Home » Dr c. ananda ramam » Gullo Velasina Devathalu

"అదేమిటి మేడమ్ అలా అంటారు? నేను డాన్స్ ప్రోగ్రామ్స్ మానను. నేను మంచిదనుకున్న కార్యక్రమాన్ని ఎందుకు మానాలి? జీవితంలో పెళ్ళి ప్రధానమే కావచ్చు  కాని, అదే పరమార్ధం కాదు. పరవాలేదు, నేను పెళ్ళి లేకపోయినా ఉండగలను."
    దృఢ నిశ్చయంతో అంది నళిని...పావని మనసు పొంగిపోయింది.
    సమాజంలో అనుపమలాంటి ఆడవాళ్ళే అధిక సంఖ్యాకులు. అయినా నళిని లాంటి వాళ్ళు కూడా ఒకరిద్దరు లేకపోలేదు. ఆ ఒకరిద్దరివల్లనే ఏ నాటికైనా సమాజం బాగుపడాలి.
    భాగీరదమ్మ ఒకనాడు సంఘానికి వచ్చింది. ఆపాదమస్తకమూ భగ్గుమనే కోపాన్నీ, అసహ్యాన్నీ అణచుకుంటూ "ఏం కావాలి?" అంది పావని.
    "నన్ను క్షమించండి. ఇన్నాళ్ళూ మీ సంఘానికి వ్యతిరేకంగా ప్రచారం చేసాను. ఇప్పటికి మీ సంఘం ఆదర్శాలు అర్ధంచేసుకున్నాను." అంది భాగీరదమ్మ.
    భాగీరదమ్మ లాంటి వ్యక్తి తనంతట తను క్షమించమంటూ రావటమా?
    పావని సందేహానికి వెంటనే సమాధానం దొరికింది.
    "నేను పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాను. అందుకు మీ సంఘం అండదండలు కావాలి!"
    మెలికలు తిరిగిపోతూ, సిగ్గుపడిపోతూ అంది భాగీరదమ్మ....వృద్ధవేశ్య కులుకులు చూపిస్తున్నట్లుగా ఉంది ఆ సిగ్గుపడటం.
    మరొకసారి నిర్ఘాంతపోయింది పావని.
    "మీకు పెళ్ళా! ..." అనేసింది చటుక్కున.
    భాగీరధమ్మ చిన్న బుచ్చుకుంది.
    "ఈ వయసులో పెళ్ళి ఏమిటని కదూ! దిగుళ్ళవల్లా, పూజలవల్లా, ఉపవాసాల వల్లా, నా వయసు కాస్త ఎక్కువగా కనిపిస్తుంది కాని, నిజానికి నాకు మూడు పదులు నిండలేదు."
    తన వయసు చాలా తక్కువని నిరూపించుకోవటానికి తాపత్రయపడే ఆ భక్తురాలి  ముఖంలోకి చూడలేక తల దించుకుంది పావని.
    "నాకు ఆర్దికసహాయమేమీ అక్కర్లేదు. ఊరికే అండగా ఉండి మీ సంఘంలో పెళ్ళి జరిపిస్తే చాలు!"
    ఇదేమిటో అర్ధంకాలేదు పావనికి...
    "హాయిగా ఏ గుళ్ళోనో చేసుకోరాదూ! ఈ మాత్రం దానికి సంఘం అండదేనికి?"
    "చేసుకోవచ్చు ననుకోండి. కానీ ఇంతకాలం హరి దాసిగా ఉండి ఇప్పుడు పెళ్ళి చేసుకుంటున్నాను, అంటే బాగుండదు చూడండి."
    "ఎందుకు బాగుండదూ? హరిదాసులూ, హరిదాసినులూ పెళ్ళిళ్ళు చేసుకోరూ!"
    "అది వేరు...ఇన్నాళ్ళు పెళ్ళి లేకుండా ఉండి పవిత్రురాలినని పేరు సంపాదించుకుని ఇప్పుడు అకస్మాత్తుగా పెళ్ళికూతురి నయితే నవ్వుతారేమోనని... మీ బోటివారు బలవంతపెట్టి పెళ్ళి చేశారంటే కాస్త బాగుంటుంది..."
    ఇప్పటికి భాగీరధమ్మ ఉద్దేశం అర్ధమయింది. నువ్వు ఆపుకోలేక పకపక నవ్వేసింది. భాగీరధమ్మకి రోషంవచ్చింది.  అయినా హన అవసరం కనుక అణచుకుంది.
    "మీ సంఘానికి వెయ్యిరూపాయలు విరాళంగా ఇస్తాను" అంది.
    తను నవ్వినా రోషం తెచ్చుకోకుండా ఎదురువిరాళం ఇస్తానంటూ బ్రతిమాలుతోన్న భాగీరదమ్మను చూస్తే జాలి కలిగింది పావనికి.
    ఏ వయసు అయితేనేం? ఈ కోరికలకు తీరటం అంటూ ఉండదేమో! పాపం, అందులో ఈ భాగీరదమ్మ మొదటినుండీ జీవితాన్ని ఏమీ అనుభవించలేదు. తన కోరికలను ఈనాటికైనా సక్రమ మార్గాన తీర్చుకోవాలని తాపత్రయపడుతోంది. తనలో కోరికలున్నాయని ఒప్పుకోవటానికి సిగ్గుపడుతోంది ఇందులో తప్పేముంది?
    "భాగీరధమ్మగారూ! మే మే మిమ్మల్ని ప్రోత్సహించి వివాహం జరిపించామని ఒప్పుకోవటానికి నాకు అభ్యంతరంలేదు. కానీ... మరోలా అనుకోకండి.... మీకు పెళ్ళికొడుకును చూడటం కష్టంకదూ!"
    పావని ఈమాత్రం ఆదరంగా మాట్లాడేసరికి భాగీరదమ్మ ముఖం వికసించింది.
    "పెళ్ళికొడుకు సిద్దంగానే ఉన్నాడు." మరొక్కసారి సిగ్గుపడుతూ అంది.
    భాగీరదమ్మ సిగ్గుపడినప్పుడల్లా చూడటానికి పావనికి ప్రాణాంతకంగా ఉంటోంది.
    "ఆయన పెళ్ళి చేసుకోమని ఎప్పటినుండో అడుగుతున్నారు. 'కృష్ణా, రామా!' అంటూ బ్రతుకుతోన్న నాకు మళ్ళీ పెళ్ళిగోల ఎందుకని ఒప్పుకోలేదు కానీ, ఆయనే "ఆడదానికి పతి పదసేవే తారక" మని పదేపదే చెప్పి ప్రాధేయపడ్డారు. పతిసేవా సౌభాగ్యాన్ని పొందాలనే ఆశతో సరే నన్నాను చివరికి."
    పావనికి నవ్వు వచ్చేస్తూంది. అతిప్రయత్నంమీద అణచుకుంది. "చింత చచ్చినా పులుపు చావలేదు" అనుకుంటూ "సరే! మీరు ముహూర్తం నిర్ణయించి తెలియజెయ్యండి. మా సంఘంలో పెళ్ళి జరిపిస్తాం" అంది పావని.
    పట్టరాని ఆనందంతో వెళ్ళిపోయింది భాగీరదమ్మ. భాగీరదమ్మ నిర్ణయించిన ముహూర్తానికి సంఘంలో పెళ్ళి ఏర్పాట్లు చేసింది పావని విద్యార్ధినులకు కూడా ఇది తమాషాగా ఉంది "అమ్మమ్మగారి పెళ్ళి" అని నవ్వుకుంటూ హుషారుగా పనులు చేస్తున్నారు. ఊళ్ళో జనం మాత్రం "ఈ సంఘానికి మరీ పోయేకాలం! భాగీరదమ్మకు పెళ్ళి చెయ్యటమేమిటి?" అన్నారు కొందరు సన్నసన్నగా "ఆవిడ బుల్లిపాపాయి కాదుగా! ఇష్టంలేకుండా ఎవరు పెళ్ళిచెయ్యగలరూ?" అన్నారు.
    మొత్తానికి భాగీరదమ్మ పెళ్ళి చూడటానికి జనం విరగబడి వచ్చాడు. ముహూర్తం సమీపించింది. పెళ్ళికూతురూ రాలేదు. పెళ్ళికొడుకూ రాలేదు. సంగతేమిటో తెలుసుకుందామని పావని కొందరు విదార్దినులతో భాగీరదమ్మ ఇంటికి వెళ్ళింది.
    ఆ ఇంటిచుట్టూ కొందరు జనం మూగి ఉన్నారు. గందరగోళంగా ఉంది. పావనిలోపలికి వెళ్ళింది భాగీరదమ్మ ఇనప్పెట్టె తెరిచి ఉంది. వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. వాటి మధ్య చలనం లేకుండా కూర్చుని ఉంది భాగీరదమ్మ.
    చుట్టుపక్కల పోగయిన జనం మాటల బట్టి భాగీరదమ్మ ఎంచుకున్న పెళ్ళి కొడుకు, లేదా బాగీరదమ్మణు ఎంచుకున్న పెళ్ళికొడుకు, ఆవిడకంటే ఆవిడ డబ్బుకు ప్రాధాన్యమిచ్చి ఆవిడను వదిలి దానితో పరారిఅయిపోయాడు...పాపం! భాగీరదమ్మకు పతిపద సేవాసౌభాగ్యం దక్కకపోగా, కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుకూడా దూరమయింది.
    ఆ సమయంలో భాగీరదమ్మను ఏమని ఓదార్చాలో అర్ధంకాక మౌనంగా వెనక్కుతిరిగి వచ్చేసింది. పెళ్ళి చూద్దామని వచ్చిన వారందరికీ విషయం తెలిసింది ఒకనాడు భాగీరదమ్మకు వంతపాడిన భజనబృందాలే ఈనాడు ఆవిడ భంగపాటుకు నవ్వుకుంటూ వెళ్ళిపోయాయి.
    కొన్నాళ్ళ తరువాత చెదిరిపోయిన జుట్టుతో, నలిగిపోయిన బట్టలతో రోడ్డు మీద సణుక్కుంటూ వెళ్తోంది ఒక నడివయసు యువతి.
    "నేను పవిత్రురాలిని. పరమపవిత్రురాలిని. ఎన్నడూ పరపురుషున్ని కన్నెత్తి అయినా చూడలేదు. స్త్రీకి శీలం ప్రధానం...ఆడదన్నాక మొగుడికి అణిగి మణిగి పడిఉండాలి. అత్తమామలకు సేవలు చెయ్యాలి. ఆడబిడ్డల అధార్టీలకు లొంగిపోవాలి....పురాణాలు చెప్పటంలా? సావిత్రి, దమయంతి, ఎలాంటి పతివ్రతలు? వెధవకాలం! పిదపకాలం, జనం తెలివిమీరిపోతున్నారు. పాడు సంఘాలు! నీతీ నియమంలేని సంఘాలు! ఈ సంఘాలే నాకు....అగ్నిహోత్రంలాంటి నాకు పెళ్ళి చెయ్యాలని తలపెట్టాయి-ఆ శ్రీరామచంద్రుడే కాపాడాడు నన్ను..."
    ఆ వ్యక్తిని నిదానించి చూసి భాగీరదమ్మ అని గుర్తుపట్టింది పావని.
    పాపం, జీవితాంతమూ భాగీరదమ్మ హరికథలు చెప్పింది. కాని నిజంగా దమయంతీ, సావిత్రీ ఎలాంటి పతివ్రతో ఆవిడకు తెలుసా? ఏమాత్రం తెలిసినా వాళ్ళతో పోల్చి ఆధునిక య౮ఉవథిని చులకనచేసి మాట్లాడదు.
    జాలిగా ఒక్క నిట్టూర్పు విడిచింది పావని.
    
                                            15
    
    అనుపమ అక్షరాలా మహాపతివ్రత. శారీరకంగా అమృతమూర్తికి దూరమయినా గాలిగా మారి అతని ఊపిరిలో నిలిచిపోయింది. అతని ఊహలలో ఆకృతిపొంది నీడలా వెంటనిలిచింది. ఈ తాకిడికి అమృతమూర్తి తట్టుకోలేక పోయాడు. బ్రతికిఉన్న అనుపమను అనేక విధాల ఏడిపించగలిగిన అమృత మూర్తి దెయ్యమై కనిపించే అనుపమకు బెదిరిపోయాడు.
    తనను విడిచిపొమ్మని అనుపమ దయ్యాన్ని బ్రతిమాలుకున్నాడు. "మిమ్మల్ని విడిచి నేనెక్కడికి పోతానూ?" అన్నట్లు పకాలున నవ్విందేకాని, అతణ్ణి వదల లేదు దెయ్యం. భూతవైద్యులకు చూపించుకొన్నాడు. సైకలాజిస్టులని కలిసాడు. ప్రాచీనాధునిక విధానాలన్నీ అనుసరించినా అనుపమ దెయ్యం బారినుండి విముక్తి కలగలేదు.
    అనుపమ పుట్టి పెరిగిన ఊళ్ళో అనుపమకు గుడికట్టించి దేవతగా నిలబెడితే, ఈ దెయ్యం రూపు వదిలిపోవచ్చునని ఒక భూతవైద్యుడు సలహా ఇచ్చాడు. ఆ సలహా బాగా నచ్చింది అమృతమూర్తికి. అనుపమ దగ్గిరనుండి కట్నంగా తీసుకున్న యాభైవేలతో అనుపమ సొంత ఊళ్ళోనే గుడి కట్టించాలని సంకల్పించుకున్నాడు.
    
                                        *    *    *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra