భుజాల చుట్టూ చెయ్యివేసి దగ్గరకు తీసుకున్నాడు.
మెత్తటి వక్షస్ధలం. తాంబూలంతో ఎర్రగా పండిన పెదవి- రమణిప్రియ మధురాధర రసాస్వాదన....బలమ్తెన చేతిక్రింద విల్లులా వంగే నడుము-చేయి యింకోంచేం క్రిందకు జార్చి మరింత గాడంగా లతలా అల్లుకొని ....ఆ మెదవంపులో తల దాల్చుకొని- ఆ వినీల కుంత లాల నీడలో దాగిన నిశ్శబ్దం ఏదో శబ్దం అవటంతో చెదిరి...."ఏమీటిది?" అని అడిగితే జావాబు స్విట్పు పళ్ళెం పడగొట్టిన ఎలుక చటుక్కున పారిపోయి....
ప్రకాశం తల విదిలించెడు. లాభంలేదు. తను కనిసం ఊహల్లో కూడా ఆనందంగా వూహించలేడు. తనలో యెక్కడో ఏదో పూర్తిగా చెడిపోయింది.
12
పదకొండయింది.
సుజాతకి నిద్రరావటంలేదు. వెల్లకిలా పడుకొని ప్తె కప్పకేసి చూస్తూ ఆలోచన్లలోకి జారుకోంది.
నీలంరంగుసబ్ డ్యూడ్ ల్తేటింగ్ గదంతా పరుచుకొని వుంది. సీలింగ్ ఫాన్ నెమ్మదిగా తిరుగుతూంది. కిటికీ పక్కగా ప్తెకి పాకిన మల్లె తిగ మీదనుంచి వచ్చేగాలి గదిలో పరిమళాన్ని నింపుతూంది. ఫిస్టో బొమ్మమీద ల్తేటింగ్ పది ప్రతిబింబిస్తూవుంది. దాని పక్కనే ప్రేములో బిగించిన ఒక రేఖా చిత్రం వుంది. దాన్ని మాణిక్యాలరావే వేసేడు.
సుజాత దృష్టి ఆ చిత్రం మీదే చాలాసేపు నిలిచింది. కాంతి తక్కువగా ఉండటంచేత సరిగా కనబడటంలేదు. అదే వెలుతుర్లో చూస్తే ఆ రేఖల్లో ప్రతి వంపులోనూ లాలిత్యం తొణికిసలాడూతూ కనబడుతుంది ఆ బొమ్మంటే సుజాతకి చాలా యిష్టం.
పక్కకి తిరిగి చూసింది. పక్క మంచంమీద మాణిక్యాలరావు నిద్రపోతున్నాడు. మసక వెలుతురులో అతని మొహం ప్రశాంతంగా కనిపిస్తూంది. ఆ ప్రశాంతతని చూస్తూంటే అతన్నేవరూ లక్షలమీద వ్యాపారం చేసే మనిషి అనుకోరు. పొద్దున్న లేస్తే అతను మళ్ళి ముసుగు తోడిగేసుకుంటాడు.
సుజాత ఆలోచిస్తూ వుంది.
మాణిక్యాలరావునీ తను డబ్బుకోసం పెళ్ళాడింది. కాణి ఆ తరువాత అతనిలో ఆర్టిస్టుని ప్రేమించడం మొదలుపెట్టింది. అతనిలో చురుకులేదు. ఇరవ్తే అయిదేళ్ళ యువకుల్లో ఉండే చురుకు అతనిలో యెలా వస్తుంది? ఆ చురుకుదనంకోసం తనింకేవర్నయినా ప్రేమిస్తుంది! తనకు సితారు యిష్టం. అందుకని రవిశంకర్ని ప్రేమిస్తుంది? ఉహూ____ కాదు. ఇదంతా ప్రేమకాదు, ఇదంత గౌరవమూ, ఇష్టమూ అంతే! సెక్స్ వేరే సంగతి అది .కోరిక చాలా చిన్న విషయం. ప్రేమ అనేది ఒక మహాన్వితమ్తెన అలౌకికమైనస్ధితి, అభౌతికం. అపరిహర్యము, అబాదితము, పరమార్ధికము పూర్ణసత్యము....
ఈ ప్రేమని వెల్లడించటానికి ఉప్పొంగే అనురాగాన్ని బహిర్గతం చేయ్యతబికి అవసరమ్తెన ప్రక్రియే సెక్స్ ఈ కోణంలో ఇది మహొన్నతమ్తెనది. స్పర్శ, రస, గంధ, దృష్టి, శబ్ద, మనస్సులనే ఆరు ఇంద్రియాల్ని ఏకాగ్రతతో ఏకంచేసేస్ధితి. తనకా స్ధితి ఇక జీవితంలో రాదు. ఎందుకంటే తనకిప్పుడు ఇరవ్తే అయిదేళ్ళు. ఇప్పుడు తన భావాల్లో లాలిత్యం లేదు. ఇప్పట్నుంచి మళ్ళి తను జీవితాన్ని ఫ్రెష్ గా మొదలు పెట్టలేదు.
సుజాత పక్కమీదనుంచి లేచింది భర్తకి మెలకువ రాకుండా నెమ్మదిగా పక్కగదిలోకి వెళ్ళింది. తన పెట్టె తెరిచి బట్టల అడుగు నుంచి పాత డ్తెరిలు తిసి టేబుల్ ల్తెట్ వేసుకొని, ఒక్కొక్కటి తిసి చదవటం మొదలెట్టింది.
....ఎన్నో సంగతులు, మనిషిలో రోజురోజుకి ఎదుగుదల యెలా వుంటుందో....అనుభవాలు అనుభూతులుగా మారిన తర్వాత జ్ఞాపకం తెచ్చుకోవటానికి ఎంత బాగుంటాయో___
అకస్మాత్తుగా ఒకచోట ఆమె చూపు ఆగిపోయింది. "ప్రకాశం" అన్న పెరూ, దానిచుట్టూ ఎర్రగితా వుంది. అక్కడ, సుజాత పెదవుల మీద గతస్మ్పతుల ఆలోచనలతో సన్నగా నవ్వు వెలిసింది. అక్కడ్నుంచి నెమ్మదిగా పేజీలు తిరగేస్తూ చదవసాగింది.
డిసెంబరు పద్నాలుగు....
___ఈ రోజు ఎప్పటిలాగే ప్రకాశం తెల్లచొక్కా వేసుకొన్నాడు. తెల్లచోక్కాలు తప్పు ఇంకేవిలేవా ఏమిటి అతనికి? కాలరు దగ్గర చిరుగును చూచుకోలేదనుకొంటా. ఎంత బావున్నాడు చాలా సేపటి వరకూ దృష్టి మరల్చుకోలేకపోయెను. అతని నిర్లక్ష్యమే అతనికి అందం.
__లెక్చరర్ ఏదో ప్రశ్న అడిగేడు. చటుక్కున లేచి నిలబడ్డానే గాని- అసలేం ప్రశ్న అడిగేడో తెలిదు. ప్రకాశాన్నిగాని ప్రేమిస్తున్నానా?
జనవరి మూడు....
__ప్రకాశం వట్టి పూల్! కాలేజి మిత్తం నా ఒక్క చిరునవ్వు కోసం పడి చస్తుంటే_ మరి ఇతను? ఉహు ___ఇష్టం లేకకాదు, భయం. చూసిన అరక్షణంలోను అతని కళ్ళల్లో కనబడే భావాల్ని చదివెయ్యటం పెద్ద కష్టంకాదు__
పేజీలు నెమ్మదిగా తిప్పటం ప్రారంభించిది.
చాలావరకూ ఆ పెజిల్నిండ ప్రకాశం గురించే వుంది. ఆ రోజుల్లో తలపుల్లో, ఆలోచనలలో అతను అంతగా నిండిపోయినందుకు ఆమెకు ఆశ్చర్యం వేసింది. పద్దెనిమిదేళ్ళ వయసులో ప్రేమ ఎంత నిజాయితిగా ఉంటుందో! సుజాత కళ్ళల్లో ఆప్రయత్నంగా నీళ్ళు నిండినాయి. ఏదో తెలియని ఉద్వేగం ఆమె గుండెలో స్పందించింది. బాధ కాదు మాణిక్యాలరావునీ చేసుకొన్నందుకు ఆమె ఎప్పడూ బాధ పడలేదు. అతని డబ్బు నోకదాన్నే కాదు. అతని తెలివిని, అతనిలోని కళాకారుణ్ణి, అతని నెమ్మదిని ప్రేమించటం మొదలెట్టింది.