Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 22

 

    "అబ్బ! ఇప్పుడేగా తాగాను . వద్దు" అన్నాడు విసుగ్గా.
    "ఇప్పుడేనా! గంటయింది. గంటకోసారి పళ్ళ రసం తాగమని డాక్టర్ చెప్పలేదూ ? తాగండి మరి!"
    "గంటయిందా? నీతో కబుర్లు చెబుతోంటే నా కసలు టైం తెలీలేదు . నీకు చూడు గడియారం మీదే ద్రుష్టి" నిష్టురంగా అన్నాడు.
    కిలకిల నవింది వారిజ. పారిజాతాలు పరుచుకున్నట్లు , వెన్నెలలు విరుచుకున్నట్లు, సౌరభాలు కమ్ముకున్నట్లు మమతల మంచు జల్లులు కురిసినట్లు .
    "మీకు నా కబుర్లు మీద దృష్టి , నాకు మీ మీద దృష్టి. అందుకే మీ ఆరోగ్యం ముఖ్యం నాకు. మీరు రసం తాగలేదని నాకు గుర్తుంది. మీకు తెలుసా నేనింత వరకూ అన్నం తినలేదని ?" సిగ్గుపడిపోయాడు తను.
    "ఇంత వరకూ అన్నం తినలేడూ! ఎందుక్కుర్చున్నావు మరి, అన్నామైనా తినకుండా?"
    "ఎందుకో తెలిస్తే ఇన్ని తిప్పలెందుకు? తెలియక పోవడంలోనే ఉంది అందమంతా! ఈ రసం తాగండి. నే వెళ్ళి భోజనం చేసి వస్తాను."
    "నేను తాగేస్తే వెళ్ళిపోతావా?" మళ్ళీ నవింది వారిజ.
    "ఇప్పుడేగా ఎందుకున్నావని అన్నారు. మళ్ళీ వెళ్ళిపోతావా? అంటున్నారా సరే! నాకసలి తిండి వద్దు లెండి మీ ముందే కుర్చుంటాను."
    "నేను చాలా స్వార్ధపరుడ్ని వారిజ! వెళ్ళు .....వెళ్లి అన్నం తినిరా!" వారిజ చిరునవుతో చిందర వందరగా ఉన్న జుట్టుని నిమురుతూ అంది.
    "స్వార్ధలలో చాలా రకాలున్నాయి తెలుసా! కొన్ని కొన్ని స్వార్ధాలు ఎదుటివాళ్ళకు బాధను కలిగిస్తాయి. మరి కొన్ని స్వార్ధాలు ఎదుటివాళ్ళకు అంతులేని ఆనందాన్ని కలిగిస్తాయి. మొగవాడిలో ఈ రకమైన స్వార్ధం ఆడదానికి ఎంతటి అనందం కలిగిస్తుందో మీకెలా తెలుస్తుంది? ఎన్ని జన్మలు తపస్సు చేసుకుంటే లభిస్తుంది అలాంటి అనందం? నా ఎడబాటు సహించలేని మీ ఆవేదన ముందు నాకసలు ఆకలి తెలుస్తుందా.....?"
    రామచంద్ర ఆలోచనలోంచి తేరుకుని చూసేసరికి లత మళ్ళీ పుస్తకం తీసుకుని చదువుకొంటుంది. వల్లమాలిన కోపం వచ్చింది రామచంద్రకి....
    "ఛీ! నీ కసలు నా మీద ప్రేమ లేదు. ప్రేమ వుంటే , నే వచ్చీ రాగానే నాకేం కావాలో చూడవా/ నా ముఖం చూస్తే నేను అలిసిపోయానని అర్ధం చేసుకోలేవా?" లత విసురుగా పుస్తకం మూసి లేచింది.
    "మీకుంది కదా నా మీద ప్రేమ! నా కష్ట సుఖాలు ఒక్కలా కనిపెట్టి చూస్తున్నారు. కొత్త చీరెలు, కొని పెడుతున్నారు. రోజూ ప్వుపులు తెస్తున్నారు. సినిమాలకు తీసి కేళ్తున్నారు ! ఛీ! ఛీ! కాస్త నవల చదువుకోవటానికి కూడా లేదు.'
    పుస్తకం అవతల పారేసి (బహుశా! ఆ చాప్టర్ పూర్తయిందేమో!) రుసరుసలాడుతూ వంటింట్లోకి నడిచింది లత. నిర్ఘాంతపోయాడు రామచంద్ర.

                                                            8

    "మీకుంది కదూ , నామీద ప్రేమ!" తెలిసో తెలియకో  లత నోట వచ్చిన ఆ ఎత్తి పొడుపు అతనిని తిరిగి గుచ్చసాగింది . ఎంత నిజం? లతకు తనమీద ప్రేమ లేదని ఆమె మీద అభియోగం మోపేముందు ఆ ప్రశ్న తనను తనే వేసుకుంటే? లత ఇంకా నయం కదూ? ఎవర్ని ప్రేమించటం లేదు తను.
    ఒక్కసారి లేచి నిలబడ్డాడు రామచంద్ర. ఉబికి ఉబికి వస్తోన్న ఆలోచనలను ప్రయత్నపూర్వకంగా వెనక్కు నెట్టాడు. లేదు, తానెవర్ని ప్రేమించటం లేదు. లతనే ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తాడు.
    టీ కప్పు అందించిన చేతిని లాలనగా పట్టుకున్నాడు రామచంద్ర. "లతా నా మీద కోపం వచ్చిందా? ఇవాళ తలనొప్పిగా వుంది లతా?" లత నవింది.
    "ఊహు! కోపం లేదు లెండి. "అనేసి లోపలకు వెళ్ళిపోయింది. తనకు తలనొప్పి అని విని వెళ్ళిపోయింది. "తలనొప్పా" అని కంగారుగా తలమీద చెయ్యి వేసి చూడలేదు. మనసు ఎందుకు చికాగ్గా వుంది? అని అడగలేదు. ఉండండి, మందు వేసుకుని మరీ టీ తాగండి. తలనొప్పితో ఎలా బాధపడగలరు? అని అనునయించ లేదు."
    "కాస్త మందు రాయనా' అని ఆప్యాయత చూపలేదు.
    "ఇంకా తాగలేదూ! చల్లగా అయిపోతుంది. ఎమిటాలోచిస్తున్నారు అస్తమానూ?" లోపలి నుండి వచ్చిన లత అడిగింది.
    రామచంద్ర తలెత్తి లత ముఖంలోకి చూశాడు. లత నవింది . స్వచ్చంగా, పసిపిల్లలా.
    "తెలీదు. ఏం తెలీదు" గబగబ టీ తాగేశాడు . లత వంటపని ప్రారంభించింది.
    రామచంద్ర అనాలోచితంగా మళ్ళీ వీధిలోకి నడిచాడు.
    ఎదురుగా మల్లెపూల మాలలు అమ్ముతోంది రత్తి. రెండు మాలలు కొన్నాడు . వంట పూర్తీ చేసి మళ్ళీ పుస్తకం తీసుకోబోయింది లత.
    "మళ్ళీ పుస్తకమా?" అన్నాడు మృదువుగా మందలింపుగా.
    "మీరేమో ఆలోచిస్తూ ఉంటారు. నేనేం చేయ్యనేంటి?" బుంగమూతి పెట్టి అంది లత. రామచంద్ర చటుక్కున ముందుకు వంగి ఆ బుంగ మూతి మీద ముద్దు పెట్టుకున్నాడు. కిలకిల నవింది లత. పులకించిపోయాడు రామచంద్ర.
    "ఆ పుస్తకం మూసి ముఖం కడుక్కుని చీర మార్చుకో!"
    "ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగింది.
    "చెప్తాగా!" లత గబగబ తయారయ్యింది. ఉత్సాహంగా, లత భుజాలు పట్టుకుని వెన్నక్కు తిప్పి పూవులు లత జడలో తురిమి తనివితీరా అఘ్రాణిచాడు రామచంద్ర.
    లత చెయ్యి పట్టుకుని ప్రేమగా నొక్కుతూ "పద కాస్సేపు డాబా పైన కూర్చుందాం" అన్నాడు
    వెలవెల పోయింది లత.
    "సినిమాకు కాదా?" చివుక్కుమంది రామచంద్రకి.
    "ఇవాళ నా వంట్లో బాగాలేదు లతా, రేపేళదాం సినిమాకి. రా! డాబా మీద కూర్చుందాం....."
    "సినిమాకి తీసుకెళ్లకపోతే ఈ పూలు కొనడం దేనికి?" ఉక్రోషంగా అంది లత.
    "సినిమాకి వెళ్ళకపోతే ఈ పూలు దేనికి?" దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు? ఇదే వారిజయితే.......భగవంతుడా ! వద్దు! వద్దు ఆ పోలిక వద్దు. ఇదెక్కడి విపరీతం? ఈ వారిజ తన మనసులోంచి పోదెం? అనుక్షణం తన మనసులోని వారిజతో లతను పోల్చుకుంటూ లతకు అన్యాయం చేస్తున్నానా? ఎలా ఈ లత మనసు వికసింప జేసి అందులో స్థానం సంపాదించుకోవటం.
    "సరే పద! సినిమాకే వెళదాం" అన్నాడు. వంట్లో బాగుండనప్పుడు ఎందుకు లెండి' అంటుందని ఆశపడుతూ . "నిజంగానా? మీరెంత మంచివారూ!" అంటూ బయలుదేరింది లత. ఆ ముఖంలో స్పష్టంగా ప్రతిఫలిస్తోన్న సంతోషాత్సహలను గమనించి దీర్ఘంగా నిట్టుర్పు విడుచుకున్నాడు రామచంద్ర.

                                                  ------------

    సంధ్య అప్పుడప్పుడే అంతరిస్తోంది. అరుణ కిరణాలు పలుచని వెన్నెల రేఖాలతో మిళితమై ప్రకృతి వింత శోభతో మెరుస్తుంది. ఇంటి ముందు పూలమొక్కల మధ్య పచారులు చేస్తున్న రామచంద్ర మెట్ల మీద నిల్చున్న లతను చూసి ఆగిపోయాడు.
    తలంటు పోసుకున్న ముంగురులు గాలిలో ఎగురేగి పోతుండగా తెల్లని జరీ చీర కట్టుకుని మెరుగ్గా పసుపు రాసుకున్న ముఖానికి గులాబి రంగు పౌడర్ మెరుగులు పెడుతుండగా తల్లో మల్లెలు ముడుచుకోబోతున్న లత తానె ఒక గులాబిలా అనిపించింది రామచంద్రకి. మెల్లగా లతను సమీపించి చేయి పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు . పరధ్యానంగా ఉన్న లత ఉలిక్కిపడింది. విసుగ్గా ముఖం చిట్లించి దూరంగా జరిగి "ఏమిటిది బాబూ! వేళాపాళా లేకుండా" అంది.

 Previous Page Next Page