Home » Vasundhara » ఆడపడుచు

    భానుప్రకాష్ చాలా పకడ్బందీగా పథకం వేస్తున్నాడు. గెస్ట్ హౌస్ లో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో మరి!
    సాయంత్రం నాలుగింటికి భర్త వచ్చేసరికి ముక్త తయారై సిద్దంగా ఉంది
    ఇద్దరూ కార్లో వెనకసీట్లో కూర్చున్నారు.
    ప్రయాణం ప్రారంభమైంది.
    గౌతమ్ ఉత్సాహంగా భార్యకేవేవో చెబుతున్నాడు.
    ముక్త అన్యమనస్కంగా వింటూ - భర్తకావిషయం తెలియకుండా ఉంచాలని చూస్తోంది.
    గౌతమ్ తన ధోరణిలో తానున్నాడు.
    రెండుగంటల ప్రయాణం వారిని గెస్ట్ హౌస్ కు చేర్చింది.
    అక్కడ వారికోసం ఓ గది సిద్దంగా ఉంది.
    గదిలో ఖరీదైన కార్పెట్. గోడలకు శృంగార భరితమైన ఆయిల్ పెయింటింగ్స్, హంసతూలికా తల్పాలు, అతిధి మర్యాదకై కుషన్ సోఫాలు. స్టీరియో సెట్టు, కలర్ టెలివిజన్...
    గదిలోని హంగులు చూసి దిమ్మెర పోయింది ముక్త.   
    గదికి అటాచ్ డ్ బాత్ ఉంది. బాత్రూంలో టబ్బుంది. షవరుంది.   
    భార్యాభర్తలిద్దరూ అప్పటికప్పుడు వేన్నీళ్ళ స్నానం చేశారు.   
    మొదటిసారిగా టబ్బుస్నానం చేసింది ముక్త అనుకూలంగా లేకపోయినా చాలా హాయిగా ఉంది. భర్త దగ్గర్లోనే ఉండి సాయపడుతూంటే అదొక మధురానుభూతిగాకూడా ఆమెకు తోచింది.   
    అప్పుడామె భానుప్రకాష్ గురించి పూర్తిగా మరిచిపోయింది.   
    వారి స్నానాలు కాగానే బాయ్ వారిద్దరికీ కాఫీ, బిస్కట్లు తెచ్చిచ్చి- భోజనం గురించి అడిగాడు.   
    తమకేంకావాలో పురమాయించింది ముక్త.   
    బాయ్ వెళ్ళిపోయాడు ఇద్దరూ వేడివేడి కాఫీలు తాగారు.   
    "ఇంత మంచి మంచముండగా సోఫా ఎందుకు?" అన్నాడు గౌతమ్   
    ఇద్దరూ మంచం మీద మేనులు వాల్చారు.   
    పాతాళంలోకి కృంగి పోతున్నట్లూ స్వర్గంలోకి తేలిపోతున్నట్లూ...   
    ఒకే సారి రెండు విభిన్నానుభూతులు కలిగాయి ముక్తకు.   
    ఆమె భర్త వైపు తిరిగింది. అతడామె వైపు తిరిగాడు.   
    "ఇంట్లో కూడా యిలాంటి బెడ్డుంటే?" అందామె.   
    అతడు బదులివ్వకుండా ఆమె నడుం మీద చేయివేసి దగ్గరగా లాక్కున్నాడు. అతడు లాక్కోనవసరం లేకుండానే ఆమె అతడికి దగ్గరగా జరిగింది.   
    ఇద్దరూ ఒకరికొకరు హత్తుకుని పోయారు.   
    ఏదో కొత్త లోకంలో ఉన్నట్లుందిద్దరికీ!   
    అతడామెను మృదువుగా పెదవులపై చుంబించాడు.   
    ఎన్నడూ కలుగని వింత పరవశం - ఆమెకు కలిగిందారోజున....   
    సరిగ్గా అప్పుడే....   
    గదిలో ఫోన్ మ్రోగింది.   
    మంచం పక్కనే టెలిఫోన్...   
    గౌతమ్ ఒక చేతిని చాపి ఫోన్ అందుకున్నాడు. అతడు ఫోన్లో మాట్లాడుతూంటే ముక్తకతడో పెద్ద అధికారిలా తోచాడు.   
    ఆమె అతడి మాటలు వినడంలేదు. ఆరాధనాపూర్వకంగా అతడి వంకే  చూస్తోంది. అతడి చేష్టలను గమనిస్తోంది.   
    ఉన్నట్లుండి అతడామెను విడిపించుకొని ఫోన్ పెట్టేసి మంచం దిగాడు.   
    కల కరిగినట్లయింది ముక్తకు.   
    గౌతమ్ బట్టలు మార్చుకుంటున్నాడు.   
    "ఏం జరిగిందండీ?" అంది ముక్త.  
    "నేను బయటకు వెళ్ళాలి...."
    "ఎందుకు?"
    "ఒక పార్టీతో మాట్లాడాలి..."   
    "ఇప్పుడా?"
    "ఇప్పుడేమరి..." అన్నాడతడు. తన బ్రీఫ్ కేస్ లో కొన్ని పేపర్లు సర్దుతున్నాడు.
    "అంత అర్జంటేమిటండీ- రేపొస్తానని చెప్పండి...."
    "అలా వీలుకాదు ఆయనకు రెండు ఫ్యాక్టరీలున్నాయి. బిజీమనిషి నేనిప్పుడే వెళ్ళాలి. డిన్నర్ టైంకి వచ్చేస్తానుగా..." అన్నాడతడు.
    "సరదాగా గడుపుదామనుకున్నాను..."
    "రాత్రంతా మనదేనని మర్చిపోకు...."
    గౌతమ్ వెళ్ళిపోయాడు.
    ముక్తకు నిరుత్సాహంగా ఉంది. కాలక్షేపంకోసం ఆమె అక్కడున్న పుస్తకాలు చూసింది.
    ఇంగ్లీషుతోపాటు తెలుగు పత్రికలున్నాయక్కడ.
    ఓ పత్రిక తీసి పేజీలు తిప్పింది.
    "వాత్సాయన కామసూత్రాలు...."
    చటుక్కున పత్రిక మూసి మరొకటి తీసింది, పేజీలు తిరగేయగానే ఓకధ. కథలో ఏముందో చూపే బొమ్మ. బొమ్మలో ఉన్నది ఆడా, మగా....లేనిది వారికి దుస్తులు...    
    అప్పుడు ముక్త అక్కడున్న ఇంగ్లీషు పత్రిక తీసుకుంది. అందులో సినిమా విశేషాలు నచ్చుతాయి.
    స్మితాపాటిల్ బిడ్డనెవరు పెంచుతారు?
    భానుప్రియ రాకతో శ్రీదేవిస్థానం పడిపోతుందా?
    మన్ మోహన్ దేశాయ్ అమితాబ్ లేకుండా హిట్ పిక్చర్లు తీయగలడా?
    నామ్ తర్వాత కుమారా గౌరవ్, సంజయ్ దత్ లు కలిసి నటిస్తారా?
    ఇవే దేశాన్ని వేధించే సమస్యలన్నట్లు పత్రికలవాళ్ళు రాస్తూంటే చదువుతుంది ముక్త. ఆమెకు కాసేపు డైవర్షన్ కావాలి. తెలుగు పత్రికలివ్వలేని డైవర్షనాపత్రిక ఇచ్చిందామెకు.
    ఆ సమయంలో కాలింగ్ బెల్ మ్రోగింది.
    భర్త వెనక్కు వచ్చాడేమోనన్న ఆశతో ముక్త తనే వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలోనున్న వ్యక్తిని చూడగానే ఆమె గుండె అదిరిపోయింది.
    అతడు భానుప్రకాష్!
    అతడి ముఖంలో చిరునవ్వు.
    అతడి చూపులో - కాటేసే కాలనాగు కనబడుతోంది.
    ముక్త అలాగే నిలబడిపోయింది.
    ఒక్కనిముషం తనూ అలాగే నిలబడినా అతడు చటుక్కున చొరవ చేసి ఆమెను తప్పుకుని లోపలకు ప్రవేశించాడు.
    ముక్త మామూలు మనిషి కావడానికి కాసేపు పట్టింది.
    ఆమె గదిబయటకు చూసింది.
    హాలు - అక్కడెవ్వరూలేరు.
    తలుపు వదిలి ఆమె వెనక్కు తిరిగింది.
     తలుపు దానంతటదే వెనక్కు పడింది.
    మరోసారి ఉలిక్కిపడింది ముక్త.
    "ఎయిర్ కండిషన్డ్ గదిలో తలుపు దానంతటదే పడుతుంది-" అన్నాడు భానుప్రకాష్.
    ముక్త మాట్లాడలేదు.
    "రా- ఇలా కూర్చో-" అన్నాడు భానుప్రకాష్.
    అతడు కూర్చోమన్న వైపు చూసిందామె.
    అదతడికెదురుగా ఉన్న సోఫా.
    "కొంతలో కొంత మర్యాద చూపిస్తున్నాడు-" అనుకుంటూ ఆమె అతడి కెదురుగా కూర్చుంది.
    అతడుత్సాహంగా ఉన్నాడు.
    ఆమె మనసు చిక్కబెట్టుకుందుకు ప్రయత్నిస్తోంది.
    "నేను మాట్లాడ్డం ప్రారంభిస్తాను. నువ్వు మామూలుగా ఉండు..."అన్నాడు భానుప్రకాష్ గంభీరంగా.
    "ఎందుకొచ్చావిక్కడికి?" అందామె.
      "చాలా థాంక్స్...మొదటి సారిగా నువ్వు నన్ను నువ్వన్నావు. అంటే నా దారిలోకి వస్తున్నావన్నమాట...." అన్నాడు భానుప్రకాష్.
    "నీ అభిప్రాయం తప్పు నా దృష్టిలో నీ విలువ పడిపోయింది. అందుకే నువ్వన్నాను..."
    "అంటే ఇన్నాళ్ళూ పడలేదన్నమాటేగా! అంటే ఫోన్లో మాట్లాడిన మాటలు నీ దగ్గర నా విలువను నిలబెట్టుకున్నాయనేగా...ఇంకా చాలా థాంక్స్...."
    "నువ్వు నన్నెందుకిలా వేధిస్తున్నావ్..."అంది ముక్త దీనంగా.
    "నీకు తెలియకుండా నువ్వు నన్ను వేధిస్తున్నావు. నాకు తెలిసి నేను నిన్ను వేధిస్తున్నాను. రెండూ తెలిశాకకూడా ఒకరికొకరు వేధించుకోవడమెందుకు? అవగాహనతో దగ్గరవుదాం-" అన్నాడు భానుప్రకాష్.
    "ప్లీజ్ - ఇలా మాట్లాడకు-" అందామె.
    "కంగారు పడకు. నీ భర్త యిప్పట్లో రాడు...    ముక్త మాట్లాడలేదు".
    "ఇక్కణ్ణించి నేను ఫోన్ చేశాకనే అవతల పార్టీ నీ భర్తను వదిలిపెడతాడు. కాబట్టి నీకాభయమవసరంలేదు..." అన్నాడు భానుప్రకాష్.
    "నాభ్యం నా భర్త వస్తాడనికాదు. నువ్వున్నావని..."
    "దూరంగా ఉన్నంతసేపే నువ్వు నాకు భయపడతావు. ఒక్కసారి దగ్గరైతే భయం పోయి ఆకర్షణ పుడుతుంది-" అన్నాడు భానుప్రకాష్.
    ముక్త చురుగ్గా అతడివంక చూసింది.
    "నిజం చెబుతున్నాను. నాకు నీ చూపులంటే చాలా యిష్టం. ఆడదాని అందమంతా చురుకుతనంలో ఉంది-" అన్నాడు భానుప్రకాష్.
    "నీవంటి కుసంస్కారులు పై అధికారులుగా ఉండడం వల్లనే దేశమిలా అధోగతిలో ఉంది-" అంది ముక్త.
    భానుప్రకాష్ ముఖం ఎర్రబడింది- "ముక్తా! హద్దులు మీరుతున్నావు-" అన్నాడతడు కోపంగా.
    "హద్దులు మీరుతున్నది నేనుకాదు. నువ్వు...."
    "ఇప్పుడు నేను తలచుకుంటే ఈ గదిలో నిన్నేమైనా చేయగలను. నువ్వు నన్ను ప్రతిఘటించలేవు. నీకెవరూ సాయం రారు. అయినా నేను మంచిమాటలతో నచ్చజెప్పి నా కార్యం చక్కబెట్టుకోవాలనుకుంటున్నాను. బలాత్కారం నాకు నచ్చదు. పరస్పరానురాగంలో ఒకరి కొకరు చేరువ కావాలనుకుంటున్న నాది కుసంస్కారమని నువ్వంటున్నావు..."
    "నీది కుసంస్కారమని ఒకసారికాదు-వెయ్యిసార్లంటాను...నీ హద్దులు తెలుసుకోకుండా ఇలా వచ్చినాతో మాట్లాడ్డం కుసంస్కారమని నేనేకాదు-సంస్కారం తెలిసిన వారెవరైనా అంటారు..."
    "మాటి మాటికీ హద్దుల గురించి మాట్లాడుతున్నావు. ఒక విషయం తెలుసుకో. నీకు హద్దులున్నాయి. అయినా నువ్వు వాటిని మీరుతున్నావు. నాకు హద్దులు లేవు. నేను లేని హద్దుల్ని సృష్టించుకొని వాటిలోపలే ఉంటున్నావు..."
    "నీకెందుకు హద్దుల్లేవు?"
    "ఒక్కసారి నాకు దగ్గరగా రా - నీకూ హద్దులుండవు...."
    "నాకు హద్దులే యిష్టం..."
    "హాదులు బలహీనులికి. పేదవారికి. అసమర్ధులకు హద్దులను తొలగించుకొనడం హోదా. నేను నీ భర్తకు హోదా యిస్తాను. అందుకు నీవు హద్దుల్ని మర్చిపోవాలి-"
    "నీ అభిమానానికీ, సలహాలకూ కృతజ్ఞతలు నువ్విక యిక్కన్నించి వెళ్ళు."
    "నా సంస్కారం నన్నిక్కన్నించి వెళ్ళమనే అంటోంది. అందుకే వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో-ఈ గెస్ట్ హౌస్ లో నువ్వు చూస్తున్న వైభవం - నీ యింట్లోకి తరలి రాగలదు. అందుకు నీకు నా సహకారం అవసరం."
    "థాంక్స్...."
    "నువ్వు నన్నిలా బయటకు పంపేశావని తెలిస్తే ఈ ఏర్పాటు చేసిన నీ భర్త నిరుత్సాహ పడతాడు..." అన్నాడు భాను ప్రకాష్.
    అతడి మాటలకు షాక్ తింది ముక్త. ఆమె ఆ షాక్ నుంచి తేరుకునేలోగా భానుప్రకాష్ అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
                                               12
    గెస్ట్ హౌస్ కి వచ్చిన మర్నాడు మధ్యాహ్నంమూడింటికి గౌతమ్ మరో పార్టీతో మాట్లాడ్డానికి వెళ్ళాడు. అతడు వెళ్ళిన పదినిముషాల్లో భానుప్రకాష్ ఆమె గదిలో ఉన్నాడు.
    "మళ్ళీ ఎందుకొచ్చావ్?" అందామె.
    "ఈపాటికి నీభర్త నీకు బుద్దిచెప్పి ఉంటాడని!"
    ముక్త తెల్లబోయి- "ఆయనెందుకు నాకు బుద్ది చెప్పాలి?" అంది.
    "అందమైన భార్యలు - భర్తల ప్రగతికి సోపానాలు..."
    "ఆయనలాంటివారు కారు..."
    "నువ్వసలతడికి చెప్పావా?"
    "లేదు..."
    "నేననుకున్నాను. నువ్వు చెప్పలేవని!" అని భానుప్రకాష్ నవ్వడు. "నీకూనాకూ మధ్యమాటల్లో నీ భర్తకు తెలియని రహస్యం యింతుంది-" అంటూ చేతులతో అభినయించి చూపించి- "చేతల్లోకూడా యింత రహస్యమూ ఉంటే బాగుంటుంది. నీకు రహస్యం దాచడం బాగా చేతనవును..." అన్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra