర్షు వాళ్ళని పేషంటు దగ్గరికి తీసుకెళ్ళింది. ఉపిరి బిగపెట్టి ఆ పేషెంటుని చూసింది అణు. రాగ కాదు ఎవరో మరొక దురదృష్టవంతురాలు. హిట్ ఎండ్ రన్ కేస్ ఆ అమ్మాయికి దాదాపు పన్నెంళ్ళుండవచ్చు వొంటి మీద స్పృహ లేదు. హాస్పిటల్ వాతావరణంలో అణుకి తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. క్షణక్షణానికి టెన్షన్ భరించలేకపోతోంది. మంచి గాని చెడుగాని ఏదో ఒక విషయం నిర్ధారణ తెలిసిపోతే బాగుండుననిపోస్తోంది.
తరువాత్ యిద్దరూ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళారు. అదొక పెద్ద సముద్రంలా వుంది. ఒకళ్ళ మాట వొకరు వినిపించుకోరు. జలజ ఎక్కడి కక్కడ డబాయింపుగా మాట్లాడుతుంటే కాస్త నిలబడి సమాధానాలు చెప్తున్నారు.
"ఈరోజు మూడు ఏక్సిడెంటు కేసులు ఎమర్జన్సీ వార్డులో వున్నాయి చూసుకోండి" ఎమర్జన్సీ వార్డు చిన్న సైజు నరకంలా వుంది. కొందరు రోగులు సీరియస్ గా వుంటే, ప్రాణాలు పోయిన రోగుల చుట్టూ ట్రయాంగిలర్ కర్టేన్స్ వేసేస్తున్నారు. ఎమర్జన్సీ వార్డు లోనికి బయటివాళ్ళని రానియారు. డాక్టరు పర్మిషన్ తీసుకుని అణుని లోపలికి తీసుకెళ్ళింది జలజ. ఏక్సిడెంట్ గురైన ముగ్గురు పేషెంట్స్ ని భయపడుతూ చూసింది అణు. వాళ్ళలో రాగ లేదు. తేలిగ్గా నిట్టూర్చింది. ఇంక ఒక్క ప్రైవేట్ నర్సింగ్ హోం మిగిలింది. అక్కడికి కూడా వెళ్ళారు.
"ఈ హాస్పిటల్ లో ఏక్సిడెంట్ పాలైన వాళ్ళెవరు లేరు. కాని వొంటి నిండా దెబ్బలు తగిలిన వొకాయినని ఎవరో ఇవాళే హాస్పిటల్ లో చేర్పించారు. ఆయనేవరైంది మాకు యింకా తెలియదు చెప్పింది డ్యుటి డాక్టర్.
"మనకెందుకు పోదాం" అంది అణు విసుగ్గా "చూద్దాం" అంది జలజ కుతూహలంగా.
ఆ పేషెంటు ఉన్నాడని డాక్టర్ చెప్పిన రూమ్ లోకి వెళ్ళి "అరె!" అని నిలబడిపోయింది. తొంగిచూసింది అణు అక్కడ బెడ్ మీద వొంటినిండా గాయాలతో జీవన్.
రాగని తీసుకుని భువనేశ్వరి దేవాలయం వెనక ఆవరణకి చేరుకుంది యమ్మాయమ్మ. "పాపా! నువు గట్టిగా అరవకు గోల చెయ్యకు. బుద్దిగా వుంటే నిన్ను మీ డాడీ దగ్గరికి తీసుకెళ్తాను." మరోసారి నచ్చజేప్పింది రాగకి. భువనేశ్వర్ దేవాలయం రాగకి కొంత పరిచయమే. తల్లితోను తాతతోను చాలా సార్లు వచ్చింది. గుడి ఆవరణ, ఆవరణలో ఉన్న ఇరవై నాలుగు చిన్న చిన్న గుడులు, ఆ గుళ్ళలో వున్న విఘ్నేశ్వరుడు లక్ష్మిదేవి మొదలైన విగ్రహాలని లింగరాజు ఆలయం ఎదురుగా వున్న నండి విగ్రహం యివన్నీ రాగ తనే ఉత్సాహంగా చూపించింది యమ్మాయమ్మకి అలయమంతా చూస్తున్నట్టు నటిస్తున్నా యమాయమ్మా మనసులో గాభారగానే వుంది.
రాగకి బాగా పరిచయమున్న ఆ ప్రదేశంలో ఆ ప్రదేశంలో ఆ పాపకి తెలిసిన వాళ్ళెవరైనా కనిపిస్తే కొంప మునుగుతోంది అంతలో గోవింద్ సింగ్, సుబ్బయ్య వచ్చారు. యమ్మాయమ్మ అతనితో రహస్యంగా "రాగ తెలివితో వుంటే మనకి ప్రమాదం. తెలివి తప్పే ఏదో ఒక మెడిసిన్ తెచ్చి రుమాలు పైన జల్లి పట్రా," అని చెప్పింది. సుబ్బయ్య అలాగే తీసుకువచ్చాడు. ముఖానికి పట్టిన చెమట తుడుస్తున్నట్లు చాకచక్యంగా ఆ రుమాలు వాసన చూపించింది రాగకి. రాగ తెలివి తప్పిపోయింది. బాసింపట్టా వేసుకుని రాగని వొళ్ళో బోర్లగిల పడుకోబెట్టుకుని గోవింద్ సింగు సుబ్బయ్యతో జాన్ రాక కోసం ఎదురు చూడసాగింది. చూసే వాళ్ళకి భార్య భర్తలు కూతురితో కలిసి దైవదర్శనానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఒంటి మీద అక్కడక్కడ దెబ్బలు తగిలాయి రక్తం చిమ్ముతున్నాయి. తన పార్టనర్స్ ఇద్దరినీ చూసి ఒక పచ్చి బూతు మాట విసిరి, "దొంగనాకొడుకు నన్నే డబుల్ క్రాస్ చెయ్యాలని చూస్తున్నాడు," అన్నాడు.
"ఏం జరిగింది?" అడిగాడు సుబ్బయ్య.
"అలం......కొడుకు కూతుర్నేత్తుకు రమ్మని నన్ను పంపాడు. తీరా నేనిక్కడికి వచ్చేసరికి నా కంటే ముందు ఆడు తయ్యారయ్యాడి యిడకి. నడిరోడ్డు మీద నన్ను నిలేసి, "నువు చిన్నపిల్లల్ని....." అని ఆగిపోయి గొంతు సవరించుకుని "నోటికొచ్చినట్లు వాగి నన్ను పోలిసొళ్ళకి అప్పజేప్పుతానని కూర్చున్నాడు. ఎదవని పచ్చడి కింద వుతికేసి రోడ్డుమీద కిసిరేసాను. "చేతులు దులుపుకున్నాడు జాన్. చేతులకంటుకున్నది ఏదో దులుపుకున్నట్లు అప్పుడు చూశాడు యమ్మాయమ్మ చేతుల్లో వున్న రాగని.
"ఓర్నీ! ఆ పిల్ల దొరికిందన్న మాట. మన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే ఇంకాడు పోలిసొళ్ళకి ఎట్టా రిపోర్టు చేస్తాడో చూస్తా" హుషారుగా అన్నాడు. అప్రయత్నంగా పాపని దగ్గరగా అదుముకుంది యమ్మాయమ్మ తన చుట్టూ తనకు సంబంధించి అల్లబడుతున్న పధకాలు ఏమి తెలియకుండా అమాయకంగా కళ్ళు మూసుకుని వుంది రాగ. తెలివి తప్పి వున్న దశలో గూడా యమ్మాయమ్మ చెయ్యి రాగ చేతిలోనే వుంది. అది విసిపించుకోడానికి ప్రయత్నం చెయ్యలేదామే సుబ్బయ్య జాన్ ని నిశితంగా పరిశీలించాడు. అతని కనుబొమ్మలు ఆలోచనగా ముడిపడ్డాయి.
"ఇంకాస్సేపటిలో గుడి మూసేస్తారు. మనం వెంటనే ఎక్కడి కైనా బయల్దేరాలి," అన్నాడు.
"అణువేద మాములు మనిషి కాదు. ప్రఖ్యాత నాట్యకత్తె. అంతేకాదు ఇక్కడొక డాన్సు స్కూలు నడుపుతోంది. ఈపాటికి యీ ప్రాంతంలో పోలీసులు హెచ్చరికగా వుండి వుంటారు.
ముందు పోలీసులకి అనుమానం కలగని చోటికి చేరుకోవాలి." చెప్పింది యమ్మాయమ్మ ముగ్గురిలో ఎప్పటికప్పుడు తెలివిగా ఆలోచిస్తూ సలహాలిచ్చేది యమ్మాయమ్మే.
"టాక్సీలో కోణార్క చేరుకుందాము," అన్నాడు జాన్.
"చాలా డబ్బు ఖర్చవుతుందేమో?" అనుమానంగా అన్నాడు సుబ్బయ్య.
"ఏం ఫరవాలేదు ఇంతకీ పదిరెట్లు ఆ లం.....కొడుకు దగ్గిర ముక్కు పిండి వసూలు చేస్తాను. నా మీద చెయ్యి చేసుకుంటాడా! ఎవర్నుకుంటున్నాడో!" కోపంగా బుసలు కొట్టాడు. జాన్ చూపులు రాగ మీదే వున్నాయి. ఆ చూపులు ఎదురుగా వున్న ఏరని చూస్తున్న చిరుతపూలు చూపుల్లా వున్నాయి. జాన్ టాక్సీ పిలిచాడు. టాక్సీ డ్రైవర్ కి ఒరియా తప్ప తెలుగు రాదు. అప్పుడు యమ్మాయమ్మ వచ్చి ఇంగ్లీషులో "కోణార్కకి టాక్సీ కావలి" అంది. భారతదేశంలో అన్నీ రాష్ట్రాలలోను యింగ్లిషు మాట్లాడే వాళ్ళకి మంచి గౌరవం వుంది. టాక్సీ డ్రైవర్ కి వారి ముగ్గురి పైన ఏవిధమైన అనుమానం రాలేదు. ముగ్గురూ టాక్సీలో కోణార్క సూర్యదేవాలయం చేరుకున్నారు. టాక్సీ వాణ్ని పంపేసి, " యిక్కడికి దగ్గిర్లో నాకు తెలిసిన ఫ్రెండ్ యిల్లు వుంది అక్కడికి వెళ్దాం, " అన్నాడు జాన్ దేవాలయం దగ్గర్నుంచి ఐదారు ఫర్లాంగులు టౌన్ అవుట్ స్కర్ట్స్ లోకి నడిచాక "ఇక్కడే" అన్నాడు జాన్ అవన్నీ గుడిసెలు దాదాపు పాతిక గుడిసెలవరకూ వుంటాయి . అడ, మగ బిలబిల్లాడు తున్నారు జనం.
కొంచెం దూరంలోనే కళ్ళు పాక మగవాళ్ళు ముంత తరువాత ముంత పట్టిస్తూ అర్ధం పర్ధం లేకుండా వాగుతున్నారు. కొందరు పెళ్ళాలని కొడ్తున్నారు. ఆ పెళ్ళాలు మొగాళ్ళని నోటికొచ్చినట్లు తిడుతున్నారు. పిల్లలు కొందరు ఒకరితో ఒకరు కొట్టు కుంటున్నారు. మరికొందరు యిళ్ళల్లోంచి ఏవో తెచ్చుకుని తింటున్నారు. వచ్చి రాని వయస్సుల్లో ఉన్న మగపిల్లలు కొందరు డబ్బులు పెట్టి బచ్చాలాడుకుంటున్నారు. వయసులో వున్న ఆడపిల్లలు గుంపులుగా చేరి కొత్తగా వచ్చిన సినిమా పాటలు ఒకరి కొకరు నేర్పుకుంటున్నారు. వాతావరణమంతా ఒరియా భాషలో గోలగోలగా వుంది. ఆ గుడిసెల ముందు నిలబడి," సేనాపతి!" అని పిలిచాడు జాన్ పైన బనియను లేకుండా పైజామా వేసుకున్న నడి వయసు మనిషి బయటికొచ్చి, "ఇటొచ్చినా వెందిరోయి? బేరం తగిలిందా యిటు" అన్నాడు.