Home » Yandamuri veerendranath » అతడే ఆమె సైన్యం


    ప్రనూష శిలా ప్రతిమలా నిలబడిపోయింది.

    కదులుతూన్న వ్యాను వెనుకవైపు కిటికీలోంచి డాక్టర్ పాల్ తనని చూడటం ఆమె గమనించింది.

    అయినా వ్యాను సాగిపోయింది.

    డాక్టర్ పాల్ వ్యానుని ఆపే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఆమె అయోమయంగా అటువైపే చూస్తూ వుండిపోయింది.

    ఆమె ఒకటే అనుకుంది. బహుశా డాక్టర్ పాల్ అజ్మరాలీని గమనించి వుంటాడు. అజ్మరాలీ తన వెనుక వున్నాడు. కాబట్టి తనకా విషయం రూఢీగా తెలీదు. ఇటువంటి పరిస్థితుల్లో తను వ్యాను ఎక్కడం అజ్మరాలీ గమనిస్తే మొత్తం అందరి ప్రాణాలకూ ప్రమాదం. తన ఒక్కదాని కోసం అందరి ప్రాణాలూ రిస్క్ లో పెట్టడం ఎందుకని డాక్టర్ పాల్ అనుకుని వుంటాడు.

    సరయిన నిర్ణయమే!

    కానీ-

    తనని మృత్యుద్వారం ముంగిట నిలబెట్టిన నిర్ణయం!

    తనకి మరణం తప్పదని ఆమెకి తెలిసిపోయింది. ఆమెకి భయం వేయలేదు. బాధ కలుగలేదు. నవ్వొచ్చింది.

    చదరంగం ఆటలో ఎటునుంచి ఏ పావు వచ్చి మనల్ని కబళిస్తుందో తెలీదు. అలానే జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా తను కష్టపడింది. ధనం వెచ్చించింది. వివరాలు సేకరించింది. ప్రతీ క్షణమూ పగతో, ప్రతీకారంతో ఊగిపోయింది. చైతన్యని ఎన్నుకుంది. అతడి తండ్రి బందీగా వుండటం కలిసొచ్చింది- కానీ చివరికి అతడి కార్యం నెరవేరింది. అతను వెళ్లిపోయాడు. తను మిగిలిపోయింది.   

    "అలాగే నిలబడు. కదిలావంటే కాల్చేస్తాను."

    ఆమె కదల్లేదు. ఆ మాటల్ని ఎప్పుడో ఒకప్పుడు వినకతప్పదన్నట్లు అలాగే నిలబడి వుండిపోయింది. సైనికులు వృత్తాకారంలో చుట్టుముడుతున్నారు. ఎవరో జనరేటర్ బాగుచేయటంతో ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా కాంతివంతమయింది.

    "పద స్వీట్ బేబి. ఇక ఈ నాటకం పూర్తయింది" భుజం మీద చేయివేస్తూ అన్నాడు అజ్మరాలీ. ఆమె విదిలించుకోవటానికి ప్రయత్నించింది. అతడు బిగ్గరగా నవ్వుతూ మరింత దగ్గరకు లాక్కున్నాడు.

    "ఎన్ని సంవత్సరాలయింది మనం పందెం వేసుకుని? ఆ పౌరుషం ఇంకా నీలో తగ్గలేదు సుమా."

    సైనికులు ఆమెవైపు తుపాకులు గురిపెట్టి నడుస్తూ వుండగా అతడు ఆమెని తన జీపువైపు తీసుకెళ్ళాడు. "నిన్ను చూసిన మొట్టమొదటి క్షణమే గుర్తుపట్టాను. నేను గుర్తుపట్టనట్టు నటిస్తుంటే, నాకు తెలిసిపోయిందేమో అన్న నీ కంగారు... భలే గమ్మత్తుగా అనిపించింది. చివరికి కారు సీట్లో నీ పక్కన పిస్టల్ పెట్టాను. గుర్తుందా...? ఖాళీ పిస్టల్... అప్పుడే దాన్ని నువ్వు తీసుకుని పేలుస్తావనుకున్నాను. అప్పుడు పేల్చకపోవటం నీ అదృష్టం. లేకపోతే అప్పుడే దొరికిపోయేదానివి... రెడ్ హాండెడ్ గా."

    ప్రనూష అతనివిఅపు సూటిగా చూసింది. "...నామీద నీకు అనుమానం వచ్చిందని మాకు ఎప్పుడో తెలుసు అజ్మరాలీ. హోటల్లో నా రూమ్ కి వచ్చే ఫోన్ కాల్స్ ని నువ్వు అబ్జర్వేషన్ లో పెట్టినప్పుడే."

    అజ్మరాలీ మొహంలో విస్మయం కనబడింది. "ఓహో... అది కూడా మీకు తెలిసిందన్నమాట" అన్నాడు ఆశ్చర్యంగా. వెంటనే తన విస్మయాన్ని కప్పిపుచ్చుకుంటూ నవ్వాడు. "యుద్ధంలో ఎవరెవరెప్పుడు నెగ్గారు అన్నది కాదు ప్రశ్న! అంతిమ విజయం ఎవరిదా అన్నది లెక్క. నువ్వు దొరికావు. అదీ నా విజయం..."

    "నేను మరణించినా ఫర్వాలేదు. కానీ జగదీష్ ని భారతదేశం పంపగలిగాను. అది చాలు అంతిమ విజయాన్ని నా డైరీ ఆఖరి పేజీలో వ్రాసుకోవటానికి" గర్వంగా అంది.

    అజ్మరాలీ ఒక్కక్షణం అయోమయంగా చూశాడు. "జగదీష్-జగదీష్ ఎవరో నీకు తెలుసా?" అని అడిగాడు తడబడుతూ.

    "తెలుసు. రాడార్ సైంటిస్ట్! భారతదేశం సైనిక పటిమని సాంకేతికంగా పది సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్ళగలిగే రాడార్ ఫార్ములాని కనుక్కున్న సైంటిస్ట్!!" ఆమె ఆగి అంది- "నీ గుండె ఆగిపోయే ఇంకో విషయం చెపుతాను విను అజ్మరాలీ... చైతన్య ఎవరో కాదు- జగదీష్ కొడుకు. రంగనాయకి ఆయన భార్య!"

    అజ్మరాలీ ఒక్కక్షణం నిశ్శబ్దంగా వున్నాడు. తనలో తనే అనుకుంటున్నట్లు అన్నాడు- "అందుకే అన్నమాట. ఆ ముసలి వాడు అంత నమ్మకంగా వాళ్ళతో వెళ్ళిపోయింది."

    "అవును. చైతన్య వచ్చింది కేవలం తన తండ్రిని తీసుకువెళ్ళటానికి! ఈ డాన్సు ట్రూపూ, ఇదంతా ఒక నాటకం. ఈ పాటికి వాళ్ళు భారతదేశపు సరిహద్దు చేరుకుంటూ వుండి వుంటారు. చెప్పు అజ్మరాలీ విజయం నీదా? నాదా?"

    అజ్మరాలీ కళ్ళెత్తి చూశాడు. నెమ్మదిగా అతడి పెదవులమీద చిరునవ్వు విచ్చుకుంది. "విజయం నాదే ప్రనూషా! ఇప్పుడు నీ గుండె ఆగిపోయే విషయం నేనూ చెపుతాను విను... ఇంత కాలం నీ కుడిభుజంగా పనిచేసిన డాక్టర్ పాల్ నా మనిషి.. మా దేశపు గూఢచారి."

    లక్ష ఓల్టుల కరెంట్ ఒంట్లో ప్రవేశించినట్టు ఆమె అదిరి పడింది. వెయ్యి అగ్ని పర్వతాలు బ్రద్ధలయినట్లు కనిపించింది.

    అజ్మరాలీ అన్నాడు- "కాశ్మీర్ లో మనిద్దరం మొదటిసారి కలుసుకున్న రాత్రి గుర్తుందా ప్రనూషా? మీ అందరికి చాలా అనుమానాలు వచ్చాయి.... మీ సైనికాధికారులు ఎలా చనిపోయారు? నన్ను జైలునుంచి ఎవరు తప్పించారు? మీ సైన్యంలో నాకు సాయం చేస్తూన్న వ్యక్తి ఎవరు...? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియక మీరు తలలు బ్రద్ధలు కొట్టుకున్నారు. ఇప్పుడా ప్రశ్నలకి సమాధానం చెపుతున్నాను. అతను డాక్టర్ పాల్. మీ సైన్యంలో ఉన్నతాధికారి. కానీ మా దేశపు ఏజెంటు" అతడు నవ్వి అన్నాడు.

    "నేను నిన్నూ, నీ తల్లిదండ్రుల్నీ బంధించి తీసుకెళ్లి వాళ్ళని చంపేసేను గుర్తుందా? అప్పుడు నువ్వు ఛాలెంజ్ చేశావు.... ఎలాగయినా నన్ను చంపుతానని...! నాకు నవ్వొచ్చింది. ఒక దేశపు సైనికాధికారిని వాళ్ళ దేశంలో వాళ్ళ శిబిరంలోకి ప్రవేశించి చంపటం నీకు తోలుబొమ్మలాటలా కనిపించటం చూసి నవ్వుకున్నాను. నీ ఛాలెంజ్ చూస్తే ముచ్చటేసింది కూడా! ఆ రాత్రే నిన్ను మా జైల్లోంచి తప్పించుకుపోయేలా చేశాడు డాక్టర్ పాల్! నువ్వూ సరిహద్దు దాటి మీ దేశం వెళ్ళిపోయావు. నీకు తెలియనిదల్లా డాక్టర్ పాల్ నా మనిషని...."

    ప్రనూష నిశ్శబ్దంగా వింటోంది.

    "...... మా దేశపు గూఢచారిగా అతను నీతోపాటు వుండి పోయాడు. అలా సంవత్సరాల తరబడి పరాయి దేశంలో వుండిపోయే వారిని "ప్లాంటర్స్" అంటారు. నువ్వు ఎప్పుడెప్పుడు ఏయే పనులు చేస్తున్నావో, నా గురించి ఏ యే వివరాలు సేకరిస్తున్నావో అతను నాకు సమాచారం పంపేవాడు. చెప్పానుగా... నువ్వు పట్టువదలకుండా నన్ను నాశనం చేయటానికి చేసే ప్రయత్నాలన్నీ వింటూంటే నాకు ముచ్చట వేసేది" మళ్ళీ నవ్వేడు.

    "చివరికి నువ్వు చైతన్య అనే సినిమా యాక్టర్ ని చూసి ముచ్చటపడి మెంటల్ హాస్పిటల్ సెటప్ చేశావు. ఆ సంగతి నాకు తెలిసింది. అతడిని 'నీ సైన్యం' గా నియమించుకుని, నాట్యపు ట్రూపుని తీసుకుని రావటం గురించి డాక్టర్ పాల్ నాకెప్పుడో చెప్పాడు. నీతో సరదాగా ఆడుకోవటానికి మరో ఛాన్స్ దొరికిందనుకున్నాను. అన్నట్టు నీకో విషయం తెలుసా? నీకు చైతన్య భార్యగా నటించడానికి ఒకమ్మాయి కావల్సి వచ్చింది. లక్ష్మి దానికి ముందు వప్పుకోలేదు. ఆమె తమ్ముడిని కిడ్నాప్ చేసి ఆమెని బెదిరించి ఈ పనికి వప్పించింది కూడా డాక్టర్ పాల్."

    వింటూన్న ప్రనూష ఉలిక్కిపడింది. తనకి ఇంతవరకూ తెలియని విషయాలు కూడా ఇతను చెపుతున్నాడంటే, తన వ్యవహారాల్లోకి ఎంతగా చొచ్చుకుపోయాడో అర్ధమవుతూంది.

    ఆమె ఉలికిపాటు చూసి అజ్మరాలీ నవ్వేడు. "ఈ సెటప్ లో నాకు తెలియనిదల్లా... చైతన్య తన తండ్రి కోసం వస్తున్నాడని, తన తండ్రితో సహా అతను వెళ్ళిపోయాడు. అంతేకాదు. ఈ ప్లాన్ సంగతి డాక్టర్ పాల్ కి కూడా తెలియకపోవటంతో నన్ను ముందే హెచ్చరించలేకపోయాడు. ఒక నటుడికి ఒంట్లో బాగోలేదనీ, జగదీష్ కి వేషం వేయించినప్పుడు కూడా డాక్టర్ పాల్ కి అనుమానం రాకపోవటం దురదృష్టకరం. అయినా నష్టంలేదు. వాళ్ళతో పాటు ఉన్న నా మనిషి, డాక్టర్ పాల్ వైర్ లెస్ లో మాకు వాళ్ళెక్కడున్నదీ చెపుతాడు" ఆగి అన్నాడు.

    "ఈ రాత్రి హాయిగా నిద్రపో ప్రనూషా! అడవిలో మా వాళ్ళు మీ వాళ్ళని ఎలా వేటాడి చంపిందీ రేప్రొద్దునకల్లా చెపుతాను. అంతవరకూ గుడ్ నైట్."


                                        *    *    *    *


    చైతన్య బయల్దేరబోయేముందు ఒక్కసారిగా తల్లిదండ్రుల్ని చూసుకున్నాడు. తాను తిరిగి రాకపోతే, అదే ఆఖరి చూపు ఆ విషయం తల్లిదండ్రుల చూపులలోనూ కనపడుతుంది.

    తండ్రితో అన్నాడు, "నేను వెళ్ళేవరకూ ప్రనూష బ్రతికి వుంటే, ప్రాణాలు అడ్డుపెట్టి అయినా తనని తీసుకొస్తాను. దురదృష్టవశాత్తు ఆమెకి ఏ అపాయమైనా ఈ పాటికే జరిగివుంటే, ఆ అజ్మరాలీని మాత్రం ప్రాణాలతో వదలను."

    జగదీష్ ప్రసాద్ కొడుకువైపు కన్నార్పకుండా చూశాడు. అతడు చెప్పిన రెండింటిలో ఏది జరిగినా కొడుకు ప్రాణాలకే ముప్పు అని అర్ధం చేసుకోలేనంత అమాయకుడేం కాదు ఆయన.

    మృత్యుముఖంలోకి అడుగు పెడుతూన్న కొడుకువైపు చూస్తూంటే రంగనాయకి కళ్లలో నీళ్లు ధారాప్రవాహంగా కారుతున్నాయి. ఇంతకాలం భర్తకోసం దుఃఖించింది. ఇప్పుడు భర్త లభించాడనుకుంటే ఒక కొడుకు కోసం దుఃఖించాలా అని ఆమె ఆందోళన!

    "నేను లేనంతసేపూ డాక్టర్ పాల్, ఇస్మాయిల్ జాగ్రత్తగా చూసుకుంటారు మిమ్మల్ని" అని చెప్పి బయల్దేరాడు. దూరంగా అతని కోసం డాక్టర్ పాల్, ఇస్మాయిల్ నిలబడి వేచివున్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి అన్నాడు- "నా కోసం కేవలం ఇరవై నాలుగ్గంటలు చూడండి. నేను రాకపోతే ఎలాగయినా నా తల్లిదండ్రులని తీసుకుని సరిహద్దు దాటండి. వాళ్ళని సురక్షితంగా మనదేశం చేర్చే బాధ్యత మీ మీద పెడుతున్నాను."

    "నువ్వు నిశ్చితంగా వెళ్ళొచ్చు" అన్నాడు ఇస్మాయిల్. వాళ్ళతో కరచాలనం చేసి వ్యాన్ ఎక్కాడు చైతన్య. క్రమక్రమంగా చీకటిలో కలిసిపోసాగింది అతని వ్యాన్. అటు చూస్తున్న పాల్ మొహంలో సన్నగా నవ్వు కదలాడింది.


                                         *    *    *    *


    దాదాపు ఆరుగంటలు వ్యానులో ప్రయాణం చేశాడు చైతన్య.

    తూర్పున ఎర్రటి వెలుగురేఖలు విచ్చుకుంటూ వుండగా, దూరంగా సైనిక శిబిరం కనబడింది.

    "ఈ పాటికి వాళ్ళకి జరిగిందేమిటో అర్ధమైపోయి వుంటుంది" అనుకున్నాడు. యుద్ధ ప్రాతిపదిక మీద తమకోసం వెతుకుతూ వుండి వుంటారు. తమ వాహనాల్లో ఏ వ్యాన్ కనపడటంలేదో కూడా తెలిసిపోయి వుంటుంది. అందువల్ల తను వచ్చిన వ్యాన్ ని అక్కడే వదిలిపెట్టెయ్యటం మంచిది. వెలుగులో ప్రయాణం మంచిదికాదు.

    అతని వ్యాన్ ని రోడ్డు పక్కనుంచి తప్పించి గుట్టల వెనక్కి తీసుకెళ్ళాడు. అక్కడ అది ఎవరికీ కనపడదన్న నమ్మకం కుదిరాక దాన్ని వదిలి కాలినడకన తిరిగి రోడ్డుమీదకు వచ్చి, సైనిక శిబిరాలవైపు నడవసాగాడు. సూర్యుడు మరింత పైకి రావటంతో అక్కడంతా వెలుగు పరుచుకుంది.

    క్రితం రాత్రి తాలూకు విధ్వంసం అంతా అక్కడ స్పష్టంగా కనిపిస్తూంది.

    దాదాపు పావుగంట నడిచాడు. శిబిరాల చుట్టూ ముళ్ళఫెన్సింగ్, ప్రతీ వందగజాలకీ మంచెమీద గార్డులూ వున్నారు. ఆ లోపల ప్రనూష వున్నది నిజం కాకపోతే, ఈ పాటికి తమ దేశంలో విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వుండి వుండేవాళ్ళు. తన తండ్రి తిరిగి రావటం అనేది పెద్ద సంచలన వార్త అయి వుండేది.

    నడుస్తూన్న చైతన్య అక్కడనుంచి తుప్పల్లోకి తప్పుకున్నాడు. ఇక అక్కడనుంచి రోడ్ మీద నడవటం మంచిదికాదు. దూరంగా మెయిన్ గేట్ కనపడుతూంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra