Home » Dr c. ananda ramam » Aathmabali


    "ఉద్యోగాలు చేసి ఊళ్లేలదామనుకొంటున్నావటనే! అదేమంటే, 'చదువురానివాళ్ళు మీకేం తెలుసు?' అన్నావుట! ఏం చూసుకొని నీకింత పొగరు?"
    ఈ అన్యాయారోపణను సహించలేక ఉమ ధైర్యంగా సమాధానమిచ్చింది.
    "ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను. ఊళ్లేలడానికి కాదు. నా భర్తను చదివించుకోవటానికి. నేనెవర్నీ ఏమీ అనలేదు."
    కుటుంబంలో అంతవరకూ అతనికి ఎదురునిలిచి సమాధానం చెప్పినవాళ్ళు లేరు. ఉమ సమాధానానికి అతను నిర్ఘాంతపోయాడు. తన మాటకు ఎదురువచ్చిందనే 'అహం' తప్ప నిజానిజాలు, మంచిచెడ్డలూ అతనికక్కర్లేదు.
    "ఉద్యోగం చేస్తావా? ఇది సానికొంపా? సంసారుల కొంపా? ఆ వంకతో నడివీధిలో ఊరేగుదామనుకొంటున్నావా?"
    "ఈ కొంప సంగతి నాకు తెలీదు. నడివీధిలో ఊరేగటానికి ఉద్యోగాలు చెయ్యక్కర్లేదు. ఉద్యోగాలు చేస్తున్నవారెవరూ నడివీధుల్లో లేరు."
    ఉమ సమాధానాలు చెపుతున్నకొద్దీ అతని కోపం మరింత రెచ్చిపోయింది.
    "నీ అక్కలా నువ్వూ భోగమాటలాడదామనుకుంటున్నావేమో? ఆ పప్పులుడకవు. నువ్వు గడపదాటి ఉద్యోగం చెయ్యడానికి వీల్లేదు."
    అక్క ప్రసక్తి తెచ్చినందుకూ, ఇంత అవమానకరంగా మాట్లాడినందుకూ కోపంతో వణికిపోయింది ఉమ. ఇంత అవమానకరంగా మాట్లాడినందుకూ కోపంతో వణికిపోయింది ఉమ. ఇంత అమర్యాదగా మాట్లాడే వ్యక్తిని గౌరవించవలసిన అవసరం లేదనిపించింది.
    "మీకు కోడలినయినందుకు నన్ననండి. ఎన్ని మాటలకైనా అర్హురాలిని. ఇతరులను అనవసరంగా నిందించకండి. నేను ఉద్యోగం చెయ్యకమానను. ఆయన ఒప్పుకున్నారు."
    "వాడెవడో ఒప్పుకోవటానికీ, మానటానికీ! నేను చెప్తున్నాను. వీల్లేదు."
    "ఆయన మీకెవరో కావచ్చు. కానీ ఆయనే నా సర్వస్వమూ."
    "అంతవరకూ వచ్చిందీ! 'నేనూ, నా మొగుడూ, నా యిష్టం' అనదల్చుకుంటే ఇక్కడెందుకూ? పొండి - నా ఇంట్లోంచి అవతలకు పొండి. చెప్పినట్లు పడుంటే ఇక్కడుండండి. లేకపోతే అవతలకు పొండి" విసురుగా వెళ్ళిపోయాడు.
    చెక్కుచెదరక నిల్చింది ఉమ.
    చలపతి బెంబేలుపడిపోయాడు.
    "నాన్నగారు ఇంట్లోంచి వెళ్ళిపొమ్మన్నారు. ఎలా ఉమా?"
    "మరేం ఫర్వాలేదు. మా శోభక్కయ్య దగ్గిరకు వెళ్దాం పదండి. ఏదో ఉపాయం ఆలోచిస్తుంది. ఎక్కడైనా అప్పుగా రెండుమూడు వందలు పుట్టిస్తే నా ఉద్యోగం రాగానే నెమ్మదిగా తీర్చెయ్యచ్చు. మీరు కాలేజీలో చేరితీరాలి. మీ పి.యు.సి. ఫలితాన్నిబట్టి ముందు కార్యక్రమం నిర్ణయించుకోవచ్చు. ఒక మంచి పనికిన్ని ఆటంకాలేవిఁటీ? కేవలం అహంకారం కాకపోతే! తన కొడుకు బాగుపడటం ఆయనకు మంచిదికాదూ?"
    ఆ రాత్రి కెలాగో ఓపికపట్టి మరునాడు మావగారు బయటికెళ్ళగానే బట్టలు సర్దుకుని చలపతితో బయలుదేరింది ఉమ.
    వర్ధనమ్మ పిండి బొమ్మయింది. "ఎక్కడికి?" అంది.
    "మావాళ్లింటికి."
    "మావఁగారితో చెప్పకుండానేనా?"
    "ఆయన మాటమీదనే వెళుతున్నాం."
    "ఆయన మీవాళ్లింటి కెళ్ళమన్నారా?"
    "ఇంట్లోంచి పొమ్మన్నారు."
    "కోపంలో ఏదో అంటే..."
    "కోపం తగ్గి, రమ్మన్నప్పుడు తప్పక వస్తాం."
    మరొకసారి నిర్ఘాంతపోయింది వర్ధనమ్మ.
    వర్ధనమ్మకు నమస్కరించి రిక్షాలో కూర్చుంది ఉమ - చలపతి కూడా నమస్కరించబోయాడు.
    "నువ్వూ పోతున్నావుట్రా?"
    "ఉమను విడిచి నేనుండలేనమ్మా."
    "నేనక్కర్లేదా?"
    "ప్రస్తుతం నాకు నీ అవసరంకంటే ఉమ అవసరం ఎక్కువ."
    ఉలిక్కిపడింది వర్ధనమ్మ. తన వెఱ్ఱిబాగులకొడుకు తన ముఖంమీదే ఇలా మాట్లాడతాడనుకోలేదు. రిక్షా కనుమరుగయ్యే వరకూ దిగ్భ్రాంతితో చూసి కసిగా తలుపులు దభాలున మూసింది.


                                     22


    చలపతితో రిక్షాదిగి ఇంట్లో ప్రవేశించిన ఉమ వితంతువేషంలో ఉన్న పార్వతిని చూసి "వదినా!" అని ఆర్తనాదం చేసింది. పార్వతి కళ్ళలో నీళ్ళు పూర్తిగా ఎండిపోయాయి. శూన్యంగా ఉమను చూసి "ఇప్పటికైనా వచ్చావా?" అంది పొడిగా. ఎంతో ఆప్యాయంగా తనతో మాట్లాడే వదిన ఇలా పొడిగా మాట్లాడేసరికి ఉమ గుండెలు చెదిరిపోయాయి.
    "నాకు తెలీదొదినా! నిజంగా నాకు తెలీదు. నీతో కులాసాగా కబుర్లు చెప్పాలని గంపెడాశతో వచ్చి ఈ పాపిష్టికళ్ళతో మారిపోయిన నీ రూపాన్ని చూసి కృంగిపోతున్నాను. ఇంత అన్యాయం ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? నాకొక్క కార్డయినా రాయలేదేం?"
    "శోభ రాశానంది...ఎవరొచ్చి ఏం చెయ్యగలరులే!"
    సందడికి కామాక్షమ్మ బయటికొచ్చింది.
    "నువ్వింకా బ్రతికే ఉన్నావా తల్లీ!" అంటూ కుశలమడిగింది.
    చలపతికిప్పుడిప్పుడే విషయం సరిగ్గా అర్ధమవుతోంది, కామాక్షమ్మ మాటలతనికర్ధమయ్యాయి. తలవంచుకున్నాడు. ఉమ మనసు కలుక్కుమంది.
    "ఏవిఁటమ్మా ఇది? నిక్షేపంలా ఉన్నాను. వదినను చూడు పుట్టెడు దుఃఖంలో ఉంది. నాకేవిఁటీ?"
    "మీ ఇద్దరిలో ఎవరి దుఃఖం ఎక్కువో నాకర్ధం కావటం లేదమ్మా!"
    కన్నీళ్ళతోనే అంది కామాక్షమ్మ.
    "అబ్బబ్బ! ఊరుకో!" అంటూ గాభరాగా తల్లిని కసిరింది ఉమ.
    సాయంత్రం శోభ ఆఫీస్ నుండి వచ్చి ఉమను చూసి ఆశ్చర్యపోయింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra