Previous Page Next Page 
టు హెల్ విత్ లవ్ పేజి 13


    "మీకు తెలుసో తెలీదో.....నేనూ మా తులసీ 'ఇండిపెండెన్స్ డే' కోసం ఢిల్లీ వెళుతున్నప్పుడు రైల్లో ఈ పంజాబీ అమ్మాయి ఫ్రెండయింది. ఢిల్లీ చేరేలోగా ఎంత క్లోజయిపోయిందంటే.....ఢిల్లీలో పొరపాటున తులసిని ఫ్లాట్ ఫారం మీద వదిలి మేమిద్దరం బయట ఆటో ఎక్కాం."
    ఆమె నవ్వాపుకోలేకపోయింది.
    "మీరేం చేస్తున్నారు?" అడిగింది తులసి.
    "నిజాం ఆర్ధోపెడిక్స్ లో నర్స్!"
    "ఓహో! అదా! సూపర్ స్పెషాలిటీస్" సురేష్ కల్పించుకున్నాడు.
    "అవును" చిరునవ్వుతో అంది.
    "మీ సూపర్ స్పెషాలిటీస్ అన్నిట్లోకీ సూపర్ స్పెషాలిటీ ఏమిటో చెప్పగలరా?"
    ఆమె అర్ధంకానట్లు చూసింది.
    "అంటే?"
    "అంటే......అదే.....సూపర్ స్పెషాలిటీస్ లోకల్లా గొప్ప సూపర్ స్పెషాలిటీ?"
    "అలాంటిదేమీలేదు, నాకు తెలిసినంతవరకూ......"
    "మీకు తెలీదులెండి! పేషెంట్లకు తెలుస్తుంది."
    "ఏమిటది?"
    "డబ్బు గుంజటం! పేషంట్స్ ని గేట్లో అడుగు పెట్టిన దగ్గర్నుంచీ బయటకు కట్టుబట్టలుకూడా వదిలేసి పారిపోయేవరకు దోచేస్తారు"
    ఆమె నవ్వింది.
    "మరి అంత ఇదిగా ఏమీ ఉండదు లెండి!"
    "మా ఫ్రెండ్ కడువైద్యంకోసం ఆ హాస్పిటల్ లో చేరి ఇల్లూ, ఇంట్లో సామానూ అన్నీ అమ్మేసాడు బిల్లు కట్టటానికి! చివరకు వాడి ప్రియురాలిని కూడా అమ్మేశాడు.
    "నేన్నమ్మను మరీ అంత ఘోరం కాదు మాహాస్పిటల్!"
    "ఎవరికోసం నమ్మరు? వాడి ప్రియురాలిని నేను కొనుకున్నాను. ఇదిగో ఈవిడే....." తులసిని చూపుతూ అన్నాడు.
    "మాటలేం పట్టించుకోకండి!" సురేష్ వంక చిరుకోపంతో చూస్తూ అంది తులసి రైలు కదిలింది.
    "మీరెక్కడుంటున్నారు?" అడిగింది తులసి.
    "సంజీవరెడ్డి నగర్ లో నేనూ మాబాచ్ మేట్ ఇంకో అమ్మాయి ఇల్లు తీసుకుని ఉంటున్నాం...."
    సురేష్ ఉలిక్కిపడ్డాడు.
    "ఆ అమ్మాయి కేరళా అమ్మాయా?" ఆత్రుతగా అడిగాడు.
    "అవును! మీకెలా తెలుసు?" ఆశ్చర్యంగా అంది.
    "ఊహించాను! అయిహే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి!"
    "ఎందుకు?"
    "ఈమధ్య న్యూస్ పేపర్స్ చూడటంలేదా మీరు?"
    "చూస్తున్నానే......!"
    "అయితే ఎలా మిస్సయ్యారు మరి?"
    "ఏమిటి మిస్సవటం?"
    "అదే.....ఇద్దరు నర్సులు......ఆత్మహత్య చేసుకోవటం....."
    హఠాత్తుగా ఆమె మొఖం ఎర్రబడింది. అవమానం, సిగ్గూ మిళితమయిపోయినాయి.
    "ఓ! అదా...." చూపులు మార్చుకుంటూ అంది.
    "అవును......అదే" కవ్వింపుగా అన్నాడు.
    "మీరెక్కడ ఉంటున్నారు?" టాపిక్ మారుస్తూ అడిగింది.
    "దిల్ షుక్ నగర్"
    "నర్సాపూర్ మీ నేటివ్ ప్లేసా?"
    "కాదు మాఅక్క ఇంటికి!"
    "వాళ్ళాయనతాలూకూ చిన్నిల్లుఅది" కల్పించుకుంటూ అన్నాడు.
    ఆమె అతనిని పట్టించుకోనట్లు నటించింది.
    "మీరు శెలవులో వెళుతున్నారా?" తులసి అడిగింది.
    "అవును! మా అమ్మకు సీరియస్ గా ఉందని మా వాళ్ళు టెలిగ్రామిచ్చారు కానీ నాకు అనుమానం! నా పెళ్ళి సంబంధాలకోసం పిలిపిస్తున్నారని."
    తులసి నవ్వేసింది.
    "ఏం పెళ్ళిచేసుకోవటం ఇష్టంలేదామీకు?"
    "నాకు పెళ్ళంటేనే భయం! భయంకంటే అసహ్యం! పెళ్ళిచేసుకోవటం, పిల్లల్ని కనటం, జీవితాంతం వాళ్ళందరికీ చాకిరీచేస్తూ ఓ నౌకర్లా గడిపేయటం నాకు నచ్చదు. మగాడు జీవితాన్ని ఎంత హాయిగా అనుభవిస్తున్నాడో.....ఆడదికూడా అంతే హాయిగా అనుభవించగలగాలి. అలాంటి అవకాశం వున్నపుడే పెళ్ళి చేసుకోవాలి......"
    సురేష్ చప్పట్లుకొట్టాడు.
    "మనదేశానికి మీలాంటివాళ్ళేకావాలి!"
    ఆమె నవ్వేసింది.
    "అంటే?"
    "ఫామిలీ ప్లానింగ్ డిపార్టుమెంట్ వాళ్ళు మీ జీవితచరిత్రను సినిమాగా తీసి టీ.వీ. ద్వారా స్పాన్సర్ చేయిస్తారు"
    తులసి మళ్ళీ టాపిక్ మార్చింది.
    "నేనూ.....నాచిన్న నాటి రోజులూ" అనే సబ్జెక్ట్ లోకొచ్చింది.
    సురేష్ పైబెర్తుమీద కెక్కి పడుకున్నాడు.
    రైలు ఏదో బ్రిడ్జిమీదనుంచీ భయంకరమయినశబ్దాలు చేసుకుంటూ వెళుతోంది. చాలాత్వరగా నిద్రపట్టేసిందతనికి. మెలకువ వచ్చేసైర్కి అర్ధరాత్రయిపోయింది. రైలు ఎక్కడో ఆగిపోయి వుంది. చీమ చిటుక్కుమన్న వినిపించేంత నిశ్శబ్దం.
    సన్నగా నెమ్మదిగా పుస్తకం పేజీలు  తిప్పుతోన్నచప్పుడు ఉండుండి ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తోంది. నెమ్మదిగా కిందకువంగి చూశాడు.
    మిడిల్ బెర్తుమీద యువతి ఏదో పుస్తకం చదువుతోంది. తల మరికొంచెంకిందకు జార్చి చూశాడు.
    ఆ పుస్తకంలోని ఫోటోలు చూస్తూనే అదిరిపడ్డాడు.
    ఇందాక పుస్తకాలమ్మేవాడు తనను కొనమనిప్రాధేయపడిన పుస్తకమే అది.
    "అమ్మదొంగ!" చిరునవ్వుతో రహస్యంగా అన్నాడు.
    గాబరాపడిచటుక్కున పుస్తకంమూసేసి దుప్పట్లోదాచేసుకుందామే.
    "లాభంలేదులెండి! నేను చూసేసాను! ఎన్నిఫోటోలున్నాయి?"
    ఆమె మాట్లాడలేదు తల పక్కకు తిప్పిదుప్పటి ముసుగుపెట్టేసుకుంది.
    "ఆ కేరళాగాళ్ మీ రూమ్మేట్ అనగానే నాకు అనుమానం వచ్చిందసలు."
    ఆమె చేయిదుప్పటిలోంచి బయటకొచ్చి ఫాన్ స్విచ్ ఆఫ్ చేసేసింది.
    "చూడండి! మీరు మాట్లాడకపోయినా ఫరవాలేదు. కానీ థీయరీలు మనుషుల్ని పాడు చేస్తాయి. చెడయినా, మంచయినా.......బిప్రాక్టికల్ మీక్కావాలంటే నేను సహాయంచేస్తాను."

 Previous Page Next Page