ఇప్పుడు ఆమె ఉద్విగ్నతకు కారణం ఇవేవికావు. ఒకవేళ ఆమె తెగించి ప్రకాశాన్ని పెళ్ళిచేసుకొన్నా ఇలాటి రాత్రి ఎప్పడన్నా హరికేన్ లాంతరు గుడ్డివెలుతురులో ఈ డ్తెరి చదివితే, మళ్ళి ఆమె ఈ ఉద్విగ్నతనే అనుభవించవచ్చు. కారణం చాలా చిన్నది. గతం ఎప్పడూ అందమ్తేనదే వర్తమానం సంఘర్షణ-ముఖ్యంగా సుజాతలాటి వాళ్ళకు.
"నిద్ర రావటంలేదా?" అన్న కంఠం మృదువుగా వినబడటంతో తలతిప్పి చూసింది. గుమ్మం దగ్గిర మాణిక్యాలరావు నిలబడి వున్నాడు.
సుజాత నవ్వి పుస్తకాలు సర్దేసి పడక గదిలోకి వచ్చేసింది.
"సుజాతా...." అస్పష్టంగా పిలిచాడు. దుప్పటి కప్పకోబోతున్న దల్లా ఆగి భర్తవ్తెపు చూసింది. అతను ఆమె వ్తెపు చూడకుండా అన్నాడు. "నన్ను పెళ్ళిచేసుకోవటంవల్ల నువ్వు భరించలేనంత అసంతృప్తిగా ఫిలవుతున్నావా?"
ఉలిక్కిపడి "అంటే" అంది.
"ఏవిలేదు. ఇంత అర్ధరాత్రిపూట ఇలా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకొంటూన్నవంటే?"
సుజాత ముఖం తెల్లగా పాలిపోయింది. "లేదు, అటువంటిదేమి లేదు" అంటూ గొణిగింది.
"నిజం సుజాత" ఆగేడు. "మనిద్దరి కథా ఎవరన్నా వ్రాస్తే మొదటి పేరాలోనే నేను విలన్ని. కారణాలు రెండు ఒకటి -నేను అందంగా లేకపోవటం, రెండు -జీవితంపట్ల నేను చాలా పచ్చిఅగా అభిప్రాయలు అవేలిబుచ్చటం" అతని కంఠం గద్గదికమ్తెంది "కాణి ఏం చెయ్యను. ఈ రెండింటిలో ఏ ఒక్కదాన్ని మార్చుకోలేను. మొదటిది దేవుడిచ్చింది. రెండోది అనుభవాలు నేర్పింది. ఈ కారణంగానే నువ్వు నా పట్ల చూపించలేకపోతే___దానికి నేనేం బాధపడను. నా మీద కొంచెం సానుభూతి చూపించు చాలు. ఆ ఆలంబనతో ఒక జీవితకాలం బ్రతికేస్తాను." సుజాత చప్పన చేత్తో అతని నోటిని మూసివేసింది. వర్షించటానికి సిద్దంగావున్న కళ్ళు గట్టిగా మూసుకొని అతని గుండెల్లో తలదాచుకోంది. ఆమె గుండెల్నిండా అతనిపట్ల ఏదో తెలియని ఒక ఆత్మీయత నిండిపోయింది. అత నామే జుట్టు నెమ్మదిగా నిమురుతూ వుండిపోయేడు. కొంచెం విరామం తరువాత అతనన్నాడు. "మనం కొంత కాలంపాటు ఎక్కడికన్నా వేల్లోద్దాం సుజాత!.... ఈ బిజినెస్ వ్యవహారాలు నాకూ తలనోప్పిగానే వున్నాయి."
సుజాత 'అలాగే' అన్నట్టు అతని గుండెలమీద నుంచి లేవకుండానే తలవూపింది. విపు వెనుకనుంచి అతని చెయ్యి బిగుసుకోంది. ఆమె తలెత్తి ఆర్తిగాస చూసింది అతనివ్తెపు. మసక వెలుతురులో అతని కళ్ళు ఒక వింత కాంతితో మెరుస్తున్నాయి. కొంచెం ప్తెకి జరిగింది.
అజంతా గుహల్లో నిశ్శబ్దంగా! పక్కనే అర్ణవపుహొరు! తెగిన బ్రసరి హుక్కు! విరిగిన చేతిగాజూ! ఎత్తయిన కొండల అంచుల్ని స్పృశించాలని తాపత్రయపడే మేఘాలూ, తిగెల్ని శృతిచేస్తే శరీరంపాడే శివరంజిని! లోయలమధ్య చీకటి-చీకట్లో వెలుగురేఖ! అరణ్యం మధ్యలో తన అస్దిత్వం సలుపుకొనే గడ్డిపువ్వు.....
ప్రకృతితో పురుషుడి పోరాటం! స్థగుల్ ఫర్ ఎగ్జిస్టేన్స్! విభావరి సుందర పయోధరల ప్తె అంగజుని నఖక్షతాలు! జీవితం అంతా మూన్నిముషాల ఘర్షణ. కాంట్రడిక్షన్ల ముడి విప్పితే, ఆ ఘర్షణలో అస్దిత్వపు స్పందన!
అనుభవం భౌతికమ్తేతేనేం? భావం మానసికమ్తెంది.
ధాంక్యూ ఈజ్!
13
ఇక నిద్రపట్టదని పూర్తిగా నిశ్చయించుకొని పక్కమీదనుంచి లేచాడు ప్రకాశం.
పదకొండున్నార అయింది.
కిళ్ళి వేసుకోవాలని అనిపించింది. బ్తేటకు వెళ్ళోస్తే బావుంటుందనుకొని చెప్పలేసుకొన్నాడు.
బ్తేటకోస్తూ లోపలి గడియ ఎత్తిపట్టుకొని తలుపు దగ్గిరగా లాగేడు. లోపలి బోల్డు పడింది తలుపుతోసి గెడ పడిందని సంతృప్తి చెంది విధిలోకి అడుగు పెట్టాడు.
అంతా నిర్మానుష్యంగా వుంది. విధిల్తెటు చికటినీ పారద్రోలు తుంది. చెత్తకుండి పక్క బూడిదలో పడుకున్న కుక్క అలికిడి వినితలెత్తి చూసి మళ్ళి పడుకుంది.
ప్రకాశం మెయిన్ రోడ్ మీద కొచ్చాడు. సాధారణంగా సెకండ్ షో వదిలేవరకూ ఉండే కిళ్ళిషాపు మూసేసివుంది. 'ఎలానూ నిద్ర పట్టటం లేదు కాబట్టి కొంచెందూరం నడుద్దాం' అనుకొని మెయిన్ రోడ్ వరకూ వచ్చి కిళ్ళి వేసుకొన్నాడు.
కార్నవాల్ కి వెళదామనిపించింది.
జేబులు చూసుకొన్నాడు మూడ్రూపాయలున్నాయి.
పోతే నష్టం ఏవిలేదు.
వారం అంతా తన అదృష్టం బావున్నట్టు నిన్న తేలిపోయింది. కాబట్టి ఈ మూడుతోనే నలబ్తే, యాబ్తే సంపాదించవచ్చు. పోయినా పెద్ద నష్టం వుండదు. మూడు రూపాయలే కాబట్టి.
ఈ ఆలోచన వచ్చేసరికి హుషారుగా నడవసాగేడు. మనసంతా ద్రిల్లింగ్ గా వుంది.
కార్నవాల్ చేరుకొన్నాడు.