Home » Kommuri venugopala rao » Pasupu Kumkuma


    సంగతి విని భానుమతి "నేనిక్కడ వెయిట్ చేస్తూ వుంటాలే. ఏకంగా ఇద్దరం కలిసే వేడదాం" అన్నది.

    కానీ ఆమె ముఖంలో ప్రస్ఫుటమవుతున్న ఆ బడలికనూ కనిపించీ కనిపించనట్లున్న ప్రకంపననూ మాలతి గమనించకపోలేదు. "గంటే అవుతుందో రెండు గంటలే అవుతుందో!నువ్వెళ్ళిరా" అంది.

    "నువ్వసలే భయస్థురాలవు కదా?"

    "నాకేం భయంలేదు. నన్నెవరూ ఎత్తుకుపోరులే."

    "అబ్బో ! అంత ధైర్యం ఎప్పటినుంచి అమ్మాయిగారికి?..... సరే నీ ఇష్టం" అంటూ లేచి నిలబడింది.

    మేనేజరు గదిలోకి వెళ్ళాక "టైపుమిషను ఇక్కడికే తెప్పిస్తాను. ఒక్కొక్కటే మీరు పూర్తి చేస్తుంటే నేను సరిదిద్ది సంతకాలు పెట్టేస్తాను" అని దస్తగిరిని పిలిచి మిషన్ అక్కడకు తెప్పించాడు.

    అర్జంటు పనులున్నప్పుడు ఓవర్ టైమ్ వర్క్ చేసే అనుభవం మాలతికి కొత్తకాదు. ఇదివరలో రెండుమూడుసార్లిలా జరిగింది. అలాంటి సందర్భాలలో మేనేజరుగారు చేసే హంగామా, ఆయనలో కనిపించే కలవరం ఆమెకు నవ్వు కూడా తెప్పించాయి.

    "మీకు కాఫీ తెప్పించమన్నారా? ఆలస్యమైతే మీకు తలనొప్పి అదీ రాదు కదా?"

    "రాదులెండి" అని మాలతి అతనికెదురుగా కూర్చుంది.

    అతను డిక్టేట్ చెయ్యటం మొదలుపెట్టాడు. ఆమె చురుకైన వ్రేళ్ళతో చకచక టైపు చేసేస్తోంది. నిముషాలు గడచిపోతున్నాయి. "అయిందా? ఏదీ చూడనివ్వండి" అంటూ అతను పూర్తయిన కాగితాలను చేతిలోకి తీసుకుని "అరెరే, ఈ డ్రాప్టింగ్ అంతగా బాగులేదే. ఇది మళ్ళీ తయారుచేస్తే బాగుంటుంది"అనటం. ఓ నిముషం ఏకాగ్రత అంతా దానిమీద గ్రుమ్మరిం చినట్లు సీరియస్ గా ఆలోచించటం "ఆఁ ఇలా చేద్దాం!" అని మరో రెండుమూడు క్షణాలు తనలో తనే తర్కించుకుని "ఏమంటారు? బాగుంటుందంటారా?" అని ఆమెను ప్రశ్నించటం. అలాంటప్పుడు ఇతని ముఖకవళికలు, పసితనం, ప్రతి స్వల్ప విషయానికీ చలించిపోయే మనస్తత్వం- ఒక్కోసారి ఆమెకు నవ్వాపుకోవటం  కష్టమైపోతుంది.

    మధ్యలో ఎక్కడినుంచో ఫోన్ వచ్చింది. "ఎవరూ? గోపయ్యా! ఏమిటీ? అమ్మగారు మరీ కంగారు చేసేస్తున్నారా? అర్జంటుగా రావాలంటే ఎలా? ఇక్కడ మరి అంతకంటే అర్జంటుపనిలో ఇరుక్కున్నారు.... డాక్టరుగారు ఫోనుమీద దొరకలేదా? ఇంకో అరగంట ఎలాగో కంట్రోల్ చెయ్యి. జాగ్రత్తగా వుండు."

    ఫోన్ పెట్టేశాడు. అతని ముఖంలో పెరిగిపోయిన  గాభరా, నుదిటిమీద చిరుచెమటలు ఆశ్చర్యంగా చూస్తుంది  మాలతి.

    ఈయానకు పెళ్ళికాలేదుకదా! అమ్మగారంటాడేమిటి? అన్న సందేహం ఆమెలోకి ఆడమనసుకు అప్పటికప్పుడు అంకురించింది.

    ఆ తర్వాత అతను చేసే తప్పులు మరీ ఎక్కువైపోయాయి. ఏదో ఆందోళన, కలవరపాటు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి ముఖంలో.  ఎందుకంత కలవరపడుతున్నాడు? ఏం జరిగింది? ఈ అమ్మగారెవరు?

    "అడుగుదామా?" అనుకుంది. ప్రశ్న పెదవులవరకూ వచ్చి ఆగింది.

    ఎందుకంటే అతని వాలకంచూస్తే మళ్ళీ భయమేసింది.  "నీకెందుకు నా స్వంత విషయాలు?" అని కసురుకుంటాడేమో ననిపించింది. చివరకు కిమ్మనకుండా ఊరుకుంది.

    మొత్తానికి సందేహంతో మాలతి, సంవేదనతో మేనేజరుగారు తప్పొప్పులు బేరీజు వేసుకుంటూ టైపు కార్యక్రమాన్ని ముగించేసరికి ఏడు దాటిపోయింది. ఆమెకు కణతలు పట్టేసినట్లయింది. అతను ప్యూన్ ని పిలచి ఆ కవర్లు అర్జంటుగా పోస్టు చెయ్యమని చెప్పే పనిలో  నిమగ్నమైవున్నాడు.

    ఓ నిముషం సంకోచించి మాలతి లేచి నిలబడి "నన్ను వెళ్ళమంటారా?" అని అడిగింది వినయంగా. అతని చేతిలోనున్న కవరుమీది అడ్రసుమీద దృష్టినిలిపి తల ఎత్తకుండా "అలాగే" అన్నాడు.

    మాలతికి ఉడుకుమోత్తనం వచ్చినట్లయింది. "ఛీ! ఏం మనిషి? కర్టైసీకి థాంక్సయినా చెప్పకుండా అలాగే అంటాడు" అనుకుంటూ అక్కడ్నుంచి బయటకొచ్చేసింది.

    ఇవతలకు వచ్చేశాకగానీ ఆమెకు వాతావరణం అర్ధంకాలేదు. ఆపీసు మొత్తంమీద తనూ, మేనేజరుగారూ, ప్యూన్ దస్తగిరి తప్ప ఎవరూ లేరు.

    ఆమె ముఖంలోకి రక్తం పొంగుకువచ్చినట్లయి గుండె గబగబ కొట్టుకుంది. ఇంతసేపూ నేను అతన్తో ఒంటరిగా వున్నానా? అన్న భావం ఆమెను సూదులలా గుచ్చింది. ఒకవేళ రౌడీ మనిషేమో? అందుకే కావాలని అంతసేపు ఉంచాడేమో  అన్న ఆలోచనలో ఆమెలో ఏ మూలో మెదలకపోలేదు.

    గేటుదాటి బయటకి వచ్చాక ఆమెకు మరీ భయమనిపించింది.  బస్ స్టాప్ కు వెళ్ళాలంటే జనసంచారమంతగా లేని చిన్న సందుగుండా కొంతదూరం నడిచి మెయిన్ రోడ్డు మీదకు రావాలి.  ఆ చీకట్లో ఇంచుమించు నిర్మానుష్యంగా వున్న ఆ సందులో ఒంటరిగా నడిచిపోతుంటే ఆమెకు ముచ్చెమటలు పోస్తున్నాయి. ఇంతలో ఎవరో ముగ్గురు మనుషులు ఆమెకెదురుగా వచ్చారు.  వాళ్ళ వాలకం చూస్తే పెద్దమనుషుల్లా లేరు.  ఆమెగుండె గుభేలుమన్నట్టయి రోడ్డుకు ఓ ప్రక్కగా పూర్తిగా తిరిగిపోయి ఒదిగి ఒదిగి నడిచింది.  అయినా వాళ్ళు మీద మీదకు వచ్చి, ఆమెను ఇంచుమించు రాసుకుంటూ పోతూ వాళ్ళలో వాళ్ళు బిగ్గరగా నవ్వుకున్నారు.  మాలతి నిలువునా వణికిపోయింది. వేగం ఎక్కువచేసి త్వరత్వరగా నడిచి మెయిన్ రోడ్డు ఎక్కేశాక "హమ్మయ్య" అని ఊపిరి తీసుకుంది.

    బస్ స్టాప్ వద్దకు వచ్చి నిలుచుంది.

    అక్కడ మళ్ళీ జనం. బస్సు కోసం నిలబడినవాళ్ళు, రోడ్డుమీద నడిచేవాళ్ళు, సైకిల్ రిక్షాలలో పోయేవాళ్లు, కార్లలో పోయేవాళ్లు, మనుషుల ముఖాలలోకి చూసేవాళ్ళు - ఆమెకు భానుమతి మాటలు గుర్తుకొచ్చాయి. లేట్ ను ఆమె వ్యాఖ్యానించిన  విధం గుర్తుకువచ్చింది.

    సాయంత్రం ఆరుగంటలలోపున  గదికెళ్ళి మంచికాఫీ త్రాగటం ఆమె అలవాటు.  ఆ అలవాటు తప్పిపోవటంతో ఇందాక తెలియలేదుగానీ ఇప్పుడు తలనొప్పి దంచేస్తోంది.

    మళ్ళీ  భానుమతి విషయం గుర్తొచ్చింది. ఆమెకొచ్చిన ఉత్తరం.....

    తన ప్రక్కగా కారాగటంతో ఆమె ఉలిక్కిపడి తలత్రిప్పి చూసింది. మేనేజరుగారి లేతాకు పచ్చరంగు ఫియట్ కారు, స్టీరింగు ముందు కూర్చున్న చంద్రశేఖరం "రండి, మిమ్మల్ని ఇంటిదగ్గర  డ్రాప్ చేస్తాను" అంటున్నాడు.                                                                 
       

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra