Previous Page Next Page 
అభిలాష పేజి 35

    శర్మ స్థితి అలాటిది.
   
    అతడు సర్వోత్తమరావు యింటికి చేరుకొనేసరికి పావుతక్కువ రెండు కావోస్తూంది.
   
    రొప్పుతూ యింటిముందు నిలబడ్డ అతడిని చూసి గూర్ఖ అనుమౌనంగా "ఏం కావాలి" అని అడిగాడు.
   
    "అర్చనగారు కావాలి."
   
    రాత్రి రెండింటికి పరుగెత్తుకుంటూ వచ్చి, "ఇంటి యజమానురాలు కావాలి"అని అడిగే ఆ అపరిచిత వ్యక్తిని మెడపట్టుకుని గెంతేవాడే. కాని, అతడి దుస్తులు చూసి తమాయించుకుని "ఎందుకు...? అసలు నువ్వెవరు?" అని అడిగాడు గూర్ఖా.
   
    శర్మ విసుగుతో, "అవన్నీ తరువత. ముండావిడని పిలుపు"అన్నాడు. ఒకవైపు టైమ్ అయిపోతూందనిఅతడికికంగ్రుగా వుంది. అయితే అతడి అరుపుకి గూర్ఖా అహం దెబ్బతిన్నది.
   
    "వెళ్ళేళ్ళు ఇక్కణ్ణుంచి __" అన్నాడు.
   
    "చాలా అర్జెంటు పని_"
   
    "ఏమిటా పని?"
   
    శర్మ ఇబ్బందిలో పడ్డాడు. చిరంజీవి విషయం ఈ గూర్ఖాకి చెప్పోచ్చోలేదో...ఆ విషయం చెప్పకుండా వాదించటం మొదలుపెట్టాడు. పావుగంట వాదించినా గూర్ఖా వప్పుకోలేదు. అంతలో అతడికో ఆలోచన వచ్చింది..... టెలిఫోను.
   
    చాలా పోష్ కాలనీ అది. మెయిన్ రోడ్ మీదకు రావాతనికి అరగంట పట్టింది. ఒక ఇరానీ హొటల్ ఇంకా తెరచివుంది. అక్కణ్ణుంచి ఫోన్ చేసేడు. అర్చన గదిలోంచి బైరాగి మెట్లు దిగుతూ వుంటే వినిపించిన ఫోన్ శబ్దం అదే.
   
    బైరాగి ఫోన్ ఎత్తి విసుగ్గా "హల్లో" అన్నాడు.
   
    "అర్చనగారున్నారా? ఒకసారి పిలవండి" వగరస్తూ అన్నాడు శర్మ.
   
    "ఎవరు మాట్లాడుతున్నది" అని అడిగాడు బైరాగి.అర్చానకి దూరపు ట్రంక్ కాల్స్ రావటం అర్ధరాత్రిపూట మామూలే.
   
    శర్మకి యిక అసలు విషయం చెప్పెయ్యటం మంచినిపించింది. "నా పేరు శర్మ. చిరంజీవిగారి విషయం ఒకటి అర్జెంటుగా అర్చనగారికి చెప్పాలి" శర్మ, చేసిన తప్పు అదే_ చిరంజీవి విషయం బైరాగికి చెప్పటం.
   
    చిరంజీవి పేరు వినబడేసరికి బైరాగి మొహంలో రంగు మారింది. ప్రత్యర్ధి గెలుపుని చూసి ఏర్పడే కసిలాటిది....ఎన్నాళ్ళనుంచో మనసులో పేరుకుని వున్నది.....తన మూగాప్రేమకి అతడు అడ్డు వస్తున్నాడన్నది, తను గెలవలేనిది అతడు గెల్చుకున్నాడన్నది.... చిరంజీవి, అర్చన కార్లో వెళ్ళటం మేడమీద నుంచి చాలాసార్లు చూసి __ కసితో కడలిపోయాడు అతడు.
   
    "ఏమిటి చిరంజీవగారివిషయం?" అన్నాడు 'గారి' అన్నమాతనొక్కి పలుకుతూ.
   
    "అన్నీ ఫోన్ లో చెప్పటానికి వీలులేదు. అర్చనగార్ని లేపండి__" ఆతృతగా అన్నాడు శర్మ. ఒకవైపు కొంపలటుకు పోతూంటే వీళ్ళందరూ ఇంత నిర్లిప్తంగా వుంటారేం...... అతడికి పళ్ళు మండి పోతూంది.... "తొందరగా లేపండీ!"
   
    "అర్చనగారు నిద్రపోతున్నారు."
   
    "ఇంత అర్ధరాత్రిపూట ఆమె మెలకువగా వుండరని నాకూ తెలుసు. అందుకే లేవామంటున్నాను" కోపంగా అరిచేడు.
   
    "కుదర్దు" నిర్లిప్తంగా అన్నాడు బైరాగి.
   
    "కానీ ఈ విషయం...." అని అతడింకా ఏదో అనబోతూ వుంటే_ ఫోన్ కట్ అయింది.
   
    శర్మ నెమ్మదిగా ఫోన్ క్రిందకి దింపేసేడు. అతడి మొహంలో ఉక్రోషం __కోపం చోటు చేసుకున్నాయి. ఒక వార్త అందించటానికి ఇంత కష్టపడాల్సి వస్తుందనుకోలేదు. కసిగా పెదవి కొరుక్కున్నాడు. అతడిని ఎంత ఉక్రోషం _నిస్సహాయతా ఆవరించాయంటే, అన్నీ మర్చిపోయి ఇంటికి వెళ్ళి నిద్రపోతూఅనుకున్నాడు. కనీ ఆ భావం క్షణంసేపే వెంటనే తేరుకున్నాడు.
   
    జేబులోంచిడబ్బులు తీసి హొటల్ వాడికి ముప్పవులా ఇచ్చాడు. ఇంకా ముప్పావులా మిగిలివుంది. అతడికి ఎం చెయ్యాలో తోచలేదు.
   
    బయటకొచ్చాడు. చలిగాలి రివ్వున వీస్తూందీ రాత్రితాలూకు వర్షపునీరు రోడ్డుమీద నిలిచివుంది.
   
    ఊరంతా గాఢనిద్రలో వున్నట్లుంది. ఏం చెయ్యాలో తోచక రోడ్డు మధ్యలో నిస్సహాయిగా నిలబడి వున్నాడతను.
   
    అతడికి కోపం అంతా సర్వోత్తమరావు మెడకి మళ్ళింది. అయన సాయంత్రం నుంచీ ఏంస్తున్నాడూ? అనుకున్నాడు.అంతలో మెరుపులావుకాలోచన తట్టింది. తనే సర్వోత్తమరావు కంఠంతో ఫోన్ చేస్తే....?
   
    రిస్కు!
   
    అయినా పర్లేదు. ఈ అర్దరాత్రి ఎవడు గుర్తుపట్టి చచ్చేడు గనుక! ఒకవేళ సర్వోత్తమరావు గారే ఇంట్లో వుంటే తను దొరకిపోతాడు. దొరికి పోనీ! ఫోన్ పెట్టేస్తాడు__ అంతేగా!!
   
    జేబులో  డబ్బులు చూసుకుంటే ఇంకో ఫోన్ కాల్ కి సరిపడేంటంత వున్నాయి.మళ్ళీ ఫోన్ చేసేడు.. బైరాగి విసుక్కుంటూ వచ్చి ఫోన్ ఎత్తి "హల్లో" అన్నాడు.
   
    "నేను __ సర్వోత్తమరావుని, అమ్మాయందా?"
   
    బైరాగి చప్పున అటెన్షన్ లో వచ్చి "సార్" అన్నాడు. శర్మ మరింత అధికారంతో, "అమ్మాయుందా అంటే మాట్లాడవేం?" అని గద్దించాడు.
   
    "ని..... నిద్ర పోతున్నారు సార్."
   
    "వెళ్ళిపిలుపు."
   
    "అలాగేనండి..." ఫోన్ క్రింద పెట్టిన చప్పుడు,శర్మ వూపిరి బిగపేట్టి క్షణాలు లెక్కపేట్టి సాగేడు.
   
    బైరాగి మేడమీదకు పడిపడిగా వెళ్ళి అర్చన బెడ్ పక్కన నిలబడి "అమ్మాయిగారూ..." అని పిలవసాగేడు. అర్చన నిద్రమాత్రల ప్రభాపంలో గాఢనిద్రలో వుంది. ఇంకొంచెంసేపు ప్రయత్నించి విఫలమై కిందకొచ్చి, "అమ్మాయిగారు  నిద్రలేవటం లేదయ్యా" అన్నాడు. శర్మ గుండెల్లో రాయిపడింది కనీ వెంటనే సర్దుకుని, "ఇడియట్! బుద్ధిలేదూ? నేనని చెప్పి లేవు" అని అరిచేడు.   

 Previous Page Next Page