Home » Dr c. ananda ramam » రేపటి మహిళ


    అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్లు ఉలిక్కిపడ్డాడు భాగవతార్. రిసీవర్ ని క్రేడిల్ లో పడేసి లేచి నిలబడ్డాడు.
    "వెళ్దాం పదండి"
    "ఎక్కడికి?"
    "ఏండెటో దగ్గిరకి."
    "ఏండెటోగారికేమైందండీ?"
    "ఏంకాలేదు అక్కడికి మృదుల వెళ్ళింది"
    "ఓస్! అంతేకదా! ఏదేనా పనిమీద వెళ్లుంటారు, పనికాగానే వచ్చేస్తారు. దానికింత రాద్దాంతం దేనికి?"
    "మీకేం తెలియదు. వాళ్ళిద్దర్నీ రెడ్ హేండెడ్ గా పట్టుకోవాలి."
    "ఛ....ఛ.... మీ అనుమానాలు మళ్ళీ మొదలయ్యాయా!"    
    "కిం జీర్ణం తృణమత్తి మానమహతా మగ్రేసరః కేసరీ?" అంటే అభిమానం ముప్పిరిగొన్న సింహం ఎండుగడ్డి తింటుందా? మృదులగారు ఒక్కనాటికీ ఇలాంటి అడ్డదార్లు తొక్కరు."
    "మీ సూక్తులు కట్టిపెట్టి వెళదాం పదండి."
    "వస్తాను, మీ పరాభవం చూడ్డానికి."
    "ఏమిటి సార్! ఎప్పుడూ మంచి మూడ్ లో నన్ను డిస్టర్బ్ చేస్తారు" విసుగ్గా అన్నాడు ఏండెటో తన ఇంటికొచ్చిన భాగవతార్, నక్షత్రలతో.
    "ఎవరు? నీ బెడ్ రూమ్ లో ఉన్నది?"
    నవ్వేడు ఏండెటో, జోక్ చెయ్యకండి సార్, నా బెడ్ రూమ్ లో ఉన్నది ఎవరైతే మీకెందుకు? మీకిలాంటివి అఖ్ఖరలేదు కదా!"
    "షటప్! లోపల ఉన్నదెవరో చెప్పు"
    "సార్! మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. కాని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊర్కోను. నా గాళ్ ఫ్రెండ్ జోలి మీకెందుకండి?"
    "నీ గాళ్ ఫ్రెండ్ జోలి నాకక్కరలేదు. నా భార్యని నీ గదిలో దాచావు. బయటికి పిలు."
    "మీ భార్యా! ఎవరి సంగతి మీరు మాట్లాడుతున్నది? మృదులగారి గురించా!"
    "నాకెందరు భార్యలున్నారని? బయటికి పిలువు మృదులని"
    "మీకు మతిపోయిందా! మృదులగారు నా యింట్లో ఎందుకుంటారు?"
    "మృదుల మీ ఇంటికొస్తూన్నట్లు నాకు తెలుసు. అబద్దమంటావా?"
    "అనను, అవును ఆవిడప్పుడప్పువాడొస్తుంటారు."
    "ఈ విషయం నాకిన్నాళ్ళూ ఎందుకు చెప్పలేదు."
    మృదులగారు రహస్యంగా ఉంచమన్నారు."
    "మీరిద్దరూ కలిసి...."
    "ఛ-ఊరుకోండి. ఆవిడ నాదగ్గిరకు మృదంగం నేర్చుకోడానికొస్తున్నారు. మీకు ప్లజెంట్ సర్ ప్రైజ్ ఇవ్వాలని రహస్యంగా ఉంచమన్నారు. మీ పాటకి సమంగా మృదంగం వాయించి మీచేత సెహభాష్ అనిపించుకోవాలన్నది ఆమె ప్రగాడ వాంఛ. స్వరమాధురం సాధించలేరు కనక మృదంగ వాయిద్యంలోనైనా ప్రావీణ్యం సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు."
    నిర్ఘాంతపోయాడు భాగవతార్.
    దభాల్న బెడ్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. ఆ తలుపుల వెనక నుంచి వచ్చిన అమ్మాయిని చూసి అవాక్కయిపోయాడు భాగవతార్. చక్కగా గంజిపెట్టి ఇస్త్రీ చేసిన చీర వంటినిండా కప్పుకుని, తల కిందకు దించుకుని, ఆఫీసుకెళ్ళే ఆ అమ్మాయిని చాలాసార్లు చూసాడు భాగవతార్. "ఆడపిల్లలంటే ఇలా ఉండాలి. ఈ అమ్మాయిని పెళ్ళిచేసుకునేవాడు ఎంత అదృష్టవంతుడో అనుకున్నాడు చాలాసార్లు.
    "ఏమిటండీ!" అలా నోరు తెరిచిచూస్తారూ! చదువు - రూపం - గుణం - అన్నీ ఉన్న ఆడపిల్లని భార్యగా తెచ్చుకోవడానికి కట్నాలు గుమ్మరించమనడం మీకేమీ వింతగాలేదు. కట్నంకోసం అందంగా లేకపోయినా పెళ్ళి చేసేసుకుని మరో అందమైనదాన్ని "ఉంచుకోవటం", మీకు వింతగా తోచలేదు, ఒక భార్యని చంపేసి మరో భార్యని చేసుకుంటే మరింత కట్నం వస్తుందనే ఆశతో కట్టుకున్న భార్యని నిలువునా మంటల్లో కాల్చడం మీకు వింతగా తోచలేదు. అందమైన ఆడపిల్ల ఏరికోరి వరించి పెళ్ళి చేసుకుంటే నిష్కారణమైన అనుమానాలతో వీధిని పడి అల్లరి పెట్టడం కూడా మీకు వింతగా తోచలేదు. థూ! ఏం జాతి ఇది. నేనిక్కడెందుకున్నానని మీకు సందేహంగా ఉంది కదూ! నన్ను పెళ్ళాడ్డానికి ఒక్కొక్క వరుడు ఇరవై వేల కట్నం అడుగుతున్నాడు. నేను కష్టపడి ఉద్యోగం చేసి అందులో ఆ జీతంలోంచి నా ఖర్చులుపోనూ మిగిలింది దాచి ఇరవై వేలు పోగుచెయ్యాలి. కొన్ని ఏళ్ళు పడుతుంది. అందుకు అప్పటిదాకా బోర్ కొట్టినప్పుడు ఎంటర్ టెయిన్ మెంట్ కోసం ఇలాంటి స్నేహితుల ఇళ్ళకి వస్తూంటాను. ఇరవై వేలూ పోగయ్యాక అవి ఎవడో ఒకడి ముఖానకొట్టి తాళి కట్టించుకుంటాను తల్లి కావడం కోసం. అంతకంటే నేను చెయ్యగలిగిందేముంది? కట్నాలకోసం ఎగబడే వాళ్ళకంటే లేనిపోని అనుమానాలతో భార్యలను హింసించేవాళ్ళు మరింత నికృష్టులు." కంపరంగా భాగవతార్ ని చూస్తూ, అతడికి దూరంగా తప్పుకుని, పైటనిండా కప్పుకుని తలదించుకుని వెళ్ళిపోయింది లోపాముద్ర.
    "కథం దీపికాం తమః కళంకయతి?" అంటే, "చీకటి దీపాన్ని కళంకపరుస్తుందా?" అన్నాడు నక్షత్ర.
    తనని తను నిగ్రహించుకోటానికి విశ్వప్రయత్నం చేసాడు భాగవతార్. అయినా అతని మనసు సమాధానపడటం లేదు. తీవ్రమైన రోగంతో బాధపడుతూ చస్తాడో- బ్రతుకుతాడో తెలియకుండా ఆందోళనతో కొట్టుకుంటున్న రోగి మనసులా ఉందతని మనసు. ఈ అశాంతికంటే ఎంతటి దుర్వారయినా మేలేననిపించింది. ఈ సారి నక్షత్రని తీసుకెళ్ళలేదు. అతని సూక్తులు భాగవతార్ మనసులో మంటలమీద ఆజ్యం పోస్తున్నాయి. తనేదో చెయ్యరాని పని చేస్తూన్నట్లు నిలబెట్టి విచారిస్తూన్నట్లుగా చూసే నక్షత్ర చూపులు తట్టుకోలేకపోతున్నాడు. అనంగ్ ఇంటిముందు కారు పార్క్ చేసి కాలింగ్ బెల్ ప్రస్ చేసాడు. తలుపులు తెరుచుకున్నాయి. గబుక్కున ఒక అడుగు వెనక్కి వేసాడు. బాగా నెరసిపోయి చింపిరిగా వ్రేళ్ళాడుతూన్న జుట్టు- గద్దముక్కు లాగ బాగా ముందుకు పొడుచుకొచ్చిన ముక్కు, కింది పెదవిని దాటి మరింత ముందుకు సాగిన పళ్ళు-ముఖంలో లోతుగా గుంటలుపడిన కళ్ళూ- దొప్పల్లా వెళ్ళాడుతూన్న చెవులు- ఆ ఆకారాన్ని చూసి నోటమాట రాలేదు భాగవతార్ కి. ఆ ఆకారం నవ్వి. "లోపలికిరండి!" అన్నాక గుర్తించాడు అది ప్లాస్టిక్ మొఖం అని. లోపలికెళ్ళి సోఫాలో కూర్చుని, "అనంగ్ గారిని పిలవండి!" అన్నాడు.
    "పిలవడానికి ఆయనగారింట్లో ఉంటేగా!" వికారపు ముసిలమ్మ ప్లాస్టిక్ ముఖం నిట్టూర్చింది.
    "ఎక్కడికెళ్ళారు?"
    "రాజభూషణంగారింటికి. మృదుల మా యింటికొస్తోంది. మీరూ రండి. పెద్ద హీరోయిన్ లాగ పోజులు కొడుతూ కబుర్లు చెపుతోంది. దాని బండారం బయట పెడతాం రండి" అని ఫోన్ చేసాడు రాజభూషణం. వెంటనే అనంగ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కాళ్ళతో కాదనుకోండి. మోటర్ సైకిల్ మీద. అయినా మీకిదేం బుద్ధండీ? మీ భార్యని రాజభూషణం దగ్గిరకి పంపించాలా! మీరేమో ఇక్కడికి తయారయ్యారా? రాజభూషణం మీకు పార్టీలిస్తాడు- పాటకచ్చేరీ లేర్పాటు చేయిస్తాడు_ సన్మానాలు చేయిస్తాడు. అదంతా నిజమేకాని, వెధవ సన్మానాల కోసం మరీ ఇలాంటి స్థితికి దిగజారతారా? బుద్ధుండఖ్కర్లేదు. ఛీ....ఛీ!"  
    బిక్కచచ్చిపోయాడు భాగవతార్. గుటకమింగాడు. ఏదేదో ఘాటుగా చెప్పాలనుంది. మనసులో సుడులు పడ్తూన్న భావాలకి మాటలు దొరకడం లేదు.
    "నీ పేరేమిటి?" అన్నాడు సంజాయిషీ యిచ్చుకోవడానికి తయారౌతూ.
    "మృదుల .... నేనే ఆర్యపుత్రా! ఇంకా నన్ను గుర్తించలేదా?" విరగబడి నవ్వింది.
                                                                         *    *    *
    రాజభూషణం జైల్లో పెట్టించిన గిరిజనులు లాయర్ యశోధరాదేవి జోక్యంతో విడుదలైనా, శాంతించి ఊర్కోలేదు. రాజభూషణం, అసభ్య ప్రవర్తనపైనా_ విచారణ జరిపించాలని పట్టుబట్టారు. ప్రతిపక్షాలు కూడా కొంత అలజడి చేసాయి. అక్కడితో ఊర్కోకుండా తమ స్త్రీజనం పట్ల రాజభూషణం చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అందుకు క్షమాపణ చెప్పి_నష్ట పరిహారం చెల్లించుకోవాలని_కోర్టులో కేసు పెట్టారు కొందరు గిరిజన యువకులు. కోర్టు పేరు చెపితే బెంబేలెత్తిపోయే గిరిజనులు_ పోలీసులు ఆమడ దూరంలో ఉన్నారనగానే_ ఆరు మైళ్ళు వెనక్కి పరుగెత్తుకెళ్లే గిరిజనులు_ నాగరిక సమాజానికి_ కోర్టులకి_ ఆసుపత్రులకి_ దూరంగా తమ అడవిలో తాము బ్రతకాలనుకొన్న గిరిజనులు_ తామే ఎదురు తిరిగి కేసు పెట్టడం_ అందులోనూ రాజభూషణంపైన కేసు పెట్టడం నాగరిక సమాజానికి దిగ్బ్రమ కలిగించింది. అజ్ఞానంలో మగ్గిపోతూ నూతుల్లో కప్పలా అమాయకంగా బతికేసే గిరిజనుల్లో ఇంతటి జాగృతి ఊహాతీతంగా తోచింది.
    అయితే రాజభూషణం అతి తెలివిగా ఈ వల్లోం చి బయటపడి అనంగ్ ని అపరాధిగా చూపించగలిగాడు.
    రాజభూషణం ఫోన్ చెయ్యగానే పరమానందంగా అతడింటికి బయల్దేరాడు అనంగ్. మృదులని అవమానించి- కసి తీర్చుకోవాలని పట్టుదలగా వుందతనికి, నిజానికి మృదుల అతడికి చేసిన అపకారమేమీలేదు. మృదుల తనతోపాటు గిరిజన గ్రామానికి రమ్మని ఆహ్వానించగానే అతడే ఏదేదో ఊహించుకున్నాడు. ఆ ఊహలన్నీ చిందర వందరైపోయి అందమైన స్వప్నలోకానికి బదులుగా- చావు దెబ్బలు ఎదురయ్యేసరికి బాధతో, అవమానంతో రగిలిపోయాడు. దీనికంతకీ బాధ్యత మృదులదే అన్నట్లు అనిపించింది అతని మనసుకి. రాజభూషణం మృదుల "వస్తోంది" అని చెప్పగానే, అది సంభవమా- అసంభవమా అని ఆలోచించకుండా వెంటనే బయల్దేరాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra