ఎదురుగావున్న వ్యక్తివ్తెపు ఇబ్బందిగా చూసి____"నాకో యాభ్తే రూపాయలు కావాలి" అన్నాడు.
"ఇప్పడా?" అఆశ్చర్యంగా అడిగేడా క్లర్కు.
"అవును. చాలా అవసరం, మళ్ళి రేపు యిచ్చేస్తాను."
అతనొక క్షణం ఆలోచించి__ "ఒక రెండు నిమిషాల్లో ఇస్తాను" అన్నాడు.
ప్రకాశం తేలిగ్గా ఊపిరి పీల్చుకొని తన సీటు దగ్గర కోచ్చేడు. రాఘవరావు ఆత్రుతగా తనవ్తెపు చూడటం గమనించి___"దోరికింది" అన్నాడు.
కుర్చీలో వెనక్కి వాలుతూ "క్షమించండి. పొద్దున్నే వచ్చి అనవసరంగా మిమ్మల్ని బాధపెట్టెను" అన్నాడు రాఘవరావు.
స్నేహపూర్వకంగా అతని చేతిమీద చెయ్యివెస్తూ, "మీరు అలా అనకండి నిజంగా ఇంత శ్రమ తీసుకొని వచ్చినందుకు నేనే మీ కెంతో ఋణపడి వున్నాను" అన్నాడు ప్రకాశం.
అంతలో కో-క్లర్కు డబ్బు తీసుకువచ్చి యిచ్చేడు. దాన్ని అతని చేతిలో పెడుతూ "నేనూ రావాలా?" అని ప్రశ్నించేడు.
"అక్కర్లేదులెండి. నేను చూసుకుంటాను" అంటూ లేచాడు రాఘవరావు. అతనితోబాటు ప్రకాశామూ బయటకోచ్చేడు. అతను వెళ్ళి పోతూ వుంటే "ఈ విష్యం దయచేసి ఎవరికీ...." అంటూ మధ్యలో ఆపుచేసేడు.
రాఘవరావు నవ్వి "నాకు అంతగా చెప్పాలా? మిరి విషయంలో ఏవి ఆలోచించకండి...." అని స్తేకిలేక్కుతూ "అయినా ఎవరి బలహీనతలు వారివి... మనమేం చెయ్యగలం?" అంటూ వెళ్ళిపోయేడు.
అతను వెళ్ళినవ్తెపే చూస్తూ వుండిపోయేడు. ప్రకాశం అతని మాటలే చెవుల్లో ప్రతిధ్వనించ సాగినయ్. "ఎవరి బలహీనతలు వారిని నిజవే తను కాదనడు. కాని వేదాంతం అలవర్చుకోవలసిన యాభయిఏళ్ళ వయసులో ఇదేం బలహినత" అతనికి మావయ్యమీద కోపం రాలేదు, అసహ్యం వేసింది. ఎంత కసి పెరిగిపోయిందంటే- "సిత కూతురు కాబట్టి సరిపోయింది. తనేగాని ఆయన కొడుక్తేవుండి, సిత ఆ యింటి కోడలుగా వస్తే, ఆ అమ్మాయిని కూడా తన దాహానికి వాడుకోటాన్కి ఆయన వెనుదిసి ఉండేవాడు కాదు" అనేటంత క్రూరంగా ఆలోచించటానికి కూడా ప్రకాశం వెనుదియలేదు.
ప్రకాశం తిరిగి తన సీటు దగ్గరికి వచ్చేసరికి తన తోటి క్లార్కు చమన్ లాలూ అక్కడే కూర్చొని వున్నారు. వాళ్ళని చూసి కొంచెం ఆశ్చర్యపడుతూనే "ఏమిటి సంగతి?"అని అడిగేడు.
"దానికేముంది. అప్లి కేశాను ఇమ్మను చూద్దం" అన్నాడు ప్రకాశం మామూలుగా.
కో-క్లర్క్ నవ్వేడు___ "మామూలుగా అది రావటాన్కి ఎంత కాలం పడుతుందో నీకు తెలీదూ? ఇప్పడది అర్జంటుగా కావాలి. నువ్వు తలచుకుంటే అంత పెద్ద కష్టం కాదు అది."
"కాని..."
"ఇందులో అంత తప్పేవి లేదే. మామూలుగా మూడ్రోజులు పట్టేది_కొంచెం ముందు ఇమ్మంటున్నాడం తే. నువ్వు కొంచెం శ్రమ పడితేచాలు ప్రకాశం- అతనికి ఆ సర్టిఫికేట్ చాలా అవసరం వుంది. ఈ రోజు దాన్ని ఇంకేదో ఆఫీసులో చూపించకబోతే వాళ్ళతనికి 'గూడ్స్' ఇవ్వరట_" అనునయిస్తున్నట్టు అన్నాడు తనని కష్టంలో ఆడుకొన్నవాడు అంత ప్రాదేయపడుతూ వుంటే ఇలా మొండిపట్టు పట్టటం బావోదాని పించింది అయిష్టంగానే "చూస్తాను" అన్నాడు.
చమన్ లాల్ మొహం వికసించింది. లేచి "ధాంక్స్ చాలా ధాంక్స్ సాయంత్రం వస్తాను" అన్నాడు. అతను వెళ్ళిపోయేక ప్రకాశం తన స్నేహితుడి వ్తెపు తిరిగి "మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞత చెప్పుకోవలో తెలియటంలేదు. ఆ యాభయి రూపాయలూ నన్ను చాలా ఆడుకోన్నాయి" అన్నాడు.
అతను మొహమాటంగా నవ్వేడు.
"....మీకు శ్రమ ఇచ్చినందుకు ఏవి అనుకోకండి.
అతను ఆశ్చర్యంగా చూసేడు.
మళ్ళి ప్రకాశవె అన్నాడు___ "ధాంక్స్ ....మీ డబ్బు మిటి?... అది ఆ చమన్ లాలే ఇచ్చాడు. క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మన ఆఫీసులో రేటు అదేగా "అన్నాడు.
"ఏమిటి" అన్నాడు ఆశ్చర్యంగా ప్రకాశం. ఆ విష్యం వినగానే అతనికి షాక్ తగిలినట్టూ అనిపించలేదు ఉట్టి ఆశ్చర్యం____బాధకాదు.
16
"పొద్దున్నించీ నీ కోసం కంగారుపడుతున్నాం నాన్నా. ఎక్కడి కెళ్ళేవ్?" పరందాంయ్యా రాగానే అడిగింది సిత.
మొహంమీద ఏ భావమూ కనబడ నియకుండా అదేదో సామాన్య మ్తెన విషయంలా నవ్వేసాడు పరంధామయ్య....."రాత్రి నిద్రపట్టక అలా సెకండ్ షోకి వెళ్ళేనమ్మ. ఈ ఊళ్ళోస్తిక్ట్ ఆట నాకు తెలిదు. ఇలా సిగరెట్ వెలిగించానో లేదో వచ్చి పట్టుకున్నారు...."
సిత కంగారుపడి "ఏం చేసేరు నాన్నా"అంది.
"ఏం చేస్తారు? పొద్దున్న ఇన్ స్పెక్టర్ వచ్చేడు. నా కింద పని చేసినతనే, నన్ను చూసి బోల్డు సంబరపదిపోయేడు. ఆ పోలీసుని తల వాచేటట్టు చివాట్లు పెట్టి, నన్ను టాక్సీలో పంపెసేడు."