Previous Page Next Page 
ఋషి పేజి 38


    "ఏం?.... అందరూ దాదాపు తెలుసు.

    "ఆహ-వాళ్ళ నేవరిని పలకరించకపోతే...."

    "నాకలా పదిమందితో కలవటం ఇష్టం  వుండదు__"

    ఉన్నట్టుండి కోలాహలం తగ్గటం చూసి  తలతిప్పి చూసేడు ప్రకాశం.

    సుజాత వస్తోంది!

    యెర్రటి అంచున్న జాకెట్టు....పాము కుబుసంలాటి చీరే-మబ్బు ల్ల్లోంచి దిగివస్తున్న దేవకన్యలా  నెమ్మదిగా వస్తూంది. చెట్ల ఆకుల సందుల్లోంచి పడుతున్న వెలుతురులో ఆమె మొహం  అప్పడే  విరిసిన మల్లె మొగ్గల నాజూగ్గా  వుంది. చిరునవ్వుతో అందర్నీ పలకరిస్తూ వచ్చి ఒక టేబుల్ దగ్గర ఆగి భర్త ప్రక్కనే కూర్చోంది.

    ప్రకాశానికి వాతావరణం అంతా  స్ధంబించినట్టయింది.

    ఎంత అందంగా వుంది! పాలరాతి బొమ్మలా....సుజాత....తనని ప్రేమించిన సుజాత....ముఖ్యంగా ఆ ఠివి....ఆ హుందా....

    ప్రకాశం  మళ్ళి అటు చూసేడు. భర్తతో  నవ్వుతూ ఏదో చెబుతుంది.

    ఇటువ్తెపు చూస్తే బావున్ను.....

    మాణిక్యాలరావు లేచి ఇంకో  టేబుల్ దగ్గరకు వెళ్ళేడు.

    "చాలా స్టిక్టు హొస్టేస్ లా  గెస్టుల బాగోగులు చూస్తున్నాడే-" అన్నాడు కుమార్. ప్రకాశం మాట్లాడలేదు.

    సుజాత లేచింది.

    లేచి....వాళ్ళిద్దారూ కూర్చున్నవ్తెపు రాసాగింది.

    ప్రకాశం ఊపిరి  బిగపట్టేడు.

    "నమస్తే.... బావున్నారా?"

    "మనవడు జ్ఞాపకం వున్నాడా-ప్రకాశం-"

    సుజాత ప్రాకాశం వ్తెపు తిరిగి పలకరింపుగా  నవ్వింది. ప్రకాశం  నవ్వలేదు.

    "ఎంత సేపయింది వచ్చి?" కుమార్ని అడిగింది.

    "ఇప్పడే అయిదు నిముషాల్తెంది__"

    "ఇంత ఆలస్యం  అయిందేం?"

    ప్రకాశం మనస్సునిండా ఏదో తెలియని అసంతృప్తి నిండింది. అసలు తన ఉనికినీ గమనించలేదేం?

    "పాత మిత్రులందరూ కలిశారు__" అంటూ వచ్చేడు మాణిక్యాల రావు.

    తను లేచి పక్కకుర్చీలో కూర్చొని భర్తకు  చోటిచ్చింది. అలా కూర్చోవటంలో బల్లక్రింద ఆమె చీర కుచ్చిళ్ళు ప్రకాశం  కాలుమీద పడ్డాయి. చటుక్కున వెనక్కి తీసేసుకున్నాడు.

    ముగ్గురూ మాటల్లో పడ్డారు.

    కాలు కొద్దిగా ముందుగా  జరిపి చాలా క్యాజువల్  కూర్చున్నాడు. చీరేలేదు. కాళ్ళు దగ్గరకు తీసుకొని కూర్చోంది. ప్రకాశానికి అక్కడ  నుంచి లేచి ఇంటింకి వవెళ్ళిపోదామన్నంత కసిగా వుంది.

    ఒకసారి నవ్వు సుజాత! ఒకసారి- యెవరూ చూడకుండా చూసి నవ్వు. నీకూ నాకూ మధ్య ఈ ప్రపంచానికి  తెలియని రహస్యం ఒకటుందనే విషయాన్నీ మనిద్దరం గుర్తుంచుకొనేలా ఒక సారి నవ్వు-చాలు.

    "ఇప్పడే వస్తాను" అని మాణిక్యాలరావు లేచి వెళ్ళిపోయేడు.

    సుజాత కూడా లేచింది.

    ....వద్దు సుజాత- వెళ్ళిపోకు యిక్కడే యింకోంచేంసేపు వుండు-

    ఉండలేదు. వెళ్ళిపోయింది, వెళ్ళేటప్పుడు కనిసం  వెనక్కి కూడా తిరిగి చూడలేదు.

    "కాలేజి రోజుల్లోకన్నా ఇప్పుడు హుషారు కొద్దిగా తక్కువ్తెంది కదూ" అటువ్తెపే  చూస్తూ అన్నాడు కుమార్.

    ప్రకాశం మాట్లాడలేదు.

    "ఏమిటి ఆలోచిస్తున్నావు?"

    ప్రకాశం ఉలిక్కిపడి__"అబ్బే, ఏవిలేదు" అన్నాడు. 

    "నువ్వెందుకో అన్యమనస్కంగా ఉన్నావు-"

    "ఆహా__అలాటిదేమి" అన్నాడు కలవరపాటునీ కప్పిపుచ్చుకొంటూ.  అతని దృష్టి సుజాత వెళ్ళిపోయిన దారివ్తెపే వుంది.

    స్పీకర్ లోంచి  సన్నగా వస్తున్న మ్యూజిక్  మారి రకరకాల వాయిద్యాలు కలిసిన సంగితం హుషారు గోలుపుతు వినిపించసాగింది. నౌకర్లు తొందర  తోందరుగా గ్లాసులు  నింపుతున్నారు. ఎవరో వచ్చి వాళ్ళ టేబిల్ మీద చిప్స్ ప్లేట్  పెట్టి వెళ్ళేరు.

    "ఇప్పడే  వస్తాను" అంటూ కుమార్ కూడా లేచి వెళ్ళేడు.

    ప్రకాశం ఒక్కడే  మిగిలెడు.

    ఒప్పడే సుజాత వస్తే__

    తన యేదుటి కుర్చీలో కూర్చొని నవ్వూతూ  మాట్లాడితే__ అంత  మంది  కళ్ళు తమ వ్తెపు తిరిగి__ చాలు అంతకన్న యింకేవి వద్దు....

    వస్తూంది. సుజాత మళ్ళి వస్తూంది- వస్తూ యిటువ్తెపు చూసింది. క్షణంలో వెయ్యోవంతుపాటు కళ్ళు కలుసుకొన్నాయి. కొద్దిగా నవ్వబోయేడు. కాని ఆ  దంపతుల్తో మాట్లాడసాగింది.

    ప్రకాశం ఉక్రోషంతో  వూగిపోయేడు. పిడికిళ్ళు అప్రయత్నముగా  బిగుసుకొన్నాయి. కన్నార్పకుండా  అటువ్తెపే చూస్తూ కూర్చొన్నాడు.

    ఆమె నవ్వుతూ  ఏదో మాట్లాడుతూ  వుంది. నవ్వినప్పడల్లా చేవికున్నరింగు అందంగా వూగుతుంది. ల్తెటు వెలుతురు  నునుపు చెక్కిలిమీదప్రతిబింబిస్తూంది.

    కుర్చీమీద నిలబడి గట్టిగా అరిస్తే.... ఈ సుజాత తనని ఎలా వంచిస్తున్నది గట్టిగా అరిచి  అందరికి చెప్పేస్తే__

    ఏవిటి శాడిజం!

    తనని గురించీ తను నిజాయితిగా  ఆలోచించటానికి  ప్రకాశానికి భయం వేసింది.

    ఏముంది తన వ్యక్తిత్వం?

 Previous Page Next Page