Home » Yandamuri veerendranath » అగ్నిప్రవేశం

  

         "భోగం వాళ్ళు సెక్స్ కోసం పడిచావరు. వాళ్ళ దగ్గరకు వెళ్ళే వాళ్ళకే వుంటుందా జబ్బు. పరాయి వాళ్ళ ఉత్తరాలు చదివే వాళ్ళకన్నా ఆ భోగం వాళ్ళు చాలా మెరుగు" కోపంగా అంది.
   
    "ఏమిటే మాటకు మాట ఎదురు చెపుతున్నావ్? ఒళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడు. ఇంటికివస్తే మొదలు వెధవ భాగోతం, ఛీ" అతడు బయటకు వెళ్ళిపోయాడు.
   
    అతడు తిరిగి వచ్చేసరికి అర్దరాత్రి కావస్తోంది. తలుపు తెరవగానే గుప్పున వాసన కొట్టింది. అంతకు ముందెప్పుడూ భాస్కరరామ్మూర్తి తాగలేదు ఇది కొత్త అలవాటు.
   
    ఆ కొత్త అలవాటుకి అతడెంతగా బానిసయిపోయాడో ఆమెకు కొద్ది రోజుల్లోనే అర్ధమైపోయింది. అతడిని మార్చాలని, ఆ అలవాటు మాన్పించాలని ఆమె చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. స్నేహబృందం ఎక్కువి పోయింది. వాళ్ళు చెప్పిందే వేదం అతడికి తాగి రావడం, అర్దరాత్రిపూట గొడవ చేసి పెద్దగా అరవడం దినచర్య అయిపోయింది. చుట్టుప్రక్కల వాళ్ళ దగ్గర ఎంత చులకనయిపోతున్నాడో అతడు అర్ధం చేసుకునే స్థితిలో లేడు.
   
    రాత్రి పదిగంటలు అవుతోంది. మూర్తి రోజులాగే యింకా ఇల్లు చేరలేదు. పావని భోజనం చేసి పుస్తకం చదువుతూ కూర్చుంది.
   
    "అసమర్ధుడి జీవయాత్ర" పుస్తకం అది. ఒకప్పుడు అది నచ్చక తెగ తిట్టుకుంది. అప్పట్లో దాన్ని అర్ధం చేసుకోలేక అలా ఆలోచించిందని, ఇప్పుడర్ధం అవుతోంది. అది చదువుతుంటే ఆమెకు మూర్తే తెగ గుర్తు వస్తున్నాడు. తన అసమర్దతని కప్పిపుచ్చుకోవడానికి అతడు ఎన్నుకున్న మార్గం తాగుడు.
   
    తలుపు చప్పుడయింది. మూర్తి అయితే పిలుస్తాడు. ఎవరో అర్ధంకాలేదు. పావని పక్కనే వున్న కిటికీలోంచి చూసింది. పక్కింటి రంగబాబు.
   
    "ఆయన ఇంకా రాలేదండీ" అంది కిటికీలోంచే.
   
    "అలాగా, పొద్దున మా ఇంటినుంచి స్క్రూడ్రైవర్ పట్టుకొచ్చాడు. అవసరం వచ్చింది ఇస్తారా?"
   
    పావని తలుపు తెరిచింది. "రండి లోపలకు చూసి ఇస్తాను" ఎంత వెదికినా అది మాత్రం కనిపించలేదు.
   
    "పోనీ లెండి....రేపు వచ్చాక అడిగి తీసుకుంటాను" అన్నాడే గాని కుర్చీలోంచి లేవలేదు. ఏం మాట్లాడాలో తోచలేదామెకు.

    "మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తుంది. ఎలా భరిస్తున్నారండీ ఆయన్ని?" అతడి మాటలకు పావని భయపడింది.
   
    "మీలాంటి అందమైన భార్య ఉంటే నేనయితే ఆఫీసుకి కూడా పోకుండా ఇరవై నాలుగ్గంటలూ దగ్గరే కూర్చునే వాడిని."
   
    "మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తోందా?" పావని కోపంగా అంది.
   
    "అరే అంతలోనే కోపం ఎందుకండీ? ఏదో ఒంటరిగా వుంటారు, కంపెనీ యిద్డామనుకున్నాను. అంతే!"
   
    "అవసరం లేదు వెళ్ళండి."
   
    "ఎప్పుడైనా అవసరం అనిపిస్తే పిలవండి. నేనెప్పుడూ సిద్దం" అతను వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ.
   
    పావనికి దుఃఖం ముంచుకొచ్చింది. భర్త ప్రవర్తన అలా ఉండబట్టే అతడింత ధైర్యం చేస్తున్నాడు. ఆ రాత్రంతా ఆమె నిద్రపోలేదు. మూర్తితో అసలు మాట్లాడలేదు. తండ్రికి ఉత్తరం రాయక తప్పదనిపించింది. కానీ ఆయనయినా ఏం చేస్తాడు? వచ్చి మందలించే ధైర్యం చేయలేడు. ఆమె సందేహిస్తుండగానే పోస్ట్ వచ్చింది. తండ్రి దగ్గరనుంచి ఉత్తరం. అది చదివి ఆమె స్థంభించి పోయింది.
   
    భాస్కరరామ్మూర్తి పదివేలు కావాలని ఉత్తరం రాశాడనీ, అప్పుచేసి పంపిస్తున్నాననీ అందులోని సారాంశం.
   
    భాస్కరరామ్మూర్తి చాలా హుషారుగా వున్నాడు. మామగారికి ఉత్తరం వ్రాసి వారం రోజులయింది. ఇవ్వాళో రేపో డబ్బు వస్తుందని నమ్మకం వుంది. అందగానే మంచి మైసూర్ క్రేప్ చీర తీసుకెళ్ళి వాసంతి కివ్వాలి. ఆమె సంతోషంతో వళ్ళో వచ్చిపడితే విజయగర్వంతో నవ్వాలి.
   
    ఆ తర్వాత భాస్కరరామ్మూర్తి ఆలోచనలు నిర్మల ఆస్థివైపు మళ్ళాయి. పావనిని మంచిగా లొంగదీసుకోవాలి. ఆవేశం వస్తే ఏదో అనేస్తుందిగాని, కాస్త చల్లగా కబుర్లు చెబితే కరిగిపోతుంది. త్వరలోనే ఆమెను రంగంలోకి దించాలి. ఆ పరమహంసని తల్చుకుంటేనే భయం వేస్తోంది. అందుకని ఈసారి నిర్మల దగ్గరికే వెళ్ళాలి. స్వంత కూతుర్ని చూడగానే ఆమె గుర్తుపట్టగలుగుతుంది. జరిగిందంతా చెప్పాలి. ఎంతయినా తల్లి పేగు అర్ధం చేసుకోగలదు. అభిమానంతో దగ్గరకు తీసుకుంటుంది. తన బిడ్డను తీసుకొచ్చినందుకు ఇంటల్లుడుగా గౌరవిస్తుంది.
   
    "అత్తగారూ! మీ ఆస్థికోసం కాదండీ మేము వచ్చింది! నా తల్లి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం యిది. అంతే!" అని చెప్పాలి. అలాంటి మాటలు ఈ ఆడవాళ్ళ దగ్గర బాగా పనిచేస్తాయి.
   
    ఆలోచిస్తూనే రామ్మూర్తి వెతుక్కుంటూ మెయిన్ రోడ్డు వదలి ఓ సందులోకి ప్రవెశించాడు. సందు లోపల ఉందో వైన్ షాప్.
   
    షోకేసులో బాటిల్స్ మీద పేర్లు చదువుకుంటున్న మూర్తి వెనుకనుంచి భుజం మీద చెయ్యి పడటంతో ఉలిక్కిపడి తిరిగి చూశాడు. ఎదురుగా చిరునవ్వుతో కనిపించిన వ్యక్తిని చూడగానే అతడి ఒళ్ళు జలదరించింది. ఇంతటి దైవభక్తుడు ఈ షాప్ లో కనిపిస్తాడని అతడు కలలో కూడా వూహించలేదు. 'థింక్ ఆఫ్ ది డెవిల్' అని అనుకోగానే ఎదురుపడ్డాడు.
   
    "ఏమిటి బాబూ! నువ్విక్కడున్నట్లు నాకెలా తెలిసిందని ఆశ్చర్యంగా వుందికదూ. అప్పుడే చెప్పానుగా నేను సర్వాంతర్యామినని. ఇంట్లో కూర్చునే నీ గురించి, నీ ఆలోచనల గురించి పసిగట్టగలను. హాస్పిటల్ లో చాలా రోజులున్నట్లున్నావు. ఇప్పుడు కులాసాయే కదూ. ఆలోచనలు సరిగ్గా ఉంటే ఆరోగ్యమూ బావుంటుంది."
   
    "బాగానే వున్నానండీ" గొంతు పెగల్చుకుని మెల్లిగా అన్నాడు మూర్తి.
   
    "గుడ్! అప్పుడే స్వర్గానికి వెళ్ళాల్సినవాడివి. కానీ నాకు నీ మీద జాలి తప్ప కోపం లేదు. అందుకే ఇంట్లో ఉండే నిన్ను రక్షించాను. కానీ నీలో ఆ ఆస్తి గురించి ఆలోచన పోవడంలేదు. అందుకని ఈసారి మాత్రం నేను రక్షించను. నీ ఇష్టం మరి."
   
    భాస్కరరామ్మూర్తి భయంతో వణికిపోతున్నాడు. ఆ విషయం తను ఆలోచించి అయిదు నిమిషాలయినా కాలేదు. అంతలోనే అతడిలా రావడం......! నిజంగానే ఇతడికి దైవశక్తి వుందనిపిస్తోంది. ఇతడితోనేనా తను తలపడాలనుకున్నది. ఈ రోజు ఇంటికి వెళ్ళే లోపల మరో యాక్సిడెంట్ అయినా ఆశ్చర్యం లేదు. అతడికి ప్రాణభయం పట్టుకుంది.
   
    "మరేం భయంలేదు. చెప్పాగా నీ ఆలోచనలు సక్రమంగా ఉన్నంతవరకు నీకే ఆపదా రాదు" పరమహంస జేబులోంచి ఓ ఫోటో తీసి యిచ్చాడు. అది ఆయనదే. "ఇది దగ్గరుంచుకో రోజూ పూజ చేస్తూండు. ఆ విబూది పెట్టుకో. శుభం కలుగుతుంది."
   
    "అలాగే!" అన్నట్టు తలూపాడు మూర్తి.
   
    "వెళ్ళు బాబూ! నీ బిల్లు నే పేచేసి వస్తాలే" అతడి భుజం మీద ఆప్యాయంగా తట్టాడు. భాస్కరరామ్మూర్తి నిద్రలో నడుస్తున్నట్లు బయటకు నడిచాడు.
   
    పరమహంస జేబులోంచి వందరూపాయల నోటు తీసి సేల్స్ మాన్ కి అందించాడు. అతడికి కావలసిన విదేశీ సరుకుల డబ్బా అతని కార్లో పెట్టబడిందప్పటికే. అతనిప్పుడు చాలా డబ్బున్నవాడు. విదేశీ సరుకు తప్ప ముట్టుకోడు. కాకపోతే ఆ ప్రాంతంలో పరిచయస్తులెవరూ కనిపించని ఆ షాప్ లోనే వాడుక పెట్టుకున్నాడు.
   
                             *    *    *
   
    అతడు తూలుతూ రావడం పావని గమనించింది. ఆమె ఒక్కక్షణం ఊపిరి పీల్చడం మర్చిపోయింది. ఆమెకు దుఃఖం రాలేదు షాక్. అంతే! అంత మైకంలోనూ రామ్మూర్తి చాలా తెలివిగా మాట్లాడాడు. "ఏమే ఉత్తరాలేవైనా వచ్చాయా?"
   
    "మీకేం రాలేదు. నాకే మా నాన్నగారు వ్రాశారు" క్లుప్తంగా అంది.
   
    "డబ్బు పంపించాడా?"
   
    "లేదు."
   
    "ఎప్పుడు పంపుతాట్ట?" కోపంగా అరిచాడు.
   
    "పంపడు. పంపవద్దని ఉత్తరం వ్రాసేశా" అంది పావని.
   
    "ఏం, ఎందుకని?"
   
    "కట్నం కావాలనుకున్న వాళ్ళు పెళ్ళికి ముందే అడగాలి. ఇవ్వగలిగితే యిస్తారు. లేకపోతే యీ సంబంధం వద్దనుకునేవారు. అప్పుడలా నీతులు వల్లించి ఇప్పుడీ సొద ఏమిటి?"
   
    "ఏమిటే.... నాది సొదలా అనిపిస్తోందా? నేనెవరనుకుంటావ్? నీ మొగుణ్ణి నిన్ననుభవిస్తున్నవాణ్ని నేను కష్టపడి సంపాదించిందంతా తేరగా నీకు పెట్టాల్సిన అవసరం నాకు లేదు. నోరు మూసుకుని చెప్పినట్లు చేయి."

    "ఇంతవరకూ అలాగే పడున్నాను. ఇప్పుడిక వూరుకునేది లేదు. ఇప్పటికే పాతికవేలు ధర నీ కోసం చెల్లించాను. ఇప్పుడు నాకు అధికారం, హక్కువచ్చాయి. అయినా చేతకానివాడికి అంతకంటే ధర ఎక్కువ పెట్టడం అనవసరం!"
   
    ఆమె మాటలు మూర్తికి వెంటనే అర్ధం కాలేదు. అర్ధం కాగానే అదిరిపోయాడు. పావని ఇంత పెద్ద దెబ్బ కొడుతుందని అతడు కలలో కూడా వూహించలేదు. మైకం అంతా దిగిపోయింది. చెమటలు పట్టేశాయి. ఆ తర్వాత కోపం రెట్టింపయింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra