Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 36

                                 

    హార్ట్ (హృదయం) బొమ్మలు, వాటిమద్య బాణం గుర్తులు,  లవ్ డిజైన్లు గీసేవారు - ప్రేమపట్ల దృఢమైన అభిప్రాయం లేని వారై వుంటారు. విచిత్రంగా కనిపించినా ఇది నిజం.  ఒకరి కన్నా ఎక్కువమంది చేత ప్రేమించబడాలని , తాము మాత్రం ఎవర్నీ ప్రేమించ కూడదని గుర్తింపు ధోరణి కలవారు ఈ విధమైన డూడ్లింగ్ చేస్తారు.

     వీరు నిజానికి చాలా తెలివితేటలున్నవారు. సగటు మనిషితో పోల్చుకుంటే కొన్ని మెట్లు ఎత్తుమీద  వున్నవారు  అయివుంటారు.  అందువల్ల  కొంత వరకూ  వీరి అభిప్రాయం కరక్టే కానీ, జీవితం  గడిచేకొద్దీ తాము ఎవరినీ ప్రేమించక, తమని ఎవరూ ప్రేమించక  అశాంతితో బాధపడే అవకాశం వుంది. అందువల్ల ఇటువంటి డూడ్లింగ్ గీసేవారు ఒక మెట్టు కిందికి దిగి,  తమ కన్నా క్రింది స్థాయిలో వున్నవారినైనా సరే ప్రేమించి ప్రేమింపబడటం అవసరం.

     4. కత్తులు, తుపాకులు, బాణాలు:

               


     ఖాళీ సమయాల్లో కత్తినీ, తుపాకినీ, విల్లునీ గీసేవారు ఒక విధమైన కట్టడిలో పెరిగిన వారై వుంటారు. వీరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తాము అనుకున్నది సాధించగలుగుతారు. వీళ్లని ప్రేమించే వారికన్నా, వీరు ప్రేమించేవారు తక్కువగా వుంటారు. అయితే, అవతలవాళ్ల ప్రేమకి వీరు తగిన గుర్తింపు ఇవ్వరు.

     5. సంతకాలు , దేవుడి పేర్లు:

     మనం  చాలామంది పుస్తకాలమీద దేవుడి పేర్లు రాయటం గమనిస్తూ వుంటాం. కాగితం నిండా తమ సంతకాన్ని పెట్టడం కూడా చూస్తూంటాం.

        

     దేవుడి పేర్లు రాయటాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు.

     1.  స్పృహలో వుండి రామకోటి  వ్రాసినట్లు పుణ్యం కోసం  వ్రాయటం.

    2. ఏదో ఆలోచిస్తూ అనాలోచితంగా దేవుడి పేర్లు వ్రాయటం.  ముందే చెప్పినట్లు డూట్లింగ్ అంటే స్పృహలో వుండి చేసే చర్యకాదు. కేవలం అనాలోచితమైన  చర్య మాత్రమే.

     ఈ విధంగా కాగితం మీద దేవుడి పేర్లు వ్రాసేవారు చిన్నప్పటినుంచి తల్లిదండ్రుల కస్టడిలో పెరిగిన వారై వుంటారు. తమ మీద తమకి నమ్మకం తక్కువైన వాళ్లై వుంటారు. తమ వాళ్లని, తమ పిల్లలని  మనస్పూర్తిగా ప్రేమించేవారై వుంటారు. ఏదైనా తప్పుచేసినా సరే ఆ తప్పుని తాము చేయలేదని మనస్పూర్తిగా నమ్మేవాళ్లు ఈ కోవలోకి వస్తారు.

     అలాగే ఖాళీగా వున్నప్పుడు కాగితాల మీద చిత్తు  సంతకాలు పెట్టే వాళ్లు ఇండివిడ్యుయలిస్టులు, తమమీద తమకి నమ్మకం వున్నవాళ్లు, తమని కేంద్రబిందువుగా చేసుకుని నిరంతరం  ఆలోచించేవాళ్లయి వుంటారు. ఈ సంతకాల్లో కూడా ఒక్కోసారి  పెద్దసంతకం  పెట్టి మరోసారి  పొడి అక్షరాలతో   పూర్తిచేసి కాగితం నిండా ఈ విధంగా రకరకాల  సంతకాలు చేసేవాళ్లు అవతల మనిషి మీద నమ్మకం తక్కువ వున్న వాళ్ల్లై వుంటారు.  జీవితంలో ఏదో ఒకటి చేసి ఎలాగైనా పైకి రావాలి అనే స్వభావాన్ని కలిగిన వారై వుంటారు. మనిషికీ మనిషికీ మద్యవుండే సంబందాల పట్ల వీరికి  ఎక్కువ నమ్మకం వుంటుంది. అందువల్ల అందరూ మంచివారని  భావించి  వారిని నమ్మడానికి ప్రయత్నిస్తారు.

    కాగితం మీద  ఆశ్చర్యార్దకాలు, ప్రశ్నార్దకాలు గీసేవాళ్లు జీవితంలో ఎప్పుడూ ఒకరకమైన ఉద్వేగానికి లోనవుతుంటారు. వీళ్లది చిన్న పిల్లల మనస్తత్వం.  ఆనందమొచ్చినా విషాదమొచ్చినా పట్టలేరు.  చిన్న పిల్లల మనస్తత్వం అని చెప్పి వీళ్లని తక్కువ అంచనా వెయ్యలేం. ప్రపంచంలోని  మేధావులందరూ మానసికంగా చిన్న పిల్లలే  అన్న విషయాన్ని మనం మరిచిపోకూడదు.

     6.  పూలు, ఫ్యాక్టరీలు, ఇళ్లు, కిటికీలు:

                                 

     వీళ్లు జాలి, దయ కలిగి ఇతరులు మెచ్చుకునే విధంగా ప్రవర్తిస్తారు.  తమ ఆలోచనలని తమ ప్లాన్లని  తమ భవిష్యత్తుని ఇతరులతో చర్చించటానికి చాలా ఇష్టపడతారు.

     సరల స్వభావికులు ,మృదు సంభాషణాచతురులు. భావుకులు,  ఎక్కువగా పూలబొమ్మలు గీస్తుంటారని గ్రాఫాలజిస్టులు చెబుతారు.

     ఒక పువ్వు గీసేవారు ఇంట్రావర్టులయితే, ఒకటి కన్నా ఎక్కువ గీసేవారు ఎక్స్ ట్రావర్ట్ లై వుంటారు. పూలతోపాటు ఆకులూ  రెమ్మలూ గీసే వారు ఏ పనైనా   మొదలుపెడితే పూర్తి చేసే వరకూ కిటికీలు, తెరుచుకున్న కిటికీలు...... ఈ  బొమ్మలు గీసే వాళ్లు విశ్లేషణాత్మక శక్తి కలిగివుంటారు.

     7. ఓడలు, విమానాలు, కార్లు:
     మానసికంగా టెన్షన్  అనుభవిస్తూ జీవితం నుంచి తప్పించుకోవాలనుకునే వారు ఈ విధమైన  బొమ్మలు గీస్తుంటారు. తీరని ఆశలు తీర్చుకోవాలన్న తపన, నిరాశ, అశక్తత ఒకవైపు ఇంకోవైపు వీటన్నిటినీ అధిగమించాలనే మనస్తత్వంలో ఘర్షణ పడేవారు కూడా ఈ రకమైన బొమ్మలు గీస్తారు.  

 Previous Page Next Page